For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్నే ఫ్రీ మరియు హెల్తీ స్కిన్ కోసం దాల్చినను ఈ4 విధాలుగా వాడండి

యాక్నే ఫ్రీ మరియు హెల్తీ స్కిన్ కోసం దాల్చినను ఈ 8 విధాలుగా వాడండి

|

మనమందరం దాల్చినను వంటకాలలో వాడటం జరుగుతుంది. దీని సువాసన భిన్నంగా ఉంటుంది. దీన్ని వంటకాలలో వేస్తే వంటకాల ఫ్లేవర్ మరింత పెరుగుతుంది. దాల్చిన టీ ని తీసుకోవడం ఆరోగ్యకరం. కొన్నాళ్లుగా, దాల్చినను వాడటం ద్వారా పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎంతో చర్చ జరుగుతోంది.

దాల్చినలోనున్న ఔషధ గుణాలను గుర్తించడం ప్రారంభిస్తున్నారు. దాల్చిన ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న విషయం ప్రాచుర్యం పొందుతోంది. చూడటానికి చిన్న కర్రముక్కలా ఉండే దాల్చిన ద్వారా కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే అమితాశ్చర్యం కలగక మానదు.

8 Ways You Can Use Cinnamon For Healthy, Acne-Free Skin

దాల్చిన అనేక ఇన్ఫెక్షన్స్ నుంచి అలాగే వ్యాధుల నుంచి శరీరానికి రక్షణను అందిస్తుంది. ఇది శిరోజాల సంరక్షణకు కూడా తోడ్పడుతుంది. డాండ్రఫ్ ను తొలగిస్తుంది. హెయిర్ ఫాల్ ను అరికడుతుంది. శరీరాన్నిఅనేక విధాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

ఏ విధంగా వాడటం ద్వారా ఈ అద్భుతమైన స్పైస్ నుంచి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ ను తప్పక చదవండి. దాల్చిన ద్వారా చర్మసంరక్షణను పొందండి.

1. మొటిమలను నివారిస్తుంది - దాల్చిన, తేనే మరియు నిమ్మరసం

1. మొటిమలను నివారిస్తుంది - దాల్చిన, తేనే మరియు నిమ్మరసం

దాల్చిన యాంటీ ఇంఫ్లేమేటరీ మరియు యాంటీ మైక్రో బయాల్ నేచర్ కలిగినది. ఇది యాక్నేకి దారితీసే బాక్టీరియాతో పోరాడుతుంది. చర్మంపై యాక్నే ప్రభావాన్ని తగ్గిస్తుంది. చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సేల్స్ ను తొలగిస్తుంది. అదనపు ఆయిల్ ను నిర్మూలిస్తుంది.

తేనే అనేది సహజసిద్ధమైన యాంటీ బాక్ట్రయల్ ఏజెంట్. ఇది మైక్రోబ్స్ తో పోరాడుతుంది. చర్మాన్ని మాయిశ్చరైయిజ్ చేస్తుంది. చర్మంలో సహజ నిగారింపును వెలికితీస్తుంది.

నిమ్మలో నున్న చర్మ సంరక్షణ గుణాలు చర్మాన్ని అందంగా మార్చేందుకు తోడ్పడతాయి. నిమ్మలో సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. ఇది యాక్నేతో పోరాడి చర్మంపై పేరుకుపోయిన అదనపు నూనెను తొలగించేందుకు తోడ్పడుతుంది. మీ చర్మం మరింత సున్నితమైతే నిమ్మని ఈ ప్యాక్ లో కలపకండి. లేదా నిమ్మరసాన్ని డైల్యూట్ చేసి ఈ ప్యాక్ లో జోడించండి.

కావలసిన పదార్థాలు:

• ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి

• రెండు టేబుల్ స్పూన్స్ తేనే

• అర నిమ్మకాయ నుంచి సేకరించబడిన రసం

• నీళ్లు (ఆప్షనల్ )

ఈ పదార్థాలని ఒక పాత్రలోకి తీసుకుని స్మూత్ పేస్ట్ ను తయారుచేసుకోండి. చర్మాన్ని శుభ్రపరచుకొని ఈ పేస్ట్ ను అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ ను ఇరవై నిమిషాల పాటు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రపరుచుకోండి. ఈ పద్దతిని వారంలో ఒకటి లేదా రెండు పాటించండి. ఈ ప్యాక్ ను కొన్నిసార్లు ఉపయోగించిన తరువాత, యాక్నే సమస్య తగ్గుముఖం పట్టడాన్ని మీరు గమనించగలుగుతారు.

