For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆపిల్ విత్తనాలు విషపూరితమైనవా ? వాటి గూర్చి మీరు తప్పక తెలుసుకోవాలి !

|

ప్రతిరోజూ ఒక ఆపిల్ తినడం వల్ల డాక్టర్కు దూరంగా ఉండవచ్చనే సామెత వాడుకలో ఉంది. కానీ మీరు అలా తీసుకునే ఆపిల్స్లో దాని విత్తనాలను కూడా తెలియకుండానే తినడం వల్ల మీ ఆరోగ్యాన్ని విషపూరితం చేయగలవు. ఆపిల్స్ చాలా విస్తృతంగా లభించే పండ్లలో ఒకటి, ఇవి ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడతాయి & ప్రామాణికమైన తీపి రుచిని కలిగి ఉంటాయి.

పోషకాలతో సమృద్ధమైన ఈ ఆపిల్స్ యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, మన శరీరాన్ని ప్రాణాంతక వైరస్లు నుంచి, అంటే క్యాన్సర్ను ప్రేరేపించే ఆక్సిడైజేషన్లతో సహా, వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటినుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఈ విధంగా ఆపిల్ ఆకట్టుకునే ఆరోగ్య ప్రయోజనాలు చాలా సంవత్సరాల క్రితం నుండి పూర్తిగా నిరూపించబడింది.

కానీ ఇవి రుచిలో గొప్పగా ఉన్నా, దాని కేంద్రభాగంలో నల్లని గింజలను కలిగి ఉంటుంది. మనము ఆపిల్ను తినేటప్పుడు మనలో చాలామంది అనుకోకుండా 1-2 గింజలను నమిలేస్తూ ఉంటారు. ఆ ఆపిల్ గింజల గురించి మీకు వేరే కథను చెప్పాలి. ఈ ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అని పిలువబడే ఒక పదార్థాన్ని కలిగి ఉంటాయి, ఇది మానవ జీర్ణ ఎంజైమ్లతో ప్రతిచర్య చెందిన వెంటనే సైనైడ్ను విడుదల చేస్తుంది.

కానీ, ఆపిల్ విత్తనాలను తిన్న తర్వాత దానిలో ఉండే సైనైడ్ మన జీర్ణ వ్యవస్థపై ఏ విధంగా ప్రతికూల ప్రభావాలను చూపించ లేదా అని, మీరు ఇప్పటికే ఆశ్చర్య పోతూ ఉండవచ్చు ! అవును, కేవలం కొన్ని ఆపిల్ గింజలను తినడం వల్ల చేదు రుచిని తప్ప మీ శరీరం ఎటువంటి హానిని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏమీ లేదు, కానీ ఈ ఆపిల్ గింజలను మీరు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే, మీ శరీరానికి జరిగే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది.

వాటిలో ఉండే సైనైడ్ ఎలా పనిచేస్తుంది ?

చరిత్రలో విశదీకరించబడిన అనేక సామూహిక ఆత్మహత్యలకు & రసాయన పరమైన యుద్ధ తంత్రాలతో కూడా అత్యంత ప్రమాదకరమైన విషపదార్థాల సైనైడ్ ఒకటిగా ఉంది. వీటిలో ముఖ్యంగా సైనోగ్లైకోసైడ్లు అని పిలిచే ఒక సమ్మేళనము ఈ పండు గింజలలో కనబడుతుంది. చరిత్రలో జరిగిన మానవ యుద్ధాల ద్వారా సైనేడ్ అనే పేరు చరిత్ర పుటలలోకి వచ్చింది. ఈ సైనేడ్ ఆక్సిజన్-సరఫరా చేసే కణాలతో జోక్యం చేసుకుని రసాయనిక చర్యకు లోనగుట వల్ల, వీటిని అధిక మొత్తంలో వినియోగిస్తే మరణానికి దారి తీస్తుంది.


చిన్న ఆపిల్స్ కలిగి ఉండే గింజలలో కనిపించే అమిగ్దాలిన్ అనేవి కూడా ఒక రకమైన సైనైడ్స్. ఈ గింజలు ఎక్కువగా రోజ్ కుటుంబానికి చెందిన పండ్లలో అంటే నేరేడు, బాదం, ఆపిల్, పీచ్ & చెర్రీస్లలో కలిగి ఉంటుంది. ఈ అమిగ్దాలిన్ సమ్మేళనం అనేది చిన్న గింజల లోపల, దాని రసాయన రక్షణ నిలయంలో భాగంగా ఉంటుంది.

