For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ హోమ్ రెమెడీస్ తో ఊపిరితిత్తులకు ఎంత ఉపయోగమో తెలుసా...

ఈ పది గృహచిట్కాలు ఊపిరితిత్తులను శుద్దిచేయగలవని తెలుసా?

|

ఈ రోజుల్లో, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పరిసరాలు మరియు వాతావరణంలో కాలుష్యం. అంతేకాకుండా ఊపిరితిత్తుల మీద ధూమపానం వంటి వాటి ద్వారా చూపే అశ్రద్ద కూడా ఒక కారణంగా ఉంది. ధూమపానం, ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా హాని కలిగిస్తుంది అని తెలిసినా కూడా అనేకమంది ఇంకనూ కొనసాగించడం చాలా భాధాకరం. ఈవ్యాసంలో, 3 రోజుల్లో మీ ఊపిరితిత్తులను ఎలా శుద్ధిచేయగలరనే అంశం గురించి తెలుసుకోబోతున్నాము.

మీరు హానికరమైన సూక్ష్మజీవులను మీకే తెలీకుండా, ఆరగిస్తున్నారని తెలుసా? కావున, వివిధ ఊపిరితిత్తుల వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి ఎప్పటికప్పుడు మీ ఊపిరితిత్తులను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఊపిరితిత్తులను శుభ్రపరచడం అనేది అత్యవసరం. ఎందుకంటే, గాలి నుండి వచ్చే దుమ్ము కూడా మీ ఊపిరితిత్తులకు హానికరం కాబట్టి.

10 Home Remedies To Purify Your Lungs

అలాగే, ఊపిరితిత్తుల నిర్విషీకరణ లేదా శుద్దీకరణ అనునవి, ఊపిరితిత్తుల పనితీరును ప్రోత్సహిస్తుంది, ఊపిరితిత్తులని చైతన్యవంతం చేస్తుంది, వాపు మరియు మంటను తగ్గించడం,శ్వాస నాళాల నుండి శ్లేష్మాన్ని తొలగించడం, ఊపిరితిత్తులలో శ్వాసను మరియు రక్తప్రసరణను మెరుగుపరచడం వంటివి చేస్తుంది.

అంతేకాకుండా కోరింత దగ్గు, ఆస్తమా, గొంతు అంటువ్యాధులు, నోటి దుర్వాసన, ధనుర్వాతం వంటి మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో కూడా ఇది సహాయపడుతుంది.

మీ ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి ఇంటి నివారణలు చూద్దాం.

1. నిమ్మరసం

1. నిమ్మరసం

నిమ్మరసం మీ ఊపిరితిత్తుల నిర్విషీకరణలో అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఆస్త్మా, ఇన్ఫెక్షన్లు మరియు ఏవైనా ఇతర ఊపిరితిత్తుల వ్యాధుల కారణంగా మీరు బాధపడుతుంటే, నిమ్మరసం లేదా నిమ్మరసం కలిపిన నీటిని త్రాగటం మూలంగా ఈ సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. నిమ్మరసంలోని విటమిన్-సి మరియు అనామ్లజనకాలు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సహాయపడతాయి.

అల్పాహారం ముందు 1 లేదా 2 గ్లాసుల నిమ్మరసం తీసుకోండి.

మీకు నిమ్మకాయలు నచ్చకపోతే, క్రాన్బెర్రీ రసం లేదా పైనాపిల్ రసం తీసుకోవచ్చు. ఇవి కూడా ఇంచుమించు నిమ్మరసం లక్షణాలనే కలిగి ఉంటాయి.

2. అల్లం

2. అల్లం

అల్లం కూడా మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచుటకు సహాయపడుతుంది ఎందుకంటే ఊపిరితిత్తులు మరింత ప్రభావవంతంగా పనిచేయటానికి సహాయపడే అనేక రసాయన మిశ్రమాలు అల్లంలో ఉన్నాయి. మీ ఊపిరితిత్తులను అసౌకర్యానికి గురిచేసే వాయు కాలుష్య కారకాలను శ్వాసనాళాల నుండి తొలగించడంలో అల్లం సహాయపడుతుంది; అదనంగా, అల్లం ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ప్రసిద్ధి చెందింది.

