For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

|

ఎండాకాలం వచ్చిందంటే కొన్ని చర్మ సమస్యలు కూడా వెంట వస్తాయి. వేసవిని ఆనందంగానే స్వాగతిస్తాము. అయితే, వేసవితో పాటు వెంట వచ్చే చర్మ సమస్యలు మనల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. అందులో ముఖ్యంగా మనం సన్ బర్న్ సమస్య గురించి చెప్పుకోవాలి. ఎండలో ఎక్కువసేపు ఉండటం వలన చర్మం కమిలినట్లు మారుతుంది. దీనినే సన్ బర్న్ అనంటారు. సూర్యరశ్మిలో కొన్ని హానికర కిరణాలు చర్మాన్ని తాకడం వలన చర్మం దెబ్బతింటుంది. ఈ సమస్యను అశ్రద్ధ చేయకూడదు.

ఈ సన్ బర్న్ నుంచి ఉపశమనం పొందడానికి అనేక మార్గాలున్నాయి. ఇంట్లోనే ఉండటం, ఎండలో బయటికి వెళ్ళకపోవడం వంటివి చేయడం వలన సన్ బర్న్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, ఎండలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ ను వాడటం కూడా ఒక మార్గం. అయితే, ఎన్ని జాగ్రత్తలు పాటించినా కొన్ని సార్లు సన్ బర్న్ కి గురవడం జరుగుతుంది. అటువంటప్పుడు, సన్ బర్న్ ను ఎలా తగ్గించుకోవాలన్న విషయంపై మనం దృష్టి పెట్టాలి. సన్ బర్న్ కి గురవడం వలన చర్మం పొరలుపొరలుగా నొప్పిగా తయారవుతుంది. చర్మానికి తగిన రక్షణ అందించకపోతే స్కిన్ క్యాన్సర్ కి కూడా గురయ్యే ప్రమాదం ఉంది.

డెర్మటాలజిస్ట్ లు సూచించిన ఈ సీక్రెట్ క్యూర్స్ ని పాటిస్తే సన్ బర్న్ నుంచి విముక్తి పొందవచ్చు

సన్ బర్న్ కి సంబంధించిన సమస్యలు వెల్లడవుతున్న కొద్దీ మనం సన్ బర్న్ ను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు ముమ్మరమవుతాయి. డెర్మటాలజిస్ట్ లు సన్ బర్న్ సమస్యకు కొన్ని సీక్రెట్ క్యూర్స్ ను వెల్లడించారు. అటువంటి, ఒక సీక్రెట్ క్యూర్ మీ ఇంట్లోనే రిఫ్రిజెరేటర్ లో దాగుంది. అన్నిరకాలైన సన్ బర్న్ సమస్యలకు పరిష్కారం మీకు దొరికినట్టే.

న్యూ యార్క్ నగరానికి చెందిన డాక్టర్. జోషువా జిచ్నర్ అనే ప్రఖ్యాత డెర్మటాలజిస్ట్ తీవ్రమైన సన్ బర్న్ వలన కలిగే దుష్ప్రభావాల నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన అలాగే ఉపయోగకరమైన సొల్యూషన్ ను సూచిస్తున్నారు. ఎండాకాలంలో ఈ క్యూర్ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

సన్ బర్న్ గణాంకాలు:

సన్ బర్న్ గణాంకాలు:

1. ప్రతి వేసవిలో దాదాపు మూడొంతుల జనాభా తీవ్రంగా సన్ బర్న్ సమస్యకు గురవుతున్నారు.

2. దాదాపు సగం మంది జనాభా ఎండకు ఎక్కువగా గురవుతున్నారు. అందువలన అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు.

3. ఐదింట ఒక వంతు జనాభా హానికర సూర్యరశ్మి వలన చర్మానికి కలిగే ఇబ్బందుల గురించి అవగాహన లేమితో ఉంటున్నారు.

4. చాలా మటుకు ఎక్కువ జనాభా ఎండకు గురవడం జరుగుతోంది. అందువలన, సన్ బర్న్ సమస్యలకు వీరు గురవుతున్నారు.

5. మూడింట ఒక వంతు జనాభా డెర్మటాలజిస్ట్ ను సంప్రదించడం లేదు. సన్ బర్న్ సమస్యలకు ఇంటి వద్దే పరిష్కారాలను ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎటువంటి రెమెడీస్ పనిచేస్తాయో వీరికి అవగాహన లేకపోవటం దురదృష్టకరం.

ఉపశమనం పొందే మార్గాలు:

ఉపశమనం పొందే మార్గాలు:

కాబట్టి, సన్ బర్న్ సమస్య నుంచి మీకు ఉపశమనం లభించేందుకు మేము ఇక్కడ సులభమైన చిట్కాలను అలాగే రహస్యాలను పొందుబరిచాము. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా?

కాలం అన్ని గాయాలను తగ్గిస్తుంది. ఇది వాస్తవమే. అయినా, మన తరపు నుండి కూడా కొన్ని జాగ్రత్తలను మనం తీసుకోవాలి. న్యూయార్క్ నగరానికి చెందిన డాక్టర్, జిచ్నర్ అనే డెర్మటాలజిస్ట్ సూచనల ప్రకారం మీ ఫ్రిడ్జ్ లో అలాగే మెడిసిన్ క్యాబినెట్ లో లభ్యమయ్యే కొన్ని సర్ప్రైజింగ్ ఐటమ్స్ అనేవి సన్ బర్న్ వలన తీవ్రంగా దెబ్బతిన్న చర్మాన్ని తిరిగి మాములుగా మార్చేందుకు తోడ్పడతాయి. అలాగే, ఎండలోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ ఐటమ్స్ మీకు రక్షణగా ఉంటాయి.

