For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఎనిమిది తప్పులు మీ ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.

ఈ ఎనిమిది తప్పులు మీ ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేస్తాయి.

|

గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం "మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడం, మన కర్తవ్యం. లేనిచో మన మనస్సును దృఢంగా మరియు స్పష్టంగా ఉంచలేము".

నిజం, ఎందుకంటే మంచి భౌతిక మరియు మానసిక ఆరోగ్యం లేని వ్యక్తి మంచి జీవితo ఆస్వాదించడo జరగని పనే అవుతుంది.

స్వల్ప కీళ్ళ నొప్పులు లేదా ఫ్లూ వలన బాధపడుతున్న వ్యక్తి కూడా జీవితంలో అసౌకర్యంగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే చిన్న వ్యాధులు కూడా రోజువారీ కార్యకలాపాలను మరియు మానసిక శాంతికి ఆటంకం కలిగించగలవు.

8-deadliest-health-mistakes-you-must-never-make

అందువల్ల క్యాన్సర్, హృదయ సమస్యలు, డయాబెటిస్ మొదలైన ఇతర ప్రధాన వ్యాధులు, వ్యక్తి యొక్క జీవితాన్ని మరియు శ్రేయస్సును సైతం ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఆవ్యాధుల పట్ల ఎటువంటి నివారణ చర్యలు తీసుకోని ఎడల, లేదా వాటికి ఎటువంటి మందులు పని చేయని ఎడల. అవునా, కాదా?

అందువలన, మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి మరియు కొన్ని వ్యాధులను నివారించడానికి ఖచ్చితంగా ఒక ప్రయత్నాన్ని కలిగి ఉండాలి. తద్వారా ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నివారణ కన్నా, జబ్బులు రాకుండా చూసుకోవడం మంచిది అని మన పెద్దలు కూడా సలహా ఇస్తుంటారు.

వ్యక్తి ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగిఉన్నప్పటికీ,శరీరాన్ని ప్రభావితం చేసే కొన్ని వ్యాధులు ఉన్నాయి.

అయితే, అనారోగ్యకర జీవనశైలి మరియు కొన్ని అసాధారణ నిర్ణయాలు, వ్యక్తులను తీవ్రంగా ప్రభావితం చేసి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయి.

ఇక్కడ పొందుపరచిన కొన్ని అనారోగ్యకర అలవాట్లు, తప్పులు లేదా మనం విస్మరించిన కొన్ని మంచి విషయాలు ఎలా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయో, మరియు జాగ్రత్త తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ధూమపానం విడువలేకపోవడం

1. ధూమపానం విడువలేకపోవడం

చాలామంది అనాలోచితంగా అనారోగ్యకరమైన మరియు అపాయకరమైన తప్పు అని తెలిసినా కూడా ఈ అలవాటును కొనసాగిస్తూ ఉన్నారు. సిగరెట్ లో ఉండే నికోటిన్ అధిక స్థాయిలో మనసును ప్రభావితం చేయడం మూలంగా, ఒక వ్యసనంలా మారి వ్యక్తి జీవితాన్ని అంధకారం చేస్తుంది. అంతేకాకుండా అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, తక్కువ రోగ నిరోధక శక్తి, వంధ్యత్వం, లైంగిక అసమర్థత, శీఘ్ర స్ఖలనం, శ్వాసకోశ సంబందిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, స్వరపేటిక సమస్యలు మొదలైన అనేక చిన్న మరియు పెద్ద వ్యాధులకు ధూమపానం ప్రధాన కారణంగా ఉంది.

2. ఒత్తిడినితో ఉన్నారా?

2. ఒత్తిడినితో ఉన్నారా?

