For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేపల వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు అస్సలు వదలరు...!

వారంలో రెండు సార్లు చేపలను తింటే మంచిది. చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. చేపలు తినడం వల్ల ఉపయోగాలు, చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు, చేపల వల్ల ప్రయోజనాలు

|

ప్రతి ఒక్కరూ కనీసం వారంలో రెండు సార్లు చేపలను తింటే మంచిది. దీంతో మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన ఒక పరిశోధనలో ఈ విషయం తెలిసింది. అలాగే మాలిక్యులార్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్, న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ జర్నల్స్‌లోనూ ఇదే విషయాన్ని ప్రచురించారు.

15 amazing health benefits of eating fish

చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు ఉండదు.

ఫలితంగా గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అయితే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే సాల్మన్, మాకరెల్, హెర్రింగ్, లేక్ ట్రౌట్, సార్డిన్స్, అల్బాకోర్ ట్యూనా వంటి చేపలను తింటే ఇంకా మంచి ఫలితం ఉంటుందని సైంటిస్టులు సూచిస్తున్నారు.

రెండు సార్లు

రెండు సార్లు

వారంలో రెండు సార్లు మొత్తం కలిపి 100 గ్రాముల వరకు ఉడకబెట్టిన లేదా గ్రిల్ చేసిన చేపలను తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. కనుక చేపలను మీ ఆహారంలో భాగం చేసుకోవడం మరిచిపోకండి.

ఎన్నో పోషకాలు అందుతాయి

ఎన్నో పోషకాలు అందుతాయి

ఇక చేపలు తినడం వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి.. వైద్య నిపుణులు కూడా చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. వీటి వల్ల మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంతోపాటు మెదడును చురుగ్గా ఉండేలా చేస్తాయి. అయితే చేపలను వారంలో కనీసం 2 సార్లు తింటే దాంతో ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రై గ్లిజరిడ్స్

ట్రై గ్లిజరిడ్స్

చేపలను తరచూ తింటుంటే రక్తంలో ఉండే ట్రై గ్లిజరిడ్స్ 30 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. గుండె సమస్యలు ఉన్నవారు తరచూ చేపలను తీసుకుంటే మంచిది.

విటమిన్ డి, ప్రోటీన్లు

విటమిన్ డి, ప్రోటీన్లు

చేపల్లో విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డికి సమానంగా పోషకాలు మనకు చేపల ద్వారా లభిస్తాయి. దీంతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి.

అల్జీమర్స్

అల్జీమర్స్

తరచూ చేపలను తింటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్, దెమెంతియా వంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. చేపలను రెగ్యులర్‌గా తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. ఇవి డిప్రెషన్ నుంచి బయట పడేస్తాయి. మానసిక ఆందోళనను పోగొడతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది

చేపలను తరచూ తినేవారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దెబ్బతిన్న నాడీవ్యవస్థను మరమ్మతు చేయడానికి చేపలు ఉపయోగపడతాయి.

మానసిక ఆందోళన

మానసిక ఆందోళన

మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్న వారు చేపలు తింటే మానసిక ఆందోళనలను దూరం చేసుకోవచ్చు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని పోగొడుతాయి. అలాగే చేపల్లో వుండే విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా వున్నందున మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బొజ్జ పెరగటం

బొజ్జ పెరగటం

మాంసం కన్నా చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బొజ్జ పెరగటం, రక్తపోటు పెరగకుండా చేయడం.. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు చేపలు దోహదం చేస్తాయి.

క్యాన్సర్ కారకాలు నశిస్తాయి

క్యాన్సర్ కారకాలు నశిస్తాయి

చేపలు తినే అలవాటున్న వారిలో క్యాన్సర్ కారకాలు నశిస్తాయి. చేపలను తింటే గుండెజబ్బు, పెద్దపేగు క్యాన్సర్‌ వంటి వాటి బారిన పడకుండా కాపాడుకోవచ్చునని పోషకాహార నిపుణులు అంటున్నారు. కానీ ఎక్కువ నూనెలో వేపుడు చేసిన చేపలతో క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఉప్పు నీటి చేపలు

ఉప్పు నీటి చేపలు

అయితే, మంచి నీటిలో పెరిగే చేపల కన్నా ఉప్పు నీటిలో పెరిగే చేపలు ఎక్కువగా ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లని కలిగి ఉంటాయి. సాల్మన్, ట్యునా, సార్డైన్స్, మాకేరాల్ వంటి ఉప్పు నీటిలో పెరిగే చేపలు చాలా ఆరోగ్యకరమని 'ది అమెరికన్ డైట్ అసోసియేషన్' తెలిపింది.

శృంగార కోర్కెలు

శృంగార కోర్కెలు

చేపలు ఆరగించడం వల్ల ప్రతి మగాడిలో శృంగార కోర్కెలు తారా స్థాయికి చేరుతాయి. ముఖ్యంగా.. ప్రతి మగాడు సెక్స్‌లో పాల్గొనాలంటే ఒమేగా 3, ఒమేగా 6 ఎంతో అవసరం. దీనికి చేపలే సరైన మందు. దీనికి మంచిని మందు ప్రకృతిలో లేదనే చెప్పాలి. అయితే, ఈ మందు అన్ని రకాల చేపల్లో ఉండవు. కేవలం షెల్ ఫిష్, సాల్మన్, మాక్‌రెల్, సార్డినెస్ వంటి రకం చేపల్లోనే ఉంటాయి.

వీర్య కణాలు

వీర్య కణాలు

ఇవి పురుషుల్లో వీర్య కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తాయి. ఈ రకం చేపలను అధికంగా ఆరగించే పురుషుడికి ప్రతి రాత్రీ వసంత రాత్రిగానే మిగిలిపోతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సో.. పురుషులూ.. ఇకెందుకు ఆలస్యం.. ఈ రకం చేపలను ఆరగించి మీలో వీర్యవృద్ధిని పెంచుకోండి.. పడక గదిలో రెచ్చిపోండి.

బుద్ధిబలం పెరుగుతుంది

బుద్ధిబలం పెరుగుతుంది

పిల్లలకు ఆహారంగా చేపలను ఇస్తే వారిలో బుద్ధిబలం పెరుగుతుందని వైద్యులు తెలిపారు. వారానికి ఒకసారి చేపలు తిన్న 15 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల్లో తెలివి బాగా పెరిగినట్లు పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. దీంతోబాటు వారి శరీరంలో కొవ్వు శాతంకూడా తగ్గినట్లు, ఇతర శరీర భాగాలుకూడా సక్రమంగా ఎదిగినట్లు పరిశోధనలో వెల్లడైనట్లు వారు వివరించారు.

English summary

15 amazing health benefits of eating fish

15 amazing health benefits of eating fish
Desktop Bottom Promotion