For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జలుబు మరియు ఫ్లూ జ్వరాలకు సూచించబడిన సహజ సిద్దమైన ఇంటి చిట్కాలు ఇవే.. !

|

చిన్నప్పుడు జలుబు, జ్వరాలని అబద్దాలు చెప్పి స్కూల్స్ కి సెలవులు పెట్టే రోజులు గుర్తున్నాయా? చాలా ఫన్నీగా అనిపిస్తుంది తలచుకుంటే. కానీ నిజజీవితంలో ఆ జలుబు జ్వరాల వలన కలిగే సమస్యలు అన్నీ ఇన్ని కావు. వళ్ళు నొప్పులు, శరీర ఉష్ణోగ్రతలలో అసాధారణ మార్పులు, తుమ్ములు, దగ్గు, ముక్కు అసౌకర్యానికి గురవడం వంటి అనేక భాధాకరమైన అంశాలు ప్రభావితం చేస్తాయి.

ఆరోగ్య నిపుణులు చెప్తున్న సలహాల ప్రకారం 2సంవత్సరాల లోపు పిల్లలకు ఇలాంటి సమస్యలకు మందులు అధికంగా ఇవ్వడం వలన, ప్రాణాంతకాలుగా కూడా పరిణమించే అవకాశాలు లేకపోలేదు. ఇలాంటి మందులు అధికంగా వాడడం వలన మూత్రపిండాలు, కాలేయం ముఖ్యంగా ప్రభావితమవుతాయని హెచ్చరిస్తున్నారు. పెద్దలే ఇలాంటి ప్రభావాలను తట్టుకోవడానికి కష్టాలు పడుతుంటారు, మరి పసిపిల్లల పరిస్తితి ఎలా ఉంటుందో ఊహకు కూడా అందని విషయమే.

Natural Home Remedies For Cold And Flu,

Influenza (శ్వాసనాళంలో వైరస్ చేరడం వలన ఏర్పడిన పడిశము) ను ఫ్లూ అని కూడా వ్యవహరిస్తారు. ఇవి ముఖ్యంగా శరీరంలోని పైభాగాన కల శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలుగా ఉంటాయి. క్రమంగా గొంతు, ఊపిరి తిత్తులు మరియు ముక్కు సంబంధిత సమస్యలు అధికమవుతుంటాయి. ఫ్లూ అనేది సాధారణ జ్వరాల్లో ఒకటిగా మారిపోయింది అనడంలో ఆశ్చర్యం లేదు.

కానీ ఈ జలుబు, మరియు ఫ్లూ జ్వరాలకు అద్భుతమైన ఇంటి చిట్కాలు కూడా అందుబాటులో ఉన్నాయి అన్నది ఆహ్వానించదగ్గ విషయము. మీ వంట గదిని మెడికల్ ఫార్మసీగా భావించి చూడండి, అనేక సహజ సిద్దమైన మందులు మీకు దర్శనం ఇస్తాయి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క అనేది ఒక సుగంధ ద్రవ్యం అని అందరికీ తెలిసినదే. కానీ ఇందులో అనేక రహస్యమైన శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. ఓట్ మీల్ మరియు కుకీస్ కు ఫ్లేవర్ గా కూడా వినియోగించవచ్చు. ఇందులో నొప్పి నివారణ లక్షణాలతో సహా, క్రిమి సంహారక తత్వాలను కూడా కలిగి ఉంటాయి తద్వారా bronchitis (శ్వాస నాళాల వాపు) ను తగ్గించే గుణాలను కలిగి ఉంటాయి. ఈ దాల్చిన చెక్క రక్త నాళాలను ఉత్తేజపరచి, షుగర్, రక్తపోటు తీవ్రతలను తగ్గించుటలో ఎంతగానో సహాయపడుతుంది. ఇన్సులిన్ మోతాదులను పెంచడంలో దీని పనితీరు అత్యధ్బుతం.

ఒక కప్పు వేడి నీళ్ళలో, కొంచం దాల్చిన చెక్క పౌడర్ వేసి కలిపి 2నిమిషాలు ఉంచి సేవించవలసి ఉంటుంది. రోజులో కనీసం మూడు మార్లు తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

తెల్లగడ్డ :

తెల్లగడ్డ :

తెల్లగడ్డలో అనేక రకాల సహజ సిద్దమైన రోగ నిరోధక శక్తి తత్వాలు, క్రిమి సంహారక లక్షణాలు అధికంగా ఉంటాయి. శ్వాసకోశ నాళాల పూడికను తొలగించుటలో తెల్లగడ్డ లోని తత్వాలు అద్భుతంగా పని చేస్తాయి. అనేక రకాల బాక్టీరియాలను తుదముట్టించ గలిగే లక్షణాలను కలిగి ఉండడం తో పాటు, రోగనిరోధక శక్తి తత్వాలను ఉత్తేజపరచే లక్షణాలు కూడా అధికంగా కలిగి ఉంటాయి. తద్వారా శ్వాసకోస సంబంధిత బాక్టీరియాను సమర్ధవంతంగా అడ్డుకోగలదు. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఇన్ ఇండియా ప్రకారం తెల్లగడ్డ అనేకరకాల బాక్టీరియాలు తొలగించడంలో మరియు మూత్రకోశ సంబంధిత సమస్యలను కూడా తగ్గించుటలో సహాయం చేస్తుంది.

