For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నలభై ఏళ్ళ వయసులో అధిక బరువును తగ్గించుకునేందుకు 7 అద్భుత చిట్కాలు

నలభై ఏళ్ళ వయసులో అధిక బరువును తగ్గించుకునేందుకు 7 అద్భుత చిట్కాలు

|

"జీవితం 40 తరువాతే మొదలవుతుంది", "40 అనేది మరొక నూతన 20" - ఇవన్నీ నలభై ఏళ్ళ వయసుకు సంబంధించిన కొన్ని ప్రసిద్ధ సూక్తులు.

40 ఏళ్ళ వయసు అంటే యవ్వనం దాటగానే అడుపెట్టే వయసు. అడల్ట్ హుడ్ కు సంబంధించి కొత్త రాజ్యమిది.

40 ఏళ్ళ వయసు రాగానే చాలా మంది అనేక జీవిత పాఠాలను నేర్చుకుని ఉండుంటారు. ప్రపంచం గురించి, వ్యక్తుల గురించి అలాగే తమ గురించి తాము క్షుణ్ణంగా తెలుసుకుని ఉండుంటారు!

ఆరోగ్యం గురించి చెప్పుకోవాలంటే 40 ఏళ్ళ వయసు వచ్చేసరికి తమ శరీరం యొక్క పనితీరు గురించి ఒక అవగాహన వచ్చి ఉంటారు. ఈ వయసులో ఏది ఆరోగ్యకరమైనదో ఏది కాదో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.

నలభై ఏళ్ళ వయసులో అధిక బరువును తగ్గించుకునేందుకు 7 అద్భుత చిట్కాలు

ప్రతి దానికి లాభాలు నష్టాలూ ఉంటాయి. ఈ విషయం ఏజింగ్ కి కూడా వర్తిస్తుంది. ఏజింగ్ అనేది అనేక పాజిటివ్ విషయాలను కూడా తీసుకువస్తుంది.

వయసు పెరుగుతున్న కొద్దీ మెటబాలిక్ రేట్ అలాగే ఇమ్మ్యూనిటీ మందగిస్తుంది. కాబట్టి, అనేక రకాల ఏజ్ రిలేటెడ్ సమస్యలు వేధిస్తాయి.

ఆంతే కాక, నలభైలోకి అడుగుపెట్టగానే బరువు తగ్గటమనేది కాస్తంత ఛాలెంజింగ్ గా మారుతుంది. మెటబాలిక్ రేట్ మందగించడం వలన ఇలా జరుగుతుంది.

కాబట్టి, నలభై తరువాత బరువు తగ్గేందుకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇక్కడ వివరించాము.

1. వాస్తవాలను అర్థం చేసుకోండి:

1. వాస్తవాలను అర్థం చేసుకోండి:

మొదటగా, బరువు తగ్గాలన్నా లేదా నలభైలలో ఆరోగ్యకరమైన బరువును మెయింటెయిన్ చేయాలన్నా ఈ వయసులో శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడం సహజమన్న వాస్తవాన్ని గ్రహించండి. హార్మోన్లలో, మెటబాలిక్ ఫంక్షన్స్ లో హెచ్చు తగ్గుల వలన ఇలా జరుగుతుంది.

కాబట్టి, ఈ వయసులో బరువు అధికంగా పెరగడం సహజం. కానీ, తగ్గించుకోవడం కష్టం. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. బరువు తగ్గేందుకు మరింత శ్రద్ధ అవసరపడుతుంది. ఇరవైలలో బరువు తగ్గడం సులభం. నలభైలలో బరువు తగ్గేందుకు మరింత అంకితభావం అవసరం.

2. ఎక్కువగా పండ్లను అలాగే కూరగాయలను తీసుకోండి:

2. ఎక్కువగా పండ్లను అలాగే కూరగాయలను తీసుకోండి:

పండ్లను అలాగే కూరగాయలను తీసుకోవడం మీకు చిన్నప్పటి నుంచి అయిష్టంగా ఉన్నట్టైనా ఇప్పుడేం మించి పోలేదు. ఇప్పుడైనా మీరు పండ్లను అలాగే కూరగాయలను తీసుకోవడాన్ని ప్రారంభించండి.

నిజానికి, 40లలో ఉండే వారు పండ్లను అలాగే కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పండ్లలో అలాగే కూరగాయలలో లభించే పోషకాలు అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి హార్మోన్లలో హెచ్చుతగ్గులను సుస్థిరపరుస్తాయి. అలాగే మెటబాలిక్ రేట్ ను బూస్ట్ చేస్తాయి. తద్వారా, శరీరంలోని ఫ్యాట్ సెల్స్ అనేవి త్వరగా కరిగిపోతాయి.

3. తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి:

3. తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి:

ఇంతకు ముందు ప్రస్తావించుకున్నట్టుగా నలభైకి చేరుకోగానే శరీర పనితీరులో మార్పులు సంభవిస్తాయి. మెటబాలిజమనేది ఇంతకు ముందున్నట్టుగా యాక్టివ్ గా ఉండదు. కాబట్టి, వయసు పైబడి నలభైకి చేరగానే మీరు తక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే మీరు తక్కువ మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం మంచిది. అయితే, పోషకాలు మాత్రం పుష్కలంగా లభించేలా జాగ్రత్తపడాలి.

