For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతిరోజూ ఉదయం పసుపును కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి తెలుసుకోండి !

ప్రతిరోజూ ఉదయం పసుపును కలిపిన గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గూర్చి తెలుసుకోండి !

|

మనలో చాలామందికి ఉదయాన్నే వేడినీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి బాగా తెలుసు. ఇది లోపల నుండి శరీరాన్ని శుభ్రపరిచి, జీర్ణాశయ వ్యవస్థ నుంచి విష వ్యర్థాలను వడబోసి మీ జీవక్రియను మెరుగుపరచడమే కాక, మీ చర్మాన్ని కూడా పరిరక్షిస్తుంది. కానీ మీకు తెలియని విషయం ఏమంటే, మీరు తీసుకునే వెచ్చని నీటిలో కొంచెం పసుపును జోడించినట్లయితే కలిగే ఫలితాలు చాలా ఎక్కువ గా ఉంటాయి ! వేడినీటిలో పసుపును జోడించడం వల్ల మీకు చేకూరే దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉత్తమంగా ఉంటాయి. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం !

9 Benefits Of Drinking Warm Water With Turmeric In The Morning
1. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది :-

1. మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది :-

ధమనుల్లో ఫలకములను పెంపొందించి స్ట్రోక్ (లేదా) గుండెపోటు వచ్చే పరిస్థితులకు కారణమైన కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలోనూ & ఎథెరోస్క్లెరోసిస్ను నివారించటంలో పసుపు తనదైన పాత్రని పోషిస్తుంది. ధమనుల గోడల మీద ఉన్న రక్తం గడ్డలను నివారించడంలో పసుపు బాగా సహాయపడుతుంది.

2. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

2. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది :-

మీరు తరచుగా పసుపును వినియోగించడం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే క్యాన్సర్ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే కణితులను నివారించడంలో పసుపు చాలా ఉత్తమంగా పనిచేస్తుంది.

3. మెదడు కణాలను పరిరక్షిస్తుంది :-

3. మెదడు కణాలను పరిరక్షిస్తుంది :-

పసుపు అల్జీమర్స్ వ్యాధి వృద్ధి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. పసుపులో ఉన్న క్యూర్క్యూమిన్ అనే సమ్మేళనం అల్జీమర్స్ వ్యాధిలో ఉన్న లక్షణాలను నివారించడం వల్ల బీటా-అమ్లోయిడ్ ఏర్పడటాన్ని అడ్డుకుంటుంది. పసుపులో ఉండే ప్రోటీన్ మీ శరీర కణాలకు నష్టం వాటిల్లకుండా కాపాడుతుంది. అంతేకాకుండా, పసుపు నాడీ కణజాలం యొక్క వాపులను తగ్గిస్తుంది.

4. మీ చర్మం ఆరోగ్యాన్ని & ఛాయను మెరుగుపరుస్తుంది :-

4. మీ చర్మం ఆరోగ్యాన్ని & ఛాయను మెరుగుపరుస్తుంది :-

పసుపు, మీ చర్మానికి అనేక ప్రయోజనాలను అందించగలదు. సహజంగానే పసుపు రక్తాన్ని పరిశుభ్రం చేస్తుంది, అలా ఇది రక్తంలో ఉండే విష వ్యర్థాలను తొలగిస్తుంది. పసుపు కూడా యాంటిఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, మీ చర్మానికి నష్టాన్ని కలుగజేసే ఫ్రీ-రాడికల్స్తో పోరాడి, మీ చర్మం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలా మీ చర్మాన్ని మరింత కాంతివంతంగా తయారు చేస్తుంది.

5. వాపు & మంటలను తగ్గిస్తుంది :-

5. వాపు & మంటలను తగ్గిస్తుంది :-

పసుపు నీరును తాగడంవల్ల ఉమ్మడి కణజాలాలకు నష్టాన్ని కలిగించే వాపులను నిరోధిస్తుంది. అలా ఇది కీళ్లనొప్పులను & వాపులను తగ్గిస్తుంది. కాబట్టి, ఆర్థరైటిస్తో బాధపడేవారు రోజుకి ఒక గ్లాసు పసుపు కలిపిన నీళ్లను తీసుకోవటం వల్ల, ఆరోజు వారికి చాలా అద్భుతంగా ప్రారంభమవుతుంది.

6. శరీర బరువును తగ్గిస్తుంది :-

6. శరీర బరువును తగ్గిస్తుంది :-

పసుపు నీరును తీసుకోవడం వల్ల మీ శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇది మీ బరువును తగ్గించే ప్రక్రియలో సహాయకారిగా ఉంటుంది. పసుపులో ఉన్న క్యూర్క్యూమిన్ అనే సమ్మేళనం కణజాలాలలోకి కొవ్వు చేరటాన్ని నిరోధించేదిగా ఉంటుందని కనుగొనబడింది.

7. శరీరంలో షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది :-

7. శరీరంలో షుగర్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది :-

మనం తీసుకునే ఆహారంలో ఉన్న చక్కెరలను, మన శరీరం సరైన ప్రక్రియలో కిన్వణం చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచడానికి పసుపు బాగా సహాయపడుతుంది. పసుపులో ఉన్న ఈ గుణం డయాబెటిస్తో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

8. జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తుంది :-

8. జీర్ణాశయాన్ని మెరుగుపరుస్తుంది :-

పసుపు, పిత్తాశయంలో ఉన్న ఇతర ఎంజైములను ఉత్పత్తి చేయడం వల్ల మీరు తీసుకున్న ఆహారాన్ని సరైన రీతిలో జీర్ణమయ్యేలా ప్రోత్సహిస్తుంది. మీరు ఉదయాన్నే పసుపు నీరుని తాగుతూ రోజును ప్రారంభించినప్పుడు, మీరు తీసుకున్న ఆహారం సరైన రీతిలో జీర్ణమయ్యేలా చేసే చక్కటి జీర్ణవ్యవస్థను సమకూరుతుంది.

9. మీ రోగనిరోధక వ్యవస్థను తక్షణమే బలోపేతం చేస్తుంది :-

9. మీ రోగనిరోధక వ్యవస్థను తక్షణమే బలోపేతం చేస్తుంది :-

పసుపులో ఉండే లిపోపోలిసాచరైడ్స్ (ఎండోటాక్సిన్స్) శరీర రోగనిరోధక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం వల్ల జలుబు, ఫ్లూ (లేదా) అనేక ఇతర అంటువ్యాధులను ఎదుర్కొనే ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా ఈ పసుపు నీటిని తాగటం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా చలికాలంలో విస్తృతంగా వ్యాపించిన రకరకాల వైరస్ల నుండి మిమ్మల్ని రక్షించటానికి ఈ పసుపు నీరు బాగా సహాయపడుతుంది.

English summary

9 Benefits Of Drinking Warm Water With Turmeric In The Morning

Most of us know the benefits of drinking warm water first thing in the morning. It cleanses the body from the inside, flushes out toxins from the digestive system, boosts metabolism, clears skin, etc. But what you might not know is that if you add just a small amount of Turmeric to your warm water, it will benefit you even more!
Desktop Bottom Promotion