For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి పురుషునికి, ఈ 12 పురుషాంగ సమస్యల గురించిన అవగాహన ఉండడం అవసరం

|

పురుషాంగం ఆరోగ్యం అనేది పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలలో ఒకటి. మరియు పురుషాంగం ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను సూచించడానికి అనేక ప్రమాణాలు ఉన్నాయి. అనేకమంది పురుషులు, వారి పురుషాంగం యొక్క శ్రేయస్సు గురించిన ఆందోళనలు ఏమీ లేకుండా సంతోషంగా జీవించగలరు. కానీ కొన్నిసార్లు వీరి అంచనాలు కూడా తప్పు కావొచ్చు. ఈ వ్యాసం అనేక సాధారణ పురుషాంగ సమస్యల గురించిన వివరాలను మీముందుకు తెస్తుంది.

STI(సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్) లు మరియు STD(సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్) లు మాత్రమే కాకుండా, పురుషాంగం యొక్క పనితీరుకు హాని లేదా సమస్యలను కలిగించే అనేక అనారోగ్యాలు మరియు రుగ్మతలు కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు మీ సంబంధాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేయగలవు, మీ మానసిక ఆందోళనలకు, ఒత్తిడికి కారణమవడమే కాకుండా మీ ఆత్మవిశ్వాసాన్ని సైతం దెబ్బతీయవచ్చు.

12 Common Penis Problems You Should Be Aware Of

పురుషాంగం ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏమిటి?

అసురక్షిత లైంగిక సంబంధం, అసురక్షిత జీవనశైలి (శుభ్రంగా లేని బాత్రూమ్స్ వినియోగం సైతం) సంక్రమణ వ్యాధులకు మిమ్మల్ని గురిచేసే అవకాశాలు లేకపోలేదు.

గుండె జబ్బులు మరియు అధిక రక్తపోటులు అంగస్తంభన సమస్యలను కలిగిస్తాయి. ప్రోస్టేట్ గ్రంధి మరియు ఆ గ్రంధి చుట్టూతా గల ఇతర పరిసరాలను తొలగించడం వంటి చికిత్సలు, వినియోగించే మందుల కారణంగా కూడా అంగస్థంభన సమస్యలు కలుగుతాయి.

ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటి వ్యసనాలు కలిగిన వారిలో అధికశాతం ఈ సమస్యను కలిగి ఉంటారు అన్నది వాస్తవం.

సాధారణ పురుషాంగ సమస్యలు ఏమిటి?

1. స్ఖలనం సమస్యలు:

1. స్ఖలనం సమస్యలు:

స్ఖలన సమస్యలు వివిధ రకాలుగా ఉన్నాయి. స్ఖలనం సమయంలో పురుషాంగం యొక్క కొననుండి బదులుగా వీర్యం మూత్రాశయంలోకి ప్రవేశించడం కారణంగా ఒక రకమైన వక్రీకరణ లేదా వీర్యం మోతాదు తగ్గడం వంటివి జరుగుతాయి. ఇది పురుషుల వంధ్యత్వానికి కారణం కావచ్చు. ఈపరిస్థితి అకాల స్ఖలనం లేదా సంభోగానికి ముందే స్ఖలనం జరగడాన్ని సూచిస్తుంది. స్ట్రెస్ లేదా మాంద్యం, లైంగిక గాయాలు, డయాబెటిస్ మొదలైనవి కూడా స్ఖలనం సమస్యల వెనుకగల కొన్ని కారణాలు.

2. ప్రయాపిస్మ్:

2. ప్రయాపిస్మ్:

కొన్నిసార్లు ఎటువంటి లైంగిక ప్రేరేపణ లేకున్నా కూడా అంగస్తంబన జరిగి, గంటల పాటు అదే స్థితిలో ఉండిపోయే సమస్యను ప్రయాపిస్మ్ అని వ్యవహరిస్తారు. ఇది పురుషాంగ సమస్యల్లో తీవ్రమైన స్థితిగా ఉంది. ఇది సాధారణంగా పురుషాంగంలో రక్తప్రవాహం యొక్క అసాధారణమైన స్థితిగా చెప్పబడింది, మరియు ఇది నొప్పిని కూడా కలిగించవచ్చు. ఈ సమస్యకు జననేంద్రియ ప్రాంతంలో గాయాలు, సికిల్ సెల్ రక్తహీనత లేదా కొన్ని మందుల దుష్ప్రభావాలు కారణాలుగా ఉన్నాయి. ప్రయాపిజం అన్ని వయసుల పురుషులకు సంభవిస్తుంది.

