For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహం మరియు కొలెస్ట్రాల్ సమస్యలతో పోరాడే కాకరకాయ హెర్బల్- టీ

మధుమేహం మరియు కొలెస్ట్రాల్ సమస్యలతో పోరాడే కాకరకాయ హెర్బల్- టీ

|

కాకరకాయ, దీనిని బిట్టర్ గార్డ్ అని ఆంగ్లంలో, కరేలా అని హిందీలో పిలుస్తారు. బహుశా సాధారణంగా మనం అంతగా ఇష్టపడని కూరగాయలలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యమే లేదు. అతి కొద్దిమంది మాత్రమే దీనిపై మక్కువను కలిగి ఉంటారు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా, దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మాత్రం మనందరికీ తెలుసు. మన తల్లులు మన చేత బలవంతంగా తినిపించాలని చూసే చేదు ఆకుపచ్చ కూరగాయలలో ఒకటిగా ఉంటుంది. దీని చేదుని తగ్గించే క్రమంలో అనేక రకాల మసాలా దినుసులను వినియోగించవలసి ఉంటుంది. కొందరైతే చక్కెరను కూడా జోడిస్తుంటారు, చేదును తగ్గించే ప్రక్రియలో భాగంగా.

ఎన్ని చేసినా కూడా దీని పట్ల విముఖత, కళ్ళల్లో చిరాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, భారతీయ వంటకాలలో సుగంధ ద్రవ్యాలను జోడించడం ద్వారా కాకర కాయతో కూడా అద్భుతమైన వంటకం తయారు చేయగలరు. కరేలా లేదా కాకర కాయ, దాని రుచి పట్ల అందరికీ విముఖత ఉన్నప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాల దృష్యావ మాత్రం, అత్యంత విశిష్టమైనదిగా భావించబడుతుంది. ప్రయోజనకరమైన పోషకాలను శరీరానికి అందివ్వడం దృష్ట్యా, దీనిని ఆహార ప్రణాళికలో భాగస్వామ్యం చేయడం తప్పనిసరి.

Bitter Gourd Tea: How To Make This Herbal Tea To Manage Diabetes And Fight Cholesterol,

కాకర కాయను స్మూతీస్, కాక్టేయిల్స్ వంటి వాటితో పాటు, అనేక రకాల సూప్స్ మరియు బేవరేజేస్లకు విరివిగా జోడించబడుతుంది. వీటి పోషకాల ప్రయోజనాల దృష్ట్యా, వీటి వాడకం కూడా విరివిగా పెరుగుతూ ఉంది. ఈ కాకర కాయ ప్రయోజనాలలో, ముఖ్యమైనది రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించడం. మరియు సహజంగా కాలేయాన్ని శుభ్రపరచడం. ఇది ఊబకాయం తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఏదేమైనా, ఈ కాకరకాయ చేదు రుచిని పక్కన పెట్టి, దీని ప్రయోజనాలను పొందేందుకు మరొక మార్గం కూడా ఉంది. అదే కాకరకాయతో చేసిన హెర్బల్ - టీ. ఇది అంతగా ప్రాచుర్యం పొందిన పానీయం కాకపోయినా, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఉత్తమంగా చెప్పబడింది.

కాకరకాయ హెర్బల్ - టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

కాకరకాయ హెర్బల్ - టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

కాకర కాయ - టీ అనేది ఒక హెర్బల్ - టీ గా చెప్పవచ్చు. ఎండబెట్టిన కాకరకాయను ముక్కలుగా చేసి నీటిలో నానబెట్టి, హెర్బల్ - టీ వలె అమ్మబడుతుంది. ఈ కాకరకాయ - టీ పౌడర్, లేదా స్క్వాష్ రూపంలో కూడా దొరుకుతుంది. దీనిని కొన్ని ప్రాంతాలలో గోహ్యా - టీ అని కూడా పిలుస్తారు. దీనిని ఇంటిలోనే సులభంగా తయారు చేయవచ్చు. కాకరకాయ జ్యూస్ వలె కాకుండా, ఈ హెర్బల్ - టీ తయారీలో కాకరకాయ మొక్క ఆకులు, పండ్లు మరియు విత్తనాలను కూడా ఉపయోగించవచ్చు.

మరికొన్ని కాకరకాయ హెర్బల్ - టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

మరికొన్ని కాకరకాయ హెర్బల్ - టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు :

1. రక్తంలో చక్కర స్థాయిల నియంత్రణలో సహాయపడుతుంది :

కాకర కాయను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి మరియు క్రమంగా మధుమేహాన్ని నిర్వహించడానికి సూచించదగిన సహజ సిద్దమైన ఆహారంగా భావించబడుతుంది. క్రమంగా కాకరకాయ హెర్బల్ - టీ కూడా డయాబెటిస్ చికిత్సలో సహాయపడుతుంది.

2. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది :

2. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది :

కాకరకాయ హెర్బల్ - టీ కూడా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, దీనికి కారణం, కాకర కాయలోని శోధనిరోధక లక్షణాలు.

