For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకాలేయంపై ప్రభావాన్ని కలిగి ఉండే ఉత్తమ మరియు సరిపడని ఆహారపదార్ధాల జాబితా.

|

కాలేయం జీర్ణక్రియలో సహాయపడటానికి, ఆల్కహాల్ మరియు ఇతర ఔషధాల ఫలితంగా ఏర్పడే విషాన్ని తొలగించే క్రమంలో పైత్యరసాలను స్రవించడం వంటి కీలకచర్యలను నిర్వహిస్తుంది. కావున మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, సూచించబడిన ఉత్తమ మరియు సరిపడని ఆహారాల జాబితాను అర్థంచేసుకోవడం ముఖ్యం.

మీరు ఒక ఆరోగ్యకరమైన ఆహారప్రణాళికను పాటిస్తున్నారంటే, మీ కాలేయం సరిగ్గా పని చేసేందుకు మీవంతు కృషిచేస్తున్నారనే అర్ధం., క్రమంగా మీ మొత్తం శరీరం యొక్క శ్రేయస్సు ఆధారపడి ఉంటుంది. శరీరంలో గుండె తర్వాత అత్యంత కీలకమైన భాగంగా కాలేయం చెప్పబడుతుంది. కావున జాగ్రత్త తప్పనిసరి. అయితే, మీ ఆహారప్రణాళికతో జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం, కాలేయం దాని పనితీరును తగ్గిస్తుంది. చివరకు కాలేయ వైఫల్యం లేదా కొవ్వు కాలేయ వ్యాధికి కారణమవుతుంది.

13 Best And Worst Foods For The Liver

మీ కాలేయాన్ని రక్షించడానికి మరియు మీ కాలేయం దెబ్బతినడానికి ప్రభావాలు కలిగిన ఆహారాల గురించిన జాబితా గురించిన వివరాలు ఇక్కడ పొందుపరచబడినవి.

మీ కాలేయానికి సూచించబడిన ఉత్తమమైన ఆహారాలు ఏమిటి?

మీ కాలేయానికి సూచించబడిన ఉత్తమమైన ఆహారాలు ఏమిటి?

1. బ్రొకొలీ

మీ ఆహారప్రణాళికలోకి బ్రొకొలీ తీసుకోవడం కాలేయం ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తుంది. సల్ఫోరఫాన్ అని పిలువబడే సమ్మేళనం యొక్క ఉనికి కారణంగా ఈ బ్రొకొలీ, కాలేయ వ్యాధి మరియు కాలేయ క్యాన్సర్ వంటి సమస్యలు కలుగకుండా కాపాడగలదని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి.

2. వోట్మీల్

2. వోట్మీల్

వోట్మీల్ సులభంగా జీర్ణమయ్యే ఫైబర్తో లోడ్ అవుతుంది, ఇది మీ కాలేయం చక్కగా పనిచేసేలా తోడ్పాటుని అందివ్వగలదు. సులభంగా కరిగే ఫైబర్ ఉనికిని కలిగి ఉండడం ద్వారా, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మరియు కాలేయ రక్తనాళాలలో పేరుకునే చెడు కొలెస్ట్రాల్ తీవ్రతను తగ్గించగలదు. ఇది పెద్దప్రేగు, కొలెస్ట్రాల్ శోషణకు గురికాకుండా చేయడం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదు.

3. కాఫీ

3. కాఫీ

మీరు కాఫీ ప్రేమికులైతే, ఇది నిజంగా సంతోషించదగిన అంశం. అనేక అధ్యయనాల ప్రకారం రోజులో 2, 3 కప్పుల కాఫీని తీసుకోవడం ద్వారా అనారోగ్యకరమైన ఆహారం వలన కలిగే నష్టం నుండి, మరియు మద్యపాన సమస్యల నుండి కాలేయాన్ని కాపాడగలదు. కాఫీ, రక్తంలోని కొవ్వు మరియు కొల్లాజెన్ యొక్క నిర్మాణాన్ని నిరోధిస్తుంది మరియు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం తగ్గిస్తుంది.

5. ఆకుపచ్చని ఆకుకూరలు

5. ఆకుపచ్చని ఆకుకూరలు

బచ్చలికూర, పాలకూర, మొదలైన ఆకుపచ్చని ఆకుకూరల తరగతికి చెందిన వాటిలో గ్లూటాతియోన్ అని పిలువబడే శక్తివంతమైన ప్రతిక్షకారిణిని ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ కొవ్వు కాలేయ వ్యాధిని పారద్రోలే శక్తివంతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది మరియు కాలేయానికి, వ్యర్థ ఉత్పత్తులను వదిలించుకోవడానికి వీలు కల్పిస్తుంది.

6. బాదం

6. బాదం

విటమిన్-ఇ మరియు అసంతృప్త కొవ్వుల ఉనికి కారణంగా బాదం వంటి నట్స్, బాధాకరమైన కాలేయ వ్యాధి బారినుండి బయటపడేలా సహాయం చేయగలదని చెప్పబడింది. పరిశోధనల ప్రకారం, ఇందులోని సమ్మేళనాలు శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ తొలగించి, రక్తపోటును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెప్పబడింది.

