For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ పోయిసనింగ్ ను నివారించేందుకు పది మార్గాలు

|

సాధారణంగా "ఫుడ్ పోయిసనింగ్" అని పిలిచే ఆహారం వలన కలిగే అస్వస్థత, మీరు తినే ఆహారం కలుషితమైనప్పుడు, చెడిపోయిన లేదా కుళ్ళిన ఆహారం తీసుకున్నప్పుడు కలుగుతుంది. ఇప్పుడు, మనం ఫుడ్ పోయిసనింగ్ ను ఎలా నివారించాలో తెలుసుకుందాం.

బాక్టీరియా, పరాన్నజీవులు మరియు వైరస్లు ఫుడ్ పోయిసనింగ్ ను కలుగజేస్తాయి. ఫుడ్ పోయిసనింగ్ కు ప్రధాన కారణం బాక్టీరియా. ఈ. కొలి, సాల్మనెల్ల మరియు లిస్టెరియా అనేవి ఫుడ్ పోయిసనింగ్ కలుగజేసే ప్రధాన బాక్టీరియాలు. అధిక సందర్భాలలో సాల్మనెల్లా వలన ఫుడ్ పోయిసనింగ్ జరుగుతుంది.

ఆహారం ద్వారా వ్యాప్తి చెందే పరాన్నజీవుల కారణంగా ఫుడ్ పోయిసనింగ్ జరుగుతుంది. మన జీర్ణాశయంలో మనకు తెలియకుండానే ఈ పరాన్నజీవులు అనేక సంవత్సరాలపాటు నివాసముండగలవు. గర్భిణీ స్త్రీలు మరియు వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు వీటి బారిన పడి తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు.

10 Ways On How To Avoid Getting Food Poisoning

వైరస్లు కూడా ఫుడ్ పోయిసనింగ్ ను కలుగజేస్తాయి. నోటోవైరస్ మూలాన ఏటా 19 మిలియన్ల ఫుడ్ పోయిసనింగ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఆహారం ద్వారా హెపటైటిస్ A వంటి ప్రాణాంతక వైరస్లు వ్యాప్తి చెందుతాయి.

పచ్చి ఆహార పదార్థాలను వండకుండా ఆరగించడం వలన ఫుడ్ పోయిసనింగ్ సాధారణంగా జరుగుతుంది. వండటానికి ముందు ఆహార పదార్థాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వలన కూడా ఇలా జరగవచ్చు. ఫుడ్ పోయిసనింగ్ ను ఎలా నివారించే మార్గాలు మీకోసం.

1. చేతులను శుభ్రంగా కడుక్కోండి:

1. చేతులను శుభ్రంగా కడుక్కోండి:

ఆహార పదార్థాలను ముట్టుకునే ముందు చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలి. అదేవిధంగా మాంసాహారం, చేపలు, గుడ్లు మరియు కూరగాయలను మొత్తుకున్నా కూడా చేతులను కడుక్కోవాలి.ఎందుకంటే మీ చేతులు వంటగదిలో ఉన్న బాక్టీరియాను మీ ఆహార పదార్థాలపైకి సులభంగా వ్యాప్తి చెందిస్తాయి. చేతులను ఎల్లప్పుడూ సబ్బు మరియు నీటితో శుభ్రం చేసుకోవడం ఆవశ్యకం.

2. వంటగదిలో ఉపయోగించే వస్త్రాలను ఎప్పటికప్పుడు ఉతకాలి:

2. వంటగదిలో ఉపయోగించే వస్త్రాలను ఎప్పటికప్పుడు ఉతకాలి:

మీరు వంటగదిలో వాడే మసిగుడ్డలు,పాత్రలను స్టవ్ మీద పెట్టడానికి, దించడానికి వాడే గుడ్డలను క్రమం తప్పకుండా ఉతకాలి. పరిశోధనల ప్రకారం ఈ వస్త్రాలను వాషింగ్ మెషీన్లో లేదా మరిగిన నీటిలో వేసి పదిహేను నిమిషాల పాటు ఉతికితే క్రిములు వదిలిపోతాయి. మీరు ఒక వస్త్రాన్ని మాంసాహారం లేదా కూరగాయలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తే, వెంటనే తరువాత ఉపయోగించడానికి వేరొక శుభ్రమైన వస్త్రంను దాని బదులుగా ఉపయోగించాలి.

3. వివిధ అవసరాలకు వేరువేరు కటింగ్ బోర్డులను వాడండి:

3. వివిధ అవసరాలకు వేరువేరు కటింగ్ బోర్డులను వాడండి:

చేపలు మరియు మాంసం వంటి పచ్చి ఆహారాన్ని తరిగడానికి ప్రత్యేకమైన కటింగ్ బోర్డును వాడాలి. ఇలా చేయడం వలన మిగిలిన తాజా ఆహార పదార్థాలు లేదా వాడటానికి తయారుగా ఉండే ఆహార పదార్థాలకు హానికారక బాక్టీరియా వ్యాప్తి చెందదు. తాజా ఆహార పదార్థాలకు ఒక కటింగ్ బోర్డ్ ,మాంసాహారానికి ఒక కటింగ్ బోర్డ్ వాడాలి.

4. పచ్చి మాంసాహారంను విడిగా ఉంచాలి:

4. పచ్చి మాంసాహారంను విడిగా ఉంచాలి:

పచ్చి మాంసాహార పదార్థాలను సలాడ్లు, పండ్లు మరియు బ్రెడ్ వంటి మిగిలిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఈ పదార్థాలను తినే ముందు వండరు. కనుక మాంసాహార పదార్థాలలో ఉండే బాక్టీరియా వీటిలోకి ప్రవేశించవచ్చు. ఎల్లప్పుడూ మాంసాహారాన్ని శుభ్రంగా మూటపెట్టి ఫ్రీజర్ లో భద్రపరచాలి. మాంసాహారం ఇతర ఆహార పదార్థాలను తాకకుండా ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి.

