For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ ఎటాక్ స్కేర్ ని అనుభవించిన వారు పాటించవలసిన 10 ఉపయోగకరమైన చిట్కాలు

|

"హార్ట్ ఎటాక్" అన్న మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కాబట్టి, ఒకవేళ మనం గాని మనకు దగ్గరివారు కానీ నిజంగా హార్ట్ ఎటాక్ స్కేర్ కి గురైతే ఆ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి.

నిజానికి, ఏదైనా ఆరోగ్య సమస్య గురించి తెలియగానే ఆ లక్షణాలు మనకు కూడా ఉన్నాయా అని సాధారణంగా జాగ్రత్తపడతాము. సాధారణ ఫ్లూ జ్వరం విషయంలో కూడా ఇలా జరుగుతుంది. అదే హార్ట్ ఎటాక్ కి సంబంధించిన లక్షణాలు ఉన్నాయని తెలిస్తే మనం మరింత ఆందోళనకు గురవుతాం.

కాబట్టి, ఇప్పుడు ఇక్కడొక విషయాన్ని మనం గమనించాలి. హార్ట్ ఎటాక్ కి హార్ట్ ఎటాక్ స్కేర్ కి తేడా ఉందన్న విషయాన్ని మనం గ్రహించాలి.


హార్ట్ అటాక్ స్కేర్ అనే ఈ ఆరోగ్యస్థితిలో హార్ట్ ఎటాక్ కి సంబంధించిన అన్ని లక్షణాలను పేషంట్ లో గమనించవచ్చు. చెస్ట్ పెయిన్, శరీరంలోని ఎడమవైపు తిమ్మిరి, మూర్ఛపోవడం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలను పేషంట్ లో గమనించవచ్చు. అయితే, వీరిని హాస్పిటల్ కి తీసుకువెళ్లగా వీరికి హార్ట్ ఎటాక్ లేదని వైద్యులు నిర్ధారిస్తారు.

అయినప్పటికీ, వైద్యులు వీరిని జాగ్రత్తగా ఉండమని సూచిస్తారు. హార్ట్ ఎటాక్ స్కేర్ కి గురైన వారిలో నిజమైన హార్ట్ ఎటాక్ తలెత్తే ప్రమాదం దగ్గర్లోనే ఉందని వారిని హెచ్చరిస్తారు. వారి కార్డియాక్ వ్యవస్థ క్షీణించిందని తెలియచేస్తారు.

కాబట్టి, నిజమైన హార్ట్ ఎటాక్ కు గురికాకుండా ఉండేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఈ ఆర్టికల్ లో కొన్ని చిట్కాలను పొందుపరచాము. హార్ట్ ఎటాక్ స్కేర్ ని అనుభవించిన వారు ఈ టిప్స్ ను పాటిస్తే తిరిగి ఆరోగ్యవంతులవుతారు.

1. కారణాన్ని తెలుసుకోండి:

1. కారణాన్ని తెలుసుకోండి:

హార్ట్ ఎటాక్ స్కేర్ అనేది సాధారణంగా రాదు. ఈ కండిషన్ ను కొన్ని అంశాలు ప్రేరేపిస్తాయి. కాబట్టి, ఫిజీషియన్ దగ్గరికి వెళ్లి శరీరాన్ని చెక్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న అంశాలను తెలుసుకోండి. అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీ, అనారోగ్యకరమైన జీవనశైలి వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి. కారణాన్ని కనుగొన్న తరువాత, సరైన చికిత్సను పొందండి.

2. స్మోకింగ్ ను మానండి:

2. స్మోకింగ్ ను మానండి:

గత కొన్నేళ్లుగా సిగరెట్ స్మోకింగ్ ను మానడంలో మీరు విజయం సాధించలేకపోతున్నారా? అయితే, ఈ అలవాటు మీకు హార్ట్ ఎటాక్ స్కేర్ ను కలిగించవచ్చు. హార్ట్ అటాక్ స్కేర్ కు గురవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అనేక పరిశోధనల్లో స్మోకింగ్ వలన ఈ అనారోగ్యం సంభవిస్తుందని తేలింది. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్మోకింగ్ కు ఇప్పటి నుండైనా దూరంగా ఉండటం మంచిది.

3. మెడికేషన్స్ ని సరిగ్గా వాడండి:

3. మెడికేషన్స్ ని సరిగ్గా వాడండి:

హార్ట్ ఎటాక్ స్కేర్ కి గురైన తరువాత డాక్టర్లు మీకు అనేక మందులను అలాగే చికిత్సలను సూచిస్తారు. హార్ట్ ఎటాక్ సంభవించకుండా మీకు మెడిసిన్స్ ని సూచిస్తారు. వాటిని మీరు డాక్టర్లు చెప్పిన ప్రకారం వాడాలి. మెడిసిన్స్ ని వాడడంలో మీరు అశ్రద్ధ వహిస్తే మీ ఆరోగ్యం మీ చేతులలో ఉండదు. ఒకవేళ డాక్టర్లు సూచించిన మెడికేషన్స్ వలన ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మీరు వెంటనే వైద్యుని దృష్టికి తీసుకెళ్ళాలి. తద్వారా, మీకిచ్చే డోసేజులలో మార్పులు చేస్తారు.

