For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అల్లం టీ ఆ సమయంలో తాగితే ఆ సామర్థ్యం పెరుగుతుంది.. అల్లం టీతో బోలెడన్నీ ప్రయోజనాలు

అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.అల్లం టీ ఆ సమయంలో తాగితే ఆ సామర్థ్యం పెరుగుతుంది.. అల్లం టీతో బోలెడన్నీ ప్రయోజనాలు

|

వేసవి కాలం పోయి.. చినుకులు పడుతున్నాయి. ఈ సీజన్లో అల్లం టీని సేవిస్తే జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. అల్లం టీని రోజూ తీసుకోవడం ద్వారా బీపీ కూడా బాగా తగ్గుతుంది. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లను, నొప్పిని అల్లం టీ నివారిస్తుంది.

అల్లం టీ దివ్యౌషధం

అల్లం టీ దివ్యౌషధం

కండరాలు, కీళ్లనొప్పులూ ఆర్థ్రయిటిస్‌ సమస్యలు ఉన్నవాళ్లకి అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి.

రక్తప్రసరణ

రక్తప్రసరణ

అల్లంలోని జింజరాల్స్, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులను తొలగించి.. గుండె వ్యాధులు రాకుండా కాపాడుతాయి. అల్లం టీ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అజీర్తి వంటివీ తగ్గుతాయి

అజీర్తి వంటివీ తగ్గుతాయి

అల్లం టీలో కొన్ని చుక్కల నిమ్మరసం పిండితే టీ రుచిగా ఉండటమే కాదు, జలుబు, ఫ్లూ వంటి జ్వరాలతోబాటు గొంతునొప్పి, అజీర్తి వంటివీ తగ్గుతాయి. రోజుకి రెండు కప్పుల అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పక తీసుకుంటే బీపీ కూడా తగ్గుతుంది.

ఆస్తమా తగ్గుతుంది

ఆస్తమా తగ్గుతుంది

అల్లంలోని యాంటీవైరల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలవల్ల అలర్జీలూ ఆస్తమా కూడా తగ్గుముఖం పడతాయి. అల్లంలోని జింజరాల్స్‌, జింజెరాన్‌లు రక్తప్రసరణకు తోడ్పడతాయి. రక్తనాళాల్లో పేరుకున్న అడ్డంకులని తొలగించి, గుండె వ్యాధులు రాకుండా కాపాడతాయి.

జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది

జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది

వికారం, అలసట ఉన్నప్పుడు ఓ కప్పు అల్లం టీ తాగితే వెంటనే రిలీఫ్‌ వస్తుంది. ఇందులోని జింజిబర్‌ అనే పదార్థం హానికర బ్యాక్టీరియాని తొలగించి జీర్ణవ్యవస్థని మెరుగుపరుస్తుంది. తేన్పుల్నీ తగ్గిస్తుంది. ఇన్‌ఫ్లమేషన్‌ కారణంగా వచ్చే నొప్పుల్నీ మంటల్నీ దురదల్నీ కూడా నివారిస్తుంది అల్లం టీ.

అల్లం టీ ఎలా చేసుకోవాలి

అల్లం టీ ఎలా చేసుకోవాలి

అల్లం టీ తాగితే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు చక్కని ఉపశమనం కూడా లభిస్తుంది. అయితే అల్లం టీని చాలా మందికి ఎలా తయారు చేయాలో తెలియదు. ఈ క్రమంలోనే ఆ టీ తయారీ విధానం, దాంతో కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు

అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు

సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 టీస్పూన్, టీ పొడి - 1 టీస్పూన్ (ఒక కప్పుకు), నీళ్లు - 3 కప్పులు , తేనె - 1 టీస్పూన్

నిమ్మ రసం - 1 టీస్పూన్, పాలు - అర కప్పు (మీ ఇష్టం).

తయారీ విధానం

తయారీ విధానం

పాత్రలో 3 కప్పుల నీటిని తీసుకోవాలి. అందులో అల్లం ముక్కలను వేసి మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో టీ పొడి, పాలు, తేనె వేయాలి. సిమ్మర్‌లో స్టవ్‌ను ఉంచి 3-4 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత నిమ్మరసం కలపాలి. అంతే.. అల్లం టీ తయారైనట్టే. దీన్ని తాగితే కింద చెప్పిన విధంగా మనకు లాభాలు కలుగుతాయి.

రోగ నిరోధక శక్తి

రోగ నిరోధక శక్తి

అల్లం టీ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్‌ఫెక్షన్లను అడ్డుకుంటుంది. రోగాలు వృద్ధి చెందకుండా చూస్తుంది. ఉదయాన్నే కలిగే నీరసం, అలసట పోతాయి. వికారం తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఆకలి పెరుగుతుంది.

మానసిక ప్రశాంతత

మానసిక ప్రశాంతత

అల్లం టీ తాగితే కడుపునొప్పి, కడుపులో అసౌకర్యం తొలగిపోతాయి. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. అల్లం టీని సేవించడం ద్వారా ఒత్తిడిని తగ్గించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

జీర్ణ ప్రక్రియ

జీర్ణ ప్రక్రియ

యాంటియోక్సిడెంట్స్ కలిగివున్న అల్లం టీని రోజూ ఒక కప్పు తీసుకుంటే జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. మానసిక ఒత్తిడిని మాయం చేసే అల్లం టీ, మానసికోల్లాసాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

రాత్రి తాగితే

రాత్రి తాగితే

ఇక అల్లం మగవారిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. అందువల్ల మీరు రాత్రి మీ భార్యతో ఆ పనిలో పాల్గొనే ముందు అల్లం టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. అంగం బాగా గట్టిపడడానికి, లేటుగా వీర్యం స్కలించడానికి, ఎక్కువ సేపు ఆ పని కొనసాగించడానికి అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మీరు తినే ఆహారంలో అల్లం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. రోజూ అల్లం టీ లేదా పచ్చి అల్లం ముక్కలాంటివి తీసుకుంటూ ఉండాలి.

అనర్ధాలు కూడా ఉన్నాయి

అనర్ధాలు కూడా ఉన్నాయి

అయితే అల్లం' టీ తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా అనర్ధాలు కూడా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అల్లం టీ సేవించగానే కొంతమందికి పొట్టలో అలజడి గురి చేస్తుంది. ఎక్కువ అల్లం టీ తాగకూడదంట. కారం..మసాల దినుసల విధంగానే అల్లం కూడా మంట కలుగ చేస్తుందని..అల్లం టీ తాగితే రక్తపోటును బాగా తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 'అల్లం' టీ తాగటం వలన స్కిన్‌ రాషెస్‌ నోట్లో లేదా కడుపులో చికాకులను కలిగిస్తుంది. బ్లీడింగ్‌ సమస్యలున్న వారు అల్లంటీ కి దూరంగా ఉండాలంట.

English summary

15 amazing health benefits of ginger tea

15 amazing health benefits of ginger tea
Story first published:Thursday, June 7, 2018, 14:36 [IST]
Desktop Bottom Promotion