2. ఆరోగ్యకరమైన కాంప్లెక్షన్ ను పొందటం కోసం - దాల్చిన, అరటి మరియు పెరుగు

2. ఆరోగ్యకరమైన కాంప్లెక్షన్ ను పొందటం కోసం - దాల్చిన, అరటి మరియు పెరుగు

మీ స్కిన్ కలర్ ఏదైనా సరే దాల్చినను వాడటం ద్వారా చర్మానికి ఆరోగ్యవంతమైన నిగారింపు అందుతుంది. చర్మం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

అరటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఇందులో ఇతర మినరల్స్ మరియు పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇవన్నీ చర్మానికి పోషణనిస్తాయి. చర్మంలో తేమను నిలిపి ఉంచుతాయి. మీ చర్మం పొడిబారకుండా కాపాడతాయి. అలాగే సెబాకీయాస్ గ్లాండ్స్ (చర్మంలో నూనెను ఉత్పత్తి చేసే గ్లాండ్స్) పనితీరును నియంత్రిస్తాయి.

పెరుగు నుంచి అనేక సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చు. అందువలనే, పెరుగు అనేక మగువల డైలీ బ్యూటీ రొటీన్ లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. పెరుగులో యాంటీ మైక్రోబయాల్ ప్రాపర్టీస్ కలవు. అలాగే పెరుగులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. బ్లేమిషెస్ ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యకరంగా అలాగే మృదువుగా మార్చుతుంది. పెరుగుని చర్మ సౌందర్యానికి వాడటమంటే మీరు చర్మానికి గొప్ప ట్రీట్ ఇస్తున్నారని అర్థం.

కావలసిన పదార్థాలు:

• రెండు టేబుల్ స్పూన్ల పెరుగు

• బాగా పండిన అరటిపండు ఒకటి

• ఒకటి లేదా రెండు చిటికెల దాల్చిన చెక్క పొడి

ఈ పదార్థాలన్నిటినీ ఒక పాత్రలోకి తీసుకోండి. బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని చర్మంపై అప్లై చేయండి. ఈ మిశ్రమం ఆరేవరకు అలాగే ఉండనివ్వండి. ఆ తరువాత నీటితో శుభ్రపరచండి. దాల్చిన మరియు అరటిపండులో లభించే చర్మ సంరక్షణ సుగుణాలను పొందటానికి ఈ ప్యాక్ ను ప్రయత్నించండి.

3. డార్క్ స్పాట్స్ మరియు స్కారింగ్ ను తగ్గించడానికి - దాల్చిన, అలోవెరా మరియు ఆల్మండ్ ఆయిల్

3. డార్క్ స్పాట్స్ మరియు స్కారింగ్ ను తగ్గించడానికి - దాల్చిన, అలోవెరా మరియు ఆల్మండ్ ఆయిల్

ఈ ప్యాక్ ను ఉపయోగించడం ద్వారా డార్క్ స్పాట్స్ నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే మచ్చలు తగ్గుముఖం పడతాయి. అలోవెరా ద్వారా అందే అద్భుతమైన సౌందర్య ప్రయోజనాల గురించి మీరు ఈ పాటికే తెలుసుకుని ఉండుంటారు. ఇదొక అద్భుతమైన మొక్క. ఇందులో చర్మ సంరక్షణకు తోడ్పడే విటమిన్స్ లభిస్తాయి. విటమిన్ ఈ, ఏ, సీ మరియు బీ12 కాంప్లెక్స్ లు లభిస్తాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా వ్యవహరిస్తాయి.

