For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే 10 మోస్ట్ కామన్ ఫుడ్స్

ఫుడ్ పాయిజనింగ్ అనేది మనం తీసుకునే ఆహారం నుంచి సంభవిస్తుంది. కలుషితమైన, పాడైపోయిన, విషాహారమును తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది. పాతోజెన్స్ అనే రోగకారక క్రిములనేవి మనం తీసుకునే

|

ఫుడ్ పాయిజనింగ్ అనేది మనం తీసుకునే ఆహారం నుంచి సంభవిస్తుంది. కలుషితమైన, పాడైపోయిన, విషాహారమును తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదం ఉంది.

పాతోజెన్స్ అనే రోగకారక క్రిములనేవి మనం తీసుకునే ప్రతి ఆహారంలోనూ ఉంటాయి. అయితే, వండుకునేటప్పుడు ఇవి నశిస్తాయి. ,అందువలన, పచ్చివాటిని ఆహారంగా తీసుకోకూడదనే నియమం వచ్చింది.

most common foods that cause food poisoning

మాంసం, పాల ఉత్పత్తులు అలాగే గుడ్లు అనేవి తరచూ కలుషితమవుతూ ఉంటాయి. కాబట్టి, వీటిని జాగ్రత్తగా శుద్ధి చేసి ఆ తరువాత ఉడకబెట్టుకుని స్వీకరించాలి. వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, ఆకలి లేకపోవటం, చిన్నపాటి జ్వరం, బలహీనత, తలనొప్పి వంటివి ఫుడ్ పాయిజనింగ్ కు సంబంధించిన కొన్ని సాధారణ లక్షణాలు.

<strong>ఫుడ్ పాయిజన్ నయం చేసే 15 బెస్ట్ హోం రెమడీస్</strong>ఫుడ్ పాయిజన్ నయం చేసే 15 బెస్ట్ హోం రెమడీస్

ఫుడ్ పాయిజనింగ్ కొన్ని సార్లు ప్రాణాంతకమైనది కూడా. అటువంటప్పుడు, ఏ ఆహారం ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుందో తెలుసుకోవడం కష్టం. కానీ, మీకు గనక ఏయే ఆహారపదార్థాల వలన ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదముందో తెలిస్తే మీరు వాటిని మరింత జాగ్రత్తగా వండుకుని తద్వారా రోగకారక క్రిములను నశింపచేస్తారు. అంతే కాని, ఈ ఆహారపదార్థాలను తీసుకోవడం మాత్రం మానవద్దు.

ఫుడ్ పాయిజనింగ్ కు దారితీసే 10 అత్యంత సాధారణ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆకుకూరలు:

1. ఆకుకూరలు:

సలాడ్లలో అలాగే అనేకరకాల వంటకాలలో ఆకుకూరలను తరచూ వాడతారు. లెట్యూస్, స్పినాచ్, క్యాబేజ్ వంటివి దుమ్ము, మట్టి అలాగే మురికి నీటి వలన కలుషితమవుతాయి. కాబట్టి, ఆకుకూరలని వాడే ముందు వాటిని చక్కగా శుభ్రంచేసుకుని ఆ తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి.

2. గుడ్లు:

2. గుడ్లు:

గుడ్లలో సాల్మొనెల్లా అనే బాక్టీరియా పొంచి ఉంటుంది. ఈ బాక్టీరియా వలన గుడ్లు కలుషితమవుతాయి. కోడి గుడ్లను పొదగడానికి అలాగే షెల్స్ అనేవి తెరచుకోవడానికి ముందే ఇలా జరుగుతుంది. కాబట్టి, వాటిని బాగా ఉడకపెట్టడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ ను అరికట్టవచ్చు.

3. మాంసం:

3. మాంసం:

పౌల్ట్రీ చికెన్ తో పాటు గ్రౌండ్ బీఫ్ ని సరైన విధానంలో తీసుకోకపోతే వీటిద్వారా ఫుడ్ పాయిజనింగ్ సంభవించే ప్రమాదం కలదు. శ్టఫ్ మరియు సాల్మొనెల్లా బాక్టీరియా ద్వారా మాంసం అనేది కలుషితమవుతుంది. అందుకే సరిగ్గా ఉడకని మాంసాన్ని తీసుకోకూడదు. మాంసాన్ని సరిగ్గా ఉడికించిన తరువాతే ఆహారంగా స్వీకరించాలి.

