For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్-టీ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ బహుశా, మీకు తెలియకపోవచ్చు !

|

శరీర బరువును తగ్గించే అత్యుత్తమమైన పానీయాలలో గ్రీన్-టీ ఒకటి, దానిని ప్రపంచంలోనే చాలామంది ప్రజల చేత వినియోగించబడుతుంది. గ్రీన్-టీ మొక్క యొక్క మొగ్గలు, ఆకులు, కాండాలను అనేక ప్రయోజనాల కోసం విరివిగా ఉపయోగించబడుతున్నాయి. భూమి మీద లభించే పానీయాలలో ఇది చాలా ఆరోగ్యవంతమైనదని మంచి పేరును పొందింది.

ఇది క్యాన్సర్ను నివారించడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, డిప్రెషన్, తలనొప్పి, అతిసారం, బలహీనమైన ఎముకలు, ఉదర సమస్యలు మొదలైన వాటిని పరిష్కరిస్తుంది. అంతే కాకుండా గుండె వ్యాధులు, డయాబెటిస్, తక్కువ రక్తపోటు, దంతాలు అలసిపోవడం, మూత్రపిండాలలో రాళ్లు మొదలైనవాటి యొక్క ప్రమాద తీవ్రతలను కూడా తగ్గిస్తుంది.

కానీ, ఈ గ్రీన్-టీ ని త్రాగడం వల్ల మీ శరీరంపై కొన్ని రకాల దుష్ప్రభావాలు కలగటానికి కారణమవుతోందని మీరెప్పుడైనా గ్రహించారా ?? ఎందుకంటే, ఇతర టీ (తెన్నేరు) లా కాకుండా, గ్రీన్-టీ లో కెఫిన్ను కలిగి ఉంది. అధిక మొత్తంలో ఈ కెఫిన్ తీసుకోవడం వల్ల వణకడం, ఆందోళనకు గురవడము, మరియు భయాందోళనలను చెందేలా చేస్తుంది.

గ్రీన్-టీ లో 2-4 శాతం కెఫీన్ను కలిగి ఉంటుంది, ఇది మన యొక్క చురుకుదనము మరియు ఆలోచనలపై ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా ఈ గ్రీన్-టీ ను తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను తెలిసుకుందాం.

1. ఉదర సమస్యలు :

1. ఉదర సమస్యలు :

గ్రీన్-టీ లో కెఫీన్ చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ, అది కడుపు సమస్యలను కలగజేస్తుంది. ఈ కెఫీన్ మీ కడుపులో ఉన్న యాసిడ్ను పెంచే లక్షణాలను కలిగి ఉండటం వల్ల మీ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. దాని వల్ల కడుపు నొప్పి (లేదా) వికారము వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతాయి.

2. తలనొప్పి :

2. తలనొప్పి :

గ్రీన్-టీ లో ఉన్న కెఫీన్ తేలికపాటి తలనొప్పి కలగటానికి కారణమవుతుంది. దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడుతున్న వారికి ఇది మైకమును కూడా కలిగించవచ్చు. మైగ్రెయిన్ బాధితులు సురక్షితంగా ఈ పానీయం తాగవచ్చు కానీ, దీర్ఘకాలిక తలనొప్పి ఉన్నవారు మాత్రం త్రాగకూడదు.

3. నిద్ర సమస్యలు :

3. నిద్ర సమస్యలు :

గ్రీన్-టీ అనేది పడుకునేముందు త్రాగవలసిన పానీయం కాదు. ఇది నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది, అందువల్ల మిమ్మల్ని రాత్రి సమయంలో మేల్కొనేలా ఉంచుతుంది, దీని వలన మీరు నిద్రలేమికి గురవుతారు. గ్రీన్-టీలో ఉన్న కెఫిన్ పదార్ధం మెదడులో నిద్రా-ప్రేరిత రసాయనాలను నిరోధించి, ఆడ్రినలిన్ యొక్క ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది.

4. ఐరన్ లోపం :

4. ఐరన్ లోపం :

ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం, గ్రీన్-టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన రక్తహీనత ఏర్పడుతుందని బయటపడింది. ఇది మీరు తినే ఆహారాల నుండి ఐరన్ను - మీ శరీరం సంగ్రహించే శక్తిని కూడా తగ్గిస్తుంది. గ్రీన్-టీ, ఐరన్ యొక్క శోషణను నిరోధించే టానిన్లు మరియు పాలీఫెనోల్స్ను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి తక్కువగా అందుబాటులో ఐరన్ను ఉంచుతుంది.

5. క్రమరహితమైన హృదయ స్పందన :

5. క్రమరహితమైన హృదయ స్పందన :

గ్రీన్-టీలో ఉన్న కెఫిన్ పదార్థం, మీ హృదయ స్పందనను వేగవంతం చేసి, ఒక క్రమరహితమైన హృదయ స్పందనను కలిగించవచ్చు. తద్వారా ఇది ఛాతీ నొప్పికి దారి తీయవచ్చు మరియు సాధారణ హృదయ స్పందన రేటులో ఈ ఆకస్మిక మార్పు వల్ల గుండెకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాన్ని కలిగించి, గుండె జబ్బులకు కారణమవుతుంది.