మనలో చాలామంది ఒక్కోసారి తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు, ఈ ఒత్తిడి మన దైనందిక జీవనంలో ఖచ్చితంగా మనపై ప్రభావాన్ని చూపుతుంది, తద్వారా నెమ్మదిగా ఆరోగ్యం క్షీణిస్తుంది కూడా. ఏదేమైనా, గడిచిన అనేక సంవత్సరాలుగా జరిపిన అనేక అధ్యయనాల ఫలితాల మూలంగా, మానసిక మరియు శారీరకమైన అనేక వ్యాధులకు ఒత్తిడి కారణం కావచ్చు! అందువల్ల, ఒత్తిడిని నియంత్రించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు ఒత్తిడికి గురవుతున్నారని మీకు ఏమాత్రం తోచినా, పరిస్థితికి తగినట్లుగా చర్యలు ఆరంభించడం అవసరం.

3. పరోక్ష ధూమపానం :

3. పరోక్ష ధూమపానం :

మీరు ధూమపానం చేయకపోయినా, పరోక్ష ధూమపానానికి గురవుతున్నారని తెలుసా.

గతంలో ధూమపానం అనేది ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని అత్యంత వేగంగా నాశనం చేయగల అలవాటుగానే మనకు తెలుసు., అదేవిధంగా, మీరు పొగ త్రాగని వ్యక్తి అయినా, మీరు పొగ త్రాగే వ్యక్తుల చుట్టూ చేరడం వలన పరోక్ష ధూమపానానికి గురై మీ ఆరోగ్యం ప్రమాదానికి గురవుతుంది. నికోటిన్ కూడిన వాయువులను పీల్చుకోవడం మూలంగా ఊపిరితిత్తులు ప్రభావితమై క్యాన్సర్ సహా అనేక వ్యాధులను కారణభూతమవవచ్చు! కావున ధూమపానమే కాదు పరోక్ష ధూమపానం కూడా ప్రమాదమే.

4. భావోద్వేగంతో ఆహారం తీసుకోవడం:

4. భావోద్వేగంతో ఆహారం తీసుకోవడం:

"భావోద్వేగoతో ఆహారం తీసుకోవడం" అనేది కూడా ఒక చెడు అలవాటుగా పరిగణించబడుతుంది., ఈ అలవాటులో భాగoగా వ్యక్తులు జంక్ ఫుడ్ అమితంగా తినటం, విచారంతో, కోపంతో లేదా ఆత్రుతగా ఉన్నప్పుడు తినడం వంటి చర్యలు ఉన్నాయి. "సౌకర్యవంతమైన ఆహారం" తీసుకోవడం వలనే ప్రజల్లో ఆనందం మరియు ఉపశమనం లభిస్తుంది; అయితే, భావోద్వేగాలతో ఉన్నప్పుడు ఆహారం తీసుకోవడం మూలంగా ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, హృదయ సంబంధ సమస్యలు మొదలైన అనేక అనారోగ్యకర ఆహార సంబంధ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, ఆహారం తీసుకునే సందర్భంలో భావోద్వేగాలకు అవకాశo ఇవ్వకూడదు.

 5. ఎప్పటికప్పుడు వ్యాయామం చేయకపోవడం:

5. ఎప్పటికప్పుడు వ్యాయామం చేయకపోవడం:

మనలో ఎక్కువ మంది వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని గ్రహించారు. తద్వారా శరీరాన్ని పటిష్టoగా ఆరోగ్యంగా ఉంచగలుగుతున్నారు. వ్యాయామం ద్వారా అనేక వ్యాధులను అడ్డుకోవచ్చు, మరియు నివారించవచ్చు కూడా. వ్యాయామాన్ని ఆస్వాదిస్తూ, ఆనందిస్తూ చేయాలి. ఒక పనిలా కాదు. రోజూవారీ ప్రణాళికలో కనీసం ౩౦ నిమిషాలు వ్యాయామానికి సమయం కేటాయించడం, వ్యాయామం కుదరని పక్షంలో నడక, వామప్ వంటి చర్యలకైనా ఉపక్రమించడం ద్వారా ఎంతో లాభం పొందవచ్చు. కావున సరైన ఆహార ప్రణాళికతో పాటు వ్యాయామానికి కూడా సమయం కేటాయించడం అన్నిటికన్నా ముఖ్యమైనదిగా చెప్పడమైనది.

