For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పచ్చి మిరపకాయను కొరుకు... ఆరోగ్య లాభాలు మెరుగు

పచ్చిమిరపకాయలతో వచ్చే లాభాలు తెలిస్తే ఘాటెత్తే పచ్చిమిర్చిని ఇష్టంగా లాగించేస్తారు. సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది.పచ్చి మిర్చి, మిరపకాయ, మిరకాయ్, పచ్చిమిర్చి, పచ్చి మిరప

|

పచ్చిమిరపకాయలతో వచ్చే లాభాలు తెలిస్తే ఘాటెత్తే పచ్చిమిర్చిని ఇష్టంగా లాగించేస్తారు. సాధారణంగా మిరపకాయ అంటే చాలామంది భయపడిపోతారు. కారంగా ఉంటుంది. తినలేమంటూ వంటలో వాడినా పక్కన పడేస్తుంటారు.

పచ్చి మిరపకాయలను నిత్యం మనం అనేక కూరల్లో వేస్తుంటాం. ఎండు కారంకు బదులుగా వీటిని కారం కోసం చాలా మంది కూరల్లో వేస్తారు. పచ్చి మిరప వల్ల కూరలకు చక్కని రుచి వస్తుంది. ఈ క్రమంలోనే కొందరు పచ్చి మిరప కాయలను అలాగే డైరెక్ట్‌గా తింటారు.

కొందరు మజ్జిగలో వీటిని ఆరగిస్తారు. అయితే నిజానికి పచ్చి మిరపకాయలు కారంగా ఉన్నప్పటికీ వాటిని రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కేప్సైసిన్‌

కేప్సైసిన్‌

పచ్చి మిర్చిలో శరీరపు మెటబాలిజంను ప్రేరేపించే కేప్సైసిన్‌ (క్యాస్పేసియన్)అనే ఓ పదార్థం ఉంది. దీంతో తయారైన సప్లిమెంట్స్‌ తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుందట. మన శరీరంలో తెలుపు, గోధుమరంగు రెండు రకాల కొవ్వులుంటాయి.

తెలుపు రంగు కొవ్వు కణాల్లో

తెలుపు రంగు కొవ్వు కణాల్లో

తెలుపు రంగు కొవ్వు కణాల్లో శక్తి నిల్ల ఉంటే గోధుమ రంగు కొవ్వు కణాలు ఆ కొవ్వు కరిగేందుకు సహాయపడతాయి. కాబట్టి గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలను ఎక్కువ తినటం వల్ల కూడా శరీరంలోని కొవ్వును కరిగించి బరువు తగ్గించుకోవచ్చని అమెరికాలోని వ్యోమింగ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కూడా తెలిపారు.

మెటబాలిక్‌ రేట్‌ పెరిగి...

మెటబాలిక్‌ రేట్‌ పెరిగి...

పైగా తెలుపు, గోధుమ రంగు కొవ్వు కణాలు ఉష్ణోగ్రతలను బట్టి రూపాల్ని మార్పిడి కూడా చేసుకుంటాయట. అంటే క్యాప్సైసిన్‌ సప్లిమెంట్‌ను తీసుకుంటే శరీరంలో తెల్ల కొవ్వు కణాలు గోధుమ రంగు కొవ్వు కణాలుగా మారిపోయి, ఫలితంగా మెటబాలిక్‌ రేట్‌ పెరిగి ఎటువంటి వ్యాయామం చేయకుండానే బరువు తగ్గుతారని తేలింది.

ఉష్ణోగ్రత పెరుగుతుంది

ఉష్ణోగ్రత పెరుగుతుంది

అలాగే మిరపకాయల్లోని క్యాస్పేసియన్ రసాయనం వల్లే మిర్చిని తింటే మంట పుడుతుంది. ఇది మెదడులోని హైపోథాలమస్ అనే కేంద్రాన్ని ప్రేరేపించడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

జీర్ణశక్తిని పెంచుతుంది

జీర్ణశక్తిని పెంచుతుంది

పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

జీర్ణశక్తిని పెంచుతుంది

జీర్ణశక్తిని పెంచుతుంది

పచ్చి మిరపకాయ జీర్ణశక్తిని పెంచుతుంది. అజీర్తిని తొలగిస్తుంది. పక్షవాతాన్ని తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. మిరపకాయ రుచిని కలిగించడమే కాకుండా ఆకలిని వృద్ధి పరుస్తుంది. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. దెబ్బ తగిలినపుడు కారే రక్తాన్ని కూడా తగ్గించే శక్తి కారానికి ఉంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

మిరపకాయ గింజలను నువ్వుల నూనెలో కాగబెట్టి, పూతగా రాస్తుంటే కీళ్ల నొప్పులు, నడుము నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాసు నీటిలో గులాబీ పూలు రెండు పచ్చిమిరపకాయలు ఉడికించి ఆ నీటిని పుక్కిలలిస్తే గొంతు నొప్పికి అద్భుతంగా పనిచేస్తుంది.

ఆముదంలో పచ్చి మిరపకాయలు వేసుకుని

ఆముదంలో పచ్చి మిరపకాయలు వేసుకుని

పావు కేజీ ఆముదంలో రెండు ఎండు మిరపకాయలు వేసి మరిగించి చల్లారిన తరువాత కీళ్లకు మర్థనా చేసుకుంటే నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ నూనెను ఎక్కువగా పూసి రుద్దుతుంటే బొబ్బలెక్కే ప్రమాదముంది. మితంగా వాడుకోవాలి.

