For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేయం మరియు మూత్రపిండాల నిర్విషీకరణలో అత్యుత్తమంగా సహాయపడే బొప్పాయి విత్తనాలు

|

బొప్పాయి విత్తనాలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాల గురించిన అవగాహన లేని కారణంగానే, వాటిని తీసుకోకుండా దూరంగా విసిరివేయడం జరుగుతుంటుంది. కానీ ఆరోగ్య నిపుణుల ప్రకారం బొప్పాయి విత్తనాలలో అనేక ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో చూద్దాం.


బొప్పాయి విత్తనాలతో కూడిన ఆరోగ్య ప్రయోజనాలు :

బొప్పాయి గింజలు "సాంప్రదాయిక నొప్పి నివారణ చికిత్స" గా పిలువబడతాయి మరియు ఇవి కాలేయం, కిడ్నీ, జీర్ణ సంబంధ వ్యాధులు మరియు అనేక ఇతర చికిత్సలకు ఒక మాజిక్ బుల్లెట్ వలె పనిచేస్తుంది. ఈ వ్యాసంలో, బొప్పాయి విత్తనాల గురించిన కొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను మేము అందిస్తున్నాము.

"బొప్పాయి విత్తనాలు అనేక రకాల ఔషధ గుణాలను కలిగి ఉన్నాయి". ఈమాట వింటేనే కొందరికి ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మేము జోక్ చేయడం లేదు, నిజంగానే చెప్తున్నాము.

లివర్ డిటాక్సిఫికేషన్ (కాలేయం నిర్విషీకరణ) :

లివర్ డిటాక్సిఫికేషన్ (కాలేయం నిర్విషీకరణ) :

బొప్పాయి విత్తనాలు కాలేయమును నిర్విషీకరణ గావించి, పనితీరును మెరుగుపరచి నెల రోజుల్లోనే ఆకలి పెరిగేందుకు సహాయం చేస్తాయి. ముఖ్యంగా వృద్ధులలో, పిల్లలలో మరియు ఆల్కహాలిక్ రోగులలో సైతం ఆకలి పెరిగేందుకు దోహదం చేస్తుంది. బొప్పాయి విత్తనాలు కాలేయ కణాలలో ఫ్రీ రాడికల్స్ (స్వేచ్చా రాశులు) ఉత్పత్తిని నిరోధించి కొత్త కణాలను సులభంగా ఉత్పత్తి చేస్తాయి. బొప్పాయి విత్తనాలు మైరోసినాస్ (ఒకరకమైన ఎంజైమ్) కలిగివుంటాయి, ఇది కాలేయంలో సైటోక్రోమ్ పి 450 ఐసోఎంజైమ్ తో కలిసి సక్రియం చేస్తుంది. బొప్పాయి విత్తనం పపైన్ కలిగి ఉంటుంది, మంచి కణాల పనితీరును అడ్డుకోకుండా, చనిపోయిన కణజాలాన్ని మాత్రమే కరిగించి, విసర్జించి, శుభ్రపరచగల సామర్ధ్యం దీనికి ఉంది. ఈ సాంప్రదాయిక థెరపీని కేవలం 3 వారాలు మాత్రమే అనుసరించవలసి ఉంటుంది. మరియు ఒక వారం తర్వాత మళ్ళీ పునః ప్రారంభమవుతుంది. ఈ చికిత్సా సమయంలో, సుమారుగా 3 నుండి 4 లీటర్ల నీటిని తీసుకోవడం సూచించబడుతుంది.

వినియోగించుటకు పాటించవలసిన సూచనలు :

వినియోగించుటకు పాటించవలసిన సూచనలు :

2 వారాల పాటు ఎనిమిది నుండి పది గింజలు రోజులో రెండు సార్లు భోజనం తర్వాత మోస్తరు నీటితో కలిపి తీసుకోవాలి.

మరోవైపు, నీటిలో ఎండబెట్టిన బొప్పాయి విత్తనాల పౌడర్ సగం టీస్పూన్ వేసి, కాచి, ఆ కషాయాన్ని రోజులో ఒకసారి భోజనం తర్వాత తీసుకోవచ్చు.

సాంప్రదాయిక మందులలో, బొప్పాయి సీడ్ యాష్ (1 mg) తేనె (3 నుండి 5 గ్రా) తో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవడం ద్వారా కాలేయం నిర్విషీకరణలో సహాయం చేస్తుంది.

కిడ్నీ నిర్విషీకరణ :

కిడ్నీ నిర్విషీకరణ :

జీవక్రియల సమయంలో ఉత్పత్తి చేయబడిన మొత్తం విషాల వడపోతకు మూత్రపిండాలు ప్రధానంగా బాధ్యత వహిస్తాయి. మనం తెలీకుండానే అన్నిరకాల అవాంఛిత విషపదార్ధాలను విస్తృతంగా ఉపయోగించుకుంటున్నాము. క్రమంగా ఈ విష పదార్ధాల ఫలితంగా, మూత్ర మార్గములో ఇన్ఫెక్షన్స్ పెరగడం, పనితీరు మందగించడం, వాపు మరియు వడపోత సామర్ధ్యం తగ్గుముఖం పట్టడం వంటివి జరుగుతాయి. బొప్పాయి గింజల వాడకం, మూత్రపిండాల సమస్యలను తగ్గించుటలో ఉత్తమంగా సహాయపడగలవని చెప్పబడింది.

