For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ద్వారా కలిగే 10 ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్

స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ద్వారా కలిగే 10 ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్స్.ఈటరీస్ లో గాని రెస్టారెంట్స్ లో గాని మీరు సందర్శించినప్పుడు అక్కడ మినరల్ వాటర్ ని సర్వ్ చేస్తారు. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ న

|

ఈటరీస్ లో గాని రెస్టారెంట్స్ లో గాని మీరు సందర్శించినప్పుడు అక్కడ మినరల్ వాటర్ ని సర్వ్ చేస్తారు. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ని తాగితే అనేక ప్రయోజనాలు పొందవచ్చని దీనిని తాగడానికి ఆసక్తిని కనబరుస్తారు. నిజమే, స్పార్క్లింగ్ వాటర్ ని తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది.

మినరల్ వాటర్ అనేది స్వచ్ఛమైన మంచినీటి సరస్సుల నుంచి అలాగే బావి నుంచి సేకరించబడిన నీరు. ఇందులో సహజసిద్ధమైన మినరల్స్ లభిస్తాయి. మాగ్నేషియం, పొటాషియం అలాగే కేల్షియం అనే మినరల్స్ శరీరానికి అవసరపడతాయి. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ లో నేచురల్ గ్యాసెస్ లభిస్తాయి. కార్బన్ డయాక్సయిడ్ ని నీటిలోకి పంపించడం ద్వారా ఈ నీటిని తాత్కాలికంగా కార్బోనేట్ చేయడం కూడా జరగవచ్చు.

10 Surprising Health Benefits Of Sparkling Mineral Water

కాబట్టి, అసలీ స్పార్క్లింగ్ మినరల్ వాటర్ శరీరానికి మంచిదో కాదో తెలుసుకుందాం? మినరల్ వాటర్ అనేది ఆరోగ్యానికి మంచిదే. ఈ వాటర్ లోని మినరల్స్ ను శరీరం గ్రహించకపోయినా, మినరల్ వాటర్ వలన ప్రయోజనం ఏర్పడుతుంది. స్పార్క్లింగ్ వాటర్ అనేది రెగ్యులర్ వాటర్ లా హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుందని ఎంతో మంది హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.

అయినా, స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ని మితంగా సేవించడమే మంచిది. ఇందులో ఆర్టిఫీషియల్ ఫ్లేవర్స్, కలర్స్ అలాగే అడిటివ్స్ కలవు. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ను తీసుకోవడం వలన ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

1. మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి:

1. మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి:

స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ను మీరు ప్రిఫర్ చేస్తున్నారంటే మీరు డైట్ లో తగినన్ని మినరల్స్ ని తీసుకుంటున్నారని అర్థం. కేవలం శరీరాన్ని హైడ్రేట్ చేయడం కోసమే కాకుండా మినరల్స్ ని మీరు తీసుకుంటూ శరీరానికి అవసరమైన పోషణను అందిస్తున్నారు. అయితే, స్పార్క్లింగ్ మినరల్ వాటర్ అనేది నేచురల్ సోర్స్ నుంచి రావాలి అలాగే ఇందులో సహజసిద్ధమైన మినరల్స్ లభించాలి. సోర్స్ బట్టి, మినరల్ వాటర్ లో లభించే మినరల్స్ మోతాదు ఆధారపడి ఉంటుంది. అయితే, ఆహారంలో లభ్యమైయ్యే మినరల్స్ తో పోలిస్తే మినరల్ వాటర్ లో లభించే మినరల్స్ ని శరీరం త్వరగా గ్రహిస్తుంది. మెగ్నీషియం, పొటాషియం మరియు కేల్షియంలు మినరల్ వాటర్ లో లభించే ముఖ్యమైన మినరల్స్.

2. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్:

2. బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్:

మినెరల్ వాటర్ లో బైకార్బోనేట్స్ కలవు. ఇవి రక్తంలోని పి హెచ్ లెవెల్స్ ని మెయింటెయిన్ చేయడానికి తోడ్పడతాయి. కాబట్టి, మరింత ఎసిడిక్ గా మారకుండా మినెరల్ వాటర్ తోడ్పడుతుంది. ఎవిడెన్స్ బేస్డ్ కాంప్లినెటరీ మరియు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే స్టడీలో బైకార్బొనేట్ రిచ్ మినరల్ వాటర్ ను తీసుకోవడం ద్వారా గ్లైకేమిక్ నియంత్రణలో ఉంటుందని తెలుస్తోంది.

3. సోడాకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం:

3. సోడాకు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం:

ఆ డైట్ సోడాను సిప్ చేయడం మానేసి మినరల్ వాటర్ ను తీసుకోవడం ప్రారంభించండి. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ అనేది సోడా లేదా డైట్ సోడా కంటే మెరుగైనది. ఎందుకంటే, సోడా అనేది ఇన్సులిన్ ని పెంచే షుగర్స్ తోనైనా నిండి ఉంటుంది లేదా ఆరోగ్యానికి హానికరమైన అస్పర్టమ్ వంటి షుగర్స్ తోనైనా నిండి ఉంటుంది. షుగరీ డ్రింక్స్ ను ఎక్కువగా తీసుకోవడం ద్వారా హార్ట్ డిసీజ్, డయాబెటిస్ అలాగే ఇతర సీరియల్స్ క్రానిక్ హెల్త్ కండిషన్స్ రిస్క్ ను పెంచే ప్రమాదం ఉంటుందని.

4. కాన్స్టిపేషన్ & డిస్పెప్సియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది:

4. కాన్స్టిపేషన్ & డిస్పెప్సియాను అరికట్టేందుకు తోడ్పడుతుంది:

స్ట్రోక్ వంటి బ్రెయిన్ ఇంజురీ లేదా పార్కిన్సన్స్ డిసీజ్ వంటి సెంట్రల్ న్యూరలాజికల్ డిసీజ్ లతో ఇబ్బంది పడే వారిలో కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని యూకేలో నిర్వహించబడిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ను తీసుకోవటం ద్వారా కాన్స్టిపేషన్ ను అరికట్టవచ్చని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది. అలాగే, మినరల్ వాటర్ అనేది డిస్పెప్సియా లక్షణాలను కూడా తగ్గిస్తుందని తెలుస్తోంది.

5. మోషన్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది:

5. మోషన్ సిక్ నెస్ ను తగ్గిస్తుంది:

మోషన్ సిక్నెస్ అనేది మీరు లోపలి చెవి నుంచి గ్రహించే కదలికకు మీరు విజ్యువలైజ్ చేసే కదలికకు మధ్య కలిగిన తేడా వలన ఎదురయ్యే సమస్య. ఇది సాధారణ కండిషన్. కార్, ఏరోప్లేన్ లేదా ట్రెయిన్ లో ట్రావెల్ చేసే వారు ఎక్కువగా ఈ మోషన్ సిక్ నెస్ ను ఎదుర్కొంటారు. మినరల్ వాటర్ వంటి కార్బోనేటేడ్ బెవెరేజెస్ ను తీసుకోవడం ద్వారా అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే మీరు త్వరగా ఉపశమనం పొందుతారు.

6. ట్యాప్ వాటర్ కంటే సురక్షితం:

6. ట్యాప్ వాటర్ కంటే సురక్షితం:

ప్రపంచవ్యాప్తంగా, ఈ రోజుల్లో ట్యాప్ వాటర్ లో పేరుకుపోతున్న టాక్సిసిటీ అనేది నీటి స్వచ్ఛతపై సందేహాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా, వాటర్ సప్లైలో లభించే హానికర టాక్సిన్స్ అనేవి నీటి స్వచ్ఛతపై అనుమానాన్ని మరింత పెంచుతున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లోని ఓ సర్వే ప్రకారం ట్యాప్ వాటర్ లో 316 కెమికల్స్ లభ్యమయ్యాయని తెలుస్తోంది. ఇండియాలోని ట్యాప్ వాటర్ నీళ్ల స్వచ్ఛతపై కూడా అనుమానాలున్నాయి. ప్లాస్టిక్ మైక్రో ఫైబర్స్ తో ట్యాప్ వాటర్ అనేది కలుషితమవుతోందని ఒక అధ్యయనం వెల్లడించింది. కాబట్టి, ఆరోగ్యంగా ఉండేందుకు మినరల్ వాటర్ పై ఆధారపడటం తప్పదని తెలుస్తోంది.

