For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆయుర్వేదం మరియు డయాబెటిస్: డయాబెటిస్ ను ట్రీట్ చేసే 7 ఆయుర్వేదిక్ చిట్కాలు

|

ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్ ప్రకారం 2017లో ఇండియాలో దాదాపు 72 మిలియన్ల డయాబెటిక్ పేషంట్స్ ఉన్నారు. ప్రధానంగా ఇది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్. ఆహారం ద్వారా అలాగే డిటాక్సిఫికేషన్ థెరపీలు, యోగా మరియు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజులు అలాగే లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులను చేయడం ద్వారా డయాబెటిస్ ను అరికట్టవచ్చని ఆయుర్వేదంలో వివరించబడింది.

ఆయుర్వేదంలో వివరించబడిన పద్దతులను సరైన విధంగా పాటిస్తే డయాబెటిస్ అనేది అదుపులో ఉంటుందని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచేందుకు "ఆయుర్వేదా సింప్లిఫైడ్" అనే బుక్ రచయిత్రి అలాగే శ్రీ శ్రీ కాలేజ్ ఆఫ్ ఆయుర్వేదిక్ సైన్స్ అండ్ రీసెర్చ్ హాస్పిటల్ ఫౌండర్ అయిన డాక్టర్.నిషా మణికంఠన్ ను ఈ విషయమైన కొన్ని హెర్బల్ సొల్యూషన్స్, టిప్స్ మరియు లైఫ్ స్టైల్ లో మార్పుల గురించి అడిగాము.

అలాగే, మీ సందేహాన్ని కూడా ఆమెకు తెలియచేశాము. షుగర్ క్రేవింగ్ ను తగ్గించేందుకు ఆయుర్వేదా ఉపయోగపడుతుందా అన్న ప్రశ్నను కూడా అడిగాము.

Ayurveda And Diabetes: 8 Ayurvedic Tips For Treating Diabetes

షుగర్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లో ఎక్కువవడం వలన డయాబెటిస్ సంభవిస్తుంది. గ్లూకోస్ రూపంలో శరీరంలో ఎనర్జీని స్టోర్ చేసుకుంటాము. అయితే, డయాబెటిక్స్ లో గ్లూకోస్ అనేది రక్తంలో కలిసిపోదు. గ్లూకోస్ ని రేగులేట్ చేసే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి సరిగ్గా విడుదల కాకపోవడం వలన ఇలా జరుగుతుంది.

ఆకలి,దురద,మూత్రానికి తరచూ వెళ్ళవలసి రావటం, డ్రైనెస్ వంటివి డయాబెటిస్ కి చెందిన కొన్ని సాధారణ లక్షణాలు. డయాబెటిస్ టైప్ 1 కలిగిన వారిలో ఈ లక్షణాలు కనిపించక పోవచ్చు.

1. డయాబెటిస్ కి కారణమైన స్ట్రెస్ అనే ముఖ్య ఫ్యాక్టర్ తో ఎలా డీల్ చేయాలి?

1. డయాబెటిస్ కి కారణమైన స్ట్రెస్ అనే ముఖ్య ఫ్యాక్టర్ తో ఎలా డీల్ చేయాలి?

"స్ట్రెస్ అనేది డయాబెటిస్ లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. అయితే, స్ట్రెస్ ని ఎలా డీల్ చేయాలో తెలుసుకోవడం ముఖ్యం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా యోగా, మెడిటేషన్ అలాగే మరెన్నో శక్తివంతమైన మెడిటేటివ్ మరియు ఇంటరాక్టివ్ ప్రాసెస్ లనేవి ప్రజల్లోకి వెళుతున్నాయి. కాబట్టి, స్ట్రెస్ ని డీల్ చేసే విధానం ఈపాటికి చాలా మందికి తెలిసే ఉంటుంది. హీలింగ్ ను ఈ పద్ధతులు ప్రమోట్ చేస్తాయ"ని అంటున్నారు డాక్టర్. నిషా మణికంఠన్. ఈ ప్రాక్టీసెస్ కి చెందిన హీలింగ్ ఎఫెక్ట్స్ అనేవి డాక్యుమెంట్ చేయబడ్డాయి. సుదర్శన క్రియ వంటి బ్రీతింగ్ టెక్నీక్ ని ప్రాక్టీస్ చేసిన తరువాత షుగర్ లెవల్స్ ఏ విధంగా తగ్గుతాయి కూడా డాక్యుమెంట్ చేయబడింది.

2. హెర్బల్ మిక్స్:

2. హెర్బల్ మిక్స్:

ఆయుర్వేదాలో, మెహంతక్ వాటి మరియు నిషా మాలకి (యాంటీ ఆక్సిడెంట్స్ అయిన పసుపు మరియు ఉసిరి కాంబినేషన్స్). ఈ రెండూ ఇమ్యూనిటీని పెంపొందించడమే కాకుండా కాంప్లికేషన్స్ ను అరికడతాయి కూడా.