ఈ విధంగా కేలరీలు శరీరంలో పేరుకోవడం తగ్గుతుంది. అయినా, డైట్ లో ఏవైనా మార్పులూ చేర్పులూ చేసుకోదలచినప్పుడు వైద్యున్ని సంప్రదించడం మంచిది.

4. ఇంటి ఆహారాన్నే తీసుకోకండి:

4. ఇంటి ఆహారాన్నే తీసుకోకండి:

యవ్వనంతో ఉన్నప్పుడు బయటి ఆహారాన్ని తీసుకోవడానికి మీరు ఎక్కువగా ఇష్టపడి ఉండవచ్చు. ఫ్రెండ్స్ తో అలాగే ప్రియమైన వారితో బయటి ఫుడ్స్ ని తీసుకోవడం మీకు సరదాగా ఉండవచ్చు. అయితే, అదే హ్యాబిట్ ను నలభైకి చేరిన తరువాత కూడా మీరు కొనసాగిస్తే బరువును తగ్గించుకోవడం కష్టతరమని గుర్తుంచుకోండి.

మెటబాలిజంలో వయసు రీత్యా మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్న వయసులో మెటబాలిజం యాక్టివ్ గా ఉంటుంది. కాబట్టి, బయటి ఆహారాన్ని తీసుకున్నా బరువు పెరిగే సమస్య వేధించే అవకాశాలు తక్కువ. అదే, నలభైలోకి అడుగు పెట్టగానే మెటబాలిజం మందగిస్తుంది. జంక్ ఫుడ్ ని తీసుకోవడం వలన వెయిట్ లాస్ ప్రక్రియ మందగిస్తుంది. కాబట్టి, ఇంటివద్దే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వలన బరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది.

5. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకండి:

5. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయకండి:

ఇది వెయిట్ లాస్ కై తపించే వారు అలాగే ఆరోగ్యంగా ఉండాలని కాంక్షించే వారు తప్పక పాటించవలసిన నియమం. నలభైకి చేరుకోగానే బ్రేక్ ఫాస్ట్ ని తరచూ స్కిప్ చేయడం జరుగుతుంది. బాధ్యతల పట్ల నిబద్ధతతో తమ మీద శ్రద్ధ పెట్టుకోవడానికి కూడా వారికి సమయం సరిపోదు. పిల్లల్ని స్కూల్ కి పంపించడం, వంట చేయడం, ఆఫీస్ కి తయారవడం వంటి పనులతో బ్రేక్ ఫాస్ట్ ని కొందరు స్కిప్ చేస్తారు. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి మల్టీ టాస్క్ అవసరపడుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ను తీసుకునే అవకాశం వీరికి లభించదు.

బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడం వలన మెటబాలిక్ రేట్ అనేది మందగించి వెయిట్ లాస్ అరికట్టబడుతుంది.

6. ఆల్కహాల్ ని తగ్గించాలి:

6. ఆల్కహాల్ ని తగ్గించాలి:

ఇరవై అలాగే ముప్పైల వయసుల వారు కూడా కొందరు ఆల్కహాల్ కి బానిసలుగా మారుతున్నారన్న విషయం వాస్తవమే. నలభైల వారి కంటే వీరు పార్టీలు ఎక్కువగా చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆల్కహాల్ నుంచి వచ్చిన కేలరీలను వీరు త్వరగా కరిగించుకోగలరు కూడా.

అదే నలభైల వయసులో అడుగుపెట్టాక ఎక్కువగా ఆల్కహాల్ ను తీసుకుంటే మీరు అధిక బరువు సమస్యతో బాధపడే ప్రమాదం తలెత్తవచ్చు. మెటబాలిజం మందగించడం వలన ఇలా జరుగుతుంది. అంతేకాక, ఆల్కహాల్ అనేది మీ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది కూడా.

7. వ్యాయామానికి సమయం కేటాయించండి:

7. వ్యాయామానికి సమయం కేటాయించండి:

నలభైల వయసులో జీవితంలోని బాధ్యతలు పెరగడం సహజమే. ఉద్యోగంలో పని ఒత్తిడి, కుటుంబం, పిల్లలు ఇలా ఎన్నో బాధ్యతలతో తలమునకలవుతారు. ఈ బాధ్యతలలో మీరు కొన్ని సార్లు మల్టీ టాస్క్ చేయవలసిన అవసరం కూడా రావచ్చు. వ్యాయామానికి సమయం మీకు చిక్కకపోవచ్చు. అయినా, వ్యాయామానికి ప్రతిరోజూ కనీసం నలభై నిమిషాలు కేటాయించడం చేయాలి. ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది.

ఉదయాన్నే లేచి జిమ్ కి వెళ్లడం అలాగే జాగింగ్ కి వెళ్లడం డిన్నర్ తరువాత టీవీ ను చూసే బదులు నడకకి వెళ్లడం వంటివి బరువును అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. ఈ పద్దతిలో బరువును వేగంగా అలాగే మరింత సమర్థవంతంగా తగ్గించుకోగలుగుతారు.

English summary

7-amazing-tips-to-lose-weight-after-40

"Life begins at 40", "40 is the new 20" - these are some of the popular sayings we hear when we are about to turn 40. 40 years is that age where we have definitely crossed our youth and entered into a new realm of adulthood.
Story first published:Thursday, June 21, 2018, 13:08 [IST]
Desktop Bottom Promotion