4. ట్యూనా:

4. ట్యూనా:

స్కామ్బ్రోటాక్సిన్ వలన ట్యూనా ఫిష్ అనేది కలుషితమవుతుంది. దీని వలన తలనొప్పులు అలాగే ఒళ్ళు నొప్పులు సంభవిస్తాయి. ట్యూనా ఫిష్ ను పట్టిన తరువాత 60 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే, వండినా కూడా నశింపబడని విషపదార్థం అనేది విడుదలవుతుంది. అందుకే, తాజా ఫిష్ ను ప్రిఫర్ చేయాలి.

5. బంగాళాదుంపలు:

5. బంగాళాదుంపలు:

తాజాగా వండిన బంగాళాదుంపల వలన ఎటువంటి అనారోగ్యమూ తలెత్తదు. ఇవి మట్టి దిగువభాగాన ఎదుగుతాయి కాబట్టి వీటిని పూర్తిగా కడిగి శుభ్రపరచుకోవాలి. రెస్టారెంట్స్ లో లభించే బంగాళాదుంపల సలాడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. అవి కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

<strong>ఫుడ్ ఫాయిజనింగ్ అయినప్పడు ఫాలో అవ్వాల్సిన టిప్స్</strong>ఫుడ్ ఫాయిజనింగ్ అయినప్పడు ఫాలో అవ్వాల్సిన టిప్స్

6. ఛీజ్:

6. ఛీజ్:

ఛీజ్ ఇష్టపడని వారుండడం అరుదు. అయితే, ఛీజ్ ని తీసుకోవడం ద్వారా కూడా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సాల్మొనెల్లా మరియు లిస్టేరియా వంటి అనేక రకాల బాక్టీరియా ద్వారా ఛీజ్ అనేది కలుషితమవుతుంది. ఇవి గర్భస్రావాన్ని కల్గించే ప్రమాదం కూడా ఉంది.

7. టమాటో:

7. టమాటో:

టమాటోలను బయటే ఎక్కువకాలం ఉంచితే అవి పాడయిపోతాయి. వీటివలన, ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంది. బాక్టీరియా అనేది పెరిగి విస్తరింపబడకూడదంటే టమాటోలను రన్నింగ్ వాటర్ లో బాగా కడగాలి. పచ్చివి తినే బదులు టమాటోలను బాగా ఉడికించుకుని తినడం మంచిది.

8. మొలకెత్తిన విత్తనాలు:

8. మొలకెత్తిన విత్తనాలు:

అధిక బరువును తగ్గించుకోవాలనే వారు ఈ మొలకెత్తిన విత్తనాలకు బాగా ఆకర్షితులవుతారు. అయితే, వీటిపై కూడా బాక్టీరియా దాడి చేస్తుందని గుర్తుంచుకోవాలి. విత్తనాలనేవి వెచ్చని అలాగే తేమ వాతావరణంలో మొలకెత్తుతాయి. ఈ వాతావరణమనేది బాక్టీరియాను అట్రాక్ట్ చేస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వారు మొలకెత్తిన విత్తనాలను తీసుకోకపోవటమే మంచిది.

9. షెల్ ఫిష్:

9. షెల్ ఫిష్:

ఓయిస్టర్స్, ఎండ్రకాయ, రొయ్యలు, లాబ్స్టర్స్ వంటివి ఫుడ్ పాయిజనింగ్ ను కలిగించే హానికర బాక్టీరియాను కలిగి ఉంటాయి. షెల్ ఫిష్ ను సరిగ్గా వండకపోతే ప్రమాదకర బాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించి మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తుంది .

10. బెర్రీస్:

10. బెర్రీస్:

రాస్ప్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు బ్లాక్ బెర్రీస్ వంటి తాజా పళ్ళు కూడా ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతాయి. ఎలా అని సందేహపడుతున్నారా? ఈ బెర్రీస్ అన్నింటిలో కూడా ఎంతో కొంత పగుళ్లు ఉంటాయి అందువలన వీటిలో క్రిములనేవి పొంచి ఉంటాయి. అలాగే, ఈ పగుళ్లలో బాక్టీరియా, మురికి అలాగే పురుగుమందుల శేషాలుంటాయి. కాబట్టి, వీటిని పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే స్వీకరించాలి.

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి

ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టయితే మీ ప్రియమైనవారికి ఈ ఆర్టికల్ ను తప్పక షేర్ చేయండి.

English summary

10 Most Common Foods That Could Cause Food Poisoning

Lord Muruga or Murugan is a popular Hindu God and the son of Lord Shiva and Goddess Parvati . ‘Murugu’ means beauty hence ‘Murugan’ means...
Story first published:Thursday, January 4, 2018, 11:48 [IST]
Desktop Bottom Promotion