For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ దాల్చినచెక్క నీళ్ళు తీసుకోవాలనడానికి గల 6 ప్రధాన కారణాలు !

ప్రతిరోజూ దాల్చినచెక్క నీళ్ళు తీసుకోవాలనడానికి గల 6 ప్రధాన కారణాలు !

|

ప్రత్యేకమైన సువాసన మరియు రుచి దాల్చిన చెక్కకు ఉండే ప్రధాన లక్షణాలు. వంటగదిలోని ప్రధానమైన సుగంధ ద్రవ్యాలలో దాల్చిన చెక్క మొదటి వరుసలోనే ఉంటుంది.

దాల్చిన చెక్క, ప్రధానంగా అనామ్లజనకాలు మరియు యాంటీ బయాటిక్ లక్షణాలతో నిండుకుని ఉంటుంది.

దాల్చిన చెక్కతో కూడిన నీరు రోజూవారీ వినియోగంలో భాగంగా తీసుకుంటున్న ఎడల, అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని చెప్పబడింది.

6 Reasons Why You Should Be Drinking Cinnamon Water Daily

ఈ ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యం, ప్రసిద్ధమైన ఔషధ లక్షణాలతో కూడి, విస్తృతమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిని ప్రధానంగా మన దేశంలో అనేక రకాల సాంప్రదాయక వంటకాల్లోనే కాకుండా స్వీట్స్, మరియు తృణధాన్యాలతో కూడిన అల్పాహారం, స్నాక్స్ మరియు బేక్డ్ పదార్ధాలలో వినియోగించడం పరిపాటిగా ఉంటుంది. ఇది వివిధ రకాల ప్రతిక్షకారుణులు మరియు యాంటీ బయాటిక్ లక్షణాలతో లోడ్ చేయబడి ఉంటుంది. దాల్చిన చెక్కలోని అన్నిరకాల మంచి లక్షణాలను శరీరానికి అందించేందుకు, సూచించదగిన ఉత్తమమైన మార్గాలలో ఒకటి, నీటిలో నానబెట్టి క్రమం తప్పకుండా తీసుకోవడం. పలువురు ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం, దాల్చిన చెక్కను నానబెట్టిన నీటిని తీసుకోవడం ద్వారా అసంఖ్యాకమైన వైద్య లక్షణాలను శరీరానికి అందించవచ్చునని చెప్పబడింది.

రోజువారీ వినియోగంలో భాగంగా దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను ఇక్కడ పొందుపరచబడ్డాయి.

గమనిక: మధుమేహ రోగులు దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని తీసుకునే ముందుగా వారి వైద్యులను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది, ఇది తీయగా ఉండడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచగలిగే లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.

ప్రతిరోజూ దాల్చినచెక్క నీళ్ళు తీసుకోవాలనడానికి గల 6 ప్రధాన కారణాలు !

1. PCOS యొక్క ప్రభావాలను తగ్గించడంలో సహాయపడవచ్చు :

1. PCOS యొక్క ప్రభావాలను తగ్గించడంలో సహాయపడవచ్చు :

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ లేదా పిసిఒఎస్ అనేది హార్మోన్ల రుగ్మతగా ఉంటుంది. అండాశయాల బాహ్యపుటంచులలో చిన్న చిన్న తిత్తులు విస్తరించడం మూలంగా ఈ సమస్య ఏర్పడుతుంది. PCOS అవేర్నెస్ అసోసియేషన్ ప్రకారం, దాల్చిన చెక్కను నానబెట్టిన నీటిలో, తేనెను కలిపి తీసుకోవడం ద్వారా, PCOS ప్రభావాలను తగ్గించడంలో సహాయపడవచ్చు. జర్నల్ ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, దాల్చిన చెక్క నీరు PCOS సమస్యతో భాదపడుతున్న మహిళల్లో ఇన్సులిన్ లోపం కూడా క్రమబద్దీకరించబడినట్లు తెలిపింది.

2. రోగనిరోధక శక్తి తత్వాలు పెరుగుతాయి :

2. రోగనిరోధక శక్తి తత్వాలు పెరుగుతాయి :

ఆశ్చర్యకరంగా, దాల్చిన చెక్కతో కూడిన ఈ ద్రావణం, అనామ్లజనకాలతోపాటు, పాలిఫేనోల్స్ మరియు ప్రొయాంధోసియానిడిన్లలో సమృద్ధిగా ఉంటుంది. ఇవి రోగనిరోధక వ్యవస్థ పెరిగేలా దోహదం చేస్తాయి. దాని యాంటివైరల్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు శ్వాసకోశ రుగ్మతలు, గుండె సమస్యలు, మొదలైన వివిధ ఆరోగ్య సమస్యల అభివృద్ధి అవకాశాలు తగ్గిస్తాయి.