4. రీహ్యాబ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనండి

4. రీహ్యాబ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనండి

ఈ మధ్యకాలంలో ఇండియాలోని మెట్రోపాలిటన్ సిటీలలోని హాస్పటల్స్ లో కార్డియాక్ అరెస్ట్ లు అలాగే హార్ట్ ఎటాక్ స్కేర్ కి గురయిన వారికి రీహ్యాబిలేషన్ ప్రోగ్రామ్స్ ని ఆఫర్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ లో అటువంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆందోళనను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలియచేస్తారు. అలాగే, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పాటించే కొన్ని ఉపయోగకరమైన టెక్నీక్స్ ను కూడా బోధిస్తారు.

5. హెల్తీ డైట్ నే తీసుకోండి:

5. హెల్తీ డైట్ నే తీసుకోండి:

హార్ట్ ఎటాక్ స్కేర్ ని అనుభవించిన తరువాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధను కనబరచుకోవాలి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోకూడదు. హెల్తీ బాలన్స్డ్ డైట్ నే తీసుకోవాలి. తరచూ పండ్లను అలాగే కూరగాయలను వైద్యులు సిఫార్సు చేసిన మోతాదులో తీసుకోవడంతో మీ శరీరానికి అవసరమైన మినరల్స్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. తద్వారా, మీ గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

6. కేలరీల సంఖ్యను గమనించండి

6. కేలరీల సంఖ్యను గమనించండి

హై కేలరీ ఫుడ్స్ కి మీరు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా, వేపుడు పదార్థాలకు అలాగే ప్రొసెస్డ్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. అలాగే అనారోగ్యకరమైన ఫ్యాట్స్ తో పాటు షుగర్ కి దూరంగా ఉంటే మంచిది. కేలరీలు అధికంగా లభించే అనారోగ్యకరమైన ఆహారపదార్థాలు మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసి గుండె వ్యవస్థను దెబ్బతీస్తాయి. అందువలన, భవిష్యత్తులో హార్ట్ ఎటాక్ కి గురయ్యే ప్రమాదం అధికమవుతుంది. కాబట్టి, వైద్యులు సిఫార్సు చేసిన డైట్ ప్లాన్ కే కట్టుబడి ఉండండి.

7. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

7. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి:

అనేక రీసెర్చ్ స్టడీస్ ల ప్రకారం క్రమం తప్పకుండా చేసే వ్యాయామం వలన అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని తేలింది. వ్యాయామనియమాలని పాటించడం ద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్యసమస్యల్ని అరికట్టవచ్చు. కాబట్టి, ఒకవేళ మీరు ఇటీవలే హార్ట్ ఎటాక్ స్కేర్ కి గురైతే మీరు వ్యాయామాన్ని రొటీన్ లో భాగం చేసుకోవాలి. ప్రొఫషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో మీరు వ్యాయామం చేయాలి. తద్వారా, కొన్ని కాంప్లికేషన్స్ ను మీరు అవాయిడ్ చేయగలుగుతారు.

8. ఓరల్ హైజీన్ ను పాటించండి:

8. ఓరల్ హైజీన్ ను పాటించండి:

ఓరల్ హెల్త్ లేదా ఓరల్ హైజీన్ అనేది గుండె ఆరోగ్యానికి కనెక్ట్ అయి లేదని చాలామంది భావిస్తారు. అయితే, పరిశోధన అధ్యయనాల ప్రకారం, చిగుళ్ల లోంచి రక్తం రక్తనాళాల ద్వారా నేరుగా గుండెకు చేరుతుంది. చిగుళ్ల ఇన్ఫెక్షన్, కేవిటీస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన బ్లడ్ గుండెలోకి చేరి కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుంది. కాబట్టి, ఓరల్ హెల్త్ ను కాపాడుకోవడం ముఖ్యం.

9. కౌన్సిలింగ్ ను తీసుకోండి:

9. కౌన్సిలింగ్ ను తీసుకోండి:

ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్న వ్యక్తుల మానసిక స్థితి బలహీనంగా ఉండటం సహజం. ఈ స్థితిలో వారు మానసిక సంఘర్షణకు గురవుతారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. హార్ట్ ఎటాక్ స్కేర్ అనేది ఒక వ్యక్తిని మానసికంగా బలహీనపరిచి డిప్రెషన్ ను అలాగే ఆందోళనను పెంచుతుంది. అటువంటి సమయంలోనే సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం ఏర్పడుతుంది. సమస్యలను ఏ విధంగా డీల్ చేయాలో ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ ద్వారా తెలుసుకోవచ్చు.

10. ఒత్తిడిని అధిగమించండి:

10. ఒత్తిడిని అధిగమించండి:

ఒత్తిడి అనేది సాధారణ సమస్య. ఐతే, ఈ సమస్య అనేక ఇతర సమస్యలకు రూట్ కాజ్ గా మారుతుంది. కాబట్టి, మీరొకవేళ హార్ట్ ఎటాక్ స్కేర్ ను అనుభవించినట్లైతే ఒత్తిడి విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆరోగ్యం మరింత క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మెడిటేషన్ తో పాటు యోగాను మీ దినచర్యలో భాగంగా చేసుకోవాలి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి.

English summary

10 Helpful Tips To Recover After A Heart Attack

A heart attack scare is a condition which mimics a heart attack, but is not an actual heart attack. A heart attack scare indicates that your heart health has deteriorated and you could be at the risk of getting a cardiac arrest soon. So, here are a few tips to follow after a heart attack scare.