For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంతో ఈ 9 ఆరోగ్య సమస్యలను పూర్తిగా నివారించవచ్చు !

నిమ్మరసంతో ఈ 9 ఆరోగ్య సమస్యలను పూర్తిగా నివారించవచ్చు !

|

మీరు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు మొట్టమొదటిగా కాఫీను తీసుకోవడం వల్ల ఆ రోజు చాలా రొటీన్గా ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాసు వెచ్చని నిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల మీ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందిస్తుంది. మీ జీర్ణవ్యవస్థకు, రోగ వ్యవస్థకు & నిర్విషీకరణ ప్రక్రియకు మద్దతునిచ్చే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు & ఇతర పోషకాలతో నిమ్మ పూర్తిగా నిండిపోయింది. క్రమం తప్పకుండా ఒక గ్లాసు వెచ్చని నిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను సహజంగానే నివారిస్తుంది.

9 Health Problems You Can Cure With Lemon Juice

నిమ్మ రసాన్ని తీసుకోవడం వల్ల నయం కాగలిగే ఆరోగ్య సమస్యలను ఇక్కడ చూద్దాం !

1. జలుబును, ఫ్లూజ్వరాన్ని నివారిస్తుంది :-

1. జలుబును, ఫ్లూజ్వరాన్ని నివారిస్తుంది :-

నిమ్మలో ఉండే విటమిన్-సి, శరీరానికి సహజసిద్ధమైన ప్రతిక్షకారినిగా ఉంటుంది. విటమిన్-సి మేయర్ రోగనిరోధకశక్తిని బలపరిచి, జలుబు & ఫ్లూ జ్వరం వంటి రుగ్మతలతో పోరాడుతుంది. నిమ్మలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను చంపి, మీ శరీరానికి స్వస్థతను చేకూరుతుంది.

2. వాపులు & మంటలతో పోరాడుతుంది :-

2. వాపులు & మంటలతో పోరాడుతుంది :-

వాపులు, శరీరంలో ఆమ్లా వాతావరణాన్ని తయారుచేస్తుంది. నిమ్మరసం శరీరంలో ఉన్న ఎసిడిటీని తటస్థం చేస్తుంది, అంతేకాకుండా ఇది యాంటీ-ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తూ వాపులకు కారణమైన లక్షణాలను నిరోధిస్తుంది. వాపులు, వాతంతో సంబంధమున్న అనారోగ్య సమస్యలను & కీళ్లనొప్పులను నివారించడంలో సహజ పరిహారిణిగా నిమ్మరసం ఉపయోగపడుతుంది.

3. మీ శక్తిని, మానసిక స్థితిని పెంచుతుంది :-

3. మీ శక్తిని, మానసిక స్థితిని పెంచుతుంది :-

మీకు ఆకస్మికంగా తల-తిరగడం ప్రారంభిస్తే గనక, కాఫీకి బదులు నిమ్మరసమును తాగడానికి ప్రయత్నించండి. కాఫీలో కెఫిన్ ఉన్న కారణంగా తర్వాత మిమ్మల్ని కుప్పకూలేలా చేస్తుంది. కానీ నిమ్మ నీరులో ఉన్న ప్రతికూలాంశాలు మీ మానసిక స్థితిని & శక్తిని పెంపొందించడానికి సహాయపడతాయి. నిమ్మలో ఉండే వాసన మీ ఒత్తిడి స్థాయిలు తగ్గించేదిగా కనుగొనబడింది.

4. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది :-

4. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది :-

నిమ్మలో ఉండే పరమాణువుల నిర్మాణం కడుపులో కనిపించే జీర్ణరసాల నిర్మాణాన్ని పోలి ఉంటుంది. నిమ్మరసం తాగడం వల్ల కాలేయంలో బైల్ ఉత్పత్తిని ప్రేరేపించి, మీ శరీరమంతటికీ ఆహారాన్ని సరఫరా చేసే విధంగా కదిలిస్తుంది. అజీర్ణము నుండి ఉపశమనం కలిగించడంలోనూ & కడుపు ఉబ్బరాన్ని శాంతాపరుచుటలోనూ నిమ్మరసం బాగా సహాయపడుతుంది.

5. నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది :-

5. నిర్విషీకరణ ప్రక్రియకు సహాయపడుతుంది :-

నిమ్మలో ఉన్న ఆమ్లాలు శరీరంలోని పోషకాలను నెమ్మదిగా ప్రాసెస్ చేయడానికి ప్రోత్సహకారిగా ఉంటాయి. మీరు తిన్న ఆహరాల నుండి పోషకాలను పొందడమే కాకుండా, ఇన్సులిన్ స్థాయిలను అధ్యయనం చేయడానికి అనుమతిస్తుంది. శరీరంలో ఉన్న హానికరమైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపేలా కాలేయాన్ని ప్రేరేపిస్తుంది తద్వారా మీ చర్మాన్ని, శరీరాన్ని కాంతివంతంగా చేస్తుంది.

6. బరువును కోల్పోయేలా చేస్తుంది :-

6. బరువును కోల్పోయేలా చేస్తుంది :-

నిమ్మ లో ఉన్న పాలీఫినోల్ యాంటీ ఆక్సిడెంట్లు గణనీయంగా మీ శరీర బరువును తగ్గించటమే కాక, ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచగలవని జంతువుల పై చేసిన అధ్యయనాలలో నిరూపించబడ్డాయి. అవే ఫలితాలు మనుషుల్లో కూడా సంభవించవచ్చని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 7. అధిక రక్తపోటును తగ్గిస్తుంది :-

7. అధిక రక్తపోటును తగ్గిస్తుంది :-

నిమ్మలో ఉండే పొటాషియం అధిక రక్తపోటును, మైకమును & వికారాన్ని నియంత్రించటంలో సహాయపడుతుంది. అధిక రక్తపోటు, ఒత్తిడి, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మరసమును తాగటం వల్ల వారి శరీరానికి & మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.

8. కిడ్నీలో స్టోన్స్ను నిరోధిస్తుంది :-

8. కిడ్నీలో స్టోన్స్ను నిరోధిస్తుంది :-

నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్, కిడ్నీలో ఉంటే రాళ్ళను నివారించడానికి సహాయపడుతుందని బలంగా నమ్ముతారు. మీరు సిట్రిక్ యాసిడ్ను అధికంగా తీసుకోవడం వల్ల మీ కిడ్నీలో కొత్తగా ఏర్పడే క్యాల్షియం రాళ్ళ ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్ళను నిరోధించడానికి నిమ్మరసమును అధికంగా తీసుకోవడం ద్వారా మీ శరీరానికి ఎక్కువ మోతాదులో సిట్రిక్ ఆమ్లం అందుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

9. చర్మ సమస్యలతో పోరాడుతుంది :-

9. చర్మ సమస్యలతో పోరాడుతుంది :-

చర్మ సమస్యల నివారణలో సహజ క్రిమినాశినిగా నిమ్మరసం పనిచేస్తుంది. సూర్యతాపం వల్ల మీ చర్మానికి కలిగే నొప్పిని తగ్గించడానికి & మొటిమలు, తామర కారణంగా మీ చర్మంపై ఏర్పడిన వాపులను, మంటలను తగ్గించడానికి నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మ, విటమిన్-సి గా కూడా పనిచేస్తుంది ! ఇది మీ చర్మాన్ని మరింత ఆరోగ్యవంతంగా, కాంతివంతంగా తీర్చిదిద్దడంలో అడ్డంకులుగా ఉన్నా ముడతలను, బ్లాక్ హెడ్స్ను తొలగించడానికి ఉపకరిస్తుంది.

English summary

9 Health Problems You Can Cure With Lemon Juice

Lemons are packed with antioxidants, vitamins and other nutrients that support your digestive system, immune system and even your body’s detoxification process. Consuming lemon water on a regular basis can help naturally clear up several health issues.
Desktop Bottom Promotion