Most Read:హోటళ్లలో సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? Most Read:హోటళ్లలో సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

3. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది :

3. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది :

కాకరకాయ హెర్బల్ - టీ మీ కాలేయంలోని విషతుల్య పదార్ధాలను నిరోధించి, సహజ సిద్దమైన డిటాక్స్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా మీ ప్రేగులను కూడా శుభ్రపరుస్తుంది. క్రమంగా జీర్ణ సమస్యలను తొలగించగలుగుతుంది కూడా.

4. రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది :

4. రోగ నిరోధక వ్యవస్థను పెంచుతుంది :

కాకరకాయలో విటమిన్ సి ఉండటం మూలాన, ఈ కాకరకాయ హెర్బల్ - టీ కూడా అంటువ్యాధులతో పోరాడటానికి మరియు మీ రోగ నిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు సహాయపడుతుంది.

5. దృష్టిని మెరుగుపరుస్తుంది :

5. దృష్టిని మెరుగుపరుస్తుంది :

కాకరకాయ - టీ లేదా కరేలా -టీ మీ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఈ కూరగాయలో సమపాళ్ళలో విటమిన్ ఎ ఉన్న కారణాన ఇది కళ్ళకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పబడింది. విటమిన్-ఎ, బీటా కెరోటిన్ ముందు రూపం, ఇది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనదిగా చెప్పబడింది.

Most Read:అది వచ్చిన రాత్రి నువ్వు నాతో అస్సలు పడుకోవు, నన్ను సుఖపెట్టవు, ఆ మాటలు వినేసరికిMost Read:అది వచ్చిన రాత్రి నువ్వు నాతో అస్సలు పడుకోవు, నన్ను సుఖపెట్టవు, ఆ మాటలు వినేసరికి

కాకరకాయ – టీ తయారుచేసే విధానం :

కాకరకాయ – టీ తయారుచేసే విధానం :

కాకరకాయ -టీ ని సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. ఈ హెర్బల్ - టీ తయారీ కోసం, గ్లాసుడు నీటిలో కొన్ని ఎండిన లేదా తాజా కాకరకాయ ముక్కలను జోడించి, తేనె లేదా అగావే సిరప్ వంటి సహజమైన స్వీటెనర్లను ఉపయోగించవచ్చు కూడా. ఈ హెర్బల్ -టీ ని కాకరకాయ ఆకులను ఉపయోగించి కూడా తయారుచేయవచ్చు. కానీ మీకు కాకరకాయ ఆకుల కన్నా, కాకరకాయలే విరివిగా లభిస్తాయి. ఈ హెర్బల్ - టీ చేయడానికి, ఒక పాత్రలో నీటిని తీసుకుని, అందులో ఎండిన లేదా తాజా కాకరకాయ ముక్కలను జోడించండి. 10 నిముషాల పాటు, నీటిని తక్కువ మంటతో వేడి చేయండి. క్రమంగా కాకరకాయ యొక్క అన్ని పోషకాలు నీటిలోనికి సంగ్రహించబడుతాయి. స్టౌ నుండి పాత్రను పక్కన పెట్టి, కాసేపు అలాగే ముక్కలను అందులో ఉండనిచ్చి, ఆ నీటిని వడపోయండి. దీనిలో తేనె లేదా ఇతర స్వీటెనర్స్ జోడించి తీసుకోండి. అయితే, వీలైనంత వరకు స్వీటెనర్లను నివారించడమే ఉత్తమం, లేదా తక్కువ స్థాయిలో జోడించుకోండి. ఈ హెర్బల్-టీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి ప్రధానంగా వినియోగిస్తారు. క్రమం తప్పకుండా ఈ హెర్బల్ -టీ తీసుకున్నే ఎడల, రక్తంలో చక్కర స్థాయిలు తగ్గుముఖం పట్టడమే కాకుండా, ఊబకాయం తగ్గించడంలో కూడా ఎంతగానో సహాయపడుతుందని చెప్పబడింది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఆరోగ్య, జీవన శైలి, ఆహార, ఆద్యాత్మిక, జ్యోతిష్య, వ్యాయామ, లైంగిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Most Read: నా భార్య బలవంతంగా శృంగారం చేయించుకుంటుంది, బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది Most Read: నా భార్య బలవంతంగా శృంగారం చేయించుకుంటుంది, బెడ్రూమ్ లోనే లేపేస్తాను అంది

English summary

Bitter Gourd Tea: How To Make This Herbal Tea To Manage Diabetes And Fight Cholesterol

Bitter gourd is added to smoothies and green juices, to enhance their nutritional profile. One of the main benefits of bitter gourd juice or karela juice is its ability to regulate blood sugar levels. Another one of its wondrous benefits is cleansing the liver naturally. It also aids weight loss. However, there is another way to load up on the benefits of bitter gourd and that is through bitter gourd tea.
Desktop Bottom Promotion