For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు అలసటగా ఉన్నప్పుడు ఈ 10 విషయాలను ఎప్పుడు అస్సలు చేయకండి

ఆరోగ్యవంతమైన శరీరమును ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి - మీ శరీరంలో ఉన్న క్యాలరీలను రోజంతా తగ్గించుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఉంటుంది.

By R Vishnu Vardhan Reddy
|

మీరు ఏదైనా పనిచేస్తుంటే మీ కళ్ళు మూతలు పడుతున్నాయా లేదా మీకు ఎప్పుడు నీరసంగా ఉంటుందా ? ఇలా ఎప్పుడూ జరుగుతూ ఉంటే దానర్ధం మీ శరీరం విపరీతంగా అలసిపోయిందని మరియు మీరు బాగా క్షీణించిపోయి ఉన్నారని అర్ధం. మీకు పగలంతా బాగా నిద్ర వస్తున్నట్లు అనిపించి లేదా రాత్రి సమయంలో నిద్రపోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లైతే, ఈ రకమైన అలసట వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు పంపే లక్షణాలే అవన్నీ.

మీరు పడుకొనే నిద్ర చక్రంలో నిలకడ ఉండాలి మరియు మీరు గనుక శారీరికంగా బాగా అలసిపోయి ఉన్నాగాని, మానసికంగా బాగా ఒత్తిడికి లోనవుతుంటే, అటువంటి సమయం లో మీకు మరుసటి రోజు విపరీతమైన నిద్ర మబ్బు ఉంటుంది.

దీని వల్ల మీ శరీరం యొక్క పనితీరులో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మరియు మీ యొక్క హార్మోన్ల విడుదల శరీర ఉష్ణోగ్రత మరియు బరువు నియంత్రణ పై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అంతేకాకుండా మీ శక్తి కూడా విపరీతంగా హరించుకుపోతుంది. ఏకాగ్రత దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు మరియు ఎప్పుడు విసుగుగా ఉంటారు.

మీరు కొన్ని జీవన శైలి మార్పులు చేసుకోవాల్సి ఉంది. మీరు తీసుకొనే కెఫీన్ మరియు మద్యం శాతాన్ని తగ్గించండి, పరిపూర్ణమైన ఆహారాన్ని తీసుకోండి మరియు తరచూ వ్యాయామం చేయండి. ఇవే కాకుండా మీరు అలసటగా ఉన్నప్పుడు కొన్ని విషయాలను అసలు చేయకూడదు.

అలసటగా ఉన్నప్పుడు ఏ ఏ విషయాలను చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. రోజులో ఎక్కువ కాఫీ ని తాగకండి ;

1. రోజులో ఎక్కువ కాఫీ ని తాగకండి ;

ఒక రోజులో ఎక్కువ కాఫీ ని త్రాగటం వల్ల మీరు ఎక్కువగా అలసిపోతారు మరియు నీచ స్థితిలో ఉంటారు. దీని వల్ల మీ శరీరం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మరియు మీరు శక్తిహీనులు అవుతారు. మీరు ఎప్పుడైతే కాఫీ త్రాగుతారో మీ కడుపులో కెఫీన్ 5 గంటల పాటు ఉంటుంది. మీరు ఈ ఐదు గంటల లోపు మళ్ళీ కాఫీ గనుక తాగితే, అటువంటి సమయంలో మీ రాత్రి నిద్రకు భంగం వాటిల్లేలా చేస్తుంది.

2. మరీ ఎక్కువగా జిమ్ చేయకండి :

2. మరీ ఎక్కువగా జిమ్ చేయకండి :

మీరు ఏదైనా పని చేయాలన్నా మరియు వ్యాయామం చేయాలన్నా శక్తి చాలా అవసరం. కానీ, మీరు ఎప్పుడైతే వ్యాయామాలను శృతి మించి చేస్తారో, అటువంటి సమయంలో మీ కండరాలల్లో అలసట ఎక్కువగా అనుభవిచాల్సి వస్తుంది. దీనికి బదులుగా మీరు కొద్దిగా సాధారణంగా ఉండే వ్యాయామాలు చేయండి. ఉదాహరణకు నడవటం మరియు సైకిల్ తొక్కటం లాంటివి చేయండి. ఇలా చేయడం వల్ల మీ నరాలు పట్టుకుపోవు మరియు మీకు ఎటువంటి దెబ్బ తగలదు. మీ శక్తి మొత్తం జిమ్ లోనే ఖర్చు చేస్తే ఆ తర్వాత మీరు విపరీతంగా అలసిపోతారు మరియు శక్తిహీనంగా మారుతారు.

