For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నువ్వుల నూనెను వంటకు ఉపయోగించినా.. మర్దన చేసుకున్నా చాలా లాభాలు

ఇప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌న వాళ్లు గానుగ‌ల్లో ఆడించిన నూనెల‌నే ఎక్కువ‌గా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. నువ్వుల నూనె ప్రయోజనాలు, నువ్వుల నూనెఉపయోగాలు

|

ఇప్పుడంటే అన్నీ రిఫైన్డ్ నూనెలు వచ్చాయి కానీ ఒక‌ప్పుడు మ‌న వాళ్లు గానుగ‌ల్లో ఆడించిన నూనెల‌నే ఎక్కువ‌గా వాడేవారు. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె కూడా ఒక‌టి. అయితే నువ్వుల్లో తెల్ల‌నివి, న‌ల్ల‌నివి అని రెండు ర‌కాలుగా ఉంటాయి. వీటి నుంచి తీసే నూనెలో ఎన్నో ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి.

పవర్ హౌజ్

పవర్ హౌజ్

వెనుకటి రోజులలో నూనెగా మార్చి పల్లెల్లో వంటలో వాడే వారు కానీ ఇప్పుడు చాలా తక్కువ మంది నువ్వుల నూనెను వాడుతున్నారు. పల్లెల్లో చాలా వంటకాలలో నువ్వులను వాడుతారు. ఈ నువ్వులను వలన మనకు చాలా ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో చాలా రకాల పోషకాలు ఉన్నాయి అందుకనే దీనిని ‘పవర్ హౌజ్' అంటారు చాలా మంది. ఇందులో చాలా రకాల విటవిన్స్ ఉంటాయి.

విట‌మిన్ ఇ

విట‌మిన్ ఇ

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్ ఇ, కాల్షియం, జింక్‌, ఐర‌న్‌, థ‌యామిన్, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో మ‌న‌కు పుష్క‌లంగా ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలో నువ్వుల నూనెను నిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరం

చ‌ర్మ స‌మ‌స్య‌లు దూరం

నువ్వుల నూనెలో విట‌మిన్ ఇ, బిలు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని సంర‌క్షించ‌డ‌మే కాదు, అన్ని ర‌కాల చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. నువ్వుల నూనెను త‌ర‌చూ వాడ‌డం వ‌ల్ల ముఖం కాంతివంత‌మ‌వుతుంది. చ‌ర్మం మృదువుగా మారుతుంది.

నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే

నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే

నిత్యం స్నానం చేసే ముందు చిన్న పిల్ల‌ల‌కు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేస్తే వారి శ‌రీర నిర్మాణం స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. మెద‌డు ప‌దునుగా మారుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగిపోతుంది. ఈ నూనెలో ఉండే పోష‌కాల‌న్నీ పిల్ల‌ల‌కు ల‌భిస్తాయి. పెద్ద‌లు కూడా స్నానానికి ముందు నువ్వుల నూనెతో మ‌ర్ద‌నా చేసుకుంటే చాలా మేలు.

వేడి చేసి మర్దరన చేసుకుంటే

వేడి చేసి మర్దరన చేసుకుంటే

నువ్వుల నూనెతో త‌ల‌కు మ‌ర్ద‌నా చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు స‌మ‌స్య పోతుంది. నువ్వుల నూనెను వేడి చేసి శ‌రీరంపై కొవ్వు ఉన్న ప్రాంతాల్లో రాస్తే అధికంగా ఉన్న కొవ్వు క‌రిగిపోతుంది.

కండీషనర్

కండీషనర్

ఎప్పుడు షాంపూలు వాడిన జుట్టు కొన్ని రోజుల తరువాతతేలిపోతుంది. అలాంటి సమయంలో మీరు నువ్వుల నూనెను జుట్టుకు పట్టిస్తే నువ్వులలోని పోషకాలు జుట్టుకు బలాన్ని ఇస్తాయి. ఇప్పుడు చాలా మంది బ్యుటీషియన్స్ నువ్వుల నూనెను కేశాలంకారణలో వాడుతున్నారు.

కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి

కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి

నువ్వుల నూనెలో ఒమెగా-3,6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి బీపీని త‌గ్గిస్తాయి. శ‌రీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వ‌ల‌ను త‌గ్గిస్తాయి. కాప‌ర్‌, ఇత‌ర ప‌వ‌ర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు నువ్వుల నూనెలో ఉంటాయి. దీంతో ఇవి కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తాయి. కొద్దిగా నువ్వుల నూనెను తీసుకుని కొంచెం వేడి చేసి మోకాళ్ల‌పై రాసుకుంటే నొప్పులు, వాపులు త‌గ్గిపోతాయి.

ఎముక‌ల‌కు దృఢ‌త్వం

ఎముక‌ల‌కు దృఢ‌త్వం

నువ్వుల నూనెలో ఉండే పోష‌కాలు ఎముక‌ల‌కు దృఢ‌త్వాన్ని ఇస్తాయి. ర‌క్త‌నాళాల‌ను శుభ్రం చేస్తాయి. శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తాయి. నువ్వులలో ఉండే జింక్ ఎముకలను దృడంగా ఉండే విధంగా చేస్తుంది.ఎముకల దృఢత్వం కోసం నువ్వులు కాల్షియం, మినరల్స్ ని పుష్కలంగా అందిస్తాయి.

ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయి తగ్గుతుంది

ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయి తగ్గుతుంది

మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు నిత్యం 2 టేబుల్ స్పూన్ల మోతాదులో నువ్వుల నూనెను ఏవిధంగానైనా తీసుకుంటే వారి శ‌రీరంలోని ర‌క్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. దీని వ‌ల్ల షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది.

గుండె పోటు నివారణ

గుండె పోటు నివారణ

నువ్వుల నూనె వాడితే గుండె పోటును నివారించవచ్చు. ఈ నూనెలో యాంటీ-అథెరోస్క్లెరోటిక్ ఉండటం వలన హృదయనాళను చురుగా పనిచేసేలా చేస్తోంది. దెబ్బలు తగిలినప్పుడు తొందరగా మానడానికి నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో మొనోశాకరైడ్ లు ఉండి చెడు కొవ్వును తొందరగా కరిగించి మంచి కొవ్వును తయారు చేస్తాయి.

కొవ్వు పదార్థాల తగ్గుదల కోసం

కొవ్వు పదార్థాల తగ్గుదల కోసం

నువ్వులు ఫైబర్ ను కలిగి ఉంటాయి వీటిని ‘లిగ్నిన్స్' అంటారు. ఈ రకమైన ఫైబర్స్ శరీరాల్లో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది. నల్ల నువ్వులలో ఉండే ఫైటోస్టేరోసిస్ కొవ్వును పోలి ఉన్న ఇది కొవ్వును తగ్గిస్తూ క్యాన్సర్ కణాలను పెరగనియ్యకుండా చేస్తుంది.

పోషణ

పోషణ

నల్ల నువ్వులు రోజు తినడం వలన శరీరంలో పేరుకుపోయిన చెడు పదార్థాలను బయటకి పంపి మన శరీరాన్ని నూతన ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ నువ్వులలో ఉండే పోషకాల వలన వయసు పెరిగిన అందం మాత్రం తగ్గకుండా చేస్తుంది.

సూర్యుని వేడి నుంచి రక్షణ

సూర్యుని వేడి నుంచి రక్షణ

నువ్వుల్లో ఉండే మూలా శక్తి వలన యూవీ కిరణాలు చర్మంపై పాడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత క్యాన్సర్ ని నల్ల నువ్వులు తొలగిస్తాయి.

మధుమేహ నివారణకు

మధుమేహ నివారణకు

నువ్వుల విత్తనాల నుంచి తీసిన నూనెలో శక్తి వంతమైన పదార్థాలు అధిక రక్తపీడనాన్ని తగ్గిస్తుంది.రక్తంలో యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను , మధుమేహ వ్యాధి గ్రస్తులలో ప్లాస్మాలోని గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.