3. ఋతుస్రావం తిమ్మిర్లను వ్యవహరించడంలో సహాయపడుతుంది :

3. ఋతుస్రావం తిమ్మిర్లను వ్యవహరించడంలో సహాయపడుతుంది :

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, దాల్చిన చెక్కను తరచుగా ఉపయోగించే మహిళలు తక్కువ ఋతుస్రావం నొప్పిని అనుభవిస్తున్నారని తేలింది. అదికూడా తక్కువ వ్యవధిలోనే ఈ ఫలితాలను చూడడం జరిగింది. ఒక కప్పు గోరు వెచ్చని దాల్చిన చెక్క నీటిని ప్రతి రోజూ తీసుకోవడం మూలంగా ఋతుస్రావం సమయంలో తిమ్మిరి యొక్క ప్రభావాలను తగ్గిస్తుందని చెప్పబడింది.

Most Read:మైగ్రేన్ సమస్యతో భాదపడుతున్నారా? అయితే మైగ్రేన్ నొప్పితో సంబంధం ఉండే ఈ వ్యాధుల గురించి తెలుసుకోవడం అవసరం. Most Read:మైగ్రేన్ సమస్యతో భాదపడుతున్నారా? అయితే మైగ్రేన్ నొప్పితో సంబంధం ఉండే ఈ వ్యాధుల గురించి తెలుసుకోవడం అవసరం.

4. ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుంది :

4. ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుంది :

ఇది పూర్తి స్థాయిలో ఇంకనూ నిరూపించబడలేదు, కానీ తరచుగా దాల్చిన చెక్క నీటిని తీసుకోవడం మూలంగా ఆకలిని తగ్గించడంతో పాటు, ఆహారం మీదకు మనసు వెళ్ళకుండా నిరోధించడాన్ని గమనించడం జరిగింది. క్రమంగా బరువు తగ్గడంలో ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది.

5. మంట లేదా వాపు సమస్యలను(ఇన్ఫ్లమేషన్) తగ్గించడానికి :

5. మంట లేదా వాపు సమస్యలను(ఇన్ఫ్లమేషన్) తగ్గించడానికి :

ఉమ్మడి నొప్పి (జాయింట్ పెయిన్స్) లేదా కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నవారు ఉపశమనం కోసం దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని తీసుకోవలసినదిగా సూచించడం జరుగుతుంది. మితిమీరిన నొప్పిని తగ్గించటానికి సహాయపడే శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ది చెందిన దాల్చిన చెక్కకు కృతజ్ఞతలు తెలుపుకోవలసిందే. ఇది కీళ్ళనొప్పులు పరిస్థితులను తగ్గించడంలో భాగంగా రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది.

 6. పార్కిన్సన్స్ వ్యాధి యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది :

6. పార్కిన్సన్స్ వ్యాధి యొక్క ప్రభావాలను తగ్గిస్తుంది :

న్యూరోఇమ్యూన్ ఫార్మకాలజీ జర్నల్లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, దాల్చిన చెక్క, పార్కిన్సన్స్ వ్యాధి యొక్క పెరుగుదలను మందగిస్తుంది.

ఏదైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్న వారు, ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క నానబెట్టిన నీటిని స్వీకరించడానికి ముందుగా మీ వైద్యుని సంప్రదించండి. వాస్తవానికి అనేకమంది హెర్బల్-టీ లలో భాగంగా దాల్చిన చెక్క వినియోగాన్ని కూడా కలిగి ఉంటారు. అనుసరించేవారు తప్పక ప్రయోజనాలను పొందగలరు.

Most Read:నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్, నా సీక్రెట్స్ చెప్పేసింది Most Read:నా భర్త ఎంత కోఆపరేట్ చేసినా ఏమీ చేయలేడు, రెండు నిమిషాలకే ఔట్, నా సీక్రెట్స్ చెప్పేసింది

FAQ's
  • దాల్చిన చెక్క నీళ్లతో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి?

    దాల్చిన చెక్క నీళ్లతో మొత్తం ఆరు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది PCOS సమస్య నుండి ఉపశమనం ఇస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఊబకాయం తగ్గించడంలో సహాయపడుతుంది. కడుపుబ్బరం, మంటను తగ్గిస్తుంది. రుతు స్రావ సమస్యలకు చెక్ పెడుతుంది.

English summary

6 Reasons Why You Should Be Drinking Cinnamon Water Daily

The distinctive flavour and fragrance of cinnamon is a delight. This popular medicinal spice has been used in wide varieties of cuisines, sweet and savoury dishes, breakfast cereals, baked goods and snacks. It is loaded with various antioxidant and antibiotic properties. One of the best ways to extract all the goodness from cinnamon is to soak the stick in water and sip on it on a regular basis. Backed by various health experts,
Desktop Bottom Promotion