For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలబద్దకంను తరిమికొట్టే పండ్లను గురించి మీకు తెలుసా!

మలబద్దకంను తరిమికొట్టే పండ్లను గురించి మీకు తెలుసా!

|

మీ ప్రేగులలోని కదలికలు సక్రమంగా లేవా? అయితే, మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారు. 22 శాతం మంది భారతీయులు మలబద్ధకంతో బాధపడుతున్నారు. మలబద్ధకం వివిధ కారణాల వలన సంభవించవచ్చు. సాధారణంగా జీర్ణ వ్యవస్థలోని ఆహారం యొక్క కదలికలు నెమ్మదించిన ఫలితంగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఈ వ్యాసం ద్వారా, మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడానికి, ఏ పండ్లను తినాలో తెలుసుకోండి.

8 Fruits To Relieve Constipation

మలబద్ధకం ఎందువలన సంభవిస్తుంది?

విసర్జకాల నుండి పెద్దప్రేగు ఎక్కువగా నీటిని గ్రహించినప్పుడు, మలబద్దకం కలుగుతుంది. పెద్దప్రేగుల కండరాలలోని సంకోచాలు నెమ్మదించినప్పుడు, మలంలోని కదలికలు కూడా నెమ్మదించి, మరింత నీటిని కోల్పోతుంది.

అసంపూర్ణ ఆహారం, డీహైడ్రేషన్, మందులు, అనారోగ్యం, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే వ్యాధులు మలబద్ధకం కలగడానికి కొన్ని కారణాలు. మలబద్ధకం ఉన్న వారిలో విసర్జకాలు గట్టిపడి, ప్రేగుల్లో అడ్డుగా మారి, శరీరం నుండి వెలుపలకు నెట్టబడటంలో ఇబ్బంది ఏర్పడుతుంది.

అదృష్టవశాత్తూ, కొన్ని పండ్లు విసర్జకాలను మృదువుగా మలచడం ద్వారా మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ప్రేగులలోంచి మాల్ బయటపడే సమయాన్ని తగ్గించి, స్టూల్ ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. మలబద్ధకంను నయం చేసే పండ్లను గురించి తెలుసుకోవడానికై ఈ వ్యాసాన్ని చదవండి.

కివి పండ్లు

కివి పండ్లు

ఒక అధ్యయనం ప్రకారం, నాలుగు వారాలపాటు ప్రతిరోజు తప్పనిసరిగా కివి పండు తినేవారిలో మెరుగైన ప్రేగు కదలికలు ఉన్నాయని తేలింది. ఇది మలాన్ని మృదువుగా చేసి పరిమాణాన్ని పెంచుతుంది. కివిలోని ఆక్టినిడైన్ అనే ఎంజైము, ప్రేగుల్లోని కదలికలను మెరుగుపరుస్తుంది.

యాపిల్స్:

యాపిల్స్:

యాపిల్స్ లో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. దీనిలో సుమారు 1.2 గ్రా కరిగే పీచుపదార్ధం మరియు 2.8 గ్రా కరగని పీచుపదార్ధం ఉంటుంది. కరిగే పీచుపదార్ధం ఎక్కువగా పెక్టిన్ అనే ఆహార పీచుపదార్ధం రూపంలో ఉంటుంది. పెక్టిన్ ను ప్రేగుల్లోని బాక్టీరియా పులియబెట్టడం వలన చిన్న-గొలుసు కొవ్వు ఆమ్లాలు ఏర్పడి, పెద్ద ప్రేగుల్లోని నీటిని బయటకు వెలికి తీస్తాయి. ఈ నీటిని శోషించడం ద్వారా మలం మృదువుగా మారి, ప్రేగుల్లో నుండి బయటపడే సమయం తగ్గుతుంది. ఈ విధంగా ఇది ఒక విరేచనకారిగా పనిచేస్తుంది.

అంతేకాకుండా, జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పియర్స్

పియర్స్

పియర్స్ లో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. ఒక మధ్యస్థ పరిమాణం కలిగిన పియర్ లో, 5.5 గ్రా పీచుపదార్ధం ఉంటుంది. ఇది దైనందిన వినియోగానికి సిఫార్సు చేయబడిన పీచుపదార్ధం పరిమాణంలో 22%గా ఉంది.

