For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గూని తగ్గడానికి ఈ యోగా ఆసనాలు వేయండి

యోగ భంగిమల ద్వారా, వెన్నెముకను పొడవుగా చేసి, దానిని బాగా బలపరచి మరియు బిగుతైన ఛాతీ కండరాలను కలిగి ఉంచేదిగా ఉద్ఘాటిస్తుంది.

By Ssn Sravanth Guthi
|

గూనితనము (కైఫోసిస్) అనేది అసాధారణంగా వెన్నెముకకు వచ్చే వంకర రూపం, దీనిని "డౌజర్స్ హంప్" లేదా "హంచ్బ్యాక్" అని కూడా పిలుస్తారు. కైఫోసిస్ అనేది ఒక సాధారణ స్థితిలో ఉన్న వెన్నెముకకు ఏర్పడిన గజిబిజి పరిస్థితి, ఇది మొదటగా "క్రమం తప్పిన సాపేక్షస్థితి" అనబడే ఒక చిన్న సమస్యగా ప్రారంభమవుతుంది. అలా క్రమక్రమంగా ఇది మరింతగా అభివృద్ధి చెంది "హైపర్కీఫోసిస్" అనే క్లిష్టమైన సమస్యను దారితీస్తుంది.

కైఫోసిస్ శరీరము యొక్క చలన శక్తిని తరచుగా దెబ్బతీస్తుంది మరియు సాధారణ శ్వాసక్రియను ఆటంకంగా మారి, సాధారణ జీవితం యొక్క పనితీరుకు చాలా అవరోధంగా ఉంటుంది.

కైఫోసిస్ నివారించటం కోసం, వాస్తవంగా నిరూపించబడిన కొన్ని వైద్య సంబంధమైన చికిత్స పద్ధతులు ఉన్నప్పటికీ, కైఫోసిస్ వల్ల వచ్చే వంకరను (గూనిని) నివారించి, దానిని తిరిగి సరైన స్థానంలో ఉంచటం కోసం, చాలా సంవత్సరాల నుండి యోగ అనేది చాలా సమర్థవంతమైన పరిష్కారాలను చూపించి, నిరూపించబడినది.

అలాంటి, కైఫోసిస్ తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా యోగను సాధన చెయ్యాలనేది ఒక మంచి సలహా. ఈ యోగ భంగిమల ద్వారా, వెన్నెముకను పొడవుగా చేసి, దానిని బాగా బలపరచి మరియు బిగుతైన ఛాతీ కండరాలను కలిగి ఉంచేదిగా ఉద్ఘాటిస్తుంది.

ఈ కింది వాటిలో, కైఫోసిస్ చికిత్స కోసం సమర్థవంతమైన యోగాసనాలను తెలియపరిచారు. వారిని మీరు కూడా తెలుసుకొని ఆచరించండి.

1. తడాసనము :

1. తడాసనము :

తడాసనము (లేదా) పర్వత భంగిమ అనేది, శరీరంలో వున్న మొత్తం అన్ని కండరాలకూ వర్తిస్తుంది. శరీర భంగిమ(స్థితి)ను బాగా మెరుగుపరుస్తుంది. ఇది కైఫోసిస్ భారిన పడిన శరీర కండరాలన్నింటిని బలాన్ని చేకూరుస్తూ, వీపు వెనుక ఉన్న కండరాలను మరింతగా ప్రభావితం చేస్తుంది. ఈ భంగిమ సాధారణంగా కనపడినప్పటికీ, చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

2. శవాసనము :

2. శవాసనము :

శవాసనము (లేదా) శవ భంగిమ, విరామాన్ని మరియు విశ్రాంతిని తీసుకోవడానికి ఇది బాగా ప్రసిద్ధి చెందిన యోగాసనము. ఈ ఆసనములో, ఆ వ్యక్తి నిద్రపోతున్నట్లుగా కనపడుతుంది మరియు ఇది చాలా సులభమైన ఆసనము. ఇది మృతదేహమును కలిగిన భంగిమను పోలి ఉంటుంది. కనుక దీనిని "శవ భంగిమగా" కూడా పిలుస్తారు. ఇది శరీరం యొక్క కండరాలను సడలిస్తుంది మరియు సాధారణంగా ఈ యోగాసనాన్ని ఇతర ఆసనాల చివరిలో ఈ సాధన చేస్తారు.