Most Read:కడుపు వికారం మరియు ఉబ్బరానికి సూచించదగిన 7 సహజసిద్దమైన గృహ చిట్కాలు Most Read:కడుపు వికారం మరియు ఉబ్బరానికి సూచించదగిన 7 సహజసిద్దమైన గృహ చిట్కాలు

వినియోగించుటకు సూచనలు :

వినియోగించుటకు సూచనలు :

తాజా బొప్పాయి విత్తనాలను ఉదయాన్నే తీసుకోవలసి ఉంటుంది. సుమారుగా 15 నుండి 20 గింజలు 3 వారాల పాటు రోజువారీ క్రమంలో భాగంగా తీసుకోవలసి ఉంటుంది.

విత్తనాలను నమిలిన అరగంట తర్వాత 200 నుండి 500 ml నీటిని తీసుకోండి. ఎట్టిపరిస్థితుల్లో రోజులో కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని తీసుకుంటున్నారని నిర్ధారించుకోండి.

ఫిల్టరింగ్ ప్రక్రియ సమయంలో మూత్రపిండాలకు నష్టం కలుగకుండా బొప్పాయి గింజలు ఉపయోగిస్తారు. విత్తనాలను నమలడం ద్వారా, విత్తనాలలోని ముఖ్యమైన కొన్ని ఔషధ లక్షణాలు కలిగిన రసాయన పదార్ధాలు నేరుగా రక్త ప్రసరణకు చేరుకుంటుంది. క్రమంగా చికిత్స యొక్క సమర్థతను అసాధారణంగా 50 శాతం పెంచుతుంది.

బొప్పాయి గింజల వాడకం ద్వారా, మొత్తం శరీరంలోని జీవక్రియల సమయంలో ఉత్పత్తి చేయబడిన విషాన్ని నిర్మూలించవచ్చు మరియు మూత్రం ద్వారా విషాన్ని బయటకు నెట్టివేస్తుంది. కార్పైన్ అనేది బొప్పాయి విత్తనాలలో ఉండే ఆల్కలీయిడ్ గా చెప్పబడింది., ఇది సులభంగా విషాన్ని శరీరం నుండి బయటకు విసర్జించడంలో సహాయం చేస్తుంది.

జీర్ణక్రియలను పెంపొందిస్తుంది :

జీర్ణక్రియలను పెంపొందిస్తుంది :

బొప్పాయి విత్తనాలు, జీర్ణ వ్యవస్థను పెంపొందించుటకు ఉపయోగకరంగా ఉంటుంది, ప్రధానంగా ఇది కాలేయం మీద పనిచేస్తుంది మరియు దాని శక్తిని, పనితీరును మెరుగుపరుస్తుంది. విత్తనాలు మరియు గుజ్జులో ఉండే బెంజైల్ ఐసోథియోసయానేట్ కారణంగా అల్సర్ వంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది.

బొప్పాయి గింజలు, అల్సర్ ఉత్పాదక బ్యాక్టీరియాను నాశనం చేయగల, మరియు రాకుండా నిరోధించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

అనుసరించదగిన విధానాలు :

అనుసరించదగిన విధానాలు :

ఎండబెట్టిన బొప్పాయి విత్తనాల పొడిని తేనెతో కలిపి తీసుకోవచ్చు.

చిటికెడు నల్ల మిరియాలతో కలిపి ఐదు నుండి పది తాజా బొప్పాయి విత్తనాలను తీసుకోవడం ద్వారా ఆకలి పెరుగుతుంది.

వార్మ్ ఇన్ఫెక్షన్ (హెల్మిన్థయాసిస్) చికిత్సలో భాగంగా, ఎండబెట్టిన 2 గ్రాముల విత్తనాల పొడిని, 1 స్పూన్ తేనెతో కలిపి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

బొప్పాయి విత్తనాలు పపైన్ కలిగి ఉంటుంది, జీర్ణ వ్యవస్థ చికిత్సలో ఉత్తమంగా దోహదపడుతుంది. క్రమంగా ప్రోటీన్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read: నీ వక్షోజాలకు దీన్ని పూసుకో బాగా లావు అవుతాయి, బ్రా తీసి పూయబోయాడు Most Read: నీ వక్షోజాలకు దీన్ని పూసుకో బాగా లావు అవుతాయి, బ్రా తీసి పూయబోయాడు


English summary

Benefits of Papaya Seeds for Liver and Kidney Detox

The good thing about papaya is that you can find it almost anywhere, and it is unbelievably affordable. Since papaya is an easy-to-find fruits, people tend to underestimate the health benefit of papaya and papaya seeds. it helps keeps the bacteria away, fertility, cure liver disease etc.
Story first published: Saturday, October 27, 2018, 11:00 [IST]