For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఎనిమిది వింత కారకాలు తలనొప్పికి కారణాలు

|

జీవితంలో ఒక్కసారైనా ఈ తలనొప్పి బారిన పడని మనిషి ఉండడు . నాకు తలనొప్పే రాదు అని ఏ ఒక్కరు కూడా అనలేరు. ఏదో ఒక కారణం చేత ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా ఈ తలనొప్పిని ఎదుర్కొనే ఉంటారు. అవునా..!

ఈ తలనొప్పిని ఎదుర్కోవడం కూడా తలనొప్పే , అలాంటి స్థితికి వెళ్తుంటాం. ఒక్కోసారి సమస్య చిన్నదే అయినా కూడా దైనందిక విషయాలయందు ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. కానీ ఒక్కోసారి మాత్రం తీవ్రమైన ప్రభావాన్ని అత్యవసర పరిస్థితులలో వైద్యుని దాకా వెళ్ళవలసిన అవసరం కూడా రావొచ్చు.

Bizarre Reasons That Cause Headache

ఈ తలనొప్పికి ఊహించలేని కారణాలు :

ఉదాహరణకు మరుసటి రోజు ఉదయం ఏదైనా ఒక ముఖ్యమైన పరీక్షకు సిద్దమవుతున్నారు అనుకుందాం. అప్పటి దాకా ఏ సమస్యా ఉండని మీకు, ఒక్కసారిగా ఈ తలనొప్పి భయానకంగా కలగవచ్చు. ఒక్కోసారి చదువు మీద దృష్టి కేంద్రీకరించలేక, చదివింది గుర్తుకు రాక, పరీక్ష సరిగ్గా రాయలేక అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది.

అనేకమంది తలనొప్పిని నరకంతో పోలుస్తారు అంటేనే అర్ధమవుతుంది, దాని ప్రభావాలు ఎలా ఉంటాయో. ఈ తలనొప్పి కూడా అనేక రకాల ప్రతికూల అంశాలపై ఆధారపడి కలుగుతుంటుoది. మద్యపానం, నిద్ర లేమి, శరీరంలో క్రొవ్వు చేరడం, అధిక పని, ఒత్తిడి, వ్యాధులు, మానసిక ఆందోళన, రక్త పోటు ఇలా అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ తలనొప్పి కారణంగా పని అంతరాయం కలగడంతో పాటు, పార్టీలకు , స్నేహితులతో ప్లాన్లకు, జర్నీలకు మొదలైన వాటికి ప్రధాన అంతరాయంగా మారుతుంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, ఏదో ఒక సందర్భంలో ఈ తలనొప్పి కారణంగా ఏదో ఒక అంతరాయానికి గురయ్యే ఉంటారు.

ముఖ్యంగా, దీర్ఘకాలిక తలనొప్పులు సాధారణంగా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని సైతం క్షీణింపచేయగలవు.

ఒక్కోసారి ఇలాంటి తీవ్రమైన దీర్ఘకాలిక తలనొప్పులు , ప్రమాదకర జబ్బులకు సంకేతాలుగా కూడా ఉంటాయి. సరైన సమయంలో వైద్యుని సంప్రదించని ఎడల అనేక సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది కూడా.

సాధారణ ఫ్లూ నుండి మెదడు కణితుల లేదా ట్యూమర్ల వరకు, తలనొప్పి అనేక వ్యాధులకు ప్రధాన లక్షణంగా ఉంటుంది.

ఇప్పుడు, తలనొప్పికి కారణమయ్యే కొన్ని విషయాలు గురించి చూద్దాం, ఈ ఆలోచనలను ఊహించలేము కూడా.

ఆ ఆశ్చర్యకర కారకాల జాబితా చూడండి మరి :

ఊరగాయలు :

ఊరగాయలు :

ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఒకవేళ మీరు సాంప్రదాయక భారత దేశ ఊరగాయలను ఇష్టపడుతున్న ఎడల, మరియు రోజూ వారీ ఆహారంలో భాగంగా తీసుకుంటున్న పక్షాన, మీకు తరచుగా తలనొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం ఊరగాయల్లో నిల్వ ఉండే టైరామిన్ తలనొప్పికి ప్రధాన కారకంగా ఉంటుందని తేలింది.

లైంగిక సంభోగం :

లైంగిక సంభోగం :

ఇది నిజంగా ఆశ్చర్యకరంగా అనిపించే విషయమే. నిజానికి లైంగిక సంభోగం వలన మెదడులో హాపీ హార్మోన్లు విడుదల కారణంగా మానసిక ఒత్తిడులు దూరమవడం మరియు కాలరీలను కరిగించడం జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి ప్రక్రియ పూర్తయిన తర్వాత తలనొప్పి విపరీతంగా భాధించడం మొదలవుతుంది. ఇది రక్తపోటుకు కూడా సంకేతం కావొచ్చు. ఇది తరచుగా ఉన్న ఎడల, వైద్యుని సంప్రదించి రక్తంలో క్రొవ్వు నిల్వలు ఉన్నాయో లేదో (లిపిడ్ ప్రొఫైల్) పరీక్షించుకోవలసి ఉంటుంది.

