For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరం యొక్క కండరాలు తిమ్మిరెక్కడం లేదా బెణకడం లేదా పట్టేయడం జరగకుండా చేయవలసిన వ్యాయామాలు

శరీరం యొక్క కండరాలు తిమ్మిరెక్కడం లేదా బెణకడం లేదా పట్టేయడం జరగకుండా చేయవలసిన వ్యాయామాలు

|

మనలో, ఎప్పుడూ కండరాలు బెణుకడం వలన మాకు నొప్పి కలుగలేదని చెప్పుకునేవారు చాలా తక్కువగా ఉంటారు. ఇది ప్రపంచంలో అత్యంత బాధాకరమైన భావనేమి కాదని కొందరు వాదించినప్పటికిని, వాస్తవానికి కండరాలు బెణకడం వలన ఎంతో కొంత నొప్పి ఉంటుంది.

అంతేకాక, ఈ పరిస్థితిని మరీంత దిగజార్చే విషయం ఏమిటంటే , దానిని అనుభవించే వారు ఎదుర్కొనే నిస్సహాయత. నిజానికి, ఎవరు కండరాలు పట్టేయడం లేదా బెణకడం లేదా తిమ్మిరి పట్టడాన్ని ఎవరు కోరుకోరు.

5 Stretches That Aid In Preventing Cramps

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా నివారించగలిగే మిగిలిన వ్యాధుల వలె, కండరాలు పట్టేయడాన్ని నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే సరిపోదు. శారీరక దృఢత్వాన్ని మెరుగుపరచుకునేందుకు మీరు శారీరక శ్రమ స్థాయిని పెంచవలసి ఉంటుంది. కండరాల సమూహాలలో అసమతుల్యత కారణంగా కండరాల తిమ్మిరి ప్రధానంగా కలుగుతుంది.

ఒక నిర్దిష్ట కండరాల సమూహం ఇతర కండరాల కన్నా బలంగా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ఫలితంగా, బలహీనమైన కండరాల సమూహంలో పదేపదే కండరాలు పట్టేయడం జరుగుతుంది. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే, బలహీనమైన కండరాలను ఇతర కండరాల వలె బలంగా మార్చడమే!

ఈ వ్యాసం ద్వారా 5 వేర్వేరు మార్గాల్లో మీ శారీరక దృఢత్వాన్ని మెరుగుపరిచి, కండరాల తిమ్మిరిని అదుపులో ఉంచడానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాము.

1. హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచెస్:

ఇది చాలా సులభంగా చేయగలిగే ఈ వ్యాయామం, మీ సమయాన్ని ఎక్కువగా తీసుకోదు. మీరు చేయవలసినదల్లా మీ రెండుకాళ్ళు ముందుకు చాపి నిటారుగా కూర్చోవాలి. గట్టిగా ఉండే ఒక మంచం మీద కూర్చుని కూడా చేయవచ్చు. లేని యెడల నేలపై కూర్చుని కూడా చేయవచ్చు.

మీ వీపు నిటారుగా పెట్టండి. తరువాత మీ నడుమును ముందుకు ఒంచి,రెండు చేతులతో రెండు పాదాలను పెట్టుకోండి. ముడుకులను ఒంచకూడదు. మొదట్లో మీకు కష్టంగా అనిపిస్తే, చేతులను మోకాళ్ళకు ఆనించితే సరిపోతుంది. క్రమంగా పాదాలను పట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. కండరాల తిమ్మిరిని నిరోధించడానికి అత్యంత సమర్థవంతమైన వ్యాయామాలలో ఇది ఒకటి.

2. హ్యామ్ స్ట్రింగ్ స్టాండింగ్ స్ట్రెచెస్:

ఇది ఇంతకు ముందు చెప్పుకున్న వ్యాయామాన్ని పోలి ఉంటుంది. కానీ ఈ వ్యాయామం చేయడానికి ఏదైనా ఆధారం అవసరం. ఒక కుర్చీని గోడకు ఆనించి, ఈ వ్యాయామాన్ని ప్రారంభించండి. కుర్చీ లేనప్పుడు, మంచంను ఉపయోగించవచ్చు. కుర్చీ లేదా మంచం ముందు నిలబడి, మీ కుడి మడమను దానిపై ఉంచండి.

