For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి కాలంలో జల్ జీరా పానీయాన్నీ తీసుకుంటే కలిగే లాభాలివే?

వేసవి కాలంలో జల్ జీరా పానీయాన్నీ తీసుకుంటే కలిగే లాభాలివే?

|

చిన్నతనంలో జల్ జీరా నీటిని తాగడానికి ఎగబడటం గుర్తుందా? జల్ జీరా పేరు వింటేనే బాల్యం కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతోంది కదూ!

జల్ జీరా ని పుదీనా మరియు కొత్తిమీరతో గార్నిష్ చేసి తీసుకుంటే వేసవి వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. మనస్సుకి అలాగే శరీరానికి హాయి కలుగుతుంది. కాస్తంత మసాలాను జోడించినా కూడా జల్ జీరా రుచి మరింత మెరుగవుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఇది మీలో చైతన్యాన్ని నింపుతుంది.

8 Reasons To Drink Jaljeera This Summer Season

ఈ స్పైస్డ్ బేవెరేజ్ లో జీలకర్ర అనేది ముఖ్యమైన పదార్థం. అయితే, ఇది కేవలం జీలకర్ర నీరు మాత్రమే కాదు. జల్ జీరా అనేది ఒక పానీయం. వేయించిన జీలకర్ర పొడి, అల్లం పొడితో పాటు కొత్తిమీర మరియు పుదీనాను అలాగే గరం మసాలా, చిల్లీ పౌడర్, పెప్పర్ మరియు బ్లాక్ సాల్ట్ ను జోడించి ఈ పానీయాన్ని తయారుచేస్తారు. ఈ డ్రింక్ కి ఇంకొంచెం ఫ్లేవర్ ని అద్దడానికి కొంతమంది డ్రై మ్యాంగో పౌడర్ ను లేదా కాస్తంత చింతపండును జోడిస్తారు.

వేసవిలో జల్ జీరాను తీసుకోవడం సంప్రదాయంగా మారిపోయింది. ఈ పానీయాన్ని ఆహారానికి ముందు తీసుకోవడం వలన ఆకలి పెంపొందించబడుతుంది. టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అవుతాయి. డైజెస్టివ్ జ్యూస్ లు తగినంత ఉత్పత్తి అవుతాయి.

జల్ జీరాను వేసవి కాలంలో తీసుకోవడం వలన ఈ లాభాలను పొందవచ్చు

1. సహజసిద్ధంగా వేడిని తగ్గించి ఉపశమనాన్ని కలిగించే పానీయం:

1. సహజసిద్ధంగా వేడిని తగ్గించి ఉపశమనాన్ని కలిగించే పానీయం:

మండే వేడి నుండి ఉపశమనం అందిస్తూ అలాగే అధిక చెమటను అరికట్టేందుకు జల్ జీరా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది సహజసిద్ధంగా చలువ చేసే పానీయం. ఇది వేసవికాలంలో మండే ఎండ వేడి నుంచి రక్షణ అందించి శరీరానికి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. అలాగే శరీరంలోని ఎలెక్ట్రోలైట్ మరియు ఫ్లూయిడ్స్ ను బాలన్స్ చేస్తుంది.

2. పోషకాలు పుష్కలం:

2. పోషకాలు పుష్కలం:

జల్ జీరా అనేది నేచురల్ డిటాక్సిఫయర్ గా పనిచేస్తుంది. అదే సమయంలో నేచురల్ కూలెంట్ గా అలాగే ఎలెక్ట్రోలైట్ ని బాలన్స్ చేసే విధంగా పనిచేస్తుంది. ఇందులో పోషకవిలువలు కూడా పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియం, కాపర్, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు జింక్ వంటి ఎసెన్షియల్ మినరల్స్ ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలోని పోషక సప్లిమెంట్ మోతాదును మెయింటైన్ చేసేందుకు తోడ్పడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ఉండవు.

3. వేసవిలో సహజసిద్ధమైన డిటాక్సిఫయర్:

3. వేసవిలో సహజసిద్ధమైన డిటాక్సిఫయర్:

జల్ జీరా అనేది సహజసిద్ధమైన బాడీ డిటాక్సిఫయర్ గా పనిచేస్తుంది. ఇందులో వాడిన పదార్థాలన్నీ కూడా సహజసిద్ధమైనవే. ఇవి శరీరాన్ని క్లీన్స్ చేస్తాయి. తద్వారా, శరీరంలో పేరుకుపోయి ఉన్న టాక్సిన్స్ ను తొలగించేందుకు తోడ్పడతాయి. పుదీనా, కొత్తిమీర, అల్లం మరియు బ్లాక్ సాల్ట్ వంటి కొన్ని పదార్థాలతో జల్ జీరాను తయారుచేస్తారు. ఇవి నేచురల్ బాడీ క్లీన్సర్స్ లా పనిచేస్తాయి. అందువలన, జల్ జీరాను నేచురల్ డీటాక్సీఫయర్ అంటారు.