3. మరీ ఎక్కువ గంటల పాటు నిద్రపోకండి :

3. మరీ ఎక్కువ గంటల పాటు నిద్రపోకండి :

మరీ ఎక్కువ గంటల పాటు నిద్రపోవడం అనేది మంచి ఆలోచన కాదు. ఎందుకంటే, రోజులో ఎక్కువసేపు నిద్రపోతే రాత్రిపూట నిద్రపట్టడం కష్టం. దీని వల్ల మీరు మరుసటిరోజు అలసిపోయినట్లు అవుతారు. మీరు ఒక రోజులో పగటిపూట 20 నుండి 30 నిమిషాల పాటు కునుకు తీయవచ్చు. అంతకు మించి నిద్రపోకండి. ఇలా చేయడం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు మరియు జాగ్రత్తగా ఉంటారు.

4. మీరు సాధారణంగా నిద్రపోయే సమయాన్ని దారి తప్పేలా చేయకండి :

4. మీరు సాధారణంగా నిద్రపోయే సమయాన్ని దారి తప్పేలా చేయకండి :

మీరు ఎప్పుడైతే విపరీతమైన అలసటగా భావిస్తుంటారో, అటువంటి సమయంలో మీ అలారం ని ఆపివేయకండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ యొక్క నిద్ర చక్రానికి భంగం వాటిల్లుతుంది. ఎప్పుడైతే మీ నిద్ర యొక్క చక్రం దెబ్బతింటుందో, అటువంటి సమయంలో మీరు మరింత శక్తి హీనులుగా అవుతారు మరియు అలసిపోతారు. దీని వల్ల మీకు నాణ్యమైన నిద్రపట్టదు. మీరు ఎప్పుడైతే సాధారణ సమయం కంటే ముప్పై నిముషాలు అధికంగా పడుకుంటారో, అటువంటి సమయంలో మీ శరీరాన్ని ఆలస్యంగా నిద్రపోయేలా మరియు ఆలస్యంగా నిద్ర లేచేలా ప్రేరేపిస్తుంది.

5. జంక్ ఫుడ్ ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపించకండి :

5. జంక్ ఫుడ్ ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపించకండి :

ఎప్పుడైతే మీ శరీరం శక్తిహీనంగా మరియు అలసిపోయి ఉంటుందో, అటువంటి సమయంలో మీ శరీరం ఎక్కువ కేలరీలు ఉన్న కొవ్వు ఆహారాన్ని తీసుకోవాలని భావిస్తుంది. ఇలా చేయడం చాలా అనారోగ్యకరం మరియు దీనివల్ల మీరు బరువు విపరీతంగా పెరిగిపోతారు. మీకు గనుక ఫాస్ట్ ఫుడ్ ని తినాలని అనిపిస్తున్నట్లైతే, అటువంటి సమయంలో ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడానికి బయటకు వెళ్ళండి మరియు రుచికరమైన ఉడకబెట్టిన కాయకురాలతో పాటు కోడి మాంసం లేదా దంపుడు బియ్యాన్ని తినడానికి ఆసక్తిని కనపరచండి. దీని వల్ల మీరు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకున్నవారు అవుతారు మరియు చురుకుగా వ్యవహరిస్తారు.

6. శృతిమించి సామజిక మాధ్యమాలను వాడకండి :

6. శృతిమించి సామజిక మాధ్యమాలను వాడకండి :

ప్రస్తుత కాలంలో ప్రపంచం మొత్తం సామజిక మాద్యమాల్లోనే బ్రతుకుతోంది. అసలు సోషల్ మీడియా భారి నుండి తప్పించుకోవడం అసాధ్యమనే చెప్పాలి. కానీ, మీరు ఎప్పుడైతే శక్తి హీనులుగా అలసిపోయి ఉంటారో, అటువంటి సమయాల్లో సామజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. మీరు గనుక సామజిక మాధ్యమాలను ఎక్కువగా వాడితే, అటువంటి సమయంలో మీరు ఎక్కువ సేపు మేల్కొని ఉండాల్సి వస్తుంది. ఆ పరికరాల నుండి వచ్చే వెలుతురు మెదడు పై ప్రభావం చూపుతుంది, మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేస్తుంది.

