For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాలాకాలంపాటు మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు తప్పనిసరి

By Deepthi T A S
|

క్రమం తప్పకుండా నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం మీ నవ్వును ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతుంది. మంచి ఆత్మవిశ్వాసం నుంచి, కెరీర్ వరకు, ఆరోగ్యవంతమైన పళ్ళు మీ మనస్సులో సానుకూలతను పెంచి, నోటి ఆరోగ్యమే కాదు శరీరం మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అదృష్టవశాత్తూ, మీ ముత్యాల్లాంటి పళ్ళను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులు సింపుల్ వి.

how to keep your teeth healthy

1. రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకోవాలి

అవును, మీరు రోజుకి రెండుసార్లు పళ్ళు తోముకోవాలి
రోజువారీ దంత సంరక్షణ రొటీన్లో భాగంగా పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యమైనది. పళ్ళు చిగుళ్ళను కలిసే చోట ముఖ్యంగా శుభ్రం చేయటం వలన చిగుళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి, అలాగే పైవైపు శుభ్రం చేయటం వలన పళ్ళు పుచ్చిపోకుండా ఉంటాయి. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ రోజుకి రెండుసార్లు మెత్తని పళ్ళున్న బ్రష్ తో తోముకోమని సూచిస్తోంది. అలాగే బ్రష్ పై ముళ్ళు అరిగిపోతే 3-4నెలలకోసారి బ్రష్ ను మార్చటం వలన మంచి నోటి ఆరోగ్యం ఉంటుందని తెలిపింది.

2. సరైన టూత్ పేస్టును ఎంచుకోండి

ఈరోజు షాపుల్లో అనేకరకాల టూత్ పేస్టులు దొరుకుతున్నాయి. కానీ మీకు సరిపోయే టూత్ పేస్టును ఎంచుకోడానికి, మీ నోటి ఆరోగ్యానికి అవసరాలు ఏంటో ముందు ఆలోచించండి.3 ఉదాహరణకి మీకు సున్నితమైన పళ్ళు ఉంటే, మామూలు పేస్టుకన్నా జివ్వుమనటాన్ని తగ్గించే పేస్టును వాడితే ఎక్కువ ఉపశమనం అంది పళ్ళు సురక్షితంగా ఉంటాయి.

3. బ్రష్ చేయటంతో పాటు పురిపెట్టిన దారంతో ఫ్లాసింగ్ కూడా ముఖ్యమే

మీ పళ్ళ మధ్య శుభ్రపర్చటం వలన కావిటీలు నివారించబడి, గారను తొలగిస్తాయి. పురిపెట్టిన దారంతో పళ్ళ మధ్య శుభ్రపర్చే ఫ్లాసింగ్ టూత్ బ్రష్ చేరలేని చోట్లకి కూడా చేరి శుభ్రపరుస్తుంది. పళ్ళ మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాలు,గారను అది తొలగిస్తుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ రోజుకి ఒకసారి ఫ్లాసింగ్ చేసుకోమని సూచిస్తోంది.

4. దంతక్షయానికి ముఖ్య అపరాధి- చక్కెరే

ప్రతి వయస్సులో దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోటానికి మంచి పోషకాహార డైట్ పాటించడం అవసరం. కానీ చక్కెర ఉండే పదార్థాలు పళ్ళు క్షీణించుకుపోవటానికి అసలు కారణాలుగా తెలిసింది. నోట్లోని బ్యాక్టీరియా సింపుల్ చక్కెరలను విఛ్చిన్నం చేసినప్పుడు పంటి మీద ఎనామెల్ పొరను తొలగించే శక్తి ఉన్న యాసిడ్లను ఉత్పత్తి చేస్తాయి. ఇదే దంతక్షయానికి కారణం. అందుకని యాసిడ్లు ఎక్కువ ఉండే ఆహారం మరియ డ్రింక్స్ కి (ఉదాహరణః సోడాలు) దూరంగా ఉండండి.

5. క్రమం తప్పకుండా డెంటిస్ట్ చెకప్ కి వెళ్ళండి

చాలామటుకు అన్ని నోటి ఆరోగ్యసమస్యలు చివరి స్టేజీలకి వెళ్ళేదాకా లక్షణాలు చూపించవు కాబట్టి, మీరు కనీసం 3-6నెలలకొకసారి డెంటిస్ట్ ను కలవండి. అలాగే క్రమం తప్పకుండా డెంటల్ పరీక్షలు చేయటం వలన చిగుళ్లలో వ్యాధులు, నోటి క్యాన్సర్ ప్రాథమిక లక్షణాలు, పంటిగాట్లు వంటివి తెలుస్తాయి.

English summary

5 Ways To Keep Your Teeth Healthy For Long

Regular oral care is a prime component in keeping your smile healthy and bright. From greater self-confidence to a soaring career, healthy teeth can truly transform the positivity of your mind-set and improve the health of not only your mouth but also your body.
Desktop Bottom Promotion