For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వంద భోజనాల వల్ల కలిగే శక్తి ఒక్క కప్పు హలీంతో వస్తుంది భయ్.. మస్త్ మజా ఉంటది

నిజాం కాలంలోనే కాదు.. ఇప్పటికీ ఎప్పటికీ నోరూరించే ఆ వంటకం హలీమ్‌. మినీ భారత దేశంలా భిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్ లో ఒక్క ముస్లింలే కాకుండా కులమత ప్రమేయం లేకుండా హైదరాబాదీలంతా హలీమ్‌ తింటారు.

|

నిజాం కాలంలోనే కాదు.. ఇప్పటికీ ఎప్పటికీ నోరూరించే ఆ వంటకం హలీమ్‌. మినీ భారత దేశంలా భిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్ లో ఒక్క ముస్లింలే కాకుండా కులమత ప్రమేయం లేకుండా హైదరాబాదీలంతా హలీమ్‌ రుచిని ఆస్వాదిస్తుంటారు

ఇప్పుడు ఆన్‌లైన్లో ఆర్డరిస్తే నిమిషాల్లో వేడి వేడిగా మనముందు ప్రత్యక్షమవుతుంది. అరబ్‌, పర్షియన్‌ సేనలతో పాటు అరబిక్‌ ఎడారుల మీదుగా ప్రయాణించి హైదరాబాద్‌ చేరిన ఈ హలీమ్‌ వెనకాల కథలు చాలానే ఉన్నాయి.

ముస్లింల వంటకం కాదు

ముస్లింల వంటకం కాదు

హలీమ్‌ కేవలం ముస్లింల వంటకం మాత్రమే కాదనీ చాలా పురాతన ఆహారమనీ పర్వత ప్రాంతాల్లో నివసించే కుర్దులు తినేవారనీ అంటారు వంటకాలపై పరిశోధన చేసిన క్లాడియా రోడెన్‌. లెబనీయులూ, సిరియన్‌ క్రిస్టియన్లూ చర్చిల వద్ద పేదలకు పంచి పెట్టడానికి పెద్ద మొత్తంలో దీన్ని తయారుచేసేవారనీ చెప్తారు. ఇరాక్‌లో దీన్ని అల్పాహారంగా తీసుకుంటారు. షియా ముస్లింలు మొహర్రం సందర్భంగా చేసుకుంటారు.

పెద్ద పెద్ద బట్టీలు

పెద్ద పెద్ద బట్టీలు

మాంసాన్ని ముక్క కన్పించకుండా మెత్తగా పేస్టులా మారేలా వండడం సంప్రదాయ పద్ధతి. అయితే ఇప్పుడు వినియోగదారులకు నమ్మకం కలిగించడానికీ ముక్కలు కన్పించేలా హలీమ్‌ తయారుచేస్తున్నారు.

హలీమ్‌ వండడానికి ఇటుకలతో పెద్ద పెద్ద బట్టీలు కడతారు.

గంటల తరబడి మంట

గంటల తరబడి మంట

పెద్ద పాత్రలు పెట్టి అవి కనపడకుండా చుట్టూ మట్టితో గోడ కట్టేస్తారు. దాని కిందనుంచీ గంటల తరబడి కట్టెలతో మంటలు పెడుతూ హలీమ్‌ వండుతారు. ఈ బట్టీల్లో తెల్లవారుజామున మూడింటికే పని మొదలవుతుంది. మాంసాన్ని శుభ్రం చేసి చిన్న ముక్కలుగా చేసి మసాలా దినుసులు కలిపిన నీటిలో ఆరుగంటలపాటు ఉడికిస్తారు.

ముక్కల ఆనవాళ్లు లేకుండా

ముక్కల ఆనవాళ్లు లేకుండా

అలా ఉడికేసరికి మాంసం ముక్కల ఆనవాళ్లు లేకుండా దాదాపు కరిగిపోయినట్లు అవుతుంది. ఆ తర్వాత నానబెట్టిన గోధుమ నూక, ఇతర పదార్థాలూ వేసి మరో మూడు గంటల పాటు సన్నని సెగమీద ఉడికిస్తారు. పొడుగాటి తెడ్లతో(ఘోట్‌నీ అంటారు వాటిని) తిప్పుతూ ఉంటారు. దాంతో అందులోని పదార్థాలన్నీ బాగా ఉడికి దాదాపు పేస్టులా తయారవుతాయి. అలా సాయంత్రం అయ్యేసరికి వేడి వేడి హలీమ్‌ వడ్డించడానికి సిద్ధమవుతుంది.

పోషకాలు పుష్కలం

పోషకాలు పుష్కలం

హలీమ్‌ మంచి పోషకాహారం. అందుకే దీన్ని సింగిల్‌ డిష్‌ మీల్‌ అంటారు. మామూలు భోజనంలో అన్నం, రొట్టెలు, పప్పు, కూరలు, చారు, పెరుగు... ఇలా చాలా రకాలు తీసుకుంటాం. కానీ హలీమ్‌ ఒక్కటి తింటే పూర్తి భోజనంతో సమానమైన పోషకాలు లభిస్తాయంటారు నిపుణులు. పన్నెండు గంటలపాటు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నవారికి తక్షణ శక్తిని అందించే ఆహారం కావడంతో ఇఫ్తార్‌ విందులో ఇది ముఖ్యమైన అంశమైంది.

