For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వక్షోజాలు బాగా పెరగాలన్నా.. ఇళ్లు అందంగా ఉండాలన్నా.. ఇంకా చాలా వాటికి క్యాబేజీ అవసరమే

మనం ఆహారంగా తీసుకునే క్యాబేజీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి. క్యాబేజీ ఉపయోగాలు, క్యాబేజీ ప్రయోజనాలు

|

మనం ఆహారంగా తీసుకునే క్యాబేజీలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. నొప్పులను నివారించే గుణాలు, శరీర అందాన్ని ఇనుమడింపజేసే ఔషధ కారకాలు కూడా క్యాబేజీలో ఉన్నాయి. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల కలిగే లాభాలతోపాటు ఇది ఏయే రకాల అనారోగ్యాలకు ఔషధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాపులను తగ్గించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. శరీరంలో ఏదైనా ప్రదేశంలో వాపులుంటే రాత్రి పడుకునే ముందు వాటిపై కొన్ని క్యాబేజీ ఆకులను ఉంచితే సరిపోతుంది. తెల్లవారే సరికి వాపులు తగ్గుముఖం పడతాయి.

రాత్రి పూట పడుకునే ముందు

రాత్రి పూట పడుకునే ముందు

శరీర పెరుగుదలకు, మెటబాలిజం ప్రక్రియకు థైరాయిడ్ గ్రంథులు అత్యంత కీలకమని అందరికీ తెలిసిందే. అయితే వీటి పనితీరు మెరుగు పడాలంటే రాత్రి పూట పడుకునే ముందు కొన్ని క్యాబేజీ ఆకులను గొంతుపై ఉంచితే సరిపోతుంది. శరీరానికి కలిగే నొప్పులను తగ్గించడంలో క్యాబేజీ ఆకులు సమర్థవంతంగా పనిచేస్తాయి. తలనొప్పిని తగ్గించడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. పాలిచ్చే తల్లులకు ఒక్కోసారి వక్షోజాలు, నిపుల్స్‌లో నొప్పి, మంట కలుగుతాయి. దీన్ని నివారించాలంటే కొన్ని క్యాబేజీ ఆకులను రాత్రంతా వాటిపై ఉంచితే చాలు.

శరీర పనితీరు మెరుగవుతుంది

శరీర పనితీరు మెరుగవుతుంది

శరీరంలోని వ్యర్థపదార్థాలను బయటకు పంపించడంలో క్యాబేజీ బాగా పనిచేస్తుంది. తరచూ క్యాబేజీని తీసుకుంటే శరీర పనితీరు మెరుగవుతుంది. క్యాబేజీలో సల్ఫర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది చర్మానికి అందాన్నిస్తుంది. వెంట్రుకలను సంరక్షిస్తుంది. పలు రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి. క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఇందులోని పొటాషియం రక్తనాళాలను తెరుచుకునేలా చేసి రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.

బరువు తగ్గాలనుకునుకుంటే

బరువు తగ్గాలనుకునుకుంటే

బరువు తగ్గాలనుకునే వారికి క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. పచ్చి క్యాబేజీ జ్యూస్ తాగితే ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయి. దంతాలను తెలుపుగా చేయడంలో క్యాబేజీ అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని తరచూ తీసుకుంటే దంత సంబంధ వ్యాధులు కూడా తొలగిపోతాయి.

ఆర్నమెంటల్‌ క్యాబేజీలు

ఆర్నమెంటల్‌ క్యాబేజీలు

ఇక ఇంటిని అలంకరించేందుకు క్యాబేజీ పువ్వులు బాగా ఉపయోగపడతాయి. వీటినే ఆర్నమెంటల్‌ క్యాబేజీలుగానూ పిలుస్తారు. తోట అలంకరణకు ఇదొక వైవిధ్యమైన ఎంపిక.మామూలుగా క్యాబేజీ అంటే ఆకుపచ్చ నుంచి తెలుపు రంగులో ఉంటుంది. కానీ ఈ అందమైన క్యాబేజీలు మాత్రం గులాబీ, పీచ్‌, వంగపువ్వు, గోధుమ... ఇలా విభిన్న రంగులూ, వాటి మిశ్రమ వర్ణాల్లో ఆకట్టుకుంటాయి. క్యాబేజీ మొక్కలో, చుట్టూ ఆకులు విచ్చుకున్నట్టు ఉండి వాటి మధ్యలో ఆకులన్నీ కలిసి ఓ బంతిలా కనిపిస్తాయి. ఆ బంతిలాంటిదాన్నే మనం కోసుకుని, క్యాబేజీగా వాడుకుంటాం.

వివిధ రంగుల్లో

వివిధ రంగుల్లో

ఈ అందాల క్యాబేజీ రకాల్లో ఆ బంతిలాంటి భాగం గులాబీని పోలి విచ్చుకుంటుంది. అలా విచ్చుకునే రేకులు మనం నాటిన రకాన్ని బట్టి వివిధ రంగుల్లో కనిపిస్తాయి. చల్లని వాతావరణాలు ఉండేచోట ఈ రంగులు ముదురు వర్ణంలోకి మారుతూ మనోహరంగా దర్శనమిస్తాయి. కొన్నిచోట్ల వీటికి మరింత అందాన్ని అద్దేందుకు కృత్రిమ పద్ధతుల్ని ఉపయోగించి నీలంలాంటి భిన్నమైన రంగుల్నీ తెప్పిస్తున్నారు.

