For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

10 ఇంటి చిట్కాలతో మీ హిప్ (తుంటి) దగ్గర అధికంగా ఉన్న కొవ్వును తగ్గించుకోవడం ఎలా ?

By Sravanth
|

మీరు బాగా ఇష్టపడిన జీన్స్ (లేదా) ఇతర మంచి డ్రెస్ లోకి మీ శరీరం యొక్క హిప్ (తుంటి) భాగంలో పేరుకుపోయిన కొవ్వును కారణంగా ఇమడ లేకపోవడం వల్ల మీరు చాలా విసుగుచెందరా ? (లేక) అలసిపోయారా ? హిప్ (తుంటి) మరియు తొడ భాగంలో అధికమైన కొవ్వును పొంది ఉండే అవకాశాలను కలిగి ఉన్న మహిళలు చింతించవలసిన చాలా ముఖ్యమైన విషయము ఇది.

కొన్ని నిర్దిష్టమైన శరీరతత్వాలను బట్టి, హిప్ (తుంటి) భాగంలో ఎక్కువగా బరువు పెరగడం అంటూ చాలామంది మహిళలలో తలెత్తే సమస్యకు కారణమని చెప్పవచ్చు. చర్మము యొక్క లోపలి భాగంలో నెలకొన్న కణజాలపు పరిమాణం తాలోక తీవ్రమైన రూపానికి దారితీస్తుంది మరియు అది కూడా ఒక అనారోగ్యకరమైన జీవనశైలికి చిహ్నంగా కూడా భావించవచ్చు.

హార్వర్డ్ హెల్త్ పబ్లికేషన్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో, ఈస్ట్రోజన్ అనేది తొడలు, తుంటి మరియు పొత్తికడుపు చుట్టూ కొవ్వును నిల్వ ఉంచే లక్ష్యంతో ఉంటుంది; టెస్టోస్టెరోన్ అనేది మాత్రం కడుపులో కొవ్వును స్థిరపరిచేదిగా ఉంటుంది.

 10 Ways To Lose Hip Fat Naturally At Home

మహిళలు తమ శరీరంలో ఏ భాగానైన ఇతరములతో పోల్చినప్పుడు, ప్రత్యేకంగా ఈ హిప్ (తుంటి) ప్రాంతాలలోనే కొవ్వు ఎందుకు ఎక్కువగా భదిలీ కాబడుతోంది అనే విషయానికి ఇదే ప్రధాన కారణం కావచ్చు.

హిప్ (తుంటి) భాగంలో కొవ్వును కోల్పోవడానికి, ఆచరించవలసిన 10 ఇంటి చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే,

1. కేలరీలను గుర్తించడం :

1. కేలరీలను గుర్తించడం :

మీరు మీ తుంటిలో ఉన్న అదనపు కొవ్వును తొలగిస్తూనే, మీ తుంటిలో ఉన్న కొవ్వును తగ్గించడానికి అవసరమైన నివారణ మార్గాలను వెతికి చూడండి. అందులో ముఖ్యమైనది కేలరీలను గుర్తించడం, ఇది మీకు బాధను కలుగచేసేటప్పటికీ మీరు అంకిత భావంతో పనిచేసినట్లైతే ఖచ్చితంగా ఇది పని చేస్తుంది.మీరు తీసుకునే ఆహారం మీ శరీరంలో ఉన్న కేలరీలను పెంచేవిగా మాత్రం ఉండకూడదు. అలాంటి ఆహారాన్ని మాత్రమే మీరు తీసుకోవాలి.

2. ఎక్కువ నీరును త్రాగాలి :

2. ఎక్కువ నీరును త్రాగాలి :

మనము ఎక్కువగా నీటిని త్రాగటం వలన మన తుంటి భాగంలో ఎక్కువగా నిల్వ ఉన్న అదనపు కొవ్వును తొలగిస్తుంది. మీ శరీరం నుండి విషపదార్ధాలను బయటకు పంపి వెయ్యబడి మరియు మీ జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. మీ శరీర బరువులోనూ, చర్మం మరియు మెదడు పనితీరులోనూ మార్పులను చూడాలనుకునే వారు ఖచ్చితంగా 3-4 లీటర్ల నీరును ప్రతిరోజూ త్రాగాలి.

3. నిమ్మరసం :

3. నిమ్మరసం :

నిమ్మకాయతో కలిపిన నీళ్ళు, ముఖ్యంగా మీ తుంటి మరియు తొడల భాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించడానికి బాగా ఉపకరిస్తాయి. నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది మరియు హానికరమైన ఆక్సిజన్ రాడికల్స్ను బాగా శుభ్రపరిచేందుకు సహాయపడుతుంది. నిమ్మకాయ నీళ్ళు అంతర్గత ఉన్న pH స్థాయిని సమతుల్యం చేయడానికి మరియు జీర్ణక్రియ యొక్క పనితీరును మెరుగుపరచటంలో సహాయపడుతుంది.