3. స్లీపింగ్ ప్యాటర్న్ ను మేనేజ్ చేయడం:

3. స్లీపింగ్ ప్యాటర్న్ ను మేనేజ్ చేయడం:

డయాబెటిస్ ను ట్రీట్ చేయాలంటే స్లీపింగ్ పాటర్న్ ను తమ బాడీ క్లాక్ కి అనుగుణంగా మార్చుకోవాలి. బాడీ లో ఇన్ బిల్ట్ బ్లాక్ ఉంటుంది. ఆ క్లాక్ ని ఫాలో అయితే, త్వరగా నిద్రలేస్తాము, త్వరగా నిద్రపోతాము. నిద్రకు కూడా సమయం ఉంటుంది. ఇలా టైమింగ్స్ ని పాటించడం వలన డయాబెటిస్ అనేది అదుపులో ఉంటుంది. ఎందుకంటే శరీరంలోని అవయవాలకు రెస్ట్ దొరుకుతుంది కాబట్టి. ఈ విషయాన్ని డాక్టర్. మణికంఠన్ స్పష్టం చేస్తున్నారు.

4. డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఫుడ్ హ్యాబిట్స్:

4. డయాబెటిస్ ను అదుపులో ఉంచే ఫుడ్ హ్యాబిట్స్:

కాకరకాయ మరియు ఉసిరి జ్యూస్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ రెండిటిలో డయాబెటిస్ ను నియంత్రించే గుణాలు కలవు.

· ఆమ్లా అనే ఔషధం ఇన్సులిన్ సెక్రేషన్ ను పెంపొందిస్తుంది. పాంక్రియెటిక్ సెక్రేషన్ ను ప్రమోట్ చేస్తుంది. ఆయుర్వేదంలో వీటిని ముఖ్య ఔషధాలుగా వాడతారని డాక్టర్. నిషా పేర్కొంటున్నారు.

· గ్లైకేమిక్ ఇండెక్స్ అధికంగా కలిగిన ఫుడ్స్ ను అవాయిడ్ చేయడం మంచిది. సాధారణ కార్బోహైడ్రేట్స్ మరియు ప్రోటీన్స్ అలాగే ఎక్కువ ఆకుకూరలను తీసుకోవడం ఆరోగ్యకరం. ఆయుర్వేదా ఫ్రూట్స్ యొక్క ప్రాముఖ్యతను కూడా స్పష్టం చేస్తోంది. కూరగాయలను అలాగే నట్ సీడ్స్ ను తీసుకోవడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది.

· అలాగే, డయాబెటిస్ తో ఆల్రెడీ డయాగ్నోస్ చేయబడిన వారు ఆయుర్వేదా ప్రిస్క్రైబ్ చేసే ద్వికాల భోజనం అంటే రోజుకు రెండు సార్లు తినే పద్దతికి స్టిక్ కాకూడదు. వారు తమ డయాబెటిస్ టైప్ ను దృష్టిలో ఉంచుకుంది అందుకు తగినట్టుగా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు ఆహారాన్ని తీసుకోవాలి.

5. షుగర్ క్రేవింగ్?

5. షుగర్ క్రేవింగ్?

ఫ్రూట్ బేస్డ్ డిజర్ట్స్, డేట్ బేస్డ్ లేదా ఫిగ్ బేస్డ్ డిజర్ట్స్ ని ప్రయత్నించవచ్చని డాక్టర్. మణికంఠన్ అంటున్నారు. అయితే, అవి కూడా మితంగా తీసుకోవాలి. డయాబెటిస్ వారు తేనెను తీసుకోవచ్చు. తేనెలో అనారోగ్యం కలిగించే గుణాలు లేవని కూడా డాక్టర్ మణికంఠన్ స్పష్టం చేస్తున్నారు.

ఆయుర్వేదా డయాబెటిస్ ను ఎలా ట్రీట్ చేస్తుంది?

ఆయుర్వేదా డయాబెటిస్ ను ఎలా ట్రీట్ చేస్తుంది?

"ఆయుర్వేద ట్రీట్మెంట్స్ లో మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ ని ఫాలో అవుతాము. డైట్ ను రేగులేట్ చేయడం దగ్గర నుంచి షుగర్ లెవెల్స్ ని మానిటర్ చేయడం, డైజెస్టివ్ సిస్టం ని సరిచేయడం లేదా అగ్ని (ఫైర్ ఎలిమెంట్) ను సరిచేయడం వరకు" అనంటున్నారు డాక్టర్ మణికంఠన్. బర్ బెర్రీస్, హల్దీ లేదా టర్మరిక్ అనేవి గ్లూకోస్ మెటబాలిజం కి సంబంధించిన హెర్బ్స్.

పంచకర్మ:

పంచకర్మ:

డయాబెటిక్ పేషెంట్స్ కి పంచకర్మ ట్రీట్మెంట్ ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదం స్పష్టం చేస్తోంది. పంచకర్మలో ఫుల్ ఫ్లెడ్జెడ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మిళితమై ఉంటుంది. శరీరాన్ని డీటాక్స్ చేయడం, మనసుకి ప్రశాంతతను కలిగించడం, ఎమోషనల్ మరియు స్ట్రెస్ టాక్సిన్స్ ను తొలగించడం వంటివి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తులో కూడా అనారోగ్య సూచనలు దరిచేయకుండా చేస్తాయి.

English summary

Ayurveda And Diabetes: 7 Ayurvedic Tips For Treating Diabetes

Presence of excess sugar or glucose in the bloodstream causes diabetes. This condition can be controlled naturally with the help of Ayurvedic tips like dealing with stress, getting detoxed, consuming antioxidant-rich ayurvedic medicines which boost immunity, getting proper sleep, following a healthy diet and lifestyle.
Story first published:Monday, April 9, 2018, 18:00 [IST]
Desktop Bottom Promotion