6. సరైన మోతాదులో నీళ్ళు తాగకపోవడం :

6. సరైన మోతాదులో నీళ్ళు తాగకపోవడం :

మనకు తెలుసు రోజులో కనీసం 2 లీటర్ల నీళ్ళను (వ్యాయామం చేస్తున్న ఎడల, రోజులో 3 లీటర్ల నీటిని) అయినా తీసుకోవాలని. కానీ తీరికలేని దైనందిక కార్యక్రమాలు, పని ఒత్తిడి కారణంగా మనకే తెలీకుండా నీటిని తీసుకోవడం తగ్గిస్తాము. దీనికారణంగా డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) వంటి సమస్యలు వెంటాడుతాయి. తద్వారా పొడి చర్మం, మూత్రాశయ సంబంధిత వ్యాధులు, ఇన్ఫెక్షన్స్ వంటి అనేక తీవ్రమైన సమస్యలకు కారణమవుతుంది. కావున క్రమం తప్పకుండా నీటిని తీసుకోవడం ముఖ్యం.

7. ప్రతి వారం మద్యం సేవిస్తున్నారా ?

7. ప్రతి వారం మద్యం సేవిస్తున్నారా ?

"పార్టీ సంస్కృతి" లో భాగంగా చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువకులు ప్రతి వారాంతంలో పబ్బులు, క్లబ్బులకు అలవాటు పడి తరచుగా మద్యం సేవిస్తూ ఉంటారు. ఎక్కువగా మద్యం తీసుకోవడం మూలంగా తరచుగా వయస్సు మరియు లింగంతో సంబంధం లేకుండా ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగి ఉంటుంది. మద్యపానానికి బానిసగా మారడం, కోరి ప్రమాదాలను తెచ్చుకోవడమే అవుతుంది. కాలేయ సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్ కు కూడా కారణమవుతుంది.

 8. యో-యో డైటింగ్

8. యో-యో డైటింగ్

యో-యో డైటింగ్ ఒక విచిత్రమైన ఆహారపు అలవాటు, ఊబకాయం తగ్గించుకునే క్రమంలో భాగంగా ఇటువంటి పద్దతులపై మొగ్గు చూపుతుంటారు. ఈ ప్రత్యేకమైన ఆహార ప్రణాళికలో, తక్కువగా తినడం, ఆకలి వేసినా ఆహారం తీసుకోకుండా కట్టడి చెయ్యడం వంటి చర్యలను ఆశ్రయిస్తూ ఉంటారు. తద్వారా కొన్ని రోజుల వ్యవధిలోనే, ఈ ఆహారపు అలవాట్ల కారణంగా జంక్ ఫుడ్ మీదకు మనసు వెళ్ళడం, అధికంగా ఆహారం తీసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమిస్తుంటారు. తద్వారా అనేక ఆరోగ్య సంబంధ సమస్యలు అనగా, మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు, రక్త పోటు వంటి అనేక ప్రతికూల అంశాలు ప్రభావితమవుతాయి.

పైన చెప్పిన విషయాలలో ఏ అంశాన్నైనా మర్చిపోయామా? అలా అనిపిస్తే, మీ అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి.

ఈవ్యాసం మీకు నచ్చినట్లయితే, మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి ఆరోగ్య సంబంధిత విషయాలకోసం మాపేజీని తరచూ సందర్శించండి.

English summary

8 Deadliest Health Mistakes You Must Never Make!

There are various habits that we should avoid in order to lead a healthy life. Some of these unhealthy and dangerous habits are: not quitting smoking, poor stress management, physical inactivity, not drinking water properly, drinking alcohol and following unhealthy eating habits. One should strictly avoid these habits to live a better and healthier life.
Desktop Bottom Promotion