5. వంటగట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి:

5. వంటగట్టును ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి:

వంటగట్టును ఆహారాన్ని తయారు చేసే ముందు మరియు తరువాత శుభ్రం చేయాలి. ముఖ్యంగా పచ్చి కూరగాయలు, మాంసాహారం, చేపలు మరియు గుడ్లు వండేటప్పుడు మరీ అవసరం. పరిశుభ్రతను పాటించడానికి వేడి సుబ్బు నీటిని ఉపయోగించి వంటగట్టును శుభ్రం చేయాలి.

6. ఆహార పదార్థాలను పూర్తిగా వండాలి:

6. ఆహార పదార్థాలను పూర్తిగా వండాలి:

కోడిమాంసం, పంది మాంసం, బర్గర్లు, సాసేజ్ లు మరియు కబాబ్ లు బాగా ఉడికేటట్టు, లోపల పచ్చిదనం పోయేంతవరకు వండాలి. పచ్చి కోడి మాంసాన్ని ఫ్రీజ్ చేయడం వల్ల కాంపైలోబేక్టర్ బాక్టీరియా స్థాయిలో తగ్గుదల ఉన్నప్పటికీ పూర్తిగా తొలగిపోవు. కనుక పూర్తిగా వండటం ఆరోగ్యానికి శ్రేయస్కరం.

7. వ్యక్తిగత పరిశుభ్రత:

7. వ్యక్తిగత పరిశుభ్రత:

వంటచేసేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం అనివార్యం. గోళ్లను శుభ్రంగా కత్తిరించుకోవటం, జుట్టును ముడిపెట్టుకోవడం చేస్తే ఆహారంలో మలినాలు చేరవు. హానికారక బాక్టీరియా వ్యాప్తి కూడా తగ్గుతుంది. వంటగదిలోనికి చెప్పులతో అడుగు పెట్టవద్దు. చెప్పులతో పాటు రకరకాల బాక్టీరియాలు కూడా అడుగుపెడతాయి. కనుక వంట చేసేటప్పుడు లేదా వంటగదిలో అడుగుపెట్టేటప్పుడు చెప్పులు వేసుకోకండి.

8. మీ రెఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కన్నా తక్కువగా పెట్టండి:

8. మీ రెఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కన్నా తక్కువగా పెట్టండి:

మీ ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఐదు డిగ్రీల కన్నా తక్కువగా పెట్టండి మరియు ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు ఫ్రిజ్ ధర్మామీటర్ తో తనిఖీ చేస్తుండండి. ఇలా చేస్తే హానికారక క్రిముల ఎదుగుదల మరియు వృద్ధిని అరికట్టవచ్చు. ఫ్రిజ్ ను అతిగా సామానులతో నింపవద్దు. ఇలా చేస్తే గాలి ప్రసరణ సరిగా జరగక ఫ్రిజ్ ఉష్ణోగ్రతలో తేడాలు తలెత్తుతాయి.

9. మిగిలిపోయిన ఆహార పదార్థాలను త్వరగా ఫ్రిజ్ లో పెట్టండి:

9. మిగిలిపోయిన ఆహార పదార్థాలను త్వరగా ఫ్రిజ్ లో పెట్టండి:

మీ తయారు చేసుకున్న ఆహారాన్ని వెంటనే తినకపోతే, ఫ్రిజ్ లో వీలయినంత త్వరగా పెట్టండి. ఫుడ్ పోయిసనింగ్ ను నివారించేందుకు ఆహారాన్ని చల్లారనిచ్చి తొంభై నిమిషాల గడవక ముందే ఫ్రిజ్ లో పెట్టేయాలి. ఇలా ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్థాలను రెండు రోజులలోగానే తినేయాలి. ఇలా చేస్తే ఆహారం పోషకాలను కోల్పోదు మరియు పాడైపోదు.

10. ఎస్ఫైరీ తేదీ గడిచేలోగానే ఆహార పదార్థాలను వాడేేయాలి:

10. ఎస్ఫైరీ తేదీ గడిచేలోగానే ఆహార పదార్థాలను వాడేేయాలి:

చూడటానికి, వాసన బాగానే ఉన్నా ఎస్ఫైరీ తేదీ గడిచిన ఆహార పదార్థాలను తినరాదు. ఎస్ఫైరీ తేదీ గడిచేలోగానే ఆహార పదార్థాలను ఖాళీచేయకపోతే హానికారక క్రిములు వాటిలో చేరుతాయి, ముఖ్యంగా పేకేజెడ్ ఆహారంలో. ఆయిస్టర్లు, చీజ్, మాంసాహారం, మొలకలు, పాలు,గుడ్లు , రొయ్యలు మొదలైన ఆహారాన్ని ఎస్ఫైరీ తేదీ దాటిన తరువాత తినరాదు.

English summary

10 Ways On How To Avoid Getting Food Poisoning

Food poisoning is a horrible thing and it's caused by bacteria, parasites, and viruses. Bacteria is the major cause of food poisoning. Food poisoning is also caused by parasites that spread through the food. The ways to avoid getting food poisoning are washing your hands, washing dishcloths often, using separate chopping boards for vegetables and raw meat, etc.
Desktop Bottom Promotion