For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 10 ఆశ్చర్యపరిచే ఆరోగ్య లాభాలు డిటాక్స్ టీ వల్ల కలుగుతాయాని మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరి జీవనవిధానం ఎంతో వేగవంతం అయిపోయింది. ఇందు వల్ల మన జీవితాలు చాలా దుర్భరంగా మారిపోయాయి, ఇలా అవడానికి ప్రత్యేక కారణం మనం అలవరచుకున్న అనారోగ్య జీవన విధానం. అవసరమైనమేర నీటిని త్రాగకపోవడం, తరచూ బయటి ఆహారాన్ని తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం లాంటి పనుల వల్ల మనం అనారోగ్యం భారిన పడుతున్నాం.

ఇలా గనుక మనం వ్యవహరించినట్లైతే, ఇలాంటి ఆహారాన్నే కనుక ఎక్కువశాతం స్వీకరించినట్లైయితే, మన శరీరం రోగాలకు నిలయంగా మారుతుందట.

వయస్సు పెరుగుతున్న కొద్దీ మనం పాటించిన అనారోగ్య అలావట్ల వల్ల కలిగే మార్పులు కూడా మన శరీరం పై తీవ్రమైన ప్రభావం చుపిస్తాయంట. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? ఇందుకోసమే వైద్య రంగ నిపుణులు శరీరం లో ఉన్న హానికర పదార్థాలను బయటకు పంపడానికి వివిధ రకాల నిర్విషీకరణ పద్దతులను ప్రవేశ పెట్టారు. నిర్విషీకరణ పానీయాలు, నిర్విషీకరణ స్మూతీస్ దగ్గరి నుండి నిర్విషీకరణ టీ వరకు ఇలా ఎన్నో పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. నిర్విషీకరణ అనే ప్రక్రియ ద్వారా శరీరం లో ఉన్న హాని కార పదార్థాలన్నింటిని బయటకు పంపవచ్చు.

శరీరం లోని ప్రతి శరీర భాగాన్ని నిర్విషీకరణ చేయటానికి ఆరోగ్యవంతమైన ఆహారాలు, పానీయాలు చాలా అవసరం. ఒక వేల మీ శరీరం కనుక నిర్విషీకరణ ప్రక్రియ చేయకపోతే, మెదడు పని చేయకపోవడంతో పాటు కాలేయ, మూత్రపిండాల సమస్యలు కూడా తలెత్తుతాయి. అంతే కాకుండా హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది, క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఎన్నో రకాల నిర్విషీకరణ పానీయాలు ఉన్నప్పటికీ, వీటిల్లో చాలా వాటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాంటి ఒక నిర్విషీకరణ పానీయాలలో నిర్విషీకరణ టీ కూడా ఒకటి.

10 Surprising Health Benefits Of Detox Tea,

1. హానికర పదార్థాలను తీసివేస్తుంది :

విపరీతమైన ఖనిజాలు, పురుగుమందుల, పర్యావరణ కాలుష్యాలు, రసాయనాలు ఇలా ఎన్నో అవశేషాలు శరీరంలోని కణజాలాలు, కణాల మధ్య నిల్వ ఉండిపోయి ఉంటాయి. ఇది రోగ నిరోధక వ్యవస్థ, జీర్ణ క్రియ తో పాటు రోగాల తో పోరాడే శక్తి పై కూడా విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. నిర్విషీకరణ టీ తాగడం వల్ల హానికర అవశేషాలు శరీరం లో పేరుకుపోవు. కాలేయాన్ని నిర్విషీకరణ చేసి దాని పని తీరుని మెరుగుపరుస్తుంది.

2. మంటను తగ్గిస్తుంది :

2. మంటను తగ్గిస్తుంది :

ఈ పానీయం కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. రోగాలకు కారణమైన వ్యాధులు వల్ల కలిగే మంట కలగకుండా చేస్తుంది. శరీరం లోపల ఉబ్బకుండా చేస్తుంది. అల్లంతో చేసిన నిర్విషీకరణ టీ తీసుకోవడం ద్వారా మంట తగ్గిపోతుంది. అంతే కాకుండా జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది.

3.శక్తి, చురుకుదనాన్ని పెంచుతుంది :

3.శక్తి, చురుకుదనాన్ని పెంచుతుంది :

నిర్విషీకరణ టీ శరీరం లో మంటను తగ్గిస్తుంది. శక్తి సామర్త్యాలను పంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. క్రమం తప్పకుండా నిర్విషీకరణ టీ గనుక తాగితే అలసట దూరం అవుతుంది, ఆలోచనల్లో స్థిరత్వం ఏర్పడుతుంది, మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. లెమన్ టీ, రోజ్ మేరీ టీ, పొదీనా శరీరం లో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. మెదడు చురుకుదాన్నని పెంచుతుంది.

