For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆయుర్వేద చిట్కాలు

|

ఈ అదనంగా ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు తోడ్పడుతున్నాయి. వేడికి ఎక్కువగా గురవడం వలన ప్రత్యేకించి మండు వేసవి కాలంలో మనం కళ్ళ ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ కనబరచడం అవసరం. ఈ సమయంలో మన కళ్ళకి అత్యంత శ్రద్ధ అవసరం. ఎందుకంటే, ఇవి తరచూ ఇన్ఫెక్షన్స్ కి అలాగే అలర్జీస్ కి గురయ్యే ప్రమాదం ఉంది.

వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో తనదైన పాత్ర పోషిస్తోంది. మన కళ్ళను సురక్షితంగా కాపాడుకునేందుకు మనం మార్గాలను అన్వేషించి తీరాలి. వసంత్ ల్యాడ్ రచించిన "ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్" అనే బుక్ లో సిటీలలో నివసించే వారి కళ్ళు కాలుష్యం వలన స్ట్రెయిన్ అయి ఇరిటేషన్ కి గురవడడం జరుగుతోందని వెల్లడింపబడింది. వీటికి తోడు కంప్యూటర్ ముందు గంటల కొద్దీ కూర్చోవడం, టెలివిజన్ ను ఎక్కువ సేపు చూడడం వంటివి కూడా కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని వివరించడం జరిగింది.

ఆయుర్వేదం ప్రకారం కంటి ఆరోగ్యంపై శ్రద్ధని ఏ విధంగా కనబరచాలి:

ముందుగా కంటి ఇరిటేషన్ కు గల కారణం ఏంటో తెలుసుకోవాలని ఆయుర్వేదం సూచిస్తోంది. కంజక్టివా వలన కళ్ళు డ్రై గా మారిపోతున్నాయేమో తెలుసుకోవాలి. వాత దోషం ఎక్కువగా ఉండటం వలన ఈ సమస్య తలెత్తే ప్రమాదం ఉంది. అలాగే, స్ట్రెయిన్డ్ కళ్ళలో ఇరిటేషన్ అనేది ఉదరంలో పిత్త దోషం లేదా హైపర్ ఎసిడిటీ వలన కూడా తలెత్తే ప్రమాదం ఉంది. లివర్ ఆరోగ్యానికి అలాగే కంటి ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉంది. అందువలన, లివర్ పనితీరు దెబ్బతింటే ఆ కంటి ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

"ది కంప్లీట్ బుక్ ఆఫ్ ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్" లో వివరించబడిన ప్రకారం కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు పాటించవలసిన ఆయుర్వేదిక్ హోమ్ రెమెడీస్.

• రోజ్ వాటర్ సొల్యూషన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షించే విషయంలో అద్భుతాలు చేయగలదు. ఇందుకు ఐ కప్ లేదా డ్రాపర్ ని వాడాలి. అయితే, రోజ్ వాటర్ మరీ వేడిగా లేదా మరీ చల్లగా ఉండకూడదు. చిన్నపాటి కంటి ఇరిటేషన్ అనేది కూడా ఒకటి లేదా రెండు చుక్కల రోజ్ వాటర్ డ్రాప్స్ ని వాడటం ద్వారా తగ్గుముఖం పడుతుంది. కళ్ళు ప్రశాంతపడతాయి.

• ఒక డ్రాప్ క్యాస్టర్ ఆయిల్ ను రెండు కళ్ళల్లో నిద్రపోయే ముందు వేసుకుంటే కళ్ళు ప్రశాంతపడతాయి. అయితే, ప్రిజర్వేటివ్స్ లేని క్యాస్టర్ ఆయిల్ నే వాడటం ఉత్తమం.

• ధనియాలు లేదా మెంతి గింజలతో తయారైన ఇన్ఫ్యూషన్ ను కోల్డ్ ఐ వాష్ లా వాడితే కళ్ళు చల్లబడతాయి.

• కళ్ళల్లో మంటలుగా ఉన్నప్పుడు కోల్డ్ కంప్రెషన్స్ అనేవి గొప్పగా ఉపయోగపడతాయి. తాజా పెరుగును లేదా ఆవుపాల మీగడను వాడటం వలన కూడా కళ్ళలో బర్నింగ్ సెన్సేషన్ ను తగ్గించుకోవచ్చు.

• మీ కంటిచూపును మెరుగ్గా ఉంచుకునేందుకు నిరోగ్ స్ట్రీట్ కి చెందిన నిపుణుల సూచనల మేరకు ఈ కింది వాటిని తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది:

• త్రిఫలా చూర్ణం:

• త్రిఫలా చూర్ణం:

ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అందువలన కాటరాక్ట్ వృద్ధి చెందడాన్ని ఇది అరికడుతుంది.

• ఉసిరి -

• ఉసిరి -

ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఇమ్మ్యూనిటీని పెంపొందించి ఐ సైట్ ను మెరుగుపరుస్తుంది.

• స్పినాచ్ -

• స్పినాచ్ -

ఈ ఆకుపచ్చని ఆకుకూర శరీరంలోని యాంటీఆక్సిడెంట్స్ ను తిరిగి నింపుతుంది. అలాగే విటమిన్ సి మరియు ఏ ను శరీరానికి అందిస్తుంది. ఐరన్ మరియు కేల్షియంను ఈ ఆకుకూర నుంచి గ్రహించవచ్చు.

• పాలు -

• పాలు -

పాలలో రైబోఫ్లెవిన్ సమృద్ధిగా లభిస్తుంది. అందువలన క్యాటరాక్ట్ వృద్ధిని అరికట్టే సామర్థ్యం పాలలో కలదు. విటమిన్ ఏ తో ఫోర్టిఫై అయిన మిల్క్ అనేది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడే సాధనం.

• కేరట్స్ -

• కేరట్స్ -

విటమిన్ ఏ గా కన్వర్ట్ అయ్యే బీటా కెరోటిన్ లు ఇందులో లభిస్తాయి. అందువలన, వీటిని తీసుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు.

• బాదాం -

• బాదాం -

బాదాంలో విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. హెల్దీ టిష్యూలను టార్గెట్ చేసే అస్థిర అణువుల దాడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

• సిట్రస్ ఫ్రూట్స్ -

• సిట్రస్ ఫ్రూట్స్ -

లెమన్ మరియు ఆరెంజ్ లలో బీటా కెరోటిన్ మరియు విటమిన్ బి 12 పుష్కలంగా కలవు. ఇవి కంటి చూపును మెరుగుపరిచేందుకు తోడ్పడతాయి.

English summary

Ayurveda is the key to improve your eye health

Eyes are the most important organs that require the most care. At times, when they itch, it can be due to conjunctiva turning dry, due to excess vata dosha. One can use rose water which is of great help. You can use an eye cup or a dropper, but make sure the rose water is neither too cold nor hot.Ayurveda To Improve Your Eye Health
Story first published: Saturday, May 19, 2018, 18:00 [IST]