ఇది మీ కాలు నిటారుగా ఉండేలా చేయడానికి ఇది సహాయపడుతుంది. మీ ఎగువ శరీరం నిటారుగా ఉంచి, మీ ఎడమ మడమ నేలకు ఆనించి ఉంచి, మీ శరీరాన్ని నడుము వద్ద వంచండి. 10-15 సార్లు ఈ వ్యాయామంను పునరావృతం చేయండి.

3. లుంజ్ స్ట్రెచెస్:

మీ రెండు పాదాలు కలిసి ఉండే విధంగా నిలబడండి. ఇప్పుడు ముందుకు ఒక పెద్ద అంగ వేయండి. మీ కాళ్లను వీలైనంత దూరంగా ఉండేటట్టు నిర్ధారణ చేసుకోండి. తరువాత మీ రెండు మోకాళ్ళను ముందుకు వంచి, కాళ్ళని త్వరగా మారుస్తూ కదలండి. వెనుకకు ఉండే కాలును ఎటువంటి వంపు లేకుండా పూర్తిగా నిటారుగా ఉంచాలి మరియు పాదాన్ని నేలపై గట్టిగా ఆనించి ఉంచాలి.

మీ ఎగువ శరీరం యొక్క వ్యాయామం కోసం, ముందుగా మీ రెండు చేతులను నేలమీద ఉంచండి. ఒక చేతిని, ఒక వైపు శరీరంతో పాటుగా పైకప్పు వైపుగా చాచాలి. ఈ వ్యాయామాన్ని చేయాలనుకున్నప్పుడు, ఒక్కొవైపుగా కనీసం 10 సార్లు చేయండి.

4. స్టాండింగ్ కాఫ్ స్ట్రెచ్

ఒక గోడ ఎదుర్కోంటూ నిల్చుని, మీ అరచేతులను దానిపై ఉంచండి. అలా చేస్తున్నప్పుడు, మీ చేతులు సాధ్యమైనంత చాచి ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మీ మోకాలు వంచి, మీ కుడి కాలును ముందుకు చాచండి. ఈ సమయంలో మీ ఎడమ కాలును వెనక్కి నిటారుగా చాచాలి.

ఇప్పుడు మీరు మీ కుడి మోకాలిని మడుస్తు, ముందుకు వంగుతూ గోడను నెట్టే ప్రయత్నం చేయాలి. ఈ భంగిమలో 30 నుండి 40 సెకన్ల వరకు ఉండి, తిరిగి నిటారుగా నిలబడాలి. ఇలా కనీసం వారానికి, 4 నుండి 5 రోజుల పాటు, రోజుకు 3 నుండి 5 సార్లు చేయండి.

5. 90/90 స్ట్రెచ్

ఈ స్ట్రెచ్ ను శరీరాన్ని లంబకోణంలో ఉంచి చేయాలి. కుడి మోకాలిని 90 డిగ్రీల కోణంలో ఒంచి, పిక్క కండరాలను శరీరానికి లంబకోణంలో పెట్టాలి. ఎడమ కాలిని నేలపై ఆనించి ఉంచి, కుడి పాదం వద్ద వంచాలి. ఈ భంగిమలో, ఎడమ మోకాలుని శరీరానికి ఎడమ వైపుగా కదిపి, మీ వీపును చూస్తున్నట్టుగా ఉంచాలి.

English summary

5 Stretches That Aid In Preventing Cramps

There are very few of us who can claim to have never had any form of muscle cramps at all. While some of you may argue that this is not the most painful feeling in the world, the fact is that there is indeed some amount of pain associated with the same.
Desktop Bottom Promotion