6. కండరాల సంకోచాలు :

6. కండరాల సంకోచాలు :

గ్రీన్-టీ ని అధికంగా వినియోగించడం వల్ల, కండరాల అనియంత్రిత వ్యాకోచానికి మరియు ఉద్రిక్తతలకు దారి తీస్తుంది. ఎందుకో మీకు తెలుసా? కెఫీన్లో "రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్తో" ముడిపడివుంది, ఇది ఎముకల కండరాలను సంకోచించటానికి మరియు కాళ్ళలో కండరాల అనియంత్రిత వ్యాకోచం కలగడానికి కారణమవుతుంది.

7. అతిసారం :

7. అతిసారం :

కెఫిన్ 'విరేచనకారిగా' కూడా తన ప్రభావాన్ని కలిగి ఉంది, దీనిని అధికంగా వినియోగించినప్పుడు, మీ కడుపులో వదులుగా ఉన్న వాటిని బయటకు నెట్టెలా దారితీస్తుంది. ఒకవేళ, మీరు గ్రీన్-టీ వినియోగాన్ని కొత్తగా ప్రారంభించి ఉంటే, అది కూడా అతిసారము కలగటానికి ఒక కారణం కావచ్చు. కాబట్టి, మీరు ఒక పరిమితమైన మోతాదులో గ్రీన్-టీను త్రాగండి, కానీ ఖాళీ కడుపుతో మాత్రం త్రాగకండి.

8. వాంతులు

8. వాంతులు

గ్రీన్-టీలో ఉన్న పాలీఫెనోల్స్, ఆక్సీకరణ ఒత్తిడికి కారణమవుతాయని భారతీయ-బృందం జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడించింది. మీరు గ్రీన్-టీను త్రాగటం మొదటి సారైతే, మీకు వాంతులు మరియు వికారం కలగటానికి కారణం కావచ్చు, గ్రీన్-టీ రోజుకు 300 నుండి 400 mg వరకూ మాత్రమే పరిమితంగా వినియోగించాలి.

 9. హార్ట్ బర్న్ (ఆమ్లపితము) :

9. హార్ట్ బర్న్ (ఆమ్లపితము) :

గ్రీన్-టీ స్వభావంలో ఆమ్లత్వం దాగి ఉంటుంది, ఇది ఆహారనాళం యొక్క లైనింగ్ (పై పొర) ను చికాకుపెడుతుంది, అందువల్లే గుండెల్లో మంటగా ఉంటుంది. మీరు ఈ గ్రీన్-టీ కోసం వెతుకుతున్నప్పుడు, సీసాలలో భద్రపరిచినట్లు మార్కెట్లో లభించే వాటిలో ఆస్కార్బిక్ ఆమ్లం ఉండటం వల్ల, అది మీకు గుండెలో మంటను కలిగిస్తుందని ముందుగా మీకు మేము హెచ్చరిస్తున్నాము.

10. డయాబెటిస్ :

10. డయాబెటిస్ :

డయాబెటిస్తో బాధపడుతున్న ప్రజలు గ్రీన్-టీని వినియోగించడం మానివేయాలి, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో జోక్యం చేసుకోవచ్చు. 2వ రకం డయాబెటిస్ కలిగి ఉన్న వారు కూడా ఈ గ్రీన్-టీని త్రాగకూడదు, ఎందుకంటే, ఇది మీ ఇన్సులిన్ స్థాయిలలో జోక్యం చేసుకోవచ్చు.

11. బోలు ఎముకల వ్యాధి (ఆస్త్రోపోరోసిస్) :

11. బోలు ఎముకల వ్యాధి (ఆస్త్రోపోరోసిస్) :

గ్రీన్-టీ లో కెఫిన్ కంటెంట్ ఉండటం వల్ల, శరీరానికి కావాల్సిన క్యాల్షియమ్ను గ్రహించటాన్ని నిరోధిస్తుంది. గ్రీన్ టీని అధికంగా వినియోగించడం వల్ల క్యాల్షియము యొక్క విసర్జన రేటును పెంచుతుంది, ఇది బోలు ఎముకల వ్యాధి (ఎముకలు మెత్తబడుట) వంటి ఎముకలకు సంబంధించిన వ్యాధులను కలుగచేయును.

English summary

11 Side Effects Of Green Tea You Probably Didn't Know

Green tea has profound benefits on health, which include preventing cancer, improving brain function, depression, headaches, diarrhoea, bone loss, stomach disorders, etc. It also lowers the risk of heart diseases, diabetes, low blood pressure, chronic dental fatigue, kidney stones, etc.
Desktop Bottom Promotion