ప్రతి రోజు అల్లం టీ 2 నుండి 3 కప్పుల త్రాగాలి.

మీరు మీ వంటలో ముడి అల్లం కూడా ఉపయోగించవచ్చు.

3. పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించండి

3. పాల ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించండి

పాల ఉత్పత్తులు తప్పనిసరిగా మీ రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగమే, కానీ అవి ఊపిరితిత్తులకు హానికరమైన అనేక విషతుల్య రసాయనాలను కలిగి ఉన్నాయి. కావున, మీ ఆహారంలో పాల ఉత్పత్తులు తీసుకోవడం పరిమితం చేయడం ద్వారా ఊపిరితిత్తుల శుద్ధిలో సహాయపడుతుంది.

జున్ను, పెరుగు, మరియు పాలు వంటి పాలఉత్పత్తులు కూడా పరిమిత మొతాదులోనే స్వీకరించవలసి ఉంటుంది.

4. పెప్పర్మింట్

4. పెప్పర్మింట్

మీ ఊపిరితిత్తులను 3 రోజుల్లో శుభ్రపరచడానికి పెప్పర్మింట్(పుదీనా) మరొక ఉత్తమమైన గృహ చికిత్స. పుదీనా ఆకులలో ఉండే మెంథాల్, శ్వాస నాళానికి మరియు కండరాలకు మంచి ఉపశమనంగా ఉంటుంది. ఇది అప్రయత్నంగా శ్వాసను పెంచడమే కాకుండా వ్యాధుల ముందస్తు లక్షణాలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తుంది.

ఊపిరితిత్తుల బలానికై, ప్రతిరోజూ 3 నుండి 5 పుదీనా ఆకులను తీసుకోవడం ఉత్తమం.

రోజువారీ దినచర్యలో భాగంగా 2 కప్పుల పుదీనా-టీ కూడా మేలు చేస్తుంది.

5. ఒరేగానో

5. ఒరేగానో

ఒరెగానో, టెర్పెన్సేస్ మరియు కార్వాక్రోల్ వంటి సమ్మేళనాల్లో సమృద్ధిగా ఉంటుంది, ఇది ఊపిరితిత్తుల శుభ్రపరిచడంలో మంచి పనితీరుని కనపరుస్తుంది. శ్వాస నాళాలను శుద్దిపరచడం మరియు మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఊపిరితిత్తులలోని వాపు మరియు రద్దీని తగ్గించడం వంటి మొదలైన ప్రభావాలను కలిగి ఉంటుంది.

ఉబ్బసం మరియు ఇతర శ్వాస సంబంధ సమస్యలను తగ్గించడానికి రోజువారీ ప్రణాళికలో ఒరేగానో- టీ 2 కప్పులు త్రాగాలి.

అలాగే, మీరు హెర్బల్ టీ లేదా వెచ్చని పాలల్లో, ఒరేగానో చమురును రెండు చుక్కలు జోడించి తీసుకోవచ్చు.

6. యోగా

6. యోగా

రోజులో కనీసం అరగంట యోగా చేయడం మూలంగా, మీ శరీరంలోని అనేక విషతుల్య మలినాలను తొలగించబడుతాయి. ముఖ్యంగా ప్రాణాయామం, సూర్య నమస్కారాలు వంటి శ్వాస సంబంధిత ప్రక్రియలు ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచగలవు. యోగా ఊపిరితిత్తులను బలపరచడమే కాకుండా, వాటిని శుభ్రపరుస్తుంది కూడా. యోగా చేయడం వలన ఒత్తిడి యొక్క ప్రభావాలకు కూడా దూరంగా ఉండవచ్చు.

వెల్లకిలా పడుకొని, మీ కడుపుపై చేతులను ఉంచండి.

మీ కళ్లను మూసివేసి లోతుగా ఊపిరి తీసుకుని 5 వరకు అంకెలు లెక్కబెట్టండి.

2 సెకన్ల పాటు మీ శ్వాసను పట్టి ఉంచండి మరియు 5 లెక్కిస్తూ నెమ్మదిగా ఊపిరి వదలండి.