3. ఫినిసిస్ లేదా పారాఫిమోసిస్:

3. ఫినిసిస్ లేదా పారాఫిమోసిస్:

ఫినిసిస్ అనేది ఒక అవ్యవస్థీకృత పురుషాంగాన్ని సూచిస్తుంది, దీనికారణంగా పురుషాంగంపై చర్మం వెనుకకు వెళ్ళలేని స్థితికి లోనవుతుంది. ఇది అంటు వ్యాధులకు, బాధాకరమైన మూత్రవిసర్జన మరియు బాధాకరమైన అంగస్తంభనలకు దారితీయవచ్చు.

మరొక వైపు, పారాఫిమోసిస్, సంభోగం తర్వాత ఆ పురుషాంగం మీది చర్మం తిరిగి యదాస్థితికి రాని పరిస్థితిని సూచిస్తుంది. ఈ పరిస్థితి బాధాకరమైన వాపుకు కారణమవుతుంది మరియు పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని సైతం తగ్గిస్తుంది.

4. పెనైల్ ఫ్రాక్చర్ పగులు:

4. పెనైల్ ఫ్రాక్చర్ పగులు:

అంగస్తంభన జరిగాక, పురుషాంగం అధికంగా వంగి ఉన్న పరిస్థితిని సూచిస్తుంది, ఇటువంటి స్థితిలో, సాధారణంగా సంభోగం సమయంలో ఫ్రాక్చర్ గురయ్యే అవకాశాలు లేకపోలేదు. లేదా దూకుడుతో కూడిన హస్తప్రయోగం, కార్పోరా కావేర్నోసా యొక్క లైనింగ్ అధిక రాపిడి, మొదలైనవి ఇటువంటి సమస్యలకు కారణం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అంగస్తంభన సమయంలో పురుషాంగ స్థూపాకార నిర్మాణాలు, రక్తంతో నిండి ఉండడమే ఇందుకు కారణం.

5. పేరోనీ వ్యాధి:

5. పేరోనీ వ్యాధి:

పేరోనీ వ్యాధి, ఫైబ్రోసిస్ స్కార్ కణజాలం, పురుషాంగంలో అభివృద్ధి చెందడం కారణంగా పుడుతుంది. క్రమంగా నొప్పితో కూడిన అంగస్తంభనలకు కారణం అవుతుంది. ఇది లైంగిక సంబంధాన్ని కష్టతరం చేయడం జరుగుతుంది. లేదా దీర్ఘకాలం అంగస్తంభన ఉండడానికి సహాయకంగా ఉండకపోవచ్చు.

ఈ వ్యాధి కొన్నిసార్లు దానికదే పెరిగి, కాలక్రమేణా మరింత తీవ్రమవుతుంది.

6. లింఫాన్జియోస్క్లెరోసిస్:

6. లింఫాన్జియోస్క్లెరోసిస్:

లింఫాన్జియోస్క్లెరోసిస్ అనేది పురుషాంగం సిరతో జోడించబడి ఉన్న, పురుషాంగంలోని నరం తీవ్రంగా గట్టిపడే స్థితిని సూచిస్తుంది. ఇది పురుషాంగం చర్మం యొక్క పైప్రాంతంలో ఉంటుంది మరియు ఈ సమస్య తలెత్తినప్పుడు తీవ్రంగా గట్టిపడి ఉంటుంది. హస్తప్రయోగం మరియు లైంగిక సమయంలో నొప్పికి కారణం కావచ్చు.

7. పెనైల్ క్యాన్సర్ లేదా పురుషాంగ కార్సినోమా క్యాన్సర్:

7. పెనైల్ క్యాన్సర్ లేదా పురుషాంగ కార్సినోమా క్యాన్సర్:

పెనైల్ క్యాన్సర్ అనేది, పురుషాంగ చర్మం లేదా కణజాలం మీద ప్రాణాంతక కణితి పెరుగుదలను సూచిస్తుంది. ఇది ఒక చిన్న మరియు నొప్పిలేని మొటిమ ఆకారంతో పురుషాంగం తలపై ఏర్పడుతుంది. క్రమంగా నెమ్మదిగా పెరుగుతుంది మరియు పురుషాంగం యొక్క ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. కాలానుగుణంగా ఈ భాగం రక్తాన్ని లేదా ఫౌల్ స్మెల్లింగ్ ద్రవాలను స్రవించడం ప్రారంభిస్తుంది.

