For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లైంగిక సామర్ధ్యం పెరుగుదలకు దోహదపడే 15 ఉత్తమ పానీయాలు

|

జీవితంలో భార్యాభర్తల మద్య అనుబంధం మరింత బలపడడానికి లైంగిక సంబంధం కూడా కీలకపాత్ర పోషిస్తుంది అన్నది జగమెరిగిన సత్యం. కొన్ని అధ్యయనాల ప్రకారం లైంగిక సంబంధంలో తరచూ పాల్గొనే దంపతులు, ఎక్కువకాలం ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవిస్తున్నారని తేల్చాయి కూడా. కావున దాంపత్యం సాఫీగా సాగాలి అనుకునేవారికి, గొప్ప ఔషధంగా లైంగిక సంబంధం ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. మెదడులో హాపీ హార్మోన్స్(డోపమైన్, సెరటానిన్), సాడ్ హార్మోన్స్(కార్టిసాల్, అడ్రినలిన్,మెలటానిన్) అని ఉంటాయి. స్ట్రెస్(ఆందోళనలు) ఎక్కువగా గురయ్యేవారికి సాడ్ హార్మోన్స్ విడుదల ఎక్కువగా జరుగుతుంది.

క్రమంగా, డిప్రెషన్ వంటి సమస్యలతో పాటు, లైంగిక పటుత్వం కూడా తగ్గిపోతుంటుంది. క్రమంగా సెక్సువల్ లైఫ్ ప్రభావితమవుతుంది. పురుషులలో అంగస్థంభన సమస్యలు, స్త్రీలలో జననేంద్రియాలు పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. కానీ తరచుగా లైంగిక సంబంధంలో పాల్గొనే వారిలో హాపీ హార్మోన్స్ విడుదల కారణంగా, పురుషులలో టెస్టోస్టీరాన్, స్త్రీలలో ఈస్ట్రోజన్ స్థాయిలలో కూడా గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిరూపించబడింది.

Best Drinks For Sexual Stamina

ఒక క్రియారహిత లైంగిక జీవితం ఆత్మగౌరవాన్ని సైతం దెబ్బతీస్తుంది. మీరు మరియు మీ భాగస్వామి శారీరకంగా నిష్క్రియాత్మక లైంగిక సంబంధాన్ని కలిగి ఉన్నఎడల, ఇక్కడ చెప్పబడిన 15 పానీయాలు ఎంతగానో దోహదం చేయగలవని చెప్పబడింది.

లైంగిక పటుత్వం కోల్పోతుందని ఎటువంటి ఆందోళనలు చెందవలసిన అవసరం లేదు, సమస్యలు ఎదుర్కొంటున్న జంటలు లైంగిక శక్తిని పెంచుకోవడానికి సూచించబడిన, కొన్ని మార్గాలను అనుసరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. పానీయాలు ఖచ్చితంగా మీ లైంగిక శక్తిని పెంచడమే కాకుండా, మెరుగైన లైంగిక జీవితాన్ని సైతం సులభతరం చేస్తాయి.

ఇక్కడ సహజసిద్దంగా మీ లైంగిక శక్తిని పెంచడానికి సహాయం చేసే, 15 ఉత్తమ పానీయాల జాబితాను పొందుపరచబడింది.

1. కలబంద రసం :

1. కలబంద రసం :

అనేక పరిశోధనల్లో, అలోవెరా రసం టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని మెరుగుపర్చగలదని చూపింది. ఇది పురుషులలో లిబిడినల్ డ్రైవ్ పెంచడంతో పాటు, అధిక లైంగికశక్తిని ప్రేరేపిస్తుంది. అలోవేరా రసం మీ ఆరోగ్యాన్ని పెంచగలిగే, అద్భుతమైన పోషకాలకు మూలం. ఇది మీ శరీరాన్ని ఉత్తేజపరచడమే కాకుండా, లైంగిక పటుత్వాన్ని కూడా పెంచుతుంది.