ఈ ప్రక్రియ 9 నుంచి 10 సార్లు పునరావృతం చేయండి.

7. యూకలిప్టస్ ఆయిల్

7. యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్ ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే దాని శక్తివంతమైన, దుర్బలమైన, క్రిమినాశక లక్షణాలు అంత ఉత్తమమైనవి కాబట్టి. యూకలిప్టస్ ఆయిల్, శ్వాస నాళపు రద్దీని తగ్గించడంతో పాటు, సైనస్ సమస్యలతో కూడా పోరాడగలదు. మరియు దగ్గును కూడా తగ్గించగలదు.

వేడి నీటి కుండలో యూకలిప్టస్ నూనెను 5 నుండి 10 చుక్కల వరకు జోడించండి.

ఒక టవల్ తో మీ తల కవర్ చేస్కుని ఆవిరిని పీల్చండి.

8. లైకోరైస్

8. లైకోరైస్

లైకోరైస్ మీ ఊపిరితిత్తులను శుభ్రపరచగల మరొక ప్రభావవంతమైన హెర్బ్. ఇందులో శోథ నిరోధక మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలున్నాయి. ఇవి శ్వాస నాళాల వాపును తగ్గిస్తాయి. లైకోరైస్లో యాంటీవైరల్ లక్షణాలు మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉండడం వలన, ఇవి బాక్టీరియా సంక్రమణను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో సహాయపడతాయి.

మీరు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న ఎడల, 2 నుండి 3 కప్పుల లికోరైస్ రూట్-టీ తీసుకోండి.

మరియు కొద్దిగా తేనె జోడించి, ½ టీస్పూన్ లైకోరైస్ పొడిని రోజులో రెండు సార్లు చొప్పున తీసుకోవాలి.

9. కాస్టర్ ఆయిల్

9. కాస్టర్ ఆయిల్

మీ శరీరం నుండి విషాన్ని తొలగించడం ద్వారా మీ ఊపిరితిత్తులను శుభ్రపరచడానికి కాస్టర్ ఆయిల్ సహాయం చేస్తుంది. ఈ కాస్టర్ ఆయిల్ శ్వాస నాళ రద్దీని తగ్గిస్తుంది మరియు గర్భాశయం, కాలేయం మరియు జీర్ణ వ్యవస్థల నుండి విషతుల్య వ్యర్థాలను తొలగిస్తుంది. కాస్టర్ ఆయిల్ మంటను తగ్గిస్తుంది మరియు శోషరస ప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఛాతీ మీద కాస్టర్ ఆయిల్ కొద్దిగా వేసి నెమ్మదిగా మర్దన చేయండి.

10. ఊపిరితిత్తుల-శుద్ది ఆహారాలు

10. ఊపిరితిత్తుల-శుద్ది ఆహారాలు

మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని సైతం ప్రభావితం చేసే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలు శరీర సహజ ప్రక్షాళన యంత్రాంగాలను ప్రోత్సహిస్తాయి మరియు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. కాయేన్ పెప్పర్ మరియు పిస్తాపప్పు మీ ఊపిరితిత్తులను శుద్ధి చేయడానికి దోహదపడే అద్భుతమైన ఆహారాలు. పిస్తాపప్పులు ఊపిరితిత్తుల క్యాన్సర్ అవకాశాలను తగ్గిస్తాయి

మీ ఆహారంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, కాయెన్ పెప్పర్, అల్లం, పసుపు, ఆపిల్, గ్రీన్ టీ మరియు ఒరేగానో వంటి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి.

నల్ల బీన్స్ మరియు కాయధాన్యాలు వంటి ఫోలేట్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి, ఇటువంటి అనేక ఆరోగ్య సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

10 Home Remedies To Purify Your Lungs

Detoxification and purification of the lungs will promote normal lung functioning, rejuvenate lung vitality, reduce swelling and inflammation, help clear mucus from the airways, and improve circulation in the lungs. The home remedies for lung purification are lemon juice, lung-cleansing foods, ginger, oregano, peppermint, etc.
Desktop Bottom Promotion