పోషకాలు పుష్కలంగా ఉంటాయి

పోషకాలు పుష్కలంగా ఉంటాయి

పచ్చి మిరపకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే పచ్చి మిరపలో విటమిన్ బి6, విటమిన్ ఎ, ఐరన్, కాపర్, పొటాషియం, నియాసిన్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి మన శరీరానికి పోషణను అందిస్తాయి.

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది

జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది

పచ్చి మిరపకాయలను విత్తనాలతో సహా తింటే జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఉమ్మి ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది. పచ్చిమిరప విత్తనాల్లో ఫైటోస్టెరాల్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది.

ఇది రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. పేగుల నుంచి కొలెస్ట్రాల్ రక్తంలోకి చేరకుండా చూస్తుంది. దీంతోపాటు రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

ముక్కు దిబ్బడ ఉంటే

ముక్కు దిబ్బడ ఉంటే

దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం ఉన్నవారు పచ్చిమిరపను బాగా తీసుకుంటే ఆయా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ ఉంటే ముక్కు ద్వారాలు క్లియర్ అవుతాయి. గాలి బాగా పీల్చుకోవచ్చు.పచ్చి మిరపకాయల్లో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి చర్మ సమస్యలను పోగొడతాయి.

ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది

ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది

చైనీస్‌ వంటకాల్లో పచ్చి మిరపకు ఎనలేని ప్రాముఖ్యం ఉంది. పచ్చిమిరప తినడం వల్ల శరీరంలోని అనసవర బ్యాక్టీరియా నాశనమవుతుంది. శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది.

విటమిన్‌-ఏ పుష్కలంగా ఉంటుంది కాబట్టి కళ్లకు మేలుచేస్తుంది. చర్మం కాంతివంతం అవుతుంది.పచ్చిమిరపలో ఉండే విటమిన్‌-సీ కారణంగా విటమిన్లను శోషించుకునే గుణం శరీరానికి లభిస్తుంది.

క్యాన్సర్ నుంచి రక్షణ

క్యాన్సర్ నుంచి రక్షణ

పచ్చి మిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తాయి. దీంతో క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకూ పచ్చి మిర్చి మంచి మందులా పనిచేస్తుందట.

జీవ క్రియలు వేగవంతం

జీవ క్రియలు వేగవంతం

పచ్చి మిర్చిలో సున్నా కేలరీలుంటాయి. కానీ, అంతకు మించిన శక్తిని మన శరీరానికి అందిస్తాయి. ఇందులో ఉండే రసాయనాలు శరీరంలో జీవక్రియలను 50శాతం వేగవంతం చేస్తాయి. పచ్చి మిరపకాయలను తిన్న మూడు గంటలపాటు ఈ ప్రభావం ఉంటుంది.

గుండెకు కవచం

గుండెకు కవచం

పచ్చి మిరపకాయలు గుండెకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రమాదకరమైన అథెరోస్కెల్ రోసిస్‌ను ఇది నివారిస్తుంది. రక్తంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గిస్తుంది. మిరపలోని రసాయనాలు దమనుల్లో కొవ్వు ఏర్పడకుండా అడ్డుకుంటాయి. అంతేకాకుండా రక్తం గడ్డకట్టేందుకు దారితీసే ప్లేట్‌లెట్ల సమూహం ఏర్పడకుండా నిరోధిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటివి ధరిచేరవని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

సైనస్‌కు పరిష్కారం

సైనస్‌కు పరిష్కారం

సైనస్‌ సమస్య ఉన్నవారికి పచ్చి మిరపను మించిన ఔషధంలేదు. ముక్కులోపలి మ్యూకస్ మెంబ్రేన్లలో మ్యూకస్ ఏర్పడడాన్నే సైనస్‌గా చెబుతుంటారు. మిర్చిలో ఉండే క్యాప్సేసియన్ వల్ల మెంబ్రేన్లకు రక్తసరఫరా బాగా జరిగి, అందులో మ్యూకస్ ఏర్పడకుండా చూస్తుంది. దీంతో సైనస్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

అనేక సమస్యలకు పరిష్కారం

అనేక సమస్యలకు పరిష్కారం

రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అందుకే మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ తమ ఆహారంలో మిరపకాయను చేర్చుకోవాలి. ఐరన్‌లోపం ఉన్నవారికి కూడా మిరప మంచి ఔషధం. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మ వ్యాధుల నివారణలో ఉపయోగపడతాయి.

నొప్పి నివారిణిగా

నొప్పి నివారిణిగా

నొప్పి నివారిణిగా కూడా మిరప పనిచేస్తుంది. జీరో క్యాలేరీలు ఉండే పచ్చి మిర్చిలో ఎన్నో విటమిన్లు నిండి ఉంటాయి. అందుకే ఇప్పటి నుంచి పచ్చి మిర్చిని బాగా తినండి.

English summary

15 unbelievable health benefits of green chillies zero calories but packed with vitamins

15 unbelievable health benefits of green chillies zero calories but packed with vitamins
Story first published:Friday, May 18, 2018, 11:25 [IST]
Desktop Bottom Promotion