ఫ్రక్టోజ్ మరియు సార్బిటాల్ సమృద్ధిగా ఉన్నందున, పియర్స్ మలబద్దకమును తగ్గించటంలో సహాయపడతాయి. ఫ్రక్టోజ్ పెద్దప్రేగులోకి చేరి, ఓస్మోసిస్ ద్వారా నీటిని గ్రహించుకుంటుంది. దీనిమూలంగా, ప్రేగులలో కదలికలు ప్రేరేపింపబడతాయి.

మరోవైపు, సార్బిటాల్ ప్రేగులచే సక్రమంగా శోషించబడదు కనుక విరేచనకారిగా పనిచేసి, పెద్దప్రేగులోకి నీటిని విడుదల అయ్యేట్టుగా చేసి, ప్రేగులలోని కదలికలను ప్రేరేపిస్తుంది.

మలబద్ధకం నుండి సత్వర ఉపశమనం పొందడానికి, పియర్ రసం తాగడం ఉత్తమం.

నారింజ పండ్లు:

నారింజ పండ్లు:

నారింజ పండ్లలో విటమిన్ సి మరియు పీచుపదార్ధం సమృద్ధిగా ఉంటాయి. ఇవి మలం యొక్క పరిమాణంను పెంచుతాయి. ఒక నారింజ పండులో 3.1 గ్రా పీచుపదార్ధం కలిగి ఉంటుంది. ఇది రోజువారీ వినిమాయానికి సిఫార్సు చేయబడిన పీచుపదార్ధంలో 13% ఉంటుంది.

కొన్ని అధ్యయనాల ప్రకారం, నారింజలలో ఉండే నారింజెనిన్, అనే ఒక ఫ్లేవోనోయిడ్ విరేచనకారిగా పని చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వారి అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ విభాగం చేసిన అధ్యయనాల ప్రకారం, నారింజ తొనల మధ్య ఉన్న తెల్లని నార వంటి పదార్ధం తినడం వల్ల మన శరీరానికి అవసరమైన పీచుపదార్ధం చాలా వరకు లభిస్తుంది.

రసం రూపంలో తాగడం కంటే, నారింజ పండును తినడం మంచిది.

అత్తి పండ్లు లేదా అంజీర్:

అత్తి పండ్లు లేదా అంజీర్:

అంజీర్ మలబద్ధకంను నయం చేసే, మరొక పండు. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండే అంజీర్ లో 1.6 గ్రా పీచుపదార్ధం ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన ప్రేగు కదలికలు ప్రోత్సహిస్తుంది. పరిశోధకులు కనుగొన్నదాని ప్రకారం, అధిక పీచుపదార్ధం ఉన్నందున అంజీర్ ప్రేగులకు పోషణనిచ్చి, సహజ విరేచనకారిగా పనిచేస్తుంది.

పీచుపదార్ధం అధికంగా ఉన్నందున, మీ అల్పాహారంలో తృణధాన్యాలతో పాటుగా, ఎండబెట్టిన అంజీర్ పండ్లను తీసుకోండి.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

పండిన అరటిపండ్లు విస్తృతంగా వినియోగింపబడతాయి. ఇవి మలబద్ధకంను తగ్గిస్తాయనే అనే ఖ్యాతిని గడించాయి. వీటిలో పీచుపదార్ధం అధికంగా ఉన్నందున, ఇవి మలబద్ధకం నివారించడంలో సహాయపడతాయి. అరటిపండులో ఉన్న పీచుపదార్థం పెద్ద ప్రేగు నుండి నీటిని గ్రహిస్తుంది. దీని వలన మలం మృదువుగా మారుతుంది. మీ జీర్ణ వ్యవస్థ గుండా మలం యొక్క కదలికలను మరింత మెరుగుపరుస్తుంది.

English summary

6 Fruits To Relieve Constipation

Constipation happens when the colon absorbs too much water. This occurs when the muscles in the colon contract slowly, causing the stool to move slowly and lose more water. Poor diet, dehydration and medication cause constipation. Fruits that help in constipation are berries, banana, orange, apples, figs, kiwi fruit, pears, and prunes.
Desktop Bottom Promotion