శరీరానికి హానీ జరగదు

శరీరానికి హానీ జరగదు

హలీమ్‌ను ఏడాది పొడుగునా తిన్నా శరీరానికి మేలే కానీ హాని జరగదు. ఇందులో ఎక్కువ పోషకాలుండడం వల్ల త్వరగా ఆకలి తీరుతుంది. స్థూలకాయం రాదు. రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. సంతానోత్పత్తి శక్తినీ పెంచుతుంది. కెలొరీల పరంగా చూస్తే ఒక వ్యక్తికి రోజుకు కావలసిన కెలొరీల్లో దాదాపు 30 శాతం దీనితో లభిస్తాయి. హలీమ్‌ తయారీలో వాడే మాంసం, నెయ్యి తదితర పదార్థాల పరిమాణాన్ని బట్టి కెలొరీల పరిమాణం ఆధారపడి ఉంటుంది.

హలీమ్‌... శాకాహారం

హలీమ్‌... శాకాహారం

హలీమ్‌ శాకాహార వంటకంగా కూడా నగరంలో ప్రజాదరణ పొందింది. శాకాహార హలీమ్‌లో గోధుమ రవ్వతో పాటు పప్పు ధాన్యాలు వాడతారు. గోధుమ రవ్వను గంటసేపు నానబెట్టి నీటిని వడకట్టి ఎర్ర కందిపప్పుతో పాటు పెసర, శనగ పప్పులను కలిపి ప్రెజర్‌ కుక్కర్‌లో అరగంట ఉడికిస్తారు. మరో పక్క నేతిలో ఏలకులు, లవంగాలు, షాజీర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి తదితర మసాలాలన్నీ వేసి వేయిస్తారు.

పప్పుల పేస్ట్ కలిపి

పప్పుల పేస్ట్ కలిపి

అందులో ఉడికించిన పప్పుల పేస్టు వేసి బాగా కలిపి మరికాసేపు ఉడకనిస్తారు. కొంతమంది సోయా గ్రాన్యూల్స్‌ని ఉడికించి కూడా వెజ్‌ హలీమ్‌ని తయారుచేస్తారు. పలువురు ప్రముఖ షెఫ్‌లు నిర్వహిస్తున్న వెబ్‌సైట్లలో శాకాహార హలీమ్‌ తయారీ గురించి ఉంటుంది.

ఎంతో బలవర్ధకం

ఎంతో బలవర్ధకం

రంజాన్ మాసంలో హలీమ్ ఎందుకు తింటారంటే రోజంతా చేసే ఉపవాసం వల్ల నీరసం రాకుండా చేస్తుంది కాబట్టి. దానిలో నిండుగా ఉండే పోషకాలు అదనపు శక్తినిచ్చి నెల రోజుల పాటు ఉపవాస దీక్ష చేయగలిగేలా చేస్తుంది. పప్పుధాన్యాలు, నెయ్యి, తాజా మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి ఎంతో బలవర్ధకం. అందుకే హలీమ్ రంజాన్ మాసపు ప్రత్యేక ఆహారమయ్యింది.

నాన్ వెజ్ కూడా

నాన్ వెజ్ కూడా

మటన్, చికెన్ లతో పాటు వెజిటేరియన్స్ కోసం వెజ్ హలీమ్ కూడా దొరుకుతుంది. మటన్ తో చేసేదాన్ని హలీమ్ అనీ, చికెన్ తో చేసేదాన్ని హరీస్ అనీ అంటారు. పేరు ఏదైనా... పదార్థాలు ఏవైనా... వెజ్ అయినా నాన్ వెజ్ అయినా... దాని రుచి దేనికీ కాదు.

తిని తీరాల్సిందే

తిని తీరాల్సిందే

రేటు ఎంతయినా సరే... ఈ నెలలో హలీమ్ ని తిని తీరాల్సిందే మరి. హలీమ్ కి వెలకట్టగలమా.. తిన్న తర్వాత కొన్ని గంటల వరకూ నోటిని వదిలిపెట్టని ఆ రుచి కోసం ఎంతయినా ఖర్చుపెట్టొచ్చు. వంద భోజనాల వల్ల కలిగే శక్తిని ఒక్క కప్పుతో కలిగించే దాని ఘనతకి ఎన్ని వందలైనా వెచ్చించొచ్చు. తిరుగు లేని హలీమ్ కి ఎన్ని సలామ్ లైనా కొట్టొచ్చు.

English summary

amazing health benefits of having haleem

amazing health benefits of having haleem
Story first published:Friday, May 25, 2018, 15:21 [IST]
Desktop Bottom Promotion