2. పుచ్చకాయ జ్యూస్ :

2. పుచ్చకాయ జ్యూస్ :

మీ అంగ స్థంభనలను పెంచగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న L- సిట్రిల్లైన్ అని పిలిచే అమైనో ఆమ్లాలలో పుచ్చకాయలు అధికంగా ఉంటాయి. పుచ్చకాయ రసం లైంగిక సామర్ధ్యం బలోపేతం చేయడానికి సహాయపడే జననేంద్రియాలకు, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

3. ఆపిల్ జ్యూస్ :

3. ఆపిల్ జ్యూస్ :

యాపిల్స్ క్వెర్సేటిన్ అని పిలువబడే యాంటీయాక్సిడెంట్ ఫ్లావోనాయిడ్లను అధిక మొత్తాలలో కలిగి ఉన్న కారణంగా మీ లైంగికశక్తిని పెంచడానికి సూచించదగిన, అద్భుతమైన పండుగా ఉంది. రోజువారీ దినచర్యలలో భాగంగా ఆపిల్ రసం తీసుకునే వారిలో లైంగికసామర్ధ్యం స్థాయిలు పెరిగినట్లుగా అధ్యయనాలు సూచించాయి.

Most Read: డేటింగ్ లో ఉన్నప్పుడు సెక్స్ తప్ప అన్నీ అయిపోయాయి, డబ్బు కోసం ఆశపడ్డా,నరకం అనుభవిస్తున్నా

4. అల్లం జ్యూస్ :

4. అల్లం జ్యూస్ :

మీ ఆహారంలో అల్లం రసాన్ని జోడించడం ద్వారా, మీ జీవితానికి అదనపు మసాలాలను జోడించండి. అల్లం రసం ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఇది లైంగిక పటుత్వం తగ్గడం, మరియు అకాల స్ఖలనం వంటి సమస్యలను తొలగించి లిబిడో పనితీరును మెరుగుపరుస్తుంది.

5. తేనెతో కూడిన పాలు :

5. తేనెతో కూడిన పాలు :

హనీ మీ లైంగికశక్తిని పెంచడానికి సహాయపడే సహజ సిద్దమైన స్వీటెనర్. తేనెను, పాలలో కలిపి తీసుకున్న ఎడల, ఒక స్థిరమైన లైంగిక డ్రైవ్ను నిర్వహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, తక్షణ శక్తిని అందించే అవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి.

6. అరటిపండు షేక్ :

6. అరటిపండు షేక్ :

మీ లైంగిక శక్తిని పెంచుకోవడంలో అరటిపండ్లు అత్యంత ప్రభావవంతమైనవిగా ఉంటాయి. బ్రోమలైన్ అని పిలువబడే ఎంజైమ్ కారణంగా అరటిపండు లైంగిక సంభోగం విషయంలో అద్భుతంగా సహాయపడగలదని చెప్పబడింది. అరటిపండులోని అదనపు విటమిన్లు మరియు ఖనిజాలు సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిలో సహాయపడుతూ శరీరానికి తక్షణశక్తిని ఇచ్చేందుకు సహాయపడుతాయి.

Most Read: నీకు చాలా సాయం చేశా, నాతో ఒక్కసారైనా పడుకుని రుణం తీర్చుకో, నా నగ్న ఫొటోలను పెట్టాడు

7. దానిమ్మపండు జ్యూస్ :

7. దానిమ్మపండు జ్యూస్ :

దానిమ్మలో, రక్త ప్రసరణ మెరుగుపరచే లక్షణాలతో పాటు, అంగస్తంభనను పెంపొందించే యాంటీఆక్సిడెంట్లలో పుష్కలంగా ఉంటాయి. రోజులో ఒక గ్లాసు దానిమ్మపండు రసం తీసుకోవడం, సహజసిద్దంగా మీ లైంగికశక్తిని పెంచడానికి కృషిచేస్తుంది.

8. కాఫీ :

8. కాఫీ :

కాఫీ ఒక సహజ సిద్దమైన లిబిడో ప్రొపెల్లర్ వలె చెప్పబడుతుంది. ఇందులోని కెఫీన్ కంటెంట్ లైంగిక శక్తిని మరియు సామర్ధ్యాన్ని అందిస్తుంది. రోజువారీ కప్పు కాఫీని తీసుకునే వాళ్ళలో, అనాలోచిత లైంగిక చర్యలు అధికంగా ఉంటున్నట్లు తేలింది కూడా.

