For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గ్రీన్ యాపిల్ రోజూ తింటే హాస్పిటల్ కు అస్సలు వెళ్లరు

ప్రతి రోజూ ఓ గ్రీన్ యాపిల్ తింటూ ఉంటే వైద్యుడితో అవసరం రాదని అంటుంటారు. గ్రీన్ యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. గ్రీన్ యాపిల్,యాపిల్, ఆపిల్.

|

ప్రతి రోజూ ఓ గ్రీన్ యాపిల్ తింటూ ఉంటే వైద్యుడితో అవసరం రాదని అంటుంటారు. గ్రీన్ యాపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయాన్ని రక్షిస్తాయి. కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. వయసు పైబడినవారిలో నాడీ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చేతులు వణకడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటి అనేక లక్షణాలు ఉంటాయి. వీటన్నిటికీ గ్రీన్ యాపిల్ తో చెక్ పెట్టవచ్చు.

ఆస్త్మా కూడా తగ్గుతుంది

ఆస్త్మా కూడా తగ్గుతుంది

యాపిల్ రసం తీసుకుంటే ఆస్త్మా కూడా తగ్గుతుందని చెపుతారు. మధుమేహ వ్యాధి రాకుండా నిరోధించే శక్తి దీనికి ఉంది. చర్మ సంబంధ ఇబ్బందులన్నిటికీ తగిన ఔషధం యాపిల్ పండు. దీనిలోని పీచుపదార్థం, లవణాలు, విటమిన్లు ప్రత్యక్షంగా కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. యాపిల్ గుజ్జును ముఖానికి రాసుకుంటే చర్మ సమస్యలు దూరమవుతాయి.

అనేక ప్రయోజనాలు

అనేక ప్రయోజనాలు

గ్రీన్ యాపిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ శుభ్రం చేయడానికి తోడ్పడుతుంది. ఇనుము, జింక్, రాగి, మాంగనీస్, పొటాషియం మొదలైన ఖనిజాలు ఈ గ్రీన్ యాపిల్ లో పుష్కలంగా ఉంటాయి.

గ్రీన్ యాపిల్ తింటే మతి మరుపు దూరం

గ్రీన్ యాపిల్ తింటే మతి మరుపు దూరం

గ్రీన్ యాపిల్ వల్ల శరీరంలోని ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి ఉపయోగ పడుతుంది. అంతేకాకుండా అధిక బరువు ముప్పును కూడ గ్రీన్ యాపిల్ తగ్గిస్తుంది. బరువు తగ్గాలి అని కోరుకునే వారికి ఇది గొప్ప ఆహారం. ఎముకల నిర్మాణానికి సాయపడుతుంది. కీళ్ల వ్యాధులను నిరోధిస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి సమస్యలను గ్రీన్‌ యాపిల్‌ తగ్గిస్తుంది.

రక్తప్రసరణ మెరుగుపడుతుంది

రక్తప్రసరణ మెరుగుపడుతుంది

గుండె జబ్బులను కూడా నివారించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చర్మ కేన్సర్ నిరోధించే గుణాలు ఇందులో ఉన్నాయి. దీనిలో విటమిన్ సి ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలకు వాటిళ్లే నష్టాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌లు కణజాల పునర్నిర్మాణం, పునరుత్తేజానికి సహాయపడతాయి. ఎముకల నిర్మాణానికి సాయపడి కీళ్ల వ్యాధులను నిరోధిస్తుంది ఈ గ్రీన్ యాపిల్.

థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి

థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి

ముఖ్యంగా థైరాయిడ్ గ్రంథి సమస్యలను తగ్గిస్తుంది. రోజూ ఒక గ్రీన్ యాపిల్ తింటే మెదడులోని ఎసిటైల్‌ కోలీన్‌ స్రావాన్ని పెంచి, న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న గ్రీన్ యాపిల్ ను తినడం ద్వారా మన శరీరంలోని అనారోగ్యాలను నివారించు కోవడమే కాకుండా ఆరోగ్య పరమైన జీవితానికి అన్ని విధాల సహకరిస్తుంది..

ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది

ఆక్సిజన్‌ స్థాయిలను పెంచుతుంది

గ్రీన్‌ యాపిల్‌లో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. అది జీర్ణవ్యవస్థని శుభ్రం చేస్తుంది. ఇనుము, జింక్‌, రాగి, మాంగనీస్‌, పొటాషియం మొదలైన ఖనిజాలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. గ్రీన్‌ యాపిల్‌లోని ఐరన్ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలు పెంచడానికి తోడ్పడుతుంది.