జుట్టుకు గట్టిగా బాండ్ వేయడం :

జుట్టుకు గట్టిగా బాండ్ వేయడం :

ఈ మద్య కాలంలో స్త్రీ పురుషులు ఇరువురూ ఆటలలో భాగంగా జుట్టు ముందుకు పడకుండా గట్టిగా బాండ్లను ఉపయోగించి నియంత్రించే పనులు చేస్తున్నారు. కానీ పరిధిని దాటి గట్టిగా బిగించడం వలన, మరియు అలాగే ఎక్కువ సేపు ఉండడం వలన నరాలు ఒత్తిడికి గురై, క్రమంగా తలనొప్పులకు గురవ్వడం జరుగుతుంటుంది.

ఆకలి :

ఆకలి :

ఒక్కోసారి పని ఒత్తిడిలో లేదా మరేదైనా కారణంగా ఆహారాన్ని తీసుకోకుండా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పనుల వలన, అప్పుడప్పుడు ఆకలి, అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, తలనొప్పులకు కూడా కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయి. శరీర జీవక్రియలకు కావలసిన ఇంధనాన్ని సముపాళ్ళలో అందించినప్పుడే, శరీరంలో సరైన రక్త సరఫరా, ప్రాణ వాయువు సరఫరా జరుగుతుంది. తద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండగలము. అసంబద్ద ఆహార అలవాట్లు, ఆహారాన్ని విరమించుట వంటి పనుల వలన తలనొప్పులు రావడం సర్వ సాధారణం.

భంగిమ :

భంగిమ :

తలనొప్పికి అనేక వైద్యపరమైన కారణాలు ఉన్నా, కొన్ని మానవ తప్పిదాలు కూడా కారణమవుతూ ఉంటాయి. కుర్చీలకు అతుక్కుని పోయే ఉద్యోగాలలో ఉన్నట్లయితే, రోజంతా ఒకే భంగిమలో ఉండాల్సి వస్తుంది. సరైన కుర్చీ లేని కారణంగా కానీ, ఒత్తిడి కారణంగా కాని వెన్ను నొప్పి, మెడ నొప్పులతో పాటు తలనొప్పులను కూడా ఎదుర్కొనవలసి వస్తుంది.

 ప్రకాశవంతమైన దీపాలు:

ప్రకాశవంతమైన దీపాలు:

ఒక్కోసారి పని కారణంగా ప్రకాశవంతమైన లైట్ల మద్య ఉద్యోగాలు చేయవలసి ఉంటుంది, ఉదాహరణకు వెల్డింగ్, స్టేజ్ లైట్ మేనేజ్మెంట్ వంటి పనులు. ఇవి ఎక్కువగా సున్నితమైన కంటి మరియు మెదడు నరాలపై అధిక భారాన్ని చూపుతున్న ఎడల ఖచ్చితంగా తలనొప్పులకు కారణం అవుతాయి. ఇదే కాకుండా కంప్యూటర్ స్క్రీన్లను తీక్షణంగా చూడడం, ఎక్కువ సేపు టీవీ లకు అతుక్కుపోవడం, మొబైల్ గేమ్స్, వర్చ్యువల్ హెడ్సెట్స్ ఎక్కువ సేపు వాడడం, రోజంతా ఎండలో తిరగడం వంటి అనేక ప్రతికూల అంశాల వలన తలనొప్పులకు గురవ్వడం సర్వసాధారణంగా ఉంటుంది.

ఇలాంటి తలనొప్పి కలుగు సందర్భాలలో కనీసం 20 నిమిషాలకు ఒకసారైనా కళ్ళను కడగడం, తలను పక్కకు మళ్ళించడం, కళ్ళకు ఏదైనా ముదురు రంగు గుడ్డను కప్పి సేద తీరడం, నీటిని అధికంగా తాగడం , కంప్యూటర్ గ్లాసెస్ (యాంటీ గ్లేర్ గ్లాసులు) వాడడం వంటి చర్యల ద్వారా ఈ తలనొప్పులకు పెద్దగా గురికాకుండా తప్పించుకోవచ్చు. ముదురు రంగు కోకోవా లేదా చాక్లెట్, గ్రీన్ టీ, మూలికా టీ వంటివి తీసుకోవడం కూడా తలనొప్పి తగ్గడానికి సహాయం చేస్తాయి.

English summary

Bizarre Reasons That Cause Headache

Headaches are one of the most common ailments that people experience. Headaches are usually caused by reasons like flu, common cold, stress, etc. But some bizarre causes lead to headaches too, like pickled and aged foods, sexual intercourse, tight hairdos, jaw misalignment, monosodium glutamate (MSG), hunger, bad posture and even bright lights.
Story first published: Thursday, April 26, 2018, 19:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more