రెండు మూడు నెలల పాటు

రెండు మూడు నెలల పాటు

మొట్టమొదటగా ఈ రకం క్యాబేజీలను జపాన్‌వాళ్లు పండించారట. ఇవి చూసేందుకు బాగుండటంతో తర్వాత్తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచాయి. వీటిని ఎక్కువగా పూల తోటలను విభిన్నంగా తీర్చిదిద్దేందుకు వాడతారు. వంగపువ్వు రంగూ, గోధుమా, గులాబీ రంగుల క్యాబేజీలను వరుసలుగా వేసి వాటి చుట్టూ ఆకుపచ్చటి చెట్లను పెంచుతూ తోటను ముస్తాబుచేస్తారు. మామూలు పువ్వుల రేకులంటే సుకుమారంగా ఉంటాయి కనుక మహా అయితే వారం రోజుల పాటు బాగుంటాయి. కానీ వీటిలో మధ్యలోని ఆకులే రంగుమారతాయి కనుక రెండు మూడు నెలల పాటు ఇవి అందంగా కనువిందు చేస్తాయి.

బొకేలూ, ఫ్లవర్‌వేజుల్లోనూ

బొకేలూ, ఫ్లవర్‌వేజుల్లోనూ

ఇక కుండీలూ, ఫ్లవర్‌బెడ్లూ, పెరటిలోనూ వీటిని పెంచుకుంటారు. ఈ క్యాబేజీ పువ్వుల్లో చిన్నసైజులో ఉండేవాటిని బొకేలూ, ఫ్లవర్‌వేజుల్లోనూ ఉపయోగిస్తారు. క్యాబేజీ జాతికే చెందిన కేల్‌ రకం మొక్కలూ ఇదే తరహాలో భిన్న రంగుల్లో ఆకట్టుకుంటాయి. ఇక ఈ అలంకరణ మొక్కల్లో కొన్ని ముద్దగా పువ్వు పూసినట్టు కనిపిస్తే, కొన్నింటి రెక్కల కొసలు వంకర టింకరగా ఉండి చూసేందుకు చిత్రంగా కనిపిస్తాయి.

వంగపండు రంగులోకి

వంగపండు రంగులోకి

మొత్తంగా... మధ్యలో ఓ నిండు రంగు ఉండి చుట్టూ ఆకుపచ్చ రంగు ఉండటం ఈ క్యాబేజీపూల ప్రత్యేకత. కొన్నింటిలో అయితే ఆ చుట్టూ ఉండే ఆకులు కూడా వంగపండు రంగులోకి మారిపోయి కనిపిస్తాయి. ఇక, ఈ క్యాబేజీల్ని కొన్ని రకాల వంటకాలతోపాటు రెస్టారెంట్లలో సలాడ్లలాంటి వాటి అలంకరణలో ఉపయోగిస్తారట.

వక్షోజాలు అందవిహీనంగా మారితే

వక్షోజాలు అందవిహీనంగా మారితే

వక్షోజాలు అందవిహీనంగా మారిపోతే.. క్యాబేజీ ఆకులను వాడాలి. ఎలాగంటే..? క్యాబేజీ ఆకులను తీసుకుని రాత్రి నిద్రించే ముందు.. చపాతీలు రుద్దుకునే దానిపై వుంచి రెండుసార్లు దంచుకోవాలి. ఆపై ఆ ఆకులను వక్షోజాలపై రాత్రి పూట అలానే వుంచి.. ఉదయం తొలగించాలి. ఇలా నెల రోజులు చేయడం ద్వారా వక్షోజాల సైజులు క్రమంగా వుంటాయి. వక్షోజాలు అందంగా మారుతాయి.

మోకాళ్ల నొప్పులు కాకుండా

మోకాళ్ల నొప్పులు కాకుండా

అలాగే రాక్రి నిద్రించే ముందు క్యాబేజీ ఆకులను చిదిమిన తర్వాత మోకాలిపై పూర్తిగా ఆకును పెట్టి బ్యాండేజీ క్లాత్ లేదా ప్లాస్టర్‌తో చుట్టేయాలి. ఇలా చేస్తే మోకాళ్ల నొప్పులు కాకుండా కాలిపై ఇతర భాగాల్లో నొప్పి ఎక్కడున్నా ఇలా క్యాబేజీ ఆకులతో చుట్టేస్తే మంచి ఫలితం వుంటుంది.

ఇన్ని రకాల లాభాలు

ఇన్ని రకాల లాభాలు

ఇంకా ప్రతి రోజూ క్యాబేజీ జ్యూస్‌ను తాగితే బరువు తగ్గుతారు. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. యాంటీ ఇన్ఫర్మేటరీ లక్షణాలు ఉన్న క్యాబేజీ నొప్పులను తగ్గించేందుకు ఉపయోగపడుతాయి. క్యాబేజీలో సల్ఫర్‌ సమృద్ధిగా ఉంటుంది. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే గుణాలు క్యాబేజీలో ఉన్నాయి క్యాబేజీ రక్తపోటును నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. క్యాబేజీ వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయి. మీరు ట్రై చేయండి.

English summary

amazing benefits of cabbages for skin hair and health

amazing benefits of cabbages for skin hair and health
Desktop Bottom Promotion