For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇలా 10 రకాలుగా నీళ్లు త్రాగటం ద్వారా బరువు తగ్గొచ్చు అనే విషయం మీకు తెలుసా ?

By R Vishnu Vardhan Reddy
|

ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి అత్యవసరంగా అవసరమైన వాటిల్లో, నీరు ప్రదానం అయినది. చాలా సందర్భాల్లో, పెద్దలు తగినంత నీరు త్రాగమని తరచూ చెబుతుంటారు. మన శరీరంలో 73% నీరు ఉంటుంది. అవయవాలన్నీ సక్రమంగా పనిచేయడానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అంతేకాకుండా శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను నియంత్రించడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఈ రకమైన పనులన్నీ ఒక ఎత్తు అయితే, మనం తీసుకొనే ఆహారంలో ఉండే పోషకాలను ఆహారం నుండి కణజాలాలకు చేర్చడంలో మరియు మన శరీరానికి తగినంత శక్తిని అందించే ప్రక్రియలో భాగంగా నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కానీ, చాలామంది ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, నీటిని ఉపయోగించి బరువుని కూడా తగ్గించవచ్చు అని ఈ మధ్య తరచూ వింటున్న అంశం. అంటే దీనర్ధం నీరు తాగగానే కొవ్వు దానంతట అది కరిగిపోతుంది అని అర్ధం కాదు. నీరు తాగటం వల్ల మీకు ఆకలి తగ్గుతుంది మరియు శరీరంలో ఉండే విషపదార్ధాలు బయటకు వెళ్లిపోతాయి.

కాబట్టి, ఇప్పుడు మనం నీరు 10 రకాలుగా త్రాగటం వల్ల అది ఎలా బరువుని తగ్గిస్తుంది అనే విషయం మనం తెలుసుకోబోతున్నాం. వీటికి తోడు సరైన మోతాదులో నీరుని తీసుకోవడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది, తలనొప్పి తగ్గుతుంది మరియు మీ శరీరానికి ఓ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

మీ శరీరంలో నీరు సరైన మోతాదులో గనుక ఉంటే శరీరం త్వరగా అలసి పోదు మరియు ఉత్సాహంగా ఉంటారు. వయస్సుకు వచ్చిన మనిషి ఒక రోజు కనీసం ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగాలి. ఈ నీటిని అంతా ఒకేసారి త్రాగనవసరం లేదు. త్రాగిన ప్రతిసారి ఒకే మోతాదులో త్రాగేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ శరీరంలో ఎప్పుడూ నీరు అవసరమైన మేర ఉండి, శరీరంలో ప్రక్రియలన్నీ సక్రమంగా సాగుతాయి.

9 రకాలుగా నీరు త్రాగితే ఎలా బరువు తగ్గుతాము అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.

1. నిండుతనాన్ని కలిగించే భావన :

1. నిండుతనాన్ని కలిగించే భావన :

మీరు ఎప్పుడైనా విపరీతమైన ఆకలితో ఉంటే మరియు ఒక్క ఉదుటున ఒక ప్లేట్ బిరియాని తినేయగలను అని మీకు గనుక అనిపిస్తే, అటువంటి సమయంలో మీరు ఆహారం తినే ముందు ఒక గ్లాస్ నీటిని త్రాగండి. కొన్ని క్షణాల వ్యవధిలోనే మీ కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా, మీరు అధికంగా ఆహారాన్ని తీసుకోవడం తగ్గుతుంది. దీని ఫలితంగా మీ శరీరం లోకి అధిక కొవ్వు వచ్చి చేరదు.

2. మీ కండరాలు శక్తివంతంగా మారడంలో సహాయపడుతుంది :

2. మీ కండరాలు శక్తివంతంగా మారడంలో సహాయపడుతుంది :

వ్యాయామానికి తోడు, మీ కండరాలను శక్తివంతంగా మార్చడంలో నీరు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు వ్యాయామానికి వెళ్లే ముందు సరైన మోతాదులో నీటిని తీసుకోండి. కండరాలల్లో ఉండే నీరు మీకు కావాల్సిన శరీరాకృతిని ఇవ్వడానికి తోడ్పడుతుంది మరియు వ్యాయామం చేసే సమయంలో మీ కండరాలు పెరగటానికి దోహదపడుతుంది. మీ కండరాలు ఎప్పుడైతే పెరుగుతాయో, అటువంటి సమయంలో మీరు విపరీతమైన మరియు శక్తివంతమైన వ్యాయామాలు ఎక్కువసేపు చేయగలరు. ఈ మార్గం ద్వారా మీరు మరిన్ని కేలరీలను కరిగించుకోగలరు మరియు మీ శరీర బరువు కూడా తగ్గటానికి ఈ ప్రక్రియ కీలకంగా వ్యవహరిస్తోంది.

3. సరైన జీర్ణ ప్రక్రియ చోటు చేసుకోడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది :

3. సరైన జీర్ణ ప్రక్రియ చోటు చేసుకోడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది :

సాధారణంగా అజీర్ణం వల్లనే చాలామంది బరువు పెరుగుతుంటారు. ఇది ఒక ప్రధానమైన సమస్య. మీరు గనుక ఉబ్బిన కడుపు సమస్యతో బాధపడుతుంటే, అవసరమైన మేర నీరు తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా మీ జీర్ణ ప్రక్రియ సజావుగా సాగుతుంది. మన లాలాజలం ఉత్పత్తి ఎక్కువ శాతం నీటి నుండే జరుగుతుంది మరియు దీనివల్ల పీచు పదార్ధాలన్నీ శరీరంలోకి త్వరగా కలిసిపోతాయి. అంతేకాకుండా ఏ విషపు పదార్ధాలు అయితే శరీరంలో ఉండి కొవ్వుని పెంచి పోషిస్తాయో వాటన్నింటిని నీరు బయటకు తరిమికొడుతుంది.