9. బీట్రూట్ జ్యూస్ :

9. బీట్రూట్ జ్యూస్ :

బీట్రూట్లు నైట్రేట్లలో ఎక్కువగా ఉంటాయి, క్రమంగా శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి మగవారిలో లైంగిక పనితీరును మెరుగుపరుస్తాయి.

Most Read: వావ్..! ఈ ఆల్ట్రాసౌండ్ ఇమేజెస్ చూస్తే ఇంప్రెస్ అవ్వాల్సిందే..!!

10. స్పినాచ్ జ్యూస్ :

10. స్పినాచ్ జ్యూస్ :

స్పినాచ్లో(పాలకూర) అధికంగా ఆర్గానిన్ పదార్థం ఉంటుంది. ఈ ఆర్గానిన్, మీ లైంగికశక్తిని సహజసిద్దంగా పెంచడానికి సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్గా మార్చబడుతుంది.

11. అవోకాడో జ్యూస్ :

11. అవోకాడో జ్యూస్ :

అవోకాడోస్ ఫోలిక్-యాసిడ్ మరియు విటమిన్-B6 లో పుష్కలంగా ఉంటాయి. విటమిన్-B6, హార్మోన్లను క్రమబద్దీకరించడంలో సహాయంచేస్తుంది. మరియు ఫోలిక్ యాసిడ్ శరీరంలో శక్తి పెరుగుదలకు దోహదం చేస్తుంది.

12. చియా సీడ్ వాటర్ :

12. చియా సీడ్ వాటర్ :

చియా విత్తనాలు శరీరానికి శక్తిని అందించే ప్రోటీన్, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడుకుని ఉంటాయి. చియా సీడ్ వాటర్ తరచుగా తీసుకోవడం మూలంగా, మీ శరీరం శారీరకంగా చురుకుగా ఉండడమే కాకుండా, మంచి లైంగిక పటుత్వాన్ని ఆస్వాదించగలుగుతారు.

Most Read: అరవింద దాచిన అందాలన్నీ చూశా, పెళ్లి చేసుకోమంటోంది, నా మైండ్ ఎప్పుడెలా ఉంటుందో

13. డార్క్ చాక్లెట్ షేక్ :

13. డార్క్ చాక్లెట్ షేక్ :

చాక్లెట్లో ఉన్న తేబ్రోమైన్ కంటెంట్ లిబిడినల్ డ్రైవ్ పెంచుతుంది, మరియు లైంగికశక్తి స్థిరంగా ఉండేలా దోహదం చేస్తుంది. క్రమంగా ఎక్కువసేపు లైంగిక సంభోగంలో పాల్గొనగలిగేలా దోహదం చేస్తుంది.

14. బాదం పాలు :

14. బాదం పాలు :

తృణధాన్యాలు మరియు బాదం వంటివి, పురుషుల్లో హార్మోన్ల ఆరోగ్యకరమైన ఉత్పత్తికి కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ఆరోగ్యకర కొవ్వు ఆమ్లాలు మరియు ఖనిజాలకు గొప్ప మూలంగా ఉంటాయి. మరియు బాదంపాలు మహిళకు లైంగిక ప్రేరణగా పనిచేస్తుంది.

15. వెనీలా హనీ మార్టిని :

15. వెనీలా హనీ మార్టిని :

హనీ ఒక గొప్ప శక్తి ఉత్ప్రేరకంగా ఉంటుంది. మరియు టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. వెనిలాతో చేరినప్పుడు తేనె, పురుషులు మరియు స్త్రీలలో ఒక శక్తివంతమైన కామోద్దీపనను ప్రేరేపించగలదు., అంతేకాకుండా లైంగికచర్య ఎక్కువసేపు కొనసాగడంలో సహాయపడుతుంది.

Most Read: చలికాలంలో పొడిబారిన చర్మంతో బాధపడుతున్నారా ? అయితే ఈ 5 సహజసిద్దమైన మాయిశ్చరైజింగ్ ఫేస్ మాస్క్స్ మీకోసమే!

English summary

Best Drinks For Sexual Stamina

Often people reach out to doctors and complain about poor sexual performance and sometimes medicines don't have a cure for it. So, why not go to your kitchen and stock up some healthy foods that will act as an essential stamina booster? These 15 healthy drinks are a powerhouse of nutrients that will boost your sexual energy instantly!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more