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

జల్ జీరా పానీయంలో జోడించిన బ్లాక్ సాల్ట్ అనేది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. జీలకర్ర కూడా డైజెస్టివ్ సిస్టం పనితీరును మెరుగుపరుస్తుంది. తద్వారా, కడుపుబ్బరం, ఎసిడిటీ మరియు హార్ట్ బర్న్ నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, ఇందులో వాడిన పుదీనా, అల్లం మరియు కొత్తిమీర పేస్ట్ వంటి ఇతర పదార్థాలు కూడా డైజెస్టివ్ సిస్టం పనితీరును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి. కాబట్టి, ఎండాకాలంలో డైజెస్టివ్ ప్రాబ్లెమ్స్ తలెత్తినప్పుడు మీల్స్ కి గంట ముందుగా జల్ జీరా పానీయాన్ని తీసుకోండి. క్షణాల్లో డైజెస్టివ్ సిస్టం మెరుగవడాన్ని మీరు గుర్తించగలుగుతారు.

5. మీ టమ్మీను ప్రశాంతపరుస్తుంది:

5. మీ టమ్మీను ప్రశాంతపరుస్తుంది:

జల్ జీరా పానీయం తయారీలో వాడిన అల్లం లేదా అల్లం పొడి అనేది వికారానికి సరైన రెమెడీగా పనిచేస్తుంది. వేడి వలన కొందరిలో వికారం సమస్య తలెత్తుతుంది. అజీర్ణం వలన తలెత్తే పొత్తికడుపు నొప్పికి కూడా ఈ పానీయం విరుగుడులా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు జల్ జీరా అనేది అమితంగా ఉపయోగపడుతుంది. ఈ పానీయాన్ని తీసుకోవడం ద్వారా అనేక స్పైస్ ల ఆరోగ్య ప్రయోజనాలను గ్రహిస్తున్నారు. ఓస్మోసిస్ ద్వారా ఇవన్నీ గ్రహింపబడతాయి. తద్వారా, మైక్రోబ్స్ నశింపబడతాయి.

6. సహజసిద్ధమైన ఆపేట్టైజర్:

6. సహజసిద్ధమైన ఆపేట్టైజర్:

వేసవిలో, ఆహారాన్ని తీసుకోవాలన్న కోరిక తగ్గుతుంది. ఆపేట్టైట్ సరిగ్గా లేకపోవడం వలన ఇలా జరుగుతుంది. శరీర పనితీరు సజావుగా ఉండేందుకు ఆహారాన్ని కొద్దిగా అయినా స్వీకరించాలి. ఈ పానీయంలో వాడిన జీలకర్ర వలన ఆపేట్టైట్ మెరుగవుతుంది. జీలకర్రలో ఉండే ఆరోమా ఆయిల్స్ వలన ఇది సాధ్యపడుతుంది. ఈ అరోమాటిక్ ఆయిల్స్ అనేవి గ్యాస్ట్రిక్ స్రావాలను ఉత్తేజపరుస్తాయి. తద్వారా, ఆపేట్టైట్ ను పెంపొందిస్తాయి. కాబట్టి, వేసవిలో ఆపేట్టైట్ లాస్ సమస్య మిమ్మల్ని వేధించడం ప్రారంభిస్తే ఉదయాన్నే జల్ జీరా ను తీసుకోండి. కేవలం కొన్ని క్షణాలలోనే ఆపేట్టైట్ అనేది సాధారణ స్థితికి చేరుకుంటుంది.

7. సహజసిద్ధమైన రోగనివారిణి:

7. సహజసిద్ధమైన రోగనివారిణి:

వేసవిలో ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య తలెత్తడం సహజమే. వాంతులు అలాగే డీహైడ్రేషన్ సమస్యలు కూడా ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ వలన తలెత్తుతాయి. వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. అందువలన ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ సమస్య తలెత్తుతుంది. ఎండ వేడితో సన్ స్ట్రోక్ వలన ఫీవర్ సంభవించే ఆస్కారం కూడా ఉంది. ఇలా వేసవి కాలంలో అనేక రోగాలు దాడిచేయడం ప్రారంభిస్తాయి. వీటన్నిటికీ ఒకే ఒక్క పరిష్కారం జల్ జీరా రూపంలో అందుబాటులో ఉంది. ఇది సహజసిద్ధమైంది రోగనివారిణిగా పనిచేస్తుంది. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో వాడిన పుదీనా, కొత్తిమీర రసం మరియు అల్లం వలన ఈ పానీయానికి ఈ గుణాలు లభించాయి.

8. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది:

8. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది:

హై కేలరీ ఎరేటెడ్ బెవెరేజెస్ కు జల్ జీరా అనేది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. ఈ పానీయం కేలరీలను కరిగించేందుకు తోడ్పడుతుంది. బరువును తగ్గాలనుకునేవారు లేదా కేలరీలను ట్రాక్ చేసుకునే వారు ఈ పానీయాన్ని ఎటువంటి సందేహం లేకుండా తీసుకోవచ్చు. ఇందులో కేలరీ కంటెంట్ తక్కువగా ఉంటుంది. హై కేలరీ బెవెరేజెస్ కి బదులుగా జల్ జీరాను తీసుకుంటే ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. అదే సమయంలో కేలరీల ఇంటేక్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన లో కేలరీ డ్రింక్. ఇది రోజంతా మీ ఎనర్జీ లెవల్స్ ని బూస్ట్ చేస్తుంది.

English summary

8 Reasons To Drink Jaljeera This Summer Season

Jaljeera is essentially a form of a lemonade, spiced with a combination of roasted cumin powder, ginger powder, herbs like coriander and mint, garam masala, chilli powder, pepper and black salt. The reasons to drink jaljeera this summer are that it is a natural coolant, aids digestion, helps in weight loss, body detoxifier, increases appetite, prevents anaemia, etc.
Desktop Bottom Promotion