For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 6 లైంగిక ఆరోగ్య అవాస్తవాలను ఎన్నటికీ అంగీకరించలేరు

ఈ 6 లైంగిక ఆరోగ్య అవాస్తవాలను ఎన్నటికీ అంగీకరించలేరు

|

మనం ఆకలిగొన్నప్పుడు తినాలన్న ఆలోచన చేస్తాం, దాహం ఉన్నప్పుడు నీటి కోసం వెతుకుతాం. అదేవిధంగా లైంగిక సంబంధం కూడా. ప్రతి మనిషీ తన శరీరంలోని హార్మోనుల ప్రభావాలు, పరిసరాలు, అలవాట్లు, ఎదుర్కొనే సంఘటనల కారణంగా లైంగిక సంబంధం గురించిన ఆలోచనలను కలిగి ఉంటారు. దానికి తగ్గట్లుగా తన ఆలోచనలను నడిపేందుకు ప్రయత్నిస్తాడు కూడా.

ఆకలి, దాహం ఎలా మానవ శరీరాన్ని ప్రభావితం చేస్తాయో, లైంగిక ఆలోచనలు కూడా మనసును ప్రభావితం చేస్తాయి. ఆలోచనల తీవ్రతరం, పర్యవసాన తోడ్పాటు చర్యలు పాటించని ఎడల, ఒత్తిళ్ళకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

6 Sexual Health Myths You Must Never Believe!

కాబట్టి, ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని నిర్వహించగలగటం కూడా ముఖ్యం, లేకపోతే అనేక మానసిక, శారీరిక సమస్యలకు సైతం దారితీస్తుంది.

వివిధ కారణాల వలన ఒక జంట యొక్క లైంగిక జీవితం ఆరోగ్యకరంగా లేనట్లయితే, పర్యవసానంగా అధిక ఒత్తిడి, నిరాశ మరియు నిస్పృహలకు కారణమవుతుంది. అంతే కాకుండా, అంగస్తంభన మరియు లిబిడో నష్టం వంటి శారీరక సమస్యలను కూడా కలిగించవచ్చు.

అనేకమంది జంటలు తమ లైంగిక జీవితం ఆరోగ్యంగా లేనందున సంబంధంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు అన్నది వాస్తవం. విడాకులకు దారి తీసే అనేక సంబంధాలలో,తెలియని కోణంగా ఈ సమస్య ఉంది అనడంలో ఆశ్చర్యం లేదు.

కాబట్టి, మీ లైంగిక జీవితం ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. మరియు లైంగిక సంబంధాల గురించిన వాస్తవాలను మరియు అవాస్తవాల గురించిన కనీస అవగాహన కలిగి ఉండాలి.

కాబట్టి, ఇక్కడ లైంగిక ఆరోగ్యం గురించిన 6 అవాస్తవాలను పొందుపరచబడ్డాయి:

1. లైంగికానందానికి పురుషాంగ పరిమాణానికి సంబంధం

1. లైంగికానందానికి పురుషాంగ పరిమాణానికి సంబంధం

ఈనాటికీ ఉనికిలో ఉన్న అతి పెద్ద లైంగిక అవాస్తవాలలో ఇది కూడా ఒకటి, మరియు అనేక మంది ప్రజలు దీనిని గుడ్డిగా నమ్ముతారు కూడా. పురుషాంగం యొక్క పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు, స్త్రీ లైంగికంగా మరింత ఆనందం పొందగలదని నమ్ముతారు. అయితే, అనేక పరిశోధనా అధ్యయనాలు మరియు గణాంకాల ప్రకారం స్త్రీ జననాంగాల మొదటి 2 అంగుళాలు మాత్రమే సున్నితoగా ఉంటుంది, క్రమంగా చిన్న పురుషాంగం సైతం స్త్రీని సంతృప్తిపరచగలదని చూపించింది. వాస్తవానికి, పలువురు మహిళలు మానసికంగా దగ్గరైన వారి చేతి స్పర్శ సైతం తమకు సంతోషాన్ని ఇస్తుందని, పరిమాణాల గురించిన ఆలోచనలు ఉండవని పేర్కొన్నారు. ఇక పరిమాణాల క్రిందకు వస్తే, జననాంగాల వద్ద నొప్పితో సంబంధం ఉన్న కారణంగా చిన్న పరిమాణానికే ఎక్కువ మంది మొగ్గు చూపారు కూడా.

2.

2. "పుల్-అవుట్" పద్ధతి పనిచేస్తుంది

అనేక మంది జంటలు గర్భం నిరోధించడానికి ఈ సంప్రదాయ గర్భనిరోధక పద్ధతి పనిచేస్తుందని నమ్ముతారు, దీన్నే "పుల్-అవుట్" పద్ధతిగా పిలుస్తారు. దీనిలో మనిషి ఉచ్ఛస్థాయికి చేరుకున్న సమయాన, స్ఖలనాన్ని నివారించే ప్రక్రియలో భాగంగా, పక్కకు తప్పుకుంటాడు. ఏది ఏమైనా ఈ పద్దతి ద్వారా గర్భం ధరించకుండా లేదా లైంగిక వ్యాధులు సోకకుండా బయటపడవచ్చు అనేది అపోహ మాత్రమే. వ్యక్తి ఒక్కోసారి నియంత్రణను కోల్పోవచ్చు, లేదా తెలియకుండానే స్ఖలించే అవకాశాలు లేకపోలేదు. క్రమంగా గర్భధారణ లేదా లైంగిక వ్యాధుల(ఇద్దరిలో ఏ ఒక్కరికి ఉన్నా) వంటి అంశాలకు గురవక తప్పదు.