3. భుజంగాసనము :

3. భుజంగాసనము :

భుజంగాసానమును, కోబ్రా భంగిమగా కూడా పిలుస్తారు, ఈ భంగిమ వల్ల మీ వెన్నెముక నిటారుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ ఆసనం స్థిరమైన వెన్నెముకను బాగా విస్తరిస్తుంది మరియు ఛాతీని ముందుకు తెరవటానికి బాగా సహాయపడుతుంది. నడుము క్రింద భాగంలో ఉండే వెన్నెముకకు మరింతగా వంగే గుణాన్ని కలగచేస్తూ, మరింత బలాన్ని చేకూర్చుతుంది. ఈ యోగాసనము, మీ వీపు ఉపరితల భాగంలో ఉన్న కండరాలకు తగిన శక్తిని అందజేస్తూ, మరింత దృఢంగా చేస్తుంది.

4. మర్జర్యాసనము :

4. మర్జర్యాసనము :

మర్జర్యాసనము (లేదా) పిల్లి భంగిమ, వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను సాగేటట్లుగానూ మరియు బలపరచే యోగాసనాలలో ఇది ఒకటి. వీపు పైన ఉన్న భాగాన్ని లక్ష్యంగా చేసుకుని అక్కడ ఉన్న కండరాలలో ఒత్తిడికి తగ్గించి, వాటికి ఉపశమనమును కలిగిస్తూ మంచి స్థితిని కలుగచేస్తుంది. కైఫొసిస్ చికిత్సకు ఈ ఆసనం చాలా ఉత్తమమైనదని చెప్పవచ్చు.

5. అధోముఖ స్వనాసనం :

5. అధోముఖ స్వనాసనం :

అధోముఖ స్వనాసనము అత్యంత ప్రజాదరణ పొందిన వాటిలో ఒకటి. కైఫొసిస్ నివారణ చికిత్సలో దోహదపడే ఈ భంగిమ మీ వెన్నెముకను బలపరిచేటందుకు మరియు నడుము క్రింద ఉన్న శరీర భాగమును నిర్మించటానికి ఉపయోగపడుతుంది. మన యొక్క స్థితిని (భంగిమను) మెరుగుపరుచుకోవడంలో అధోముఖ స్వనాసనము సహాయపడుతుంది మరియు వెన్నెముకను విస్తరించి, పొడిగించడంలోనూ మరియు భుజాలను బయటవైపుకు తెరుచుకునేందుకు సహాయపడుతుంది.

6. సలభాసానము :

6. సలభాసానము :

సలభాసానము (లేదా) లోకస్ట్ (మిడుత) భంగిమ, వెన్నుపూసకు యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది. ఇది ముఖ్యంగా చేతులకు, భుజాలకు, కాలి పిక్కలకు, తోడలు వంటి వాటి యొక్క వ్యాకోచాన్ని మెరుగుపరుస్తూ వెన్నునొప్పి నిరోధిస్తుంది. శరీరం యొక్క వెనుక భాగంలో ఉన్న అన్ని కండరాలను బలపరుస్తూ, వెన్నెముకను బయట వైపుకు తెరిచేటట్లుగా చేస్తుంది. ఈ యోగాసనం మీ యొక్క శరీరాన్ని ఆరోగ్యవంతమైన స్థితిలో ఉంచుతుంది.

7. ఆంజనేయాసనము :

7. ఆంజనేయాసనము :

ఆంజనేయాసనము (లేదా) చంద్రవంక భంగిమ అనేది యోగాలోనే అత్యంత ముఖ్యమైన ఆసనాలలో ఒకటి. ఈ భంగిమ వల్ల భుజాలు, ఊపిరితిత్తులు, ఉదరం మరియు ఛాతీ బాగా తెరుచుకుంటాయి. ఇది శరీరాన్ని శక్తివంతం చేస్తుంది మరియు నడుము ప్రాంతంలో ఉన్న వెన్నెముకకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడానికి, అలానే భుజము మరియు వెన్నెముక ప్రాంతంలో గాయాల ప్రమాదాన్ని నిరోధిస్తుంది.

8. సేతు బంద సర్వంగాసనము :

8. సేతు బంద సర్వంగాసనము :

సేతు బంద సర్వంగసనము "వంతెన భంగిమ" అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అది ఒక వంతెన ఆకారాన్ని పోలి ఉంటుంది. ఇది ఛాతీని, మెడను మరియు వెన్నెముకను విస్తరించే ఒక శక్తివంతమైన భంగిమ. వెన్నెముకను పునఃసృష్టించడంలోనూ, మరియు ఎగువ వెన్నుపామును బలపరిచి వెన్నునొప్పికి ఉపశమనం కలిగించడంలోనూ ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది వెన్నెముక చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ భంగిమను ఇతర ఆసనాలతో పోలిస్తే అనేక శాస్త్రీయమైన ప్రయోజనాలను కలిగి ఉన్నాయి.

English summary

8 yoga poses for kyphosis

8 yoga poses for kyphosis
Story first published:Monday, January 22, 2018, 19:10 [IST]
Desktop Bottom Promotion