For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భోజనం చేశాక బెల్లం ముక్క తినాలి, గోరువెచ్చని నీళ్లలో బెల్లం కలుపుకుని తాగితే ఆ శక్తి పెరుగుతుంది

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు.బెల్లంలో అనేక రకాలఔషద గుణాలున్నాయి. బెల్లం ప్రయోజనాలు, బెల్లం ఉయోగాలు, పాలు బెల్లం ఉపయోగాలు.

|

బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేద వైద్య శాస్త్రాలలో కూడా బెల్లాన్ని చాలా రకాల మందుల్లో వాడతారు. సాధారణంగా చెరుకు రసం నుంచిబెల్లాన్ని తయారుచేస్తారు. బెల్లంలో అనేక రకాలఔషద గుణాలున్నాయి.

రోజూ కాస్త బెల్లం ముక్క తినడం వల్ల రక్త శుద్ది జరిగి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా లివర్ పని తీరును మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా చూస్తుంది. బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు రోగనిరోధక శక్తిని పెంచి, ఫ్రీరాడికల్స్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. మరి ఇన్ని పోషకాలు ఉన్న బెల్లం మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం తినడం వల్ల

బెల్లం తినడం వల్ల

అధిక బరువుతో బాధపడేవారు ప్రతిరోజు 100 గ్రాముల బెల్లం తినడం వల్ల బరువుని తగ్గించుకోవచ్చు.వేసవిలో బెల్లం పానకం తాగితే శరీరం చల్లబడి వడదెబ్బ, నీరసం వంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతుంది. ప్రతిరోజు బెల్లాన్ని తినడం వల్ల ఆడవారిలో నెలసరి సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి.

రక్తపోటు

రక్తపోటు

బెల్లం మంచి ఔషధం. శరీరానికి కావలసిన ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. బెల్లం రక్తపోటును అదుపులో ఉంచుతుంది.ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో కాస్త బెల్లం కలుపుకుని తాగడం వల్ల శృంగార శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గుతుంది.

జీర్ణశక్తి బాగా పెరుగుతుంది

జీర్ణశక్తి బాగా పెరుగుతుంది

బెల్లాన్ని నువ్వులతో కలిపి తినడం వల్ల ఆస్తమా, బ్రాంకైటీస్ లాంటి సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజు మద్యాహ్నం, రాత్రి భోజనం అయ్యాక కాస్త బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి బాగా పెరుగుతుంది.

కీళ్ల నొప్పుల భాదితులు రోజూ 50 గ్రాముల బెల్లం చిన్న అల్లం ముక్కని కలిపి తినడం వల్ల ఆ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ప్రతిరోజు తాగే పాలల్లో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.

వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే

వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే

వేడి వేడి పాల‌లో కొద్దిగా బెల్లం క‌లుపుకుని తాగితే ఎలా ఉంటుంది..? టేస్ట్ అదిరిపోతుంది క‌దా..! కొంద‌రు పాలు ఇలాగే తాగుతారు. అయితే ఇలా పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే కేవ‌లం రుచి మాత్ర‌మే కాదు, మ‌న‌కు క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా పోతాయి. వేడి వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. బెల్లం, పాల‌లో ఉండే ప‌లు ర‌కాల ఔష‌ధ గుణాలు శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును త‌గ్గిస్తాయి. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు. నిత్యం తాగ‌డం వ‌ల్ల వెయిట్ అదుపులో ఉంటుంది.

ర‌క్త హీన‌త తగ్గుతుంది

ర‌క్త హీన‌త తగ్గుతుంది

నేటి త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న స‌మ‌స్య ర‌క్త హీన‌త‌. అనీమియా. దీని వ‌ల్ల శ‌రీరంలో ర‌క్తం స‌రిగ్గా ఉండ‌దు. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. పోష‌కాలు అంద‌వు. అయితే బెల్లం క‌లిపిన పాలు తాగుతుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య ఇట్టే పోతుంది. ర‌క్తం బాగా ప‌డుతుంది. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.

వెంట్రుక‌లు రాలవు

వెంట్రుక‌లు రాలవు

బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది. రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల స‌మ‌స్య‌లు, ప్ర‌ధానంగా క‌డుపునొప్పి త‌గ్గుతుంది.

ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి

ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి

బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధ‌మైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల భ‌ర‌తం ప‌డ‌తాయి. దీంతో ప‌లు ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

కీళ్ల నొప్పులు తగ్గుతాయి

వృద్ధాప్యంలో చాలా మందికి కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అయితే అలాంటి వారు రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో ఆయా నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, కీళ్లు దృఢంగా మారుతాయి.

జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌ం

జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌ం

బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగుతుంటే దాంతో జీర్ణ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి. బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి క‌చ్చితంగా ప్రతి రోజూ వీటి కాంబినేష‌న్ తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. ప్రతిరోజూ తీసుకుంటే క‌చ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

నాడీవ్యవస్థ బలోపేతం

నాడీవ్యవస్థ బలోపేతం

బెల్లంలో ఐరన్, మెగ్నీషియం లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బెల్లంలో 2.8 గ్రాముల మినరల్స్, సాల్ట్ ఉంటుంది. అదే పంచదారలో 0.3 మిల్లీగ్రాములు కూడా ఉండదు. బెల్లంలోని మెగ్నీషియం నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది. పొటాషియం కణాలలోని ఆమ్లాలని నియంత్రిస్తుంది. 100 గ్రాముల బెల్లంలో 383 కేలరీలు, 95 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 80 మిల్లీ. గ్రా కాల్షియం, 40 మిల్లీ. గ్రా. పాస్ఫరస్, 2.6మి. గ్రా ఇనుము లభిస్తాయి.

కొద్దిగా తులసి ఆకులు వేసి

కొద్దిగా తులసి ఆకులు వేసి

ఒక గ్లాసు నీటిలో బెల్లం కలిపి, అందులో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడు సార్లు తీసుకుంటే పొడి దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

కాకర ఆకులు , నాలుగు వెల్లుల్లి రెబ్బల , మూడు మిరియా గింజల , చిన్న బెల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చొప్పున వారం రోజులు తీసుకున్నా, గ్లాసు పాలలో చక్కెర బదులు బెల్లం వేసి తాగిన మహిళలకు రుతుక్రమ సమస్యలు ఉండవు.

బెల్లం, నెయ్యి కలిపి

బెల్లం, నెయ్యి కలిపి

బెల్లం, నెయ్యి కలిపి వేడిచేసి నొప్పి ఉన్నా చోట పట్టు వేస్తె నివారణ కలుగుతుంది. జలుబుతో బాధపడుతోన్న వారు పెరుగు , బెల్లం కలిపి రోజూ రెండు పూటలు తింటే తగ్గుముఖం పడుతుంది. బెల్లం , నెయ్యి సమపాళ్ల కలిపి తింటే 5 -6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.

తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లే వేసుకుంటే

తిన్న వెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లే వేసుకుంటే

కడుపులో మంటగా ఉన్నప్పుడు బెల్లం ఔషధంగా ఉపయోగపడుతుంది. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది. అందువల్ల తిన్నవెంటనే చిన్న బెల్లం ముక్క నోట్లే వేసుకుంటే సరి. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.

English summary

25 jaggery benefits ever wondered why our elders end a meal with jaggery

25 jaggery benefits ever wondered why our elders end a meal with jaggery
Desktop Bottom Promotion