3. కండోమ్ పునర్వినియోగం

3. కండోమ్ పునర్వినియోగం

ఈరోజుల్లో అనేక మంది ప్రజలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో, లేదా లైంగిక విషయాలలో చురుకుగా ఉన్న యువతలో కూడా నమ్ముతున్న మరో హాస్యాస్పదమైన అవాస్తవం ఉంది. ఒక కండోమ్ ఒకసారి సెక్స్ సమయంలో ఉపయోగించిన తర్వాత కూడా అనేకసార్లు ఉపయోగించవచ్చని వారు నమ్ముతారు. ఈ అలవాటు కేవలం ఇద్దరు వ్యక్తులలో సాధారణ ఇన్ఫెక్షన్లకు కారణమవడమే కాకుండా, గర్భధారణలు మరియు లైంగిక అనారోగ్యాలకు,అంటువ్యాధులకు కూడా దారి తీయవచ్చు, ఎందుకంటే వాడిన కండోం తిరిగి వాడడం, అవి చిరుగుటకు కారణమవడమే కాదు, సురక్షణావకాశాలను సైతం తగ్గిస్తాయి.

4. లైంగిక అంటువ్యాధుల లక్షణాలు లేని ఎడల మంచి ఆరోగ్యం ఉన్నట్లే

4. లైంగిక అంటువ్యాధుల లక్షణాలు లేని ఎడల మంచి ఆరోగ్యం ఉన్నట్లే

ఒక వ్యక్తి లైంగికంగా చురుకుగా ఉంటే, ప్రత్యేకించి పలు లైంగిక భాగస్వాములను కలిగి ఉన్నట్లయితే, వారు లైంగిక సంక్రమణ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్స్ (ఎస్.టి.డి. మరియు ఎస్.టి.ఐ) నిర్ధారణకై తరచూ పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం. అనేక లైంగిక సంక్రమణ వ్యాధులు దీర్ఘకాలాలపాటు నిద్రావస్థలో ఉండి, ఒక్కసారిగా తీవ్ర ప్రభావాలను చూపే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కొన్ని నెలలలోనే ప్రభావాలను చూపిస్తే, కొన్ని సంవత్సరాల పాటు నిద్రాణంగా ఉంటాయి. ఎయిడ్స్ కూడా ఆకోవకే చెందుతుంది. క్రమంగా తెలీకుండానే ఒకరి నుండి ఒకరికి వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. కావున లక్షణాలు కనపడనంత మాత్రాన వ్యాధి లేదని అర్ధం కాదు.

5. స్త్రీలు బహిష్టు సమయంలో గర్భం దాల్చరు

5. స్త్రీలు బహిష్టు సమయంలో గర్భం దాల్చరు

అనేక మంది పురుషులు మరియు మహిళలలో ఉన్న మరొక ప్రసిద్ధమైన అపోహ, మహిళలు వారి ఋతు కాలంలో అసురక్షిత లైంగిక చర్యల కారణంగా గర్భం దాల్చరు అని. అయినప్పటికీ, ఇది తప్పు. ఈ స్పెర్మ్ మహిళ యొక్క శరీరంలో 5 రోజులపాటు వీర్యకణాలు జీవించగలుగుతాయి. మరియు కొందరు మహిళలు త్వరగా అండం విడుదలకు గురికావడం, లేదా బహిష్టు కాలాల అస్తవ్యస్త కాలాల కారణంగా గర్భం దాల్చే అవకాశాలు లేకపోలేదు.

6. కేవలం పెనెట్రేటివ్ సెక్స్ మాత్రమే ఎస్.టి.డి. (సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్) లకు కారణం కావచ్చు

6. కేవలం పెనెట్రేటివ్ సెక్స్ మాత్రమే ఎస్.టి.డి. (సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్) లకు కారణం కావచ్చు

అనేక మంది లైంగిక చర్య పూర్తిగావిస్తేనే, లైంగిక సంక్రమణ వ్యాధులకు గురవుతాము అన్న అపోహలో కూడా ఉంటారు. కానీ ఇది అబద్దం. ఫోర్ప్లే, చుంభనం మొదలైన చర్యలు మరియు కొన్ని అసురక్షిత అంశాల కారణంగా వ్యాధులకు దారితీయవచ్చు .

ఈ పై 6 ముఖ్యమైనవి. ఇలాంటి అనేక అపోహలు తరచుగా కనిపిస్తూ ఉంటాయి కూడా. కేవలం ఒక అవగాహన ఇవ్వడం కోసం మాత్రమే ఈ 6అంశాలను పొందుపరచడం జరిగింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆరోగ్య, లైంగిక సంబంధిత అంశాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ విలువైన అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

English summary

6 Sexual Health Myths You Must Never Believe!

6 Sexual Health Myths You Must Never Believe!, When we get hungry, we make ourselves something to eat; when we get thirsty, we drink water; similarly, when we feel the urge to indulge in sexual intercourse, we have to do that and make sure we attain sexual satisfaction.
Story first published:Tuesday, July 10, 2018, 18:49 [IST]
Desktop Bottom Promotion