అనేక ఇతర ఆయిల్స్ లాగానే ఆల్మండ్ ఆయిల్ అనేది తేలికపాటి కన్సిస్టెన్సీ కలిగి ఉంటుంది. తీయటి సువాసన కలిగి ఉంటుంది. చర్మంలోకి సులభంగా ఇంకిపోతుంది. చర్మానికి లోలోతుల నుంచి పోషణను అందిస్తుంది. టాక్సిన్స్ ను అలాగే డర్ట్ ను తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్ ను తగ్గిస్తుంది. ఈ రెండిటి కాంబినేషన్ అనేది మచ్చలను ముఖ్యంగా మొటిమల మచ్చలను తగ్గిస్తుంది.

కావలసిన పదార్థాలు:

• మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్

• అర టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ (కావలసినంత)

• ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి

ఈ పదార్థాలని ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలిపి మెత్తటి పేస్ట్ ను తయారుచేసుకోండి. చర్మాన్ని శుభ్రపరచుకొని ఈ పేస్ట్ ను అప్లై చేసుకోండి. ఇరవై నిమిషాల పాటు ఈ ప్యాక్ ను తొలగించవద్దు. ఈ లోపు ఈ ప్యాక్ లోని సుగుణాలను చర్మం గ్రహిస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్రాసెస్ ను పాటిస్తే మెరుగైన ఫలితాలను పొందవచ్చు.

4. ఏజింగ్ సైన్స్ ను తగ్గించడం - దాల్చిన మరియు ఆలివ్ ఆయిల్/పెట్రోలియం జెల్లీ

4. ఏజింగ్ సైన్స్ ను తగ్గించడం - దాల్చిన మరియు ఆలివ్ ఆయిల్/పెట్రోలియం జెల్లీ

దాల్చిన ద్వారా అనేక చర్మ సంరక్షణ గుణాలను పొందవచ్చు. చర్మం అత్యంత కాంతివంతంగా మారుతుంది. ఏజింగ్ వలన చర్మంలోని కొలాజిన్ ఉత్పత్తి తగ్గుముఖం పట్టడం ప్రారంభిస్తుంది. అందువలన, ఏజింగ్ సైన్స్ కనిపిస్తాయి.

దాల్చిన అనేది కొలాజెన్ ఉత్పత్తిని పెంచడానికి తద్వారా చర్మానికి రక్తసరఫరా మెరుగవడానికి తోడ్పడుతుంది. అందువలన, ముడతలు అలాగే ఫైన్ లైన్స్ సమస్య అనేది తలెత్తదు. మీ చర్మం మరింత ఆరోగ్యవంతంగా అలాగే అందంగా తయారవుతుంది.

ఆలివ్ ఆయిల్ ద్వారా పొందే సౌందర్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం వలన అనేకమంది ఈ పదార్థాన్ని తమ బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుని అనేక ప్రయోజనాలను పొందుతున్నారు. ఇందులో, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే, ఆలివ్ ఆయిల్ లాగానే పెట్రోలియం జెల్లీ పనిచేస్తుందా?

ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తుంది. పెట్రోలియం జెల్లీ అనేది శీతాకాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చర్మం పొడిబారినప్పుడు ఏజింగ్ ప్రాసెస్ అనేది వేగవంతంగా జరుగుతుంది. చర్మం పొడిబారటాన్ని తగ్గించేందుకు పెట్రోలియం జెల్లీ తోడ్పడుతుంది.

కావలసిన పదార్థాలు

• 3 లేదా నాలుగు చుక్కల దాల్చిన నూనె లేదా అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడి

• 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు పెట్రోలియం జెల్లీ

ఈ రెండు పదార్థాలని బాగా కలిపి చర్మంపై అప్లై చేసుకోండి. దాల్చినను నూనె రూపంలో లేదా పొడి రూపంలో వాడినా పదిహేను నిమిషాల తరువాత చర్మాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ పద్దతిని వారానికి రెండు లేదా మూడు సార్ల పాటు పాటించాలి. ఏజింగ్ సైన్స్ ను తగ్గించుకోవాలి.

English summary

4 Ways You Can Use Cinnamon For Healthy, Acne-Free Skin

Cinnamon is a great flavour enhancer in the foods we eat or drink. But there's also a less-explored side of it. Cinnamon is also great for our skin! And to speak of benefits, there are not one, not two but many, out of which we're listing the 8 best uses of cinnamon to attain a healthier, glowing skin.
Story first published:Monday, July 16, 2018, 18:16 [IST]
Desktop Bottom Promotion