తెల్లగడ్డ చూర్ణాన్ని ఆలివ్ నూనెతో కలిపి బ్రెడ్ తో తీసుకోవడం ద్వారా ఇలాంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులను అడ్డుకోవచ్చు.

అల్లం :

అల్లం :

అల్లంలో క్రిమినాశక తత్వాలు అధికంగా ఉంటాయి, ముఖ్యంగా కఫాన్ని(దగ్గు) తగ్గించే లక్షణాలను అధికంగా కలిగి ఉంటాయి. మరియు రోగ నిరోధక శక్తితత్వాలను అధికంగా కలిగి ఉండి, శ్వాసకోశ నాళాల ట్రాక్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో మరియు శ్లేష్మం తగ్గించుటలో సహాయం చేయగలదు.

తాజా అల్లాన్ని వేడి నీళ్ళలో 20నిమిషాలు ఉంచి, అందులో ఒక దాల్చిన చెక్కను, కొంచం నిమ్మ రసాన్ని పిండి తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం అన్నిటా శ్రేష్టం.

తేనె :

తేనె :

తేనెలో క్రిమిసoహారక తత్వాలు, మరియు రోగ నిరోధక శక్తి తత్వాలు అధికంగా ఉంటాయి. నిమ్మకాయతో కలిపి తేనెను తీసుకోవడం అన్నీ విధాలుగా మేలును చేకూరుస్తుంది. మరియు శ్వాసకోశ నాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పట్టడంలో కీలకపాత్ర పోషిస్తుంది. తేనె కఫానికి మంచి విరుగుడుగా పని చేస్తుంది అని అనేక అధ్యయనాలు తెలిపాయి. జలుబు మరియు ఫ్లూ జ్వరాలకు కూడా అత్యంత శక్తి వంతమైన గృహవైద్యంగా చెప్పబడినది.

2 టీస్పూన్ల తేనెను నిద్రపోయే ముందు ప్రతిరోజూ తీసుకోవడం అన్నివిధాలా మంచిదిగా చెప్తుంటారు. మరియు ఉదయాన్నే వేడినీళ్లలో నిమ్మరసంతో కలిపి తేనెను తీసుకోవడం ద్వారా జీవక్రియలను మెరుగుపరచడమే కాకుండా, జలుబు ఫ్లూ జ్వరాలకు కూడా చెక్ పెట్టవచ్చు.

విటమిన్-సి :

విటమిన్-సి :

విటమిన్-సి లో అనేక రకాల ఆరోగ్య లక్షణాలు ఉనాయి. నిమ్మకాయ, కమలా, ద్రాక్ష, ఆకుపచ్చని ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు మొదలైన వాటిలో విటమిన్- సి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ టీ లో కాస్త నిమ్మరసం కలపడం ద్వారా శ్లేష్మస్థరానికి సంబందించిన మరియు శ్వాసకోశ సంబంధిత సమస్యలను దూరం చేయవచ్చు. ముఖ్యంగా జలుబు జ్వరాల సమయాల్లో అత్యధ్బుతంగా పనిచేసే గృహ వైద్యంగా చెప్పబడినది.

విటమిన్ సి ఉండే ఆహార పదార్ధాలను అధికంగా తీసుకునే వారు సాధారణంగానే రోగాలకు దూరంగా ఉంటారని చెప్పబడింది. ఈ విటమిన్-సి, జలుబు, ఫ్లూ వంటి జ్వరాలకు అద్భుతంగా పని చేస్తుంది .

ఉప్పు నీళ్ళు :

ఉప్పు నీళ్ళు :

వేదినీళ్లలో ఉప్పు కలిపి పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా జలుబు, ఫ్లూ సమయాల్లో ఉపశమనంగా ఉంటుంది. ఇది శ్లేష్మ స్థరాన్ని శుభ్రపరిచే దిశగా పనిచేస్తుంది. నెమ్మదిగా గొంతునొప్పి, ముక్కు దిబ్బడ తగ్గించడం లో కీలకపాత్ర పోషిస్తుంది. మరియు అంగిట్లో పుక్కిలించి ఉమ్మివేయుట ద్వారా బాక్టీరియా తగ్గుదల పై ప్రభావం చూపుతుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ ఉప్పు కలిపి, పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.

English summary

Natural Home Remedies For Cold And Flu

Influenza, also known as flu, is an infectious viral disease that affects the upper respiratory system, including your throat, lungs and nose. Cold and flu is the most common health condition. You can treat cold and flu with simple home remedies like oregano, cinnamon, garlic, ginger, nutmeg, rosemary, thyme, honey, vitamin C, etc.
Story first published: Friday, April 13, 2018, 16:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more