For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాగి, ఇత్తడి వాడితే మీ ఆరోగ్యం పుత్తడే

పూర్వం ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు రాగి, ఇత్త‌డి వ‌స్తువుల‌నే వాడేవారు. ఇప్పుడంటే అంతా ప్లాస్టిక్‌మ‌యం అయిపోయింది. రాగి చెంబు, ఇత్తడి వస్తువులు, రాగి సామగ్రి, రాగితో ఉపయోగాలు, రాగి ప్రయోజనాలు

|

పూర్వం ఒక‌ప్పుడు మ‌న పెద్ద‌లు రాగి, ఇత్త‌డి వ‌స్తువుల‌నే వాడేవారు. ఇప్పుడంటే అంతా ప్లాస్టిక్‌మ‌యం అయిపోయింది. ఆరోగ్యంగా ఉండడానికి, శుభ్రంగా జీవించడానికి మన సంప్రదాయాల్లోని కొన్ని విషయాలు చాలా దోహదం చేస్తాయి. అటువంటిదే రాగి పాత్రల వాడకం. ఇంట్లో పూజా పునస్కారాలకు మనం రాగి లేదా వెండి పాత్రలు వాడడం కద్దు.

ఈ లోహాలకున్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలే ఆ లోహాలను పూజార్హం చేశాయి. అంతేనా.. ఒక్కసారి తాతముత్తాతల కాలంలోకి రీవైండ్‌ అయితే.. రాగి బిందెలు, ఇత్తడి గిన్నెలు, కొండొకచో కంచు సామగ్రి చూడొచ్చు.

అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండేవారు

అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండేవారు

వాటన్నింటిలోనూ రాగి ఉంటుంది. ఈ రాగికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? మన జీవితంలో ఒక భాగమైపోవడంలో ఈ లోహానికున్న లక్షణాలేంటి? అని ఆధునిక పరిశోధకులు తరచి చూస్తే.. బోలెడన్ని మంచి విషయాలు ఈ లోహం గురించి బయటపడ్డాయి. మ‌న పెద్ద‌లు రాగి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను విరివిగా ఉప‌యోగించడం వల్లే వారు అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండేవారు. మ‌నం కూడా రాగి, ఇత్త‌డి పాత్ర‌ల‌ను వాడితే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

ట్రేస్‌ ఎలిమెంట్‌

ట్రేస్‌ ఎలిమెంట్‌

అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ అయితే.. రాగిని శరీరానికి అవసరమైన ‘ట్రేస్‌ ఎలిమెంట్‌'గా గుర్తించడమే కాక, అది లోపిస్తే ఏమిటి.. ఎక్కువైతే ఏమవుతుందో కూడా చేసిన పరిశోధనలకు గుర్తింపునిచ్చింది.

చాలా జబ్బులను అరికట్టవచ్చు

చాలా జబ్బులను అరికట్టవచ్చు

ఈ పరిశోధనల ద్వారా రాగి వాడకంతో ఆధునిక కాలంలో వచ్చే చాలా జబ్బులను అరికట్టొచ్చని తేలింది. భారతదేశంలో శతాబ్దాల క్రితమే రక్తపోటు నుంచి కేన్సర్‌ వరకూ, శ్వాసకోశ వ్యాధుల నుంచి జీర్ణకోశ వ్యాధుల వరకూ, గుండె జబ్బుల నుంచి కిడ్నీ వ్యాధుల వరకూ ఇలా లెక్క తీస్తూ పోతే బోలెడన్ని గుణాలను ఆయుర్వేదంలో తెలిపారు.

యాంటీ బ్యాక్టీరియల్‌ ఆయింట్‌మెంట్స్

యాంటీ బ్యాక్టీరియల్‌ ఆయింట్‌మెంట్స్

ఆధునిక కాలంలోనూ ఈ లోహాన్ని పలు యాంటీ బ్యాక్టీరియల్‌ ఆయింట్‌మెంట్లలో వాడుతున్నారు. అంతే కాదు.. రాగి పాత్రల్లోని నీళ్లు తాగితే.. అది పొట్టలో కదలికలను (పెరిస్టాల్సిస్‌) నియంత్రించి జీర్ణవ్యవస్థను కుదుటపరుస్తుంది. అలాగే పేగుల్లో అల్సర్లు రాకుండా ఆపుతుంది. అంతేనా.. శరీరంపై మచ్చలను తొలగించడమేకాక, గాయాలు త్వరగా మానేలా చేస్తుంది.

కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర

కొవ్వును కరిగించడంలో కీలక పాత్ర

లోహం అనేది క్షారగుణం కలిగి ఉంటుంది కాబట్టి, అసిడిటీని తగ్గిస్తుంది. కొవ్వును కరిగించడంలో రాగి కీలక పాత్ర పోషించి మనం అధిక బరువును పెంచుకోకుండా కాపాడుతుంది. దీంతో ఊబకాయం సమస్యకు నివారణ ఉంటుంది. కొవ్వును నియంత్రించి, రక్తాన్ని శుద్ధిచేస్తుంది కాబట్టి, గుండెపోటు వచ్చే అవకాశాన్ని రాగి పాత్రల్లో నీరు తాగడంద్వారా తగ్గించుకోవచ్చు.