7. మద్యపానాన్ని అస్సలు తీసుకోకండి :

7. మద్యపానాన్ని అస్సలు తీసుకోకండి :

ఒక గ్లాసు మద్యపానాన్ని గనుక నిద్రపోయే ముందు తీసుకుంటే నిద్ర బాగా వస్తుంది అని, మీరు గనుక భావిస్తున్నట్లు అయితే అది పూర్తిగా అబద్దం అని భావించండి. అందులో ఎంత మాత్రము నిజం లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే నిద్రపోయే ముందు మద్యపానాన్ని స్వీకరిస్తారో, దీని వల్ల మీలో ఉన్న నిఘాడమైన నిద్రపోయే గుణాన్ని పాడుచేసినట్లు అవుతుంది. దీంతో మీరు పగలంతా లేదా రాత్రిళ్ళు మీకు నిద్ర పట్టనీయకుండా చేస్తుంది.

8. వారాంతంలో పడుకోవడాన్ని అస్సలు ఆలస్యం చేయకండి :

8. వారాంతంలో పడుకోవడాన్ని అస్సలు ఆలస్యం చేయకండి :

వారాంతంలో నిద్రపోయే సమయానికి గనుక భంగం వాటిల్లేలా మీరు గనుక వ్యవహరిస్తే, మీ యొక్క నిద్ర చక్రం గతి తప్పుతుంది. దీంతో మీరు అలారం పెట్టుకోకుండానే నిద్రపోతారు మరియు ఆలస్యంగా నిద్రలేస్తారు. దీని వల్ల మీరు ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా నిద్రలేవడం అలవాటైపోతుంది. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. అంతేకాకుండా ముఖ్యంగా సోమవారం ఉదయాన్నే నిద్రలేవడం చాలా కష్టతరంగా అనిపిస్తుంది.

9. శక్తి అవసరమయ్యే యోగాసనాలు చేయకండి :

9. శక్తి అవసరమయ్యే యోగాసనాలు చేయకండి :

యోగా చేయడం వల్ల మీ మెదడు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీ శరీరానికి కూడా విశ్రాంతి దొరుకుతుంది. కానీ, కొన్ని యోగాసనాలు చేయాలంటే శక్తి అవసరం అవుతుంది. కానీ, మీరు ఎప్పుడైతే శక్తిహీనులుగా అలసిపోయి ఉంటారో, అప్పుడు ఇలాంటి యోగాసనాలు చేయకండి. అలాంటప్పుడు దీనికి బదులుగా యోగాసనాలలో శవాసనం, చిన్నపిల్లల ఆసనం మరియు ఇతర యోగాసనాలు చేయండి. దేని వల్ల మీ యొక్క గుండె కొట్టుకునే వేగం పెరగకుండా ఉంటుంది.

10. అర్ధరాత్రి చిరు తిళ్ళు అస్సలు తినకండి :

10. అర్ధరాత్రి చిరు తిళ్ళు అస్సలు తినకండి :

మీరు అలసటగా మరియు శక్తిహీనులుగా ఉన్న సమయంలో ముఖ్యంగా అర్ధరాత్రి పూట చిరుతిళ్ళను అస్సలు తినకండి. ఇలా తినడం వల్ల మీరు నిద్రపోయిన తర్వాత ఆహారం అస్సలు జీర్ణం కాదు. ముఖ్యంగా బర్గర్లు, చిప్స్ మరియు నూనె ఆహారాలను పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే, ఇవి తీవ్రమైన మంటని మీకు కలిగిస్తాయి, మీకు నిద్రపట్టనీయకుండా చేస్తాయి.

English summary

10 Things You Should Not Do When Tired

The sleep pattern of the body requires consistency and if you are physically tired but mentally wired while going to bed, it can cause drowsiness again the very next day. These are the things you shouldn't do when you are tired, which includes drinking wine before going to bed, eating midnight snacks, performing energetic exercises, drinking lots of coffee, etc.
Story first published:Monday, February 26, 2018, 12:03 [IST]
Desktop Bottom Promotion