For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ వేళ్ళవాపుకు కారణమయ్యే 7 అంశాలు-వైద్యున్ని సంప్రదించవలసిన సందర్భాలు

అకస్మాత్ గా మీ వేళ్ళు ఉబ్బిపోయినట్టై మిమ్మల్ని హైరానాకు గురిచేస్తున్నాయా? ఈ విషయంలో మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే, కంగారు వీడండి. వేళ్ళు ఉబ్బడానికి అనేక కారణాలు దోహదపడతాయి. చాలామటుకు వేళ్ళు ఉబ్బడం

|

అకస్మాత్ గా మీ వేళ్ళు ఉబ్బిపోయినట్టై మిమ్మల్ని హైరానాకు గురిచేస్తున్నాయా? ఈ విషయంలో మీరు ఆందోళన చెందుతున్నారా? అయితే, కంగారు వీడండి. వేళ్ళు ఉబ్బడానికి అనేక కారణాలు దోహదపడతాయి. చాలామటుకు వేళ్ళు ఉబ్బడం అనేది హానికరం కాదు. కానీ, కొన్ని సందర్భాలలో నొప్పితో కూడిన వాపును మీరు గుర్తిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Reasons Your Fingers Are Swollen

వేళ్ళు వాపుకు గురవడానికి దోహదపడే కొన్ని కారణాలను ఇక్కడ వివరించాము. వేళ్ళ వాపు తీవ్రతరం గురించి తెలుసుకుని వైద్యున్ని సంప్రదించవలసిన సందర్భాలను కూడా ఇక్కడ వివరించాము.

1. ఎండాకాలంలో

1. ఎండాకాలంలో

వేడి వలన బ్లడ్ వెజిల్స్ అనేవి విస్తరిస్తాయి. ఇందువలన మిమ్మల్ని వేడి నుంచి రక్షించడానికి ఈ మెకానిజం ఉపయోగపడుతుంది. ఈ విషయాన్నీ చికాగో యూనివర్సిటీలో ర్యుమటాలజీ డిపార్ట్మెంట్ లో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన టామీ ఒల్సేన్ ఆటసెట్ (MD, MPH) వెల్లడించారు. బ్లడ్ వెజెల్స్ సాగినప్పుడు కొంత ద్రవం మృదువైన టిష్యూస్ లోకి విడుదలవుతుంది. అందువలన వాపు కనిపిస్తుంది.

మీరు రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు మీ చేతులను తరచూ ఉపయోగిస్తున్నప్పుడు ఈ విధమైన వాపు మాయమవుతుంది ఆటసెట్ వెల్లడించారు. అయితే, చేతులలో అలాగే చేతి వేళ్ళలో వాపు కనిపించి తీవ్రమైన నొప్పి కూడా అనుసంధానమై పట్టు అనేది సడలితే మీరు తక్షణమే వైద్యుని సలహాని స్వీకరించాలి.

2. ఉప్పుని అధికంగా తీసుకోవడం

2. ఉప్పుని అధికంగా తీసుకోవడం

సాధారణంగా తీసుకునే జంక్ ఫుడ్స్ లో అధికమొత్తంలో ఉప్పు కలిగి ఉంటుంది. వేపుడు పదార్థాలలో కూడా ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ అధిక మొత్తంలో తీసుకుపోవడం వలన శరీరంలో ఉప్పు శాతం పెరుగుతుంది. మన శరీరం ఉప్పుని నీటిని సమాంతరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారంటే శరీరం అందుకు తగిన నీటిని శరీరంలో నిల్వ ఉంచేలా ఏర్పాట్లు చేసుకుంటుంది. తద్వారా వాపులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని ఆటసెట్ చెప్తున్నారు.

సాధారణంగా, సాల్టీ ఫుడ్స్ ని తీసుకోవడం వలన కలిగే చిన్నపాటి వాపు ఒక రోజు గడిచిన తరువాత తగ్గిపోతుంది. కొన్ని సార్లు, కొన్ని రోజులు పట్టవచ్చు. ఒకవేళ మీరు ఉప్పును తీసుకోవడం తగ్గించుకున్నా అదే స్థాయిలో వాపు కనిపిస్తే మీరు కచ్చితంగా వైద్యున్ని సంప్రదించాలని ఆటసెట్ వెల్లడిస్తున్నారు.

సాల్ట్ లేని పదార్థాలని తీసుకుని తద్వారా సోడియం ఇన్టేక్ ను తగ్గించుకోండి.

3. ఓస్టియోఅర్త్రైటిస్

3. ఓస్టియోఅర్త్రైటిస్

కొన్ని సార్లు వేళ్ళ వాపుకు కొన్ని మెడికల్ కండిషన్స్ కూడా కారణమవుతాయి. ఓస్టియోఅర్త్రైటిస్ అనే సమస్య వలన కూడా మీరు ఈ లక్షణం గుర్తించవచ్చు. అయితే, వయసు మీరిన వారిలో ఈ కండిషన్ ఎక్కువగా కనిపిస్తుంది. జాయింట్స్ దిగువనున్న మెత్తటి టిష్యూస్ క్షీణించబడడం వలన కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది. అయితే, ఓస్టియోఅర్త్రైటిస్ లో తరచూ నొప్పి అలాగే బిగుసుకుపోవడం వంటివి కనిపించవు. అయితే, ఇంకొన్ని రకాల అర్త్రైటిస్ అనేవి వేళ్ళ నొప్పులకు అలాగే వాపుకు దారితీయవచ్చని ఆటసెట్ వెల్లడిస్తున్నారు.

