For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొద్దుటి అలసటను తగ్గించే తొమ్మిది ఉత్తమ ఆహార పదార్థాలు

|

మీరు ఉదయం లేచీలేవగానే అలసటగా అనిపిస్తుందా? ముందు రోజు రాత్రి తగినంత నిద్ర లేకపోయినా, ముందు రోజంతా విరామం లేకుండా అధిక శ్రమకు గురైనా, పొద్దుట లేవగానే అలసటగా అనిపిస్తుంది. ఈ వ్యాసంలో, పొద్దుటి పూట కలిగే అలసటతో పోరాడటానికి తోడ్పడే ఉత్తమ ఆహార పదార్థాలను గురించి తెలియజేయబోతున్నాము.

పొద్దుటి అలసట అనేక ఇతర కారణాల వలన కూడా కలగవచ్చు. వైద్య నిపుణుల అధ్యయనానుసారం, పోషకాహార లోపం వలన శరీరానికి అవసరమైన పోషకాలు లభించవు.

9 Best Foods To Fight Morning Fatigue

మీరు రోజంతా పనిచేయడానికి అవసరమైన శక్తిని పంపిణీ చేయగలిగే ఆరోగ్యకరమైన ఆహారం తప్పక తీసుకోవాలి. మన శరీరానికి అవసరమైన పోషక పదార్ధం ఏదైనా సరిపడినంత లభించకపోతే, అది శారీరక లేదా మానసిక అలసటకు కారణం అవుతుంది.

మార్కెట్లో లభించే శక్తినిచ్చే పానీయాలు ఏవి పొద్దుటి అలసట నయం చేయలేవు. సహజ ఆహారాలు మాత్రమే, మీ శక్తిని పెంచుతాయి.

ఉదయపు అలసటతో పోరాడే కొన్ని అత్యుత్తమ ఆహార పదార్థాలను గురించి తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.

1. ఓట్ మీల్

1. ఓట్ మీల్

ఓట్ మీల్ అధిక నాణ్యత కలిగిన పోషకాలు కలిగి ఉన్న కారణంగా, వీటిని సంపూర్ణ తృణధాన్యాలుగా చెప్పుకోవచ్చు. మీ దైనందిన ఆహారం నుండి తప్పిపోకూడని ఆహార పదార్థాలలో ఇది ఒకటి. ఎందుకంటే ఇది అద్భుతంగా శక్తిని అందిస్తుంది

ఓట్ మీల్ లో పీచుపదార్ధం అధికంగా ఉన్నందున జీర్ణక్రియను మెరుగుపరిచి, ఆకలిని పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్లు మరియు ఖనిజాలు

మీలోని రక్త ప్రసరణ, అభిజ్ఞాత్మక పనితీరు మరియు జీవక్రియను మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

2. ఎండు ఫలాలు

2. ఎండు ఫలాలు

ఎండు ఫలాలలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, మీలో ఆకలి మరియు ఉదయపు అలసట కలుగనివ్వవు. వీటిలోని బి కాంప్లెక్స్ విటమిన్లు మరియు కొవ్వు ఆమ్లాలు, నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని వృద్ధి పరచి, మానసిక ఆరోగ్యం మరియు ఏకాగ్రతను పెంచుతాయి. తలనొప్పి, ఆందోళన మరియు కండరాల నొప్పులను నిరోధించే, పీచుపదార్ధం మరియు యాంటీఆక్సిడెంట్లు కూడా ఎండు ఫలాలలో ఉంటాయి.

3. పాలు

3. పాలు

లాక్టోజ్ పడని వ్యక్తులు ఎలాంటి పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. కానీ లాక్టోస్ తో ఎటువంటి ఇబ్బంది లేకుంటే, ఉదయపు అలసటతో బాధపడుతున్నవారు పాలు త్రాగవచ్చు. పాలు మీ శక్తిని పెంచుకోవడానికి అవసరమైన అమైనో ఆమ్లాలు మరియు విటమిన్లు కలిగి ఉంటుంది. పాలలోని ఉండే ట్రిప్టోఫాన్ అనే ఒక అమైనో ఆమ్లం మెదడులో సెరోటోనిన్ స్రావంను ప్రేరేపిస్తుంది.