4. సముద్రపు ఉప్పు :

4. సముద్రపు ఉప్పు :

మీ కడుపులో ఉన్న పెద్దప్రేగును శుభ్రపరచి, మీ జీర్ణక్రియ సవ్యంగా కొనసాగేలా చేసి, మరియు జీవక్రియ ఎల్లప్పుడూ బాగా మండేటట్లుగా ఉంచేలా ఉండాలి. నీటితో సముద్రపు ఉప్పును బాగా కలిపి తీసుకోవడం వలన మీ యొక్క జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది మరియు ఉప్పులో ఉన్న ముఖ్యమైన ఖనిజాలు ఒక విరోచనకారిగా పనిచేస్తూ మరియు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, అందువలన మీ తుంటి భాగంలో ఉన్న కొవ్వును తగ్గించడంలో ఇది మంచి సహాయకారిగా ఉంటుంది.

5. కాఫీ :

5. కాఫీ :

చక్కెర మరియు క్రీమ్ లేకుండా నల్ల కాఫీని మీరు తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న అదనపు పౌండ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆకలిని అణచివేయడానికి సహాయపడుతుంది మరియు మీ కడుపు పూర్తిగా నిండిన భావనను అనుభూతి చెందేలా చేస్తుంది. మంచి ఫలితాల కోసం భోజనానికి 30 నిమిషాల ముందుగానే ఒక కప్పు నల్ల కాఫీని త్రాగండి.

6. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు :

6. ఆరోగ్యకరమైన కొవ్వు పదార్ధాలు :

చేపలు, అవెకాడో పండ్లు మరియు కొబ్బరినూనె వంటివి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులను కలిగి ఉండి, అవి కణాల యొక్క పరిపూర్ణతను విధిగా నిర్వహించేదిగానూ మరియు వివిధ అవయవాల యొక్క సరైన పనితీరును మరియు జీవరసాయనాల యొక్క ప్రతిచర్యలను నిర్వహించడంలో బాగా సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు హిప్ (తుంటి) ప్రాంతంలో అధికంగా ఉన్న కొవ్వును తగ్గించేందుకు సహాయపడే శోథ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి.

7. ఆరోగ్యమైనవాటిని తినండి :

7. ఆరోగ్యమైనవాటిని తినండి :

ఆరోగ్యకరమైన అలవాట్లు అనేవి ఖరీదైనవి కాదు, తక్కువ మోతాదులో వాడబడిన సోడియం మరియు చక్కెరతో ఇంటిలో చేసిన ఆహార పదార్థాలను తినడం చాలా అవసరం. అలానే మీ భోజనంలో కూరగాయలను, పండ్లను, మూలికలను, సుగంధ ద్రవ్యాలను, ఆరోగ్యకరమైన కొవ్వులను మరియు లీన్ ప్రోటీన్ వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చండి.

8. గ్రీన్-టీ :

8. గ్రీన్-టీ :

గ్రీన్-టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న కారణంగా శరీరంలో పేరుకుపోయి ఉన్న హానికరమైన వ్యర్ధాలను బయటకు తరిమికొట్టి, మీ జీవక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మీరు తృప్తి చెందేలా చేసి మరియు రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. హిప్ (తుంటి) వద్ద ఉన్న కొవ్వును సహజంగా తొలగించడానికి ఉదయం మరియు రాత్రి వేళ్ళలో మీరు గ్రీన్-టీ ని త్రాగాలి.

9. స్నాక్స్ ను తగ్గించండి :

9. స్నాక్స్ ను తగ్గించండి :

చిప్స్, చాక్లెట్ (లేదా) ఐస్-క్రీమ్ పైన పొరలుగా జల్లబడిన వంటి ఆహార పదార్థాలను అల్పాహారముగా తీసుకోవడం వల్ల మీరు వేగంగా బరువు పెరుగుటకు దోహదం చేస్తుంది. వాటికి బదులుగా మీ ఆకలి కోరికలను తగ్గించగలిగే నట్స్ (గింజల) ను మరియు డార్క్ చాక్లెట్లను అల్పాహారంగా తీసుకోండి. మీరు దోసకాయలు, క్యారట్, లేదా మొలకెత్తిన గింజలను కూడా తినవచ్చు.

 10. బాగా విశ్రాంతిని తీసుకోండి :

10. బాగా విశ్రాంతిని తీసుకోండి :

సరైన నిద్ర లేకపోవడం వలన కూడా మీరు తొందరగా బరువు పెరుగుతుంది. కాబట్టి మీ శరీరముకు విశ్రాంతిని కలుగచేయ్యడం కోసం సరిపోయేంత నిద్రను కలిగి ఉండాలి. ఇది మిమ్మల్ని తాజాగా మరియు శక్తివంతంగా చెయ్యడమే కాకుండా, మీరు తుంటి నుండి అదనముగా ఉన్న కొవ్వును కోల్పోయేలా చేస్తుంది.

English summary

10 Ways To Lose Hip Fat Naturally At Home

Depending on the certain body type, most women tend to gain weight in the hip region. This leads to the appearance of cellulite and it's a sign of an unhealthy lifestyle too. A study conducted by Harvard Health Publications, it is mentioned that while oestrogen aims at depositing fat around the thighs, hips and pelvis; testosterone settles fat in the
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more