For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ శరీరవ్యవస్థ నుంచి విషపూరిత వ్యర్ధాలను పూర్తిగా దూరం చేసే 7 ఆహార పదార్థాలు !

|

మనమందరం కొంతకాలం తర్వాత, మన మనసును ఆహ్లాద పరచుకోవడానికి, ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కలిగి ఉండటానికి

ఒత్తిడిని దూరం చేసుకోవలసిన అవసరముందని కోరుకుంటున్నాము, అవునా ?

మనము మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి మనకు డీ-స్ట్రెస్ అనేది ఎంత అవసరమో, అదేవిధంగా మన భౌతిక శరీరంలో ఉన్న హానికరమైన టాక్సిన్లను వదిలించుకోవడం కూడా అంతే ముఖ్యం.

ఈరోజుల్లో చాలామంది బిజీగా జీవించేవారు ఉన్నారు, అలాంటివారు ఆరోగ్యకరమైన ఆహార వినియోగానికి (లేదా) కాలుష్యానికి దూరంగా ఉండటమనేది అనుమతించబడదు.

మనలో చాలామంది రోజువారీ డైట్లో విషాన్ని కలిగి ఉన్న ఆహారాన్ని తీసుకోవటం, దుమ్ము - కాలుష్యాల మధ్యలో ప్రయాణించడం, అత్యంత విషపూరితమైన రసాయనాలను కలిగిన సౌందర్య సాధనాలను & ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులను మనము తరచుగా ఉపయోగిస్తుంటాము.

ఈ విషపదార్ధాలను మన శరీర వ్యవస్థలోకి ప్రవేశించి, అజీర్ణం వంటి సాధారణ ఆరోగ్య రుగ్మతల నుంచి క్యాన్సర్ వంటి ప్రాణాంతక

వ్యాధుల వరకూ అనేక ఆరోగ్య సమస్యలను కలుగజేస్తాయి !

కాబట్టి మనం మన బాహ్య శరీరాన్ని ఎలా శుభ్రపరుచుకుంటూ ఏమో అదే మాదిరిగా, మన శరీరాన్ని అంతర్గతంగా కూడా శుభ్రపరుచుకోవడమనేది చాలా ముఖ్యం.

ఇలా చేయడానికి కొన్ని ఆరోగ్యవంతమైన ఆహారాలను తీసుకోవాలి ఇది మన శరీరంలో దాగివున్న విష వ్యర్ధాలను సేకరించి విసర్జక వ్యవస్థ ద్వారా బయటకు పంపబడుతుంది.

మీ శరీర వ్యవస్థ నుంచి విష వ్యర్థాలను బయటకు పంపే కొన్ని ఆహారాలను ఇక్కడ సూచించబడ్డాయి, అవేమిటో మీరు ఒకసారి చూడండి !

ద్రాక్షపండు :-

ద్రాక్షపండు :-

భారతదేశంతో పాటు అనేక ఇతర దేశాల్లో కూడా ద్రాక్షపండు అనేది బాగా ప్రజాదరణ పొందిన అల్పాహారం కాదు. కానీ ఈ పండు అల్పాహారంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది.

బచ్చలికూర :-

బచ్చలికూర :-

మన బాల్యదశలో తక్షణ శక్తి కోసం "మిస్టర్. పొపాయ్" అనే కార్టూన్ క్యారెక్టర్ ఒక టిన్లో నిల్వచేసిన బచ్చలికూరను తినడాన్ని చూడవచ్చు. ఇది కేవలం బొమ్మల ప్రదర్శన అయినప్పటికీ, బచ్చలికూర గొప్ప పదార్థం అన్నది అబద్ధం కాదు. బచ్చలి కూరను తరచుగా తీసుకోవడం వల్ల మీలో జీవక్రియను & రోగనిరోధక శక్తిని పెంచే అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, మీ ఎముకలను కూడా బలంగా తయారు చేస్తాయి.

ఆరెంజ్ :-

ఆరెంజ్ :-

ప్రతిరోజూ ఒక ఆరెంజ్ పండును తినడం (లేదా) తాజా ఆరెంజ్ పండు రసాన్ని ఒక పెద్ద గ్లాసు మోతాదులో ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్య ప్రమాణాలను గణనీయంగా పెంచుతుంది. ఈ పండులో ఉన్న విటమిన్-సి మిమ్మల్ని వ్యాధులకు దూరంగా ఉంచడమే కాకుండా, మీలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఇది మీ శరీరంలోని విషపదార్ధాలను సమర్థవంతంగా బయటకు తొలగించి, మీ అంతర్గత శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది.

వెల్లుల్లి :-

వెల్లుల్లి :-

మన ఇళ్ళలో వెల్లుల్లిని ఉంచుకోవటం వల్ల అది రాక్షసులను, రక్త పిశాచులను మనకు దూరంగా ఉంచుతుందని - ప్రాచీన కాలంలోని ప్రజలందరూ నమ్మారు. అలాగే మన శరీరం పూర్తిగా విషంతో నిండి ప్రాణాంతకం అయినప్పటికీ కూడా ఈ వెల్లుల్లి ప్రమాదకరమైన వ్యాధులకు దూరంగా ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మన పూర్వికులు విశ్వసించారు. ఈ వెల్లుల్లిలో అలిసిన్ అని పిలిచే ఒక సమ్మేళనం ఉండటం వల్ల, అది మీ జీర్ణవ్యవస్థ నుంచి ప్రత్యేకించి విషపదార్ధాలను ఫిల్టర్ చెయ్యగలదు, అందువలన మనము వెల్లుల్లిని కలిగి ఉండటం చాలా సురక్షితమైన & ఆరోగ్యకరమైనది.

గ్రీన్-టీ :-

గ్రీన్-టీ :-

మనలో చాలామంది ప్రతిరోజు 1-2 కప్పుల గ్రీన్-టీను సిప్ చేయాలనుకుంటారు, అవునా ? అయితే మీకు గ్రీన్-టీను తాగే అలవాటు గానీ లేకపోతే, తక్షణమే ఈ అలవాటును అలవరుచుకోండి, ఎందుకంటే ఈ గ్రీన్-టీ కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడుకుని ఉంది. గ్రీన్-టీలో ఉన్న శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు మీ జీవక్రియ రేటు మెరుగుపరచి & మీ శరీర బరువును తగ్గించటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా,

మీ శరీరంలో దాగి ఉన్న విషయాలను సహజమైన పద్ధతులు తొలగించి, మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది.

పొద్దుతిరుగుడు గింజలు :-

పొద్దుతిరుగుడు గింజలు :-

ముఖ్యంగా ఈ రోజుల్లో పొద్దుతిరుగుడు గింజలు చాలా ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి, ముఖ్యంగా ప్రత్యేకమైన జీవనశైలిని ఎంచుకునే వ్యక్తులకు. ఎందుకంటే, పొద్దుతిరుగుడు గింజలలో ఫైబర్ & ఫోలేట్ వంటి సమ్మేళనాలను కలిగి వుంటాయి, అవి మీ శరీరాన్ని బాగా నిర్వహించడం ద్వారా మిమ్మల్ని చాలా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, మీ శరీరం నుండి విషపూరితమైన వ్యర్ధాలను సమర్థవంతంగా బయటకు పంపివేస్తాయి.

పసుపు :-

పసుపు :-

సంస్కృతులు, సాంప్రదాయాలు కలిగిన భారతదేశం వంటి దేశాలలో, అత్యంత విలువైన ఔషధ గుణాలను కలిగిన పసుపుకు చాలా ప్రాధాన్యత ఉంది. ఉపశమన పరీక్షా లక్షణాలను మైక్రోబయల్ స్వభావం వంటి మరెన్నో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉన్న ఈ పసుపు సహజసిద్ధమైన నిర్విషీకారిణిగా పనిచేస్తుంది. మీరు తీసుకునే ఆహారంలో పసుపును జోడించడం ద్వారా మీ శరీరం నుండి హానికరమైన వ్యర్ధాలను, విషాన్ని సమర్థవంతంగా బయటకు తొలగించడంలో ఇది సహాయపడుతుంది.

English summary

7 Foods That Detox Your Body

A lot of toxins enter our body through food, air and water on a daily basis. These toxins can cause a number of dangerous diseases if they remain inside. Foods which can detoxify your whole body are grapefruit, spinach, orange, garlic, broccoli, etc.