4. కీళ్ల దగ్గర కందెనలా ఉపయోగపడుతుంది :

4. కీళ్ల దగ్గర కందెనలా ఉపయోగపడుతుంది :

కీళ్ల దగ్గర నీరు ఒక కందెనలా ఉపయోగపడుతుంది. శరీరంలో సరైన మోతాదులో నీరు ఉంటే, కీళ్ల మధ్య కూడా అందుకు సంబంధించిన ద్రవం సరైన మోతాదులో ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా గనుక ఉంటే, పుండ్లు పడటం మరియు గాయాలవ్వడం వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. వ్యక్తులు ఎవరైతే కీళ్ల నొప్పుల వల్ల బాధపడుతుంటారో, అటువంటి వ్యక్తులు సరైన మోతాదులో నీటిని తీసుకోవడం మంచిది. ఇలా చేయడం ద్వారా నీరు ఒక కందెనలాగా ఆ నొప్పి ఉన్న ప్రదేశాల్లో చొచ్చుకెళ్లి నొప్పిని తగ్గిస్తుంది.

5. వ్యర్ధ పదార్ధాలను మరియు విష పదార్ధాలను తీసివేస్తుంది :

5. వ్యర్ధ పదార్ధాలను మరియు విష పదార్ధాలను తీసివేస్తుంది :

శరీరంలో ఉండే విషపు పదార్ధాలను మలమూత్ర విసర్జన ద్వారా బయటకు పంపడంలో నీరు కీలక పాత్ర పోషిస్తుంది. సరైన మోతాదులో నీరు గనుక తీసుకుంటే ఈ ప్రక్రియలన్నీ సాధారణంగా సజావుగా సాగుతాయి. అంతేకాకుండా మీరెప్పుడు ఉత్సాహంగా మరియు ఉల్లాసంగా ఉంటారు. అంతేకాకుండా, నీరు జీవక్రియను సరైన పద్దతిలో నడిచేలా చేసి కొవ్వుని తగ్గించి చివరకు దానిని శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ఈ విధంగా మీరు నాజూకుగా తయారవుతారు మరియు మీ శరీరంలో పేరుకుపోయి ఉన్న కొవ్వు కూడా బయటకు వెళ్ళిపోతుంది.

6 . నీటిలో అస్సలు కేలరీలు ఉండవు :

6 . నీటిలో అస్సలు కేలరీలు ఉండవు :

మనలో చాలామంది నీరు త్రాగటాన్ని అస్సలు ఇష్టపడరు. దీనికి బదులు వివిధరకాల పానీయాలను త్రాగటానికి మొగ్గుచుపుతుంటారు. కానీ, ఆ శీతల పానీయాల్లో వివిధరకాల చక్కెర పదార్ధాలు ఉంటాయి. ఇవి బరువుని అమాంతం పెంచేస్తాయి. అయితే, వీటికి బదులు సాధారణమైన నీటిని త్రాగటం చాలా మంచిది. ఎందుకంటే, ఇందులో ఎటువంటి క్యాలోరీలు ఉండవు మరియు బరువు కూడా మీరు అస్సలు పెరిగారు.

7. శక్తి స్థాయిలు బాగా పెరిగేలా ప్రేరేపిస్తుంది :

7. శక్తి స్థాయిలు బాగా పెరిగేలా ప్రేరేపిస్తుంది :

మీరు గనుక మీ శక్తి స్థాయిలను ప్రేరేపించుకోదలిస్తే, పెంచుకోదలిస్తే అవసరమైనంతమేర నీటిని త్రాగి మీ శరీరానికి నీటి కరువు తీర్చండి. మీలో ఎప్పుడైతే శక్తి ఎక్కువగా ఉంటుందో, అప్పుడు మీలో వ్యాయామం చేయాలనే కసి కూడా ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మీలో కేలరీలు మరింతగా కరుగుతాయి.

8. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

8. రోగనిరోధక శక్తిని పెంచుతుంది :

శరీరంలో పనులన్నీ సవ్యంగా జరగడానికి మరియు రోగనిరోధక శక్తి పెరగటానికి నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకొని పని చేయకపోతే, అటువంటి సమయంలో మీరు వ్యాధుల భారిన పడతారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థకు కూడా ఆ వ్యాధులపై పోరాడే శక్తి కూడా ఉండదు. మీరు గనుక ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉంటూ ప్రతిరోజూ మీ దైనందిక జీవితాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా గడిపేయాలని భావిస్తున్నట్లైతే, క్రమం తప్పకుండా కావలిసినంత నీటిని త్రాగటం మర్చిపోకండి.

9. జీవ ప్రక్రియను మెరుగు పరుస్తుంది :

9. జీవ ప్రక్రియను మెరుగు పరుస్తుంది :

మీ శరీరంలో ఉన్న అధిక కిలోల బరువు తగ్గాలంటే సరైన జీవక్రియ చాలా అవసరం. ఇది సవ్యంగా జరగాలంటే సరైన మోతాదులో నీరు త్రాగటం ఇంకా అవసరం. మీ జీవక్రియ ఎంత బాగా పనిచేస్తుందో అటువంటి సమయంలో అంత ఎక్కువగా కేలరీలు ఈ ప్రక్రియలో భాగంగా కరుగుతాయి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వుని సాధ్యమైనంత మేర తగ్గించుకోవచ్చు.

English summary

9 Ways Drinking More Water Can Help You Lose Weight

9 Ways Drinking More Water Can Help You Lose Weight,Water aids in satiating your appetite and in removing the toxins from the body. Have a look at how drinking more water can help you lose weight.
Story first published: Sunday, February 11, 2018, 14:00 [IST]