మెగ్నీషియం శాతం ఎక్కువ

మెగ్నీషియం శాతం ఎక్కువ

నువ్వుల్లో మాంసకృత్తులు, అమినోయాసిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం శాతం కూడా అధికంగా ఉంటుంది. నువ్వుల నూనె వాడటం వల్ల అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. నువ్వులు తెల్లవి, నల్లవి ఉంటాయి.

ఐరన్ ఎక్కువ

ఐరన్ ఎక్కువ

నల్ల నువ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో రక్తహీనతతో బాధపడేవారు, బలహీనంగా ఉండేవారు ఈ నువ్వులను ఆహారంగా తీసుకుంటే మంచిది. నువ్వుల్లో సెసమాల్‌ అనే యాంటీయాక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ప్లెంటరీ పదార్థం ఉంటుంది. ఇది హుద్రోగం నుంచి కాపాడుతుంది.

మూత్ర పిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి

మూత్ర పిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి

నువ్వు మొక్కలను కాల్చి, మసి చేసి పెరుగుతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే మూత్ర పిండాల్లో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పల్లేరుకాయలు, నువ్వు పువ్వులు, తేనె సమపాళ్లలో మెత్తగా నూరి కేశాలు రాలినచోట రుద్దితే తిరిగి జుట్టు పెరుగుతుంది. నల్లనువ్వుల ముద్దలో 5వ వంతు చక్కెర కలిపి, మేకపాలతో తీసుకుంటే రక్త విరోచనాలు తగ్గుతాయి. నువ్వుల ముద్దను వెన్నతో కలపి నెల రోజులపాటు తీసుకుంటే రక్తమొలలు మాయమవుతాయి.

ముఖం తాజాగా ఉంటుంది

ముఖం తాజాగా ఉంటుంది

నువ్వుల నూనె చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. నూనె ముఖానికి రాసుకొని మర్ధన చేసుకొని, శనగ పిండితో నలుగు పెట్టి, గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల ముఖం తాజాగా ఉంటుంది. పాదాలకు పగుళ్లు ఉన్నచోట నువ్వుల నూనె రాసుకొని, సాక్సులు వేసుకుంటే పగుళ్లు తగ్గుముఖం పడుతాయి.

రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది

రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది

నువ్వుల నూనెలో ఒమేగా 3, 6, 9 ప్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి జుట్టుకు పోషణ ఇస్తాయి. నువ్వుల నూనెను తరుచూ తలకు మర్ధనచేసుకుంటే తలలో రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. తద్వారా జుట్టుకుదుళ్లు దృఢంగా తయారవుతాయి. జుట్టు పొడిబారడం, రాలడం, పలుచబడటం తదితర సమస్యలను దూరం చేస్తాయి.

టైప్ 2 డయాబెటిస్‌

టైప్ 2 డయాబెటిస్‌

నువ్వుల నూనెలో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడంలో ఇది బాగా పనిచేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

నువ్వులు దంత క్షయాన్ని పోగొడతాయి

నువ్వులు దంత క్షయాన్ని పోగొడతాయి

కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది. రక్త ప్రసరణ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. ఎముకలు, కీళ్లు బలంగా తయారయ్యేలా చేస్తుంది. నువ్వులు దంత క్షయాన్ని పోగొడతాయి. దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుంచి రక్తం కారడాన్ని తగ్గిస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. ఆయిల్ పుల్లింగ్‌కు నువ్వుల నూనె ఎంతో ఉపయోగకరం.

నిద్ర బాగా పట్టేందుకు

నిద్ర బాగా పట్టేందుకు

జలుబు ఎక్కువగా ఉంటే నువ్వుల నూనె వాసన చూస్తే చాలు, వెంటనే శ్వాస తీసుకోవడం సులువవుతుంది. శరీరంలో సోడియంను తగ్గించేందుకు నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. దీంతో బాడీ మసాజ్ చేసుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. నిద్ర బాగా పట్టేందుకు ఇది ఉపకరిస్తుంది. ఆస్తమా, లోబీపీ, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో నువ్వుల నూనె మెరుగ్గా పనిచేస్తుంది.

English summary

20 huge health benefits of sesame

20 huge health benefits of sesame
Desktop Bottom Promotion