For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కలబంద జ్యూస్ తాగితే లైంగిక పటుత్వం.. కలబందతో లెక్కలేనన్నీ ప్రయోజనాలు

జీవితంలో మీరు ఒక్కసారి కలబంద జ్యూస్ తాగితే.. తర్వాత దాని ఫలితాలు చూసి రోజూ తాగుతారు. కలబంద' మనకు పరిచయం అవసరం లేని మొక్క. కానీ, ఇది చేసే మంచి పనుల గురించి అందరికి తెలిసుండదు. కలబంద.

|

జీవితంలో మీరు ఒక్కసారి కలబంద జ్యూస్ తాగితే.. తర్వాత దాని ఫలితాలు చూసి రోజూ తాగుతారు. కలబంద' మనకు పరిచయం అవసరం లేని మొక్క. కానీ, ఇది చేసే మంచి పనుల గురించి అందరికి తెలిసుండదు. కలబంద చూడటానికి పిచ్చి మొక్కలాగా కనబడుతుంది. కానీ, ఇది చేసే మేలు అంతా.. ఇంతా.. కాదు. అందుకే, కలబందను సర్వరోగ నివారిణి అంటారు.

కలబంద మొక్కని సర్వ రోగాలకు దివ్య ఔషధంగా ఉపయోగపడే ప్రకృతి ప్రసాదించిన ఒక అద్భుత వరంగా చెప్పుకోవచ్చు. మనదేశంలో సౌందర్య ఉత్పత్తులలోను, ఆయుర్వేద వైద్యంలోను దీనిని ఎక్కుగా ఉపయోగిస్తున్నారు. కలబంద నుండి రకరకాల లోషన్లు, క్రీమ్ లు, జ్యూస్‌, హెయిర్‌ ఆయిల్‌ లాంటి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దీని ఉత్పత్తులు చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి.

దాంప్యత జీవితం బాగుంటుంది

దాంప్యత జీవితం బాగుంటుంది

కలబందలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజూ అర కప్పు కలబంద గుజ్జును తీసుకోవడం ద్వారా చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవచ్చు. కలబంద జెల్లీని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. అలాగే కలబంద గుజ్జు దాంపత్య జీవనానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని జ్యూస్‌ రూపంలో తీసుకుంటే లైంగిక పటుత్వం పెరుగుతుంది.

వేర్లను ఉడికించి..

వేర్లను ఉడికించి..

కలబంద వేర్లను శుభ్రం చేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో పాలను పోసి అందులో కలబంద వేర్లను ఉడికించాలి. వాటిని పాల నుంచి తీసి బాగా ఎండబెట్టి.. పొడి కొట్టుకోవాలి. ఈ పొడిని రోజుకో టీ స్పూన్ లెక్కన పాలలో కలిపి తీసుకుంటే దాంపత్యం పండుతుంది.

జుట్టు పెరగాలంటే

జుట్టు పెరగాలంటే

జుట్టు పెరగాలంటే.. ఓ పాత్రలో అలోవెరా జెల్ తీసుకుని అందులో పటిక ఉప్పు కాసింత చేర్చి 20 నిమిషాల పాటు పక్కనబెట్టాలి. కాసేపయ్యాక జెల్ కాస్త నీరుగా మారిపోతుంది. ఆ నీటిని నువ్వుల నూనె, కొబ్బరి నూనె చేర్చి బాగా మరిగించి సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ తలకు రాసుకుంటే జుట్టు బాగా వత్తుగా పెరుగుతుంది.

మలినాలను తొలగించుకోవొచ్చు

మలినాలను తొలగించుకోవొచ్చు

అలోవెరాతో శరీరంలోని మలినాలను తొలగించుకోవచ్చు. అలోవెరా జెల్‌ను రోజూ తీసుకుంటే బరువు తగ్గుతారు. అంతేగాకుండా నిత్య యవ్వనులుగా కనిపిస్తారు. అలోవెరాను తీసుకోవడం ద్వారా చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.

పరగడుపున తింటే

పరగడుపున తింటే

ఉదయాన్నే పరగడుపున కలబంద ఆకును తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధులను మటుమాయం చేస్తుంది.

కలబంద గుజ్జు మధుమేహం, కీళ్ళనొప్పులు, జీర్ణకోశ, స్త్రీ సంబంధమైన వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

కాలిన చోట పూస్తే

కాలిన చోట పూస్తే

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. శరీరం కాలిన చోట కలబంద రసం వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. కలబంధ అటు తరుణ వ్యాధులకు, ఇటు దీర్ఘ వ్యాధులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది.

మురికిపోతుంది

మురికిపోతుంది

కలబంద గుజ్జుకు తగినంత పసుపును జోడించి ముఖానికి ఫేషియల్‌ చేసుకుని 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి తొలగిపోయి ముఖం కాంతివంతం అవుతుంది. కలబంద ఆకురసంతో నల్లమచ్చలు పోగొట్టవచ్చు.

తెల్లజుట్టు రాకుండా

తెల్లజుట్టు రాకుండా

కలబంద గుజ్జును తలకు పట్టించి ఓ గంట తరువాత తలస్నానం చేస్తే జుట్టు పెరగటమే కాకుండా, మంచి నిగారింపును సంతరించుకుంటుంది. తలకు కలబంద వాడడం వలన జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లబడడం, ఎర్రబడటం చుండ్రులను ఇది నివారిస్తుంది.

తలలో ఉండే దురదను నివారిస్తుంది

తలలో ఉండే దురదను నివారిస్తుంది

తలలో వచ్చే అనేక పుండ్లను దురదలను ఇది తగ్గిస్తుంది.

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగడం వలన దీర్ఘకాలం ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చర్మ సంరక్షణ ర్యాసిస్‌, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవడం మొదలగు వాటికీ కలబంద మంచి ఫలితాలని ఇస్తుంది.

నాలుగు పొరలు

నాలుగు పొరలు

కలబందలో 15 రకాల పోషకాలు మిళితమై మంచి శక్తి నిస్తాయి. దీని వల్ల కలిగే అనేక ఉపయోగాలను బట్టి, దీనిని అద్భుతమైన మొక్క, సహజ నివారిణి అని కూడా అంటారు. కలబంద ఆకులో నాలుగు పొరలు ఉంటాయి. మొదటి పొర మందంగా ఉండి మొక్కను రక్షిస్తుంది. రెండవ పొరలో ఉన్న పసరు చేదు రసము. మూడవది జిగురు పదార్థము. నాలుగవది జిగురు కలబందలోని లోపలి పొరలో ఉండే కలబంద జిగురు.

గుడ్డులోని తెల్లసొన కలపి

గుడ్డులోని తెల్లసొన కలపి

కలబంద జిగురులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి తలకు పట్టించాలి. ఆపైన టవల్ చుట్టేసి గంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే కుదుళ్లు బలపడి, జుత్తు రాలడం ఆగిపోతుంది. రెండు కోడిగుడ్ల తెల్లసొన తీసుకుని బాగా గిలకొట్టాలి. ఇందులో రెండు చెంచాల తేనె, మూడు చెంచాల ఆలివ్ ఆయిల్, ఒక చెంచాడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. దీన్ని మాడుకు, జుత్తుకు బాగా పట్టించి, గంట తర్వాత తలంటుకోవాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

లవంగాల పొడి, వెల్లుల్లి కలిపి..

లవంగాల పొడి, వెల్లుల్లి కలిపి..

కొబ్బరి నూనెలో అరచెంచాడు లవంగాల పొడి, కొద్దిగా చిదిమిన వెల్లుల్లి రెబ్బలు నాలుగు వేసి బాగా మరిగించాలి. చల్లారాక మాడుకు, జుత్తుకు పట్టించి... అరగంట తర్వాత తలంటుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే... జుత్తు రాలడం ఆగిపోవడమే కాక కుదుళ్లు గట్టిపడతాయి.

జాండిస్ ను నివారిస్తుంది

జాండిస్ ను నివారిస్తుంది

కలబందలో 99.3 శాతం నీరుతో పాటు ఏ, బీ, విటమిన్లు, ఎంజైములు, మినరల్స్‌, ఆంద్రోక్వినోన్ష్‌, కార్టాసిలిక్‌యాసిడ్‌, 22 అమైనోయాసిడ్స్‌ ఉన్నాయి. ఇందులోని ఎంజైమ్స్‌ నొప్పి నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. కలబందను జ్యూస్‌ రూపంలో తీసుకుంటే శరీరంలో జరిగే వివిధ జీవక్రియల ఫలితంగా ఉత్పత్తి అయ్యేటువంటి హానికర పదార్థాల నుంచి రక్షణ కల్పిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. గుండె, హెపటైటీస్‌, కిడ్నీ సమస్యలను నివారిస్తుంది. జాండిస్‌కు ఇది బాగా ఉపయోగపడుతుంది.

కేన్సర్‌ వ్యాధి నివారణకు ఇది దివ్యౌషధం

కేన్సర్‌ వ్యాధి నివారణకు ఇది దివ్యౌషధం

రోగ నిరోధక శక్తి పెంచి షుగరు, మలబద్ధకాన్ని నిరోధించి అల్సర్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వైద్య పరంగా చూస్తే కలబందలోని మెగ్నీషియం లాక్టెట్‌, వ్యాధుల నివారణకు, కీటకాలు కుట్టినపుడు కలిగే బాధకు నివారిణిగా పని చేస్తుంది. కేన్సర్‌ వ్యాధి నివారణకు ఇది దివ్యౌషధం. దీన్ని వినియోగిస్తే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

చర్మ సౌందర్యం కోసం

చర్మ సౌందర్యం కోసం

చర్మాన్ని సూర్యరశ్మి నుంచి కాపాడుకోవడానికి, కాంతివంతంగా ఉంచుకోవడానికి కలబంద జెల్‌ చాలా ఉపయోగపడుతుంది. ఇది మంచి కూలింగ్‌ ఏజెంట్‌గా పని చేస్తుంది. ఫేస్‌ మాయిశ్చర్‌గా, కేశాల సంరక్షణ కోసం బాగా ఉపయోగపడుతుంది.

ఒక్కసారి తాగు

ఒక్కసారి తాగు

కలబందం బట్టతలను నివారిస్తుంది. చర్మం ముడతలు పడటాన్ని నిరోధిస్తుంది. కంటికింద నలుపును పోగొడుతుంది. ప్రెగ్నెన్సీ అనంతరం వచ్చే ముడతలను తొలగిస్తుంది. సోరియాసిస్‌, గజ్జి తదితర చర్మ సంబంధిత వ్యాధులను అరికడుతుంది. ఇలా కలబందతో లెక్కలేనన్నీ ప్రయోజనాలున్నాయి. అందుకే బాస్.. జీవితంలో ఒక్కసారైనా కలబంద జ్యూస్ తాగు. తర్వాత దాని ఫలితాలు చూసి రోజూ తాగుతావు.

English summary

benefits of aloe vera things you didn’t know about this magic plant

ఒక్కసారి కలబంద జ్యూస్ తాగితే.. ఫలితాలు చూసి రోజూ తాగుతారు
Story first published:Saturday, May 19, 2018, 13:16 [IST]
Desktop Bottom Promotion