ఆ సర్ప్రైజింగ్ ఐటమ్స్ లిస్ట్ ను ఇక్కడ పొందుబరిచాము. ఇవి, ప్రతి ఇంట్లో సులభంగా లభించే పదార్థాలే. ఇవి సన్ బర్న్ సమస్యకు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి.

1. చల్లటి పాలు:

1. చల్లటి పాలు:

మీ ఫ్రిడ్జ్ లో లభ్యమయ్యే చల్లటి పాలకు వేసవి కాలంలో చర్మాన్ని ఇబ్బంది పెట్టే సన్ బర్న్ సమస్యను నయం చేసే సామర్థ్యం ఉంది. పాలలో, ఎసెన్షియల్ విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ కలవు. ఇవి చర్మాన్ని ప్రశాంతబరుస్తాయి. తద్వారా, హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తాయి. సన్ బర్న్ పెయిన్ ను తగ్గిస్తాయి. చర్మంపై పెయిన్ఫుల్ ఇంఫ్లేమేషన్ ను తగ్గించి వాపును తగ్గిస్తాయి. విటమిన్స్ డి మరియు ఏ, ఎమినో ఏసిడ్స్, లాక్టిక్ ఏసిడ్ మరియు ప్రోటీన్స్ అనేవి సన్ బర్న్ ను తగ్గించేందుకు తోడ్పడి హీలింగ్ ప్రాసెస్ ను వేగవంతం చేయడానికి తోడ్పడతాయి.

2. పెరుగు:

2. పెరుగు:

సన్ బర్న్ ను తగ్గించేందుకు పెరుగును వాడమని కొంతమంది డెర్మటాలజిస్ట్ లు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే ఎంజైమ్స్ అనేవి ఎండవలన కమిలిన చర్మాన్ని హీల్ చేయడానికి తోడ్పడతాయి. త్వరగా సమస్యను పరిష్కరిస్తాయి. కాస్తంత తాజా పెరుగును ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. అప్లై చేసేటప్పుడు ఎటువంటి ఒత్తిడిని కలిగించకూడదు.

4. అలోవెరా:

4. అలోవెరా:

చర్మాన్ని హీల్ చేసేందుకు అలోవెరా అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇది సన్ బర్న్ స్కిన్ కి ఫాస్ట్ గా పెయిన్ నుంచి రిలీఫ్ ను అందిస్తుంది. ఇది చర్మాన్ని ప్రశాంతింపచేసి చర్మానికి తక్షణమే సన్ బర్న్ నుంచి రిలీఫ్ ను అందిస్తుంది. ఇది ఎన్నో నంబింగ్ ఏజెంట్స్ కంటే ప్రభావవంతమైనది. ఇందులో, సహజమైన అలాగే గొప్ప కూలింగ్ ఎఫెక్ట్స్ కలవు. ఇది, చర్మంలోకి త్వరగా ఇంకిపోతుంది. అందువలన, హీలింగ్ ప్రాసెస్ త్వరగా ప్రారంభం అవుతుంది.

5. ఐబ్యూప్రోఫెన్ లేదా మోట్రిన్ :

5. ఐబ్యూప్రోఫెన్ లేదా మోట్రిన్ :

మోట్రిన్ లేదా ఐబ్యూప్రోఫెన్ వంటి యాంటీ ఇంఫ్లేమేటరీ డ్రగ్స్ కి ఇంఫ్లేమేషన్ ని అలాగే వాపును తగ్గించి తద్వారా సన్ బర్న్ వలన కలిగే ఇరిటేషన్ ను తగ్గించే సామర్థ్యం కలదు. ఇవి చర్మాన్ని ప్రశాంతపరచి ఇంఫ్లేమేషన్ ను తగ్గిస్తాయి. అందువలన, తీవ్రమైన సన్ బర్న్ నుంచి మోట్రిన్ మీకు అత్యంత సమర్థవంతమైన రిలీఫ్ ను అందిస్తుంది. అయితే, పెయిన్ కిల్లర్స్ ని వాడటం అంత సిఫార్సు చేయదగినది కాదు. ఎందుకంటే, అవి తాత్కాలికంగా ప్రభావిత ప్రాంతాలని మొద్దుబారేలా చేస్తాయి. చర్మ సమస్యలను నయం చేసేందుకు తోడ్పడవు. అందువలన, మరింత ప్రమాదం జరగవచ్చు. ఇవి చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపవు.

English summary

5 Secret Cures Of Sunburns, As Revealed By Dermatologist

5 Secret Cures Of Sunburns, As Revealed By Dermatologist,how to treat sunburn fast, how to get rid of a sunburn fast, how to treat sunburn blisters, home remedy for sunburn itch, how long for sunburn to heal, ho
Story first published:Monday, May 21, 2018, 16:19 [IST]
Desktop Bottom Promotion