For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వాయు కాలుష్యం వలన లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్న యూత్ : అధ్యయనం

వాయు కాలుష్యం వలన లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్న యూత్ : అధ్యయనం

|

భారత్ లోని అనేకమంది లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 ఏళ్ళ వయసుకంటే తక్కువ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

లంగ్ కేర్ ఫౌండేషన్ తో కలిసి ఢిల్లీకి చెందిన సర్ గంగా రామ్ హాస్పటల్ (SGRH), వారు నిర్వహించిన ఒక అధ్యయనంలో లంగ్ క్యాన్సర్ బారిన పడిన వారిలో స్మోకింగ్ అలవాట్లు ఏ మాత్రం లేని వారు 50 శాతం మంది ఉన్నట్లు తెలుస్తోంది.

మార్చ్ 2012 నుంచి జూన్ 2018 నుంచి ట్రీట్మెంట్ సక్సెస్ అయిన 150 పేషంట్స్ లో 74 మంది నాన్ స్మోకర్స్ అని 76 మంది స్మోకర్స్ అని తేలింది.

Air pollution causing lung cancer among youths: Study

కాలుష్యం వలన లంగ్ క్యాన్సర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. పారిశ్రామక అలాగే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం లంగ్ క్యాన్సర్ కి దారి తీసే ప్రధాన కారకం. యూత్ అలాగే మహిళలు ఈ సమస్య బారిన అధికంగా పడుతున్నారు. కాలుష్యం వలన క్యాన్సర్ బారిన పడుతున్న కేస్ లు విపరీతంగా పెరగడం ఆందోళనకర విషయమని గంగా రామ్ హాస్పిటల్ కి చెందిన చెస్ట్ ఫిజీషియన్ నీరజ్ జాయిన్ తెలుపుతున్నారు.

SGRH కి చెందిన సెంటర్ ఫర్ చెస్ట్ సర్జరీ ఛైర్మన్ అరవింద్ కుమార్ ప్రకారం పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎక్కువగా వాయుకాలుష్యానికి గురవుతున్నారని అందుకే లంగ్స్ అనేవి కాలుష్యం వలన ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నాయని తెలుస్తోంది.

Air pollution causing lung cancer among youths: Study

"గాలిలోని పిఎం 2.5 లెవెల్ పొల్యూషన్ అనేది ఒక రోజులో ఒక సిగరెట్ ని తీసుకోవడంతో సమానం. అందువలన, నవజాత శిశువులు చెడు గాలిని పీల్చడం వలన లంగ్ క్యాన్సర్ వారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువలన, తరచూ చెక్ అప్స్ చేసుకోవాలి." అని అంటున్నారు.

అలాగే దాదాపు 30 శాతం మంది పేషంట్స్ అనేవారు ట్యూబర్ క్యులోసిస్ బారిన పడ్డారని మిస్ డయాగ్నైజ్ చేయబడ్డారు. అందువలన, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కాస్త ఆలస్యంగా మొదలవుతోంది.

English summary

Air pollution causing lung cancer among youths: Study

Air pollution has emerged as a major factor for lung cancer in India, especially among those below the age of 40, suggests a new study.The study, conducted by Sir Ganga Ram Hospital (SGRH), Delhi, along with Lung Care Foundation, found that 50 per cent of cancer patients are non-smokers.
Story first published:Thursday, August 2, 2018, 17:19 [IST]
Desktop Bottom Promotion