కొవ్వును బయటకు పంపుతుంది

కొవ్వును బయటకు పంపుతుంది

అధిక బరువు ముప్పును గ్రీన్‌ యాపిల్‌ తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వును సేకరించి, బయటకు పంపుతుంది. గుండె జబ్బులనూ నివారించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

కాలేయాన్ని రక్షిస్తుంది

కాలేయాన్ని రక్షిస్తుంది

చర్మ క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు గ్రీన్‌ యాపిల్‌లోఎక్కువగా ఉన్నాయి. దీనిలో విటమిన్‌ సి ఫ్రీ రాడికల్స్‌ ద్వారా కణాలకు జరిగే నష్టాన్ని నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు కణజాల పునర్నిర్మాణం, పునరుత్తేజానికి తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని రక్షించి, అది సక్రమంగా పనిచేసేలా సహకరిస్తాయి.

ఆకలి వేయకుంటే

ఆకలి వేయకుంటే

శరీరానికి సంపూర్ణ పోషణ అందించే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి అతి ముఖ్యమైన పోషకాలు గ్రీన్ యాపిల్‌లో పుష్కలంగా లభిస్తాయి. చాలామంది పిల్లలు ఆకలి లేదని చెప్తుంటే ఆకలి వెయ్యడం కోసం పెద్దవాళ్ళు ఏవేవో మందులు వేస్తూ ఉంటారు. ఇక మీదట అలా చెయ్యక్కర్లేదు. రోజుకి ఒక గ్రీన్ యాపిల్ పెడితే చాలు.

కొలెస్ట్రాల్ తగ్గి

కొలెస్ట్రాల్ తగ్గి

గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గి రక్త శుద్ది జరుగుతుంది. రక్త సరఫరా కూడా మెరుగుపడి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకి హాని చేసే చెడు కొలెస్టరాల్‌ని రక్తం నుంచి తొలగించి మంచి కొలెస్టరాల్ ఏర్పడేలా చేస్తుంది. తద్వారా హైబీపీ కూడా తగ్గుతుంది.

పేగులు శుభ్రపడతాయి

పేగులు శుభ్రపడతాయి

నిత్యం గ్రీన్ యాపిల్స్ తినడం వల్ల జీర్ణాశయం, పేగులు శుభ్రపడతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం దూరమయ్యి జీర్ణవ్యవస్థ చక్కగా పని చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. అందుకే షుగర్ వ్యాధితో బాధపడేవారు నిత్యం గ్రీన్ యాపిల్స్ తినాలని డాక్టర్లు చెప్తారు.

విటమిన్ సి పుష్కలం

విటమిన్ సి పుష్కలం

గ్రీన్ యాపిల్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునే తప్పనిసరిగా వారి డైట్‌లో గ్రీన్ యాపిల్ చేర్చుకోవాల్సిందే. అనవసరమైన కొవ్వు కరిగించి బరువు తగ్గడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

అందానికి కూడా

అందానికి కూడా

ఆరోగ్యంలోనే కాదు అందంలోనూ గ్రీన్ యాపిల్ పాత్ర అమోఘమనే చెప్పాలి. రోజూ గ్రీన్ యాపిల్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కళ్ల కింద ఉండే నల్లటి వలయాల్ని తగ్గిస్తుంది. శరీరానికే కాదు శిరోజాలకి గ్రీన్ యాపిల్స్ మంచి ఔషధంగా పని చేస్తాయి. జుట్టు రాలే సమస్యని దూరం చేస్తాయి.

జుట్టు పెరగడానికి..

జుట్టు పెరగడానికి..

అంతే కాకుండా నిగనిగలాడే ఒత్తైన జుట్టు రావడానికి, జుట్టు పెరగడానికి కూడా దోహదం చేస్తాయి. ఎముకలు పటిష్ఠంగా మారతాయి. కీళ్ల నొప్పులను దూరం చేస్తాయి. అంతేకాకుండా వయసు మీద పడడం వల్ల వచ్చే అల్జీమ‌ర్స్ కూడా దరిచేరదు. మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు రోజూ గ్రీన్ యాపిల్ తినడం వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందొచ్చు.

English summary

20 health benefits of green apples and why you should eat it more often

20 health benefits of green apples and why you should eat it more often
Story first published:Monday, May 21, 2018, 17:21 [IST]
Desktop Bottom Promotion