8. బాలనిటిస్:

8. బాలనిటిస్:

ఇది పురుషాంగం యొక్క తలపై వాపును సూచించే స్థితి, ఎరుపు లేదా నారింజ రంగులో ఉండే ఈ ప్రదేశం ప్రధానంగా పురుషాంగాన్ని, దాన్ని శిశ్నాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది అసౌకర్యంతో కూడిన మండే అనుభూతిని ఇస్తుంది. అపరిశుభ్రత, చర్మ వ్యాధులు, అనియంత్రిత మధుమేహం మరియు కఠినమైన కృత్రిమ సబ్బుల వాడకం బాలనిటిస్ సమస్యకు కారణాలుగా ఉన్నాయి.

9. హెర్పెస్:

9. హెర్పెస్:

హెర్పెస్ అనేది హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వలన ఏర్పడే ఒక వైరల్ వ్యాధి, ఇది జన్యువులను మరియు నోటిని కూడా ప్రభావితం చేస్తుంది. మహిళలు కూడా హెర్పెస్ కలిగి ఉంటారు, అయితే పురుషుల విషయంలో, హెర్పెస్ పుళ్ళు పురుషాంగం చివరిలో మరియు పురుషాంగం యొక్క ముందరి భాగంలో సంభవిస్తుంటాయి. దీని కారణాన బాధాకరమైన మూత్రవిసర్జన, బాధాకరమైన లైంగిక సంపర్కము, జలదరింపు లేదా సంచలనాలు కలుగుతాయి.

10. పెనైల్ ఈస్ట్ సంక్రమణ:

10. పెనైల్ ఈస్ట్ సంక్రమణ:

ఇది ఒక రకమైన శిలీంధ్ర సంక్రమణ (కాండిడా), ఇది తరచూ ఎరుపు దద్దుర్లతో కూడుకుని, కొన్నిసార్లు పురుషాంగంపై తెలుపు, లేదా షైనింగ్ పాచెస్ వలె ఏర్పడుతుంది. ఈ మీ పురుషాంగం మీద దురద మరియు మంటకు దారితీయవచ్చు. మధుమేహం ఉన్న వ్యక్తులలో ఈ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. మరియు మధుమేహం ఉన్నట్లు సూచించే సంకేతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా శుభ్రత పాటించని, లేదా చర్మం ఎల్లప్పుడూ ముందుకు ఉండే పురుషులు(తరచుగా వెనుకకు తీసి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి) ఇతరుల కన్నా ఎక్కువగా ఈస్ట్ ఇన్ఫెక్షన్ ప్రమాదానికి గురి అవుతారు.

 11. జననేంద్రియ సోరియాసిస్:

11. జననేంద్రియ సోరియాసిస్:

సోరియాసిస్, జననాంగాలైన వల్వా, పురుషాంగం, మరియు ఎగువ తొడలు, తొడ మరియు గజ్జల మధ్య చర్మం యొక్క మడతల వంటి ప్రాంతాల చుట్టూ అభివృద్ధి చెందుతుంది. పురుషుల విషయంలో, పురుషాంగంలో సోరియాసిస్ అనేది చిన్నగా మరియు ఎరుపురంగు పాచెస్ అభివృద్ధి జరిగేలా ఉంటుంది.

12. అనోర్గాస్మియా:

12. అనోర్గాస్మియా:

కోగ్లాన్స్ సిండ్రోమ్ అని కూడా పిలువబడే అనోర్గ్మాసియా, ఒక రకమైన లైంగిక సంబంధమైన సమస్య. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తి తగినంత స్టిమ్యులేషన్ ఉన్నప్పటికీ ఉద్వేగాన్ని సాధించలేడు, దీని వలన స్ఖలనం ఆలస్యమవుతుంది. హార్మోన్ల సమస్యలు, నరాల సమస్యలు లేదా మధుమేహంతో కూడిన అంతర్లీన సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు.

English summary

12 Common Penis Problems You Should Be Aware Of

There are a number of ailments and disorders that can harm or damage the functioning of the penis, not to forget STIs and STDs. These health issues can have an impact on your relationship, cause stress and disrupt your self-confidence. Some of the common penis problems are ejaculation problems, penile fracture, herpes, priapism, phimosis, etc.
Story first published: Thursday, September 6, 2018, 14:40 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more