రక్తహీనత అదుపులో ఉంటుంది

రక్తహీనత అదుపులో ఉంటుంది

రాగికి నొప్పి, మంట తగ్గించే గుణాలున్నాయి. ఆ కారణంగా కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. శరీరంలో మెలనిన్‌ కారణంగా మన చర్మం రంగు నిర్ధారణ అవడమే కాక, అది అసలు మరీ తక్కువగా ఉంటే.. కేన్సర్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. రాగి కారణంగా అవసరమైనంత మెలనిన్‌ ఉత్పత్తి అవుతుంది. రాగి పాత్రల్లోని నీరు తాగడం వలన రక్తహీనత అదుపులో ఉంటుంది.

12 ముఖ్య ప్రయోజనాలు

12 ముఖ్య ప్రయోజనాలు

రాగి ప్రయోజనాల్లో ముఖ్యమైన 12 గుణాలు ఇవి.. 1. ఎసిడిటీని తగ్గించడం 2. అల్సర్లతోపాటు అజీర్ణాన్ని అరికట్టడం 3. అధిక బరువును తగ్గించడం 4. గుండెజబ్బును నివారించడం 5. కేన్సర్‌ నిరోధక సామర్థ్యం 6. డయేరియా దరి చేరకుండా చేయడం 7. కామెర్లు రాకుండా చూడడం 8. థైరాయిడ్‌ గ్రంథి అతిగా పనిచేయనీయకుండా చేయడం 9. అది తక్కువగా పనిచేయడాన్ని నిగ్రహించడం 10. అర్థరైటిస్‌ రాకుండా కీళ్లను బలంగా ఉం చడం 11. రక్త హీనత నివారించడం 12. రెండు రకాల రక్తపోట్లను దూరంగా ఉంచడమని రాగిపై అధ్యయనం చేసినవారు బల్లగుద్ది చెబుతున్నారు.

క్రిములు మొత్తం నశిస్తాయి

క్రిములు మొత్తం నశిస్తాయి

రాగి పాత్రలో కేవ‌లం 3 గంట‌ల పాటు నీటిని నిల్వ ఉంచితే చాలు. ఆ నీటిలో ఉండే క్రిములు నశిస్తాయి. దీంతో ఆ నీరు ప‌రిశుభ్రంగా మారుతుంది. రాగి పాత్ర‌ల‌లో నీటిని నిల్వ ఉంచ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ-కొలి బాక్టీరియా కూడా అంతమ‌వుతుంది. దీని వ‌ల్ల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది

ఇక ఇత్త‌డి పాత్ర‌ల‌ను జింక్‌, అలాయ్ మిశ్ర‌మంతో త‌యారు చేస్తారు. జింక్ వ‌ల్ల మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అందుక‌ని ఇత్త‌డి పాత్ర‌ల్లో అయినా నీటిని తాగ‌వ‌చ్చు. లేదా ఆ పాత్రల్లో వంట చేసుకుని తిన‌వ‌చ్చు.

కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి

కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి

రాగి పాత్ర‌ల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ‌డం వ‌ల్ల అసిడిటీ, అజీర్ణం, డ‌యేరియా, కామెర్లు, కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. గుండె స‌మ‌స్య‌లు రావు. క్యాన్స‌ర్ క‌ణాలు న‌శిస్తాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మెర‌గ‌వుతుంది. ర‌క్త‌హీన‌త పోతుంది. హైబీపీ త‌గ్గుతుంది.

ఎక్కువైనా ఇబ్బందే సుమా

ఎక్కువైనా ఇబ్బందే సుమా

24 గంటలూ రాగి పాత్రల్లోని నీరు తాగడం కూడా అనవసరమని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండుమూడు సార్లు.. రాగి పాత్రలోని నీళ్లు తాగితే చాలన్నది వారి మాట. మరీ ఎక్కువ రాగిని శరీరంలోకి తీసుకున్నా ఈ లోహం ఎక్కువై మిగిలిన లోహాలను స్వీకరించడంలో శరీరానికి ఇబ్బంది కలిగి సమస్యలు వస్తాయంటున్నారు.

ఎక్కువగా ఇత్తడి పాత్రలు వాడండి

ఎక్కువగా ఇత్తడి పాత్రలు వాడండి

అమెరికాలోని ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ర్టేషన్‌ అంచనాల ప్రకారం.. రోజుకు 12 మిల్లీగ్రాముల రాగి మనకి సరిపోతుంది. మన ఆయుర్వేద అంచనాల ప్రకారం కొద్దిగా ఎక్కువైనా ఫర్వాలేదు. అందుకే.. ఇంట్లో అన్నీ రాగి పాత్రలే వాడకుండా, ఎక్కువగా ఇత్తడి పాత్రలు వాడడం వలన పరిమితమైన మోతాదులో మాత్రమే రాగిని తీసుకునే అవకాశం ఉంటుందని నిపుణుల సలహా.

English summary

15 reasons drinking water in copper vessel is beneficial

15 reasons drinking water in copper vessel is beneficial
Story first published:Friday, May 18, 2018, 14:29 [IST]
Desktop Bottom Promotion