7. బెర్రీస్

7. బెర్రీస్

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీస్, రాస్బెర్రీస్ మొదలైనవి, పాలిఫెనోల్స్ నిక్షేపాలతో కూడుకుని ఉంటాయి, ఈ అనామ్లజనకాలు కొవ్వు కాలేయ వ్యాధి నుండి మిమ్మల్ని కాపాడగలవని చెప్పబడింది. ఈ బెర్రీస్ కాలేయ నష్టాన్ని అధిగమించడానికి దోహదపడే ఆంథోసియానిన్స్ మరియు పాలిఫెనోల్స్ వంటి అనామ్లజనకాలలో ఎక్కువగా ఉంటుంది, క్రమంగా కాలేయ క్యాన్సర్ అవకాశాలు తగ్గిస్తాయి.

మీ కాలేయానికి హాని చేసే ఆహారాలు ఏమిటి?

మీ కాలేయానికి హాని చేసే ఆహారాలు ఏమిటి?

1. కొవ్వు పదార్ధాలు

ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, సంతృప్త కొవ్వులు అధికంగా ఉన్న రెడ్ మీట్ వంటి అధిక కొవ్వు పదార్ధాలను తినడం వలన మీ కాలేయ పనితీరు దెబ్బతింటుంది. ఇది చివరికి కాలేయ వాపును కలిగించవచ్చు, కాలేయ సిర్హోసిస్ అని పిలువబడే కాలేయగాయానికి కూడా దారితీస్తుంది.

2. అధిక చక్కెరలతో కూడిన ఆహారాలు

2. అధిక చక్కెరలతో కూడిన ఆహారాలు

చక్కెరల అధిక వినియోగం కూడా మీ కాలేయానికి ప్రమాదకరం, ఎందుకంటే చక్కెరల అధిక వినియోగం, శరీరంలో కొవ్వు పేరుకోడానికి కారణంగా మారుతుంది. కొవ్వు కాలేయ వ్యాధికి దారితీసే అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, మరియు శుద్ధి చేసిన చక్కెర వినియోగం కూడా అత్యంత ప్రమాదకరం. అందువలనే, చక్కరలకు బదులుగా తేనెను తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు.

3. సోడియంతో కూడిన ఆహారాలు

3. సోడియంతో కూడిన ఆహారాలు

నిల్వ చేసిన సూప్లు, ప్యాక్ చేసిన మరియు ఇతర ఉప్పుతో కూడిన ఆహార పదార్ధాలు, సోడియం నిక్షేపాలను అధికంగా కలిగి ఉంటాయి. ఇది కాలేయంలో అధిక ద్రవం యొక్క నిలుపుదలకు గురిచేయడమే కాకుండా, దాని పనితీరును సైతం నిలిపివేస్తుంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఫైబ్రోసిస్తో సంబంధం కలిగి ఉన్న కాలేయ కణాలలోని అసాధారణ మార్పులకు దారితీస్తుంది, క్రమంగా కాలేయ వాపు వ్యాధికి కారణమవుతుంది.

4.ఆల్కహాల్

4.ఆల్కహాల్

ఆల్కహాల్ ఈ జాబితాలో ప్రధమ స్థానంలో ఉంటుంది, ఇది కాలేయాన్ని తీవ్రంగా నాశనం చేసే శత్రువు. ఆల్కహాల్ కరిగే క్రమంలో జరిగే రసాయనిక చర్యల కారణంగా కాలేయ కణాలు దారుణంగా దెబ్బతింటాయి. క్రమంగా కాలేయ గాయాలకు మరియు వాపునకు కారణమవుతుంది.

5. ప్యాక్డ్ స్నాక్స్

5. ప్యాక్డ్ స్నాక్స్

చిప్స్, జంతికలు మరియు ఇతర అనారోగ్యకర స్నాక్స్ అధికస్థాయిలో ఉప్పు, చక్కెర మరియు ఇతర చెడు క్రొవ్వులతో నిండి ఉంటాయి. స్థాయిని మించిన క్రొవ్వు పదార్ధాల వినియోగం, కాలేయంలో కొవ్వు నిక్షేపాల పెరుగుదలకు కారణమవుతుంది, క్రమంగా కాలేయ పనితీరు మందగిస్తుంది.

6. రెడ్ మీట్

6. రెడ్ మీట్

రెడ్ మీట్ కూడా సంతృప్త కొవ్వులతో నిండి ఉంటుంది, ఇది మీ కాలేయానికి హానికరంగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రెడ్ మీట్ అధిక వినియోగం హెపటోసెల్యులర్ క్యాన్సర్ ప్రమాదాన్ని సైతం పెంచుతుంది.

English summary

13 Best And Worst Foods For The Liver

The diet plays a major role in liver health and the overall well-being of an individual. An unhealthy diet may eventually cause liver failure or fatty liver disease. The best foods for the liver are broccoli, oatmeal, coffee, berries, green leafy veggies, etc., and the worst foods are alcohol, fatty foods and sugary foods.
Story first published: Friday, August 31, 2018, 14:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more