కాబట్టి, మీరు సైనైడ్ను కలిగి ఉన్న ఒక పండుని తినడం విషపూరితము కాగలదని మీరు తప్పక గుర్తుంచుకోండి. కానీ అమిగ్దాలిన్ సమ్మేళనాన్ని కలిగి ఉన్న గింజలు చెక్కుచెదరకుండా ఉన్నప్పుడు అంటే, ఈ గింజలు దెబ్బతినకుండా ఉన్నంతవరకూ అవి ప్రమాదకరం కావు. కానీ మీరు ఈ గింజలను అనుకోకుండా నమలడం, తినడం (లేదా) జీర్ణమైన తర్వాత, అందులో ఉన్న అమిగ్దాలిన్ హైడ్రోజెన్ సైనైడ్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి, అలా ఈ చిన్న గింజలు మరింత విషపూరితంగా మారి మీ ప్రాణాలకే ప్రాణాంతకం అవుతుంది.

అయినప్పటికీ, ఆపిల్ (లేదా) ఇతర పండ్లలో ఉన్న విత్తనాలు దట్టమైన బయటి పొరను కలిగి ఉంటాయి, ఇవి జీర్ణరసాలతో కలిసి జరిగే రసాయనిక చర్యలను నిరోధించాయి. కానీ అనుకోని విధంగా ఈ విత్తనాలను నమిలి మింగి నట్లయితే, అది శరీరంలో తక్కువ స్థాయిలో సైనైడ్ను ఉత్పత్తి చేస్తుంది, ఇది శరీరంలో ఉన్న ఎంజైమ్ల ద్వారా నిర్విషీకరణ చేయగలదు, కానీ ఈ పండ్ల విత్తనాలను పెద్ద మొత్తంలో వినియోగిస్తే, అది ప్రమాదకరమైన పరిణామాలను కలగజేస్తుంది.


ఎంత మోతాదులో ఉన్న సైనైడ్ ప్రాణాంతకం ?

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంట్ తెలిపిన దాని ప్రకారం, 1-2 mg/kg గా ఉన్న సైనైడ్, 154 పౌండ్లు అనగా 70 కిలోల బరువు కలిగిన వ్యక్తికి ప్రాణాంతక మోతాదుగా ఉంటుంది. దీని అర్థం, ఒక వ్యక్తి ఈ మోతాదును పొందేందుకు 20 ఆపిల్స్ నుండి 200 ఆపిల్ విత్తనాలను తీసుకోవాలి.

అయితే, ది ఏజెన్సీ ఫర్ టాక్సిక్ సబ్స్టన్సెస్ అండ్ డిసీజ్ రిజిస్ట్రీ ప్రకారం, అతితక్కువ మొత్తంలో ఉన్న సైనేడ్ కూడా మానవ శరీరానికి ప్రాణాంతకం కావచ్చని సూచిస్తున్నాయి. శరీరం సైనైడ్కు గురైనప్పుడు, అది మెదడును & హృదయాన్ని దెబ్బతీస్తుంది, అలాగే శరీరాన్ని కోమాలోకి తీసుకువెళ్ళి, ఆ తరువాత మరణానికి దారి తీయగలదు.

ఆపిల్ పండులో ఉండే విత్తనాలు (లేదా) ఆప్రికాట్లలో, పీచెస్ & చెర్రీస్ వంటి వాటిలో గల పిట్స్ను ప్రమాదవశాత్తు నమలడం నివారించాలని ఈ ఏజెన్సీ సూచించింది. ఒకసారి వీటిని తిన్నా వెంటనే, సైనైడ్ మానవ శరీరం లోపల స్పందించడం మొదలవుతుంది. ఇది అనారోగ్యాలకు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందుల వంటి లక్షణాలను కలుగజేస్తూ, స్పృహను కోల్పోయేటట్లుగా దారితీస్తుంది.

English summary

Are apple seeds poisonous? Here’s all you need to know

Apple is one of the most popular fruit which is extremely good for your health. Eating the flesh of the apple has numerous benefits; but consuming its seeds in large quantities can be fatal for you, as they contain a chemical compound called Amygdalin, which can release cyanide when it comes in contact with our digestive enzymes.