7. ఫిజికల్ అలర్ట్ నెస్ మెరుగవుతుంది:

7. ఫిజికల్ అలర్ట్ నెస్ మెరుగవుతుంది:

వివిధ మినరల్స్ యొక్క కలయికగా స్పార్క్లింగ్ మినరల్ వాటర్ ని పేర్కొనవచ్చు. ఈ మినరల్స్ అనేవి మజిల్స్ పనితీరును మెరుగుపరిచేందుకు శరీరం సరిగ్గా పనిచేసేందుకు అవసరపడతాయి. మజిల్స్ సరైనవిధంగా కాంట్రక్షన్ ఆలాగే ఎక్స్ప్యాన్షన్ అయ్యేందుకు కూడా మినరల్ వాటర్ తోడ్పడుతుంది. మినరల్ వాటర్ వలన ఫిజికల్ అలర్ట్ నెస్ పెరుగుతుంది. అలాగే, ఆరోగ్యం మెరుగవుతుంది.

8. కార్డియాక్ డిసీజ్ ను తగ్గిస్తుంది:

8. కార్డియాక్ డిసీజ్ ను తగ్గిస్తుంది:

మినరల్ వాటర్ లో హ్యూమన్ బాడీలోంచి ఫ్యాట్ ను మెటాబాలైజ్ చేసే సామర్థ్యం ఉంది. తద్వారా ఇది బ్లడ్ క్యాపిలరీస్ చుట్టూ పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్టరాల్ (ఎల్ డి ఎల్)ను తగ్గిస్తుంది. బాడ్ కొలెస్ట్రాల్ వలన బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. తద్వారా, హార్ట్ ఎటాక్స్ ప్రమాదం పెరుగుతుంది. స్పార్క్లింగ్ మినరల్ వాటర్ అనేది క్యాపిలర్రీస్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోవటాన్ని అరికట్టి కార్డియాక్ డిసీస్ ల బారిన పడే ప్రమాదాన్ని అరికడుతుంది.

9. ఎసిడిటీను తగ్గిస్తుంది:

9. ఎసిడిటీను తగ్గిస్తుంది:

మినరల్ వాటర్ లో పాంక్రియాస్ కు కేటలిస్ట్ గా వ్యవహరించే సల్ఫెట్స్ లభ్యమవుతాయి. ఇవి లీపాస్ మరియయు అమిలేస్ అనే డైజెస్టివ్ ఎంజైమ్స్ ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి కాన్స్టిపేషన్ మరియు బ్లోటింగ్ సమస్యను అరికడతాయి. అలాగే ఇంటస్టైన్ లో టాక్సిన్స్ గడ్డకట్టడాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, ఎసిడిటీతో మీరు ఈసారి ఇబ్బంది పడితే మినరల్ వాటర్ ని ప్రయత్నించండి.

10. చర్మసంరక్షణకు మంచిది:

10. చర్మసంరక్షణకు మంచిది:

మినరల్ వాటర్ లో స్కిన్ ఫ్రెండ్లీ సిలికా పార్టికల్స్ కలవు. ఇవి అందమైన చర్మాన్ని అందించేందుకు తోడ్పడతాయి. ఆ విధంగా చర్మంలోని కొలాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరగడం వలన ముడతలు తగ్గుతాయి. డార్క్ స్పాట్స్ అలాగే డల్ నెస్ తగ్గుతుంది. చర్మం కోమలంగా అలాగే బ్లేమిషెస్ లేకుండా తయారవుతుంది.

English summary

10 Surprising Health Benefits Of Sparkling Mineral Water

Mineral water is simply the water collected from a spring or pumped from a well that contains naturally occurring minerals. Minerals like magnesium, potassium and calcium are found in it. The health benefits of sparkling mineral water are it manages blood sugar, helps in constipation, a healthier alternative to soda, calms motion sickness, disease, etc.
Story first published:Friday, April 13, 2018, 12:50 [IST]
Desktop Bottom Promotion