4 . బరువు తగ్గడానికి కాపాడుతుంది:

4 . బరువు తగ్గడానికి కాపాడుతుంది:

నిర్విషీకరణ టీ జీర్ణక్రియ మెరుగు అయ్యేలా చేస్తుంది. శక్తి సామర్త్యాలను పెంపొసాదిస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు రోజంతా శక్తివంతులుగా ఉంటారు. నిర్విషీకరణ టీ లో ఫలావోనోయిడ్స్ , కాటెచిన్స్, హెచ్ సి ఏ లాంటి ఎన్నో యాంటియోక్సిడెంట్స్ తో పాటు మరిన్ని ఖనిజాలు, విటమిన్లు ఉంటాయట. హెచ్ సి ఏ ఆకలి ని తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు.

5. జీర్ణక్రియ మేరుపడుతుంది :

5. జీర్ణక్రియ మేరుపడుతుంది :

చాలా మంది ప్రజలు కడుపు ఉబ్బటం, కడుపు లో గ్యాస్ పెరగటం, వికారం గా ఉండటం, మలబద్ధకం లాంటి ఎన్నో జీర్ణ క్రియకు సంబంధించిన వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. ఎప్పుడైతే నిర్విషీకరణ టీ ని సేవిస్తారో అప్పుడు జీర్ణక్రియ మెరుగవుతుంది. అదే సమయంలో శరీరంలో వివిధ భాగాల్లో పేరుకుపోయి ఉన్న చెత్త అంతా కూడా బయటకు పంపివేయడంలో ఇది ఎంత గానో సహాయ పడుతుంది.

6. ఆహారం పై మక్కువను తగ్గిస్తుంది:

6. ఆహారం పై మక్కువను తగ్గిస్తుంది:

అనారోగ్య ఆహారాలను తినకుండా మనల్ని మనము అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ఆహారాలను తినటం విషయంలో మనల్ని మనం నిగ్రహించుకోకపోతే విపరీతంగా బరువు పెరుగుతారు, వివిధ రకాల వ్యాధుల భారిన పడతారు. నిర్విషీకరణ టీ లో ఉండే ఈ సాధారణ పదార్థాలు అనారోగ్య అలవాట్లకు మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. మీ కడుపు ఇప్పుడు నిండుగా ఉండేలా చేస్తుంది.

7. రోగనిరోధక శక్తిని శక్తివంతం చేస్తుంది:

7. రోగనిరోధక శక్తిని శక్తివంతం చేస్తుంది:

నిర్విషీకరణ టీ తాగటం వల్ల శరీరం మొత్తం శుభ్రం అవుతుంది. శరీరాన్ని హానికర పదార్థాలు భారి నుండి కాపాడుతుంది. ఇలా చేయడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం వివిధ రోగాల భారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

8. కాలేయ పనితీరు మెరుగుపడేలా చేస్తుంది :

8. కాలేయ పనితీరు మెరుగుపడేలా చేస్తుంది :

కాలేయాన్ని శుభ్రం చేయటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కాలేయం శరీరం లో ఉన్న హానికర పదార్థాలను శుద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని శక్తివంతం చేస్తుంది. నిర్విషీకరణ టీ కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. కాలేయం సరిగ్గా, సరైన పద్దతిలో పనిచేసేలా చేస్తుంది. ఇలా చేయడం వల్ల కాలేయ కణాలు సంరక్షించ బడటంతో పాటు, కాలేయం సరైన పద్దతిలో పనిచేసే విధంగా సహాయ పడుతుంది.

9. శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది :

9. శరీరానికి కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది :

నిర్విషీకరణ టీ తాగటం వల్ల మీకు ఎంతో తాజా గా అనిపిస్తుంది, మీలో కొత్త శక్తి వస్తుంది. దానిలో ఉండే మంచి సువాసన మీలో కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఊలోంగ్ టీ, మచ్చ టీ, గ్రీన్ టీ లాంటి టీ లను ప్రతి రోజు ఉదయం తాగి రోజుని ప్రారంభిస్తే, రోజంతా ఉల్లాసవంతంగా ఉంటుంది.

10. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది :

10. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది :

శరీరం లో గనుక హానికర పదార్థాలు ఉన్నట్లయితే అవి కచ్చితంగా చర్మం పై ప్రభావాన్ని చూపిస్తాయి. చర్మం ప్రతి రోజు వాతావరణం లో ఉండే కాలుష్య కారకాలను పీల్చుకుంటుంది. ఇలా చేయటం వల్ల చర్మం పొడి బారిపోతుంది, చర్మపు ఛాయ తగ్గిపోతుంది. నిర్విషీకరణ టీ తాగటం వల్ల చర్మంలో ఉండే హానికర పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. చర్మానికి కి నిగారింపు వస్తుంది.

English summary

10 Surprising Health Benefits Of Detox Tea

The healthy foods and drinks are required to detoxify every organ of the body. If your body is not detoxified, it may result in brain dysfunction, liver and kidney problems, hormonal imbalances and an increased risk of cancer.Though there are a lot of detox drinks that can be made at home, one such detox beverage is detox tea.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more