For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 8 అద్భుతమైన డ్రింక్స్ /జ్యూస్ లను తాగి వాపులు,నొప్పులతో పోరాడండి

ఈ 8 అద్భుతమైన డ్రింక్స్ /జ్యూస్ లను తాగి వాపులు,నొప్పులతో పోరాడండి

|

మీకు వాపులు సహజమైన ప్రక్రియ, శరీరానికి మంచివి అని ఎవరైనా చెప్పారా? చాలామటుకు అది నిజమే. శరీరానికి హానికారక జీవుల నుంచి కాపాడుకునే సహజ రోగనిరోధక పరిస్థితి ఇది. కