For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఈ పది చెడు అలవాట్ల గురించి తెలుసుకోండి.

మీ దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావలసిన ప్రాధమిక అంశాలు మీకు తెలుసని మాకు తెలుసు. అదే విధంగా రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం, ఫ్లాస్సింగ్, రిన్సింగ్, సంవత్సరo లో రెండు సార్లు కనీసం పం

|

మీ దంతాలు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కావలసిన ప్రాధమిక అంశాలు మీకు తెలుసని మాకు తెలుసు. అదే విధంగా రోజుకు రెండు సార్లు పళ్ళు తోముకోవడం, ఫ్లాస్సింగ్, రిన్సింగ్, సంవత్సరo లో రెండు సార్లు కనీసం పంటి డాక్టరును సంప్రదించడం ద్వారా మీ పళ్ల ఆరోగ్యానికి సంబంధించిన అన్నీ రకాలు జాగ్రత్తలు తీసుకోవలసివస్తుంది. ఇలా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నా కానీ కొన్ని ఆహార మరియు వ్యసనాల ప్రభావాల కారణంగా దంత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

మీ దంతాలు రోజూ వారి శుభ్రం చేసుకోవడం , ఫ్లాస్సింగ్ వంటి చర్యలు మాత్రమే ఆరోగ్యంగా ఉంచునట్లు చేస్తాయి అనుకోవడం పొరపాటే. మాట్లాడడం, నమలడం, ఆహార పదార్ధాలు మింగడం, మరియు కొరకడం వంటి అనేక అంశాలు కూడా మీ దంత ఆరోగ్యానికి ప్రభావితాలుగా ఉంటాయి.

శీతల పానీయాలు, శక్తి పానీయాలు, ఆల్కహాల్, అతి వేడి పదార్ధాలు, ధూమపానం వంటివి మీ దంత సమస్యలకు ప్రధాన కారకాలుగా ఉన్నాయి. కొందరు జార్ మూతలు తీయుటకు, కూల్ డ్రింక్ మూతలు తీయడానికి కూడా పళ్లను వాడుతుంటారు. ఇందుచేత దంతాలు ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటాయి, ఇది మంచి పద్దతి కాదు.

ఇలాంటి మరిన్ని చెడు కారకాల గురించిన వివరములు ఇచ్చట పొందుపరచబడ్డాయి.

ఐస్ :

ఐస్ :

అనేకమంది ఐస్ తినుటకు ఇష్టపడుతుంటారు. దీని వలన పెద్దగా ప్రమాదమేమీ లేదని భావిస్తుంటారు. కానీ ఐస్ కొరకడం వలన , దంతాలలోని సున్నితమైన నరాలు దెబ్బతినే అవకాశం అధికంగా ఉంది. తద్వారా దంత క్షయం, సెన్సిటివిటీ సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది. వీలైనంత వరకు మంచు ముక్కలు నమలడం వంటివి తగ్గించాలి. అదేవిధంగా అధిక వేడి గల పదార్ధాలు కూడా తీసుకోవడం మంచిది కాదు.

కాఫీ:

కాఫీ:

కెఫీన్ దంతాలకు మంచిది కాదు, దంతాలమీద గారలు ఏర్పడడం, రంగు తగ్గడం, తద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరుగుతూ ఉంటాయి. నోటిలోని బాక్టీరియాతో చర్యలు జరిపి దంతాలలోని క్షార తత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. దీనివలన స్టైన్స్ అరిగిపోవడం, కావిటీలు రావడం , దుర్వాసన తద్వారా అనేక పలు ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతాయి. కావున కాఫీ తీసుకున్న తర్వాత నోటిని శుభ్రపరచుకోవడం మంచిది. లేదా కెఫీన్ ని దూరం ఉంచడం కూడా మంచిది.

గోళ్ళు కొరకడం:

గోళ్ళు కొరకడం:

అత్యధికులకు ఇది సాధారణ అలవాటుగా ఉంటుంది. ఏ ఇతర ఆలోచనలు మనసుకు తోచినా కూడా గోళ్ళు కొరకడం వంటివి చేస్తూ ఉంటారు. దీనికారణంగా అమీబియాసిస్ వంటి కడుపుకు సంబంధించిన రోగాలే కాకుండా, గోర్ల లోని బాక్టీరియా, మరియు గోర్లను కొరకడం వలన దంతాలు అధిక ఒత్తిడికి లోనవడం వలన అనేక రకాల దంత సంబంధ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా దవడ కు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

Toungue Piercings :

Toungue Piercings :

అనేక మంది మోడర్న్ యువతీ యువకులు ఇలాంటి Piercings చేయడం చేస్తుంటారు. అనగా నాలిక మీద ఒక చిన్ని మెటల్ లేదా పూస వంటి వస్తువుని కుట్టడం వంటివి. ఇవి చూడడానికి ఆకర్షణీయంగా కనపడవచ్చు, కానీ దంతాల మద్యకి నాలిక వెళ్ళు సమయంలో చిగుళ్ళకు మరియు దంతాలకు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. ఏనామిల్ ని కరిగించడం, తద్వారా దంత క్షయానికి తోడ్పడడం వంటివి జరుగుతాయి. కావున దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.

నిమ్మకాయ రసం:

నిమ్మకాయ రసం:

సిట్రస్ ఫలాలైన బత్తాయి , ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ వంటివి ఆరోగ్యానికి మంచిది. కానీ ఇవి తీసుకున్న వెంటనే నోరుకడిగే అలవాటు చేసుకోవాలి , లేనిచో ఈ సిట్రస్ సమ్మేళనాలు బాక్టీరియా తో చర్య జరిపి పంటి ఏనామిల్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. దీని కారణంగా సెన్సిటివిటీ, కావిటీలు, దంత క్షయం వంటి సమస్యలు వస్తాయి.

రుబ్బడం:

రుబ్బడం:

కొందరు ఏదైనా ఆహారాన్ని గంటల తరబడి నములుతూ ఉంటారు ముఖ్యంగా నాన్ వెజ్ తీసుకునే సమయాలలో, మరియు గట్టిగా ఉండే పదార్ధాలు నములుతున్నప్పుడు ఇలా చేస్తుంటారు, కొందరికి చ్యూయింగ్ గం అలవాటు కూడా ఉంటుంది. కానీ ఇలా అధికంగా నమలడం వలన, దంతాలు ఒత్తిడికి లోనై, పళ్ల మద్య సందులు, చిగుళ్ళ వాపు, వంటి సమస్యలు అధికమవుతాయి.

కాండీలు, లేదా చాక్లెట్లు:

కాండీలు, లేదా చాక్లెట్లు:

చక్కెర తో కూడిన చాక్లెట్లు తినడం అధికమైతే అనేక దంత సమస్యలు చుట్టుముట్టాడుతాయి. స్వీట్స్ , కాండీలు వలన వీటిలో చక్కెర తత్వాలు బాక్టీరియాతో అధికంగా చర్యలను జరపగలవు. తద్వారా పళ్ళు ఏనామిల్ లోపానికి గురై పుచ్చడం,కావిటీస్, సెన్సిటివిటీ లకు గురికావడం వంటి సమస్యలను ఎదుర్కొంటాయి. కావున వీటిని తగ్గించడం మంచిది. లేదా ఇవి తీసుకున్నప్పుడు నోటిని శుభ్రంగా కడగడం అలవాటుగా చేసుకోవాలి.

సోడా:

సోడా:

అత్యంత ప్రమాదకారి ఈ సోడా, ముఖ్యంగా కార్బొనేటెడ్ చక్కెర స్థాయిలు కలిగిన సోడాలు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం మూలంగా స్వల్పకాలంలోనే అనేక దంత సమస్యలను ఎదుర్కొనవలసిన పరిస్థితులు దాపురిస్తాయి. ఇందులో ఉన్న పాస్ఫారిక్, సిట్రిక్ యాసిడ్స్ నోటిలోని బాక్టీరియాతో అధికంగా చర్యలను జరుపగలవు. కావున సోడాలను , ముఖ్యంగా కృత్రిమ చక్కెరలను కలిగిన సోడాలకు దూరంగా ఉండడం చాలా మంచిది.

తిన్న వెంటనే పళ్ళు తోముకొనుట:

తిన్న వెంటనే పళ్ళు తోముకొనుట:

ముఖ్యంగా ఆమ్ల తత్వాలు కలిగిన ఆహారం తీసుకున్నప్పుడు, ఫ్రైడ్ డీప్ ఫ్రైడ్, పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ వంటి పదార్ధాలు తీసుకున్నప్పుడు, శీతల మరియి అధిక వేడి కలిగిన పదార్ధాలు తీసుకున్నప్పుడు వెంటనే బ్రష్ చేస్కునే అలవాటు చేసుకోవాలి. వీలైతే ఒక చిన్న బ్రష్ ను మీతో కారీ చెయ్యడం మంచిది.

సమయానుసారం బ్రష్ మారుస్తున్నారా:

సమయానుసారం బ్రష్ మారుస్తున్నారా:

కొందరు నెలల తరబడి, వీలైతే సంవత్సరాల తరబడి ఒకే బ్రష్ బాడుతూ ఉంటారు. ఆ బ్రష్ కండిషన్ కూడా సరిగ్గా ఉందో లేదో గమనించకుండా పళ్లుతోముకోవడాన్ని కూడా తూతూ మంత్రంగా చేస్తుంటారు. ఇది మంచి పద్దతి కాదు. ఎక్కువ కాలం వాడిన బ్రష్ లోని బ్రేసిల్స్ గట్టితనానికి లోనవ్వడం కానీ, లేదా బ్రేసిల్స్ మద్య దూరాలు పెరిగి చిగుళ్లను దెబ్బతీయడం కానీ చేస్తాయి. కావున సమయానుసారం బ్రష్ ని మార్చడం విధిగా అలవాటు చేసుకోవాలి. కనీసం 3,4 నెలలకు ఒకసారి బ్రష్ మార్చడం మంచిది. మరియు సున్నితమైన బ్రెసిల్స్ ఉండేలా బ్రష్ ఎంచుకోండి.

English summary

10 Worst Habits That Wreck Your Teeth

Drinking icy cold drinks or too hot drinks might wreck your teeth. There are different things that you do every day, which put pressure on teeth. Using the teeth to open jar bottles or sodas is a bad habit. The bad habits that wreck your teeth are chewing on ice, coffee, drinking soda, lemon juice, not replacing your toothbrush, etc..
Story first published:Wednesday, March 28, 2018, 17:56 [IST]
Desktop Bottom Promotion