For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారపదార్ధాలు !

|

తాజా పండ్లను & కూరగాయలను తినడం వల్ల మీ మానసిక ఆరోగ్యాన్ని పెరుగుతుందని, న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీ నిర్వహించిన కొత్త పరిశోధనలో బయటపడింది. వండిన, తయారుగా చేసిన & ప్రాసెస్ చేయబడిన ఆహారాల కంటే ముడి ఆహార పదార్ధాలు మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆర్టికల్‌లో, పచ్చి పండ్లను & కూరగాయలను తినడం వల్ల మీ మానసిక ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనవని నేర్చుకుంటారు.

ముడి ఆహార ఉత్పత్తులు ఏ విధంగా తయారు చేయబడి, వినియోగించబడిందో కూడా ఈ పరిశోధన సూచిస్తుంది, అలాగే వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవాలి, ఎందుకంటే అవన్నీ కూడా మీ మానసిక ఆరోగ్యానికి ప్రత్యేకంగా వర్తించేవి కాబట్టి !

ఈ అధ్యయనం యువకులపైన మాత్రమే జరిగింది, ఎందుకంటే వీరు తాజా పండ్లను & కూరగాయలను అతి తక్కువ మోతాదులో వినియోగించడం వల్ల అవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే అధిక ముప్పును కలిగి ఉన్నాయి.

నిద్ర, వ్యాయామం, జెండర్, అనారోగ్యకరమైన డైట్, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులు వంటి అంశాలతో పాటు - మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే జీవనశైలి విధానాలను; అలాగే మీరు తినే తాజా (లేదా) వండిన పండ్లు & కూరగాయల డైట్‌తో పాటు, వారి అనుకూల - ప్రతికూల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇతర కారకాలన్నిటినీ ఈ సర్వేలో భాగంగా పరిగణలోనికి తీసుకోబడ్డాయి.

ముడి పండ్లు & కూరగాయలను తినడం వల్ల వీరిలో డిప్రెషన్ లక్షణాలు తక్కువగా ఉంటూ, అధిక మానసిక సంతృప్తిని కలిగి, సానుకూలమైన మానసిక దృక్పధాన్ని అధికంగా కలిగి ఉంటూ, మీ రోజువారీ జీవితంలో ఆచరించబడే పనితో నిమగ్నమైన కార్యాచరణలతో సంబంధం కలిగి ఉన్నట్లుగా చెప్పటిన అధ్యయనంలో కనుగొనబడింది.

మీ మానసిక ఆరోగ్యాన్ని సంరక్షించే అత్యుత్తమమైన ఆహారపదార్థాలను ఈ క్రింది జాబితాలో సూచించబడ్డాయి. అవి

క్యారెట్లు :

క్యారెట్లు :

క్యారట్లను అనేవి మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచి, మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తాయి. క్యారట్లలో ఉండే బీటా-కెరోటిన్ అనే సమ్మేళనం మంచి మానసిక ఆరోగ్యంతో సంబంధమును కలిగి ఉంది. ఇది మీ మెదడు పనితీరులో సానుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో సంచరించే రాడికల్స్ నుంచి మీ శరీర కణాలు నష్ట పోకుండా కాపాడుతుంది, శరీర రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది, అలాగే మీ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది & గుండె జబ్బులు వచ్చే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది.

అరటి :

అరటి :

ఇది కూడా మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించే రసాయనాలను శరీరంలో ఉత్పత్తి చేస్తున్నందున అరటి అనేది మీ మానసిక ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిలో ఉండే పొటాషియం మీ మెదడుకు సందేశాలను చేరవేసేందుకు ఎక్కువ సహాయకారిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మీ నరాల పనితీరు కోసం అవసరమైన పోషకాలను అందించడం ద్వారా ప్రపంచంలోని అత్యంత ఖ్యాతిని పొందిన ఆహారమని చెప్పవచ్చు. చేయవలసిన ఆ విషయాలపై దృష్టిని కేంద్రీకరించడం, జ్ఞాపకశక్తిని కలిగి ఉండటం వంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్‌కు మద్దతునిస్తూ - మీ మానసిక స్థితిని, ఆకలిని ఎల్లప్పుడూ నియంత్రించడం ద్వారా మెదడు సహాయం చేస్తుంది.

ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఆపిల్‌పై ఉన్న తొక్క & దాని గుజ్జు మంచి మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో బాగా ప్రసిద్ధి చెందింది. ఆపిల్ రసం, వయస్సు పైబడిన వారిలో సంభవించే మానసిక రుగ్మతకు సంభావ్యకారకమైన ప్రయోజనాలను కలిగి ఉండవచ్చు. ఇది మెదడు కణజాలాన్ని దెబ్బతీసే హానికరమైన రియాక్టివ్ ఆక్సిజన్ తీవ్రతను తగ్గించడంలో సహాయపడి మీ మానసిక రుగ్మతను తగ్గిస్తుంది. వయస్సుతో పాటు క్షీణించే న్యూరోట్రాన్స్మిటర్, అసిటైల్‌కోలిన్‌ను కాపాడడానికి ఆపిల్ సహాయపడుతుంది, తక్కువ స్థాయిలో వుండే అసిటైల్కోలిన్ అల్జీమర్స్ వ్యాధితో ముడిపడి ఉంటుంది.

బచ్చలికూర (పాలకూర) :

బచ్చలికూర (పాలకూర) :

ముదర ఆకుపచ్చని రంగులో ఉండే బచ్చలికూరలో ఉండే అధిక ఫోలేట్‌లో మీ మెదడుకు స్నేహపూర్వకమైనవిగా ఉంటాయి. బచ్చలికూర మీలో మానసిక స్థైర్యాన్ని, స్వల్పకాలిక జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఫోలేట్ లోపం వల్ల అధిక ఒత్తిడి, అలసట & నిద్రలేమికి కారణం కాగలదు. ఉడికించిన బచ్చలికూరను రోజువారీ ఆహారంలో ప్రధాన భాగంగా చేసుకోవడం వల్ల పరిస్థితులకు అనుగుణంగా సమాచారాన్ని త్వరగా ప్రాసెస్ చేయడంలో - మీ ఆలోచన స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

ఆమ్ల ఫలాలు :

ఆమ్ల ఫలాలు :

నారింజ, లెమన్స్, లైమ్స్, మండరైన్స్, ద్రాక్షపండు, పోమోలో వంటి సిట్రస్ పండ్లు మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మంచివి. సిట్రస్ పండ్లలో ఉన్న ఫ్లేవానాయిడ్లు పార్కిన్సన్ & అల్జీమర్స్ వ్యాధులకు కారణమైన న్యూరోడెనెనరేటివ్ లక్షణాలను తొలగించవచ్చు. వీటిలో ఉండే ఫ్లేవానాయిడ్స్ మీ నాడీవ్యవస్థను విచ్చిన్నం చేసే కారకాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ సామర్థ్యాలను కూడా కలిగి ఉన్నాయి. సిట్రస్ పండ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, అందువలన న్యూరోడెనెనరేటివ్ రుగ్మతల నుంచి మీ మెదడును కాపాడవచ్చు.

దోసకాయ :

దోసకాయ :

దోసకాయ అనేది ఒక రిఫ్రెషింగ్ సమ్మర్ ఫుడ్. ఇది ఫిసటిన్ అని పిలవబడే యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఫ్లేవనోల్ను కలిగి ఉంటుంది, అది మెదడు ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దోసకాయలు మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి, అలాగే వయస్సు సంబంధిత రుగ్మతల నుంచి మీ నరాల కణాలను రక్షించడంలో సహాయపడతాయి, అంతేకాకుండా పురోగమన జ్ఞాపకశక్తిని, అభ్యాస వైఫల్యాలను వంటి వాటిని కూడా నిరోధిస్తుంది.


English summary

6 Foods To Boost Your Mental Health

Eating raw fruits and vegetables could boost your mental health, suggests new research finding carried out by the University of Otago, New Zealand. Eating raw fruits and vegetables was associated with fewer depressive symptoms, higher life satisfaction and positive mood. The foods for mental health are carrots, spinach, lettuce, grapefruit, berries, bananas, etc.
Story first published:Friday, April 27, 2018, 14:51 [IST]
Desktop Bottom Promotion