4. పప్పుధాన్యాలు

4. పప్పుధాన్యాలు

పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైన ఆహారంలో ఒకటి, వీటిని సులభంగా వండుకోవచ్చు. అంతేకాక వీటిలో వివిధ రకాలు ఉంటాయి మరియు మీ సంపూర్ణ ఆరోగ్యానికి అత్యవసరమైన పోషకాలను కలిగి ఉంటాయి. పప్పుధాన్యాలు, రక్తలేమిని తగ్గించే, ఇనుము మరియు ప్రొటీన్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. వీటిలో మీ శక్తి స్థాయిలను పెంచి, మరియు రక్త ప్రసరణను మెరుగుపరిచే కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి.

5. విత్తనాలు

5. విత్తనాలు

విత్తనాలు ఉదయపు అలసటతో ప్రభావవంతంగా పోరాడటానికి సహాయపడే మరొక ఆహారం. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రత్యేకించి చియా గింజలు మరియు అవిస గింజలు , మీ హృదయ ఆరోగ్యాన్ని మరియు అభిజ్ఞ శక్తిని పెంపొందిస్తాయి. పొద్దుతిరుగుడు, గుమ్మడికాయ మరియు నువ్వులలో అమైనో ఆమ్లాలు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ మెరుగుపరచడానికి మరియు మానసిక అశాంతిని నివారించడానికి సహాయపడతాయి.

6. డార్క్ చాక్లెట్

6. డార్క్ చాక్లెట్

ఉదయం పూట చురుకుగా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే డార్క్ చాక్లెట్ ముక్క ఒకటి తింటే ఎలా ఉంటుంది? డార్క్ చాక్లెట్లో ఉన్న కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లు, మీ శరీరంలోని కణాలకు శక్తిని అందిస్తాయి కనుక రోజంతా మీరు ఉత్సాహంగా పని చేస్తారు. డార్క్ చాక్లెట్ మీ నాడీ వ్యవస్థను ప్రేరేపించి, మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి కాపాడి, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

7. అరటిపండ్లు

7. అరటిపండ్లు

ఉదయం అలసటను తగ్గించే ఆహారంగా అరటిపండ్లకు మంచి పేరు ఉంది. ఈ అద్భుతమైన ఫలం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, జీర్ణక్రియను పెంపొందిస్తుంది.

అరటిలో కార్బోహైడ్రేట్లు మరియు సహజ చక్కెరలు ఉన్నందున, మీ శక్తి స్థాయిలు పెరిగి, పనితీరు మెరుగుపడుతుంది. నాడీ వ్యవస్థను సమతుల్యం చేసి, మీ ఆకలి కోరికలను హద్దుల్లో ఉంచుతుంది. అంతేకాక, మీ మూడును ఉల్లాసపరుస్తుంది కూడా! ఇన్ని ప్రయోజనాలు ఉన్నందున, బరువు పెరుగుతామేమో అనే అనుమానంతో అరటి పండును తినడం మానుకోవద్దు.

8. గ్రీన్ టీ

8. గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే కెఫీన్ మరియు ఎల్-థియనిన్ల కలయిక, మీకు శక్తిని అందిస్తుంది. అధ్యయనాల ప్రకారం, మీకు పని ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు, గ్రీన్ టీ మీ మెదడులోని శక్తిని పెంపొందించేలా చేస్తుంది. గ్రీన్ టీ మరెన్నో అసంఖ్యాకమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగి ఉంటుంది, కానీ దీనిని మరీ అధికంగా సేవిస్తే దుష్ప్రభావాలు కలుగుతాయి.

 9. సంపూర్ణ గోధుమ రొట్టె

9. సంపూర్ణ గోధుమ రొట్టె

ఉదయపు అలసటను తప్పించుకోవటం మీకు చాలా కష్టంగా ఉంటే, అల్పాహారంలో సంపూర్ణ గోధుమ రొట్టె తీసుకోండి. ఇది తినడం వలన మీకు దీర్ఘకాలిక శక్తి కలుగుతుంది. దీనిలో సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతంగా పెంచకుండా, నెమ్మదిగా పెరిగేందుకు దోహదపడుతుంది.

English summary

9 Best Foods To Fight Morning Fatigue

Health experts say that poor nutrition is a big culprit which can cause your body to lack in essential nutrients. This can lead to morning fatigue. Having energy drinks isn't the solution to cure morning fatigue. These natural foods will boost your energy such as milk, bananas, nuts, lentils, dark chocolate, green tea, whole wheat bread, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more