4. కార్పల్ టన్నెల్

4. కార్పల్ టన్నెల్

ముంజేతి నుంచి చేతి వరకు సాగే నరానికి గాయమైతే అలాగే ఆ నరం ఒత్తిడికి గురైతే కార్పల్ టన్నెల్ అనే సమస్య తలెత్తుతుందని ఆటసెట్ తెలియచేస్తున్నారు. తద్వారా ఏర్పడిన వాపు వలన నొప్పి, మంట, చేతులు అలాగే వేళ్ళు మొద్దుబారటాన్ని మనం గుర్తించవచ్చు. ఈ లక్షణాలనేవి మెల్లగా వృద్ధి చెందుతాయి. పరిశోధనల ప్రకారం కార్పల్ టన్నెల్ అనే సమస్య మగవారికంటే ఆడవారిలో మూడు రెట్లు అధికంగా కనిపిస్తుంది.

5. లింఫెడీమా

5. లింఫెడీమా

లింఫ్ ద్రవం (ఈ ద్రవం అనేది బాక్టీరియా, వైరస్ లతో పాటు శరీరంలోని వ్యర్థాలని బయటకి పంపించేందుకు ఉపయోగపడుతుంది) అనేది సరిగ్గా డ్రైన్ అవకపోతే లింబ్ వాపు వ్యాథి బారిన పడతారు. చేతి వేళ్ళు అలాగే కాలివేళ్ళు వాపుకు గురవుతాయి. అలాగే, చేతులు, కాళ్ళు కూడా వాపుకు గురవుతాయి. మీ చర్మం కూడా బిగుతుగా అలాగే ఇదివరకటి కంటే దట్టంగా కనిపిస్తుందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. లింఫెడీమా చికిత్స అనేది బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ లాగానే సర్జరీలతో అలాగే రేడియేషన్ తో ముడిపడి ఉంటుంది. అరుదైన సందర్భాలలో, లింఫ్ సిస్టం అసాధారణ ఎదుగుదల వలన కూడా లింఫెడీమా సంభవిస్తుంది.

6. రేనాడ్స్ వ్యాథి

6. రేనాడ్స్ వ్యాథి

ధమనులు కుదించుకుపోవడమనే కండిషన్ ను మనం రేనాడ్స్ వ్యాథిలో గుర్తించవచ్చు. చల్లటి వాతావరణం అలాగే ఒత్తిడి వంటివి ఈ స్థితికి కారణమవుతాయి. ఇలా కుదించుకుపోవటం వలన రక్త ప్రసరణ తగ్గిపోతుందని న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ రిపోర్ట్ స్పష్టం చేస్తోంది. ఒత్తిడి తగ్గిపోయినప్పుడు, శరీరానికి తగినంత వెచ్చదనం అందినప్పుడు ధమనులు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఈ సమస్య ఆడవారిలో అధికంగా కనిపిస్తుంది. వాపు రావడానికి ముందు వేళ్ళు గాని చేతులు గాని బ్లూయిష్ గా మారిపోతే రెనాడ్స్ వ్యాథికి గురయ్యారని అర్థం.

7. ప్రీఎక్లెమ్ప్సియా

7. ప్రీఎక్లెమ్ప్సియా

తల్లికాబోతున్నవారిలో వాపు అనేది కొంతవరకు సహజం. చేతులలో, ముఖంలో వాపును గమనించవచ్చు. బొటనవేలితో చర్మంపై ఒత్తినప్పుడు గుర్తించదగిన వాపును గమనించవచ్చు. ఇవన్నీ ప్రీఎక్లెమ్ప్సియా కి సంబంధించిన కొన్ని సంకేతాలు. ఈ కండిషన్ కి అధిక రక్తపోటు కూడా తోడవుతుంది. ఈ సమస్యను సరైన సమయంలో తగిన చికిత్సను అందించకపోతే తల్లీ బిడ్డలకు ఎంతో ప్రమాదం. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్ట్రిక్స్ అండ్ గైనకాలజీ గైడ్లైన్స్ ప్రకారం ఈ సమస్యకు తగిన చికిత్సను అందించాలి. నలభై ఏళ్ళు దాగిన గర్భిణీలలో ఈ సమస్య సాధారణంగా కనిపిస్తుంది. అలాగే, ఒబెసిటీ కలిగిన వారిలో అలాగే ఒకరి కంటే ఎక్కువ మంది గర్భస్థ శిశువులను మోస్తున్నవారిలో కూడా ఈ సమస్య సహజమేనాని రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.

English summary

7 Reasons Your Fingers Are Swollen And when to call your doctor

Here are some of the reasons your fingers are swelling, and when a call to your doctor may be appropriate.
Story first published:Tuesday, January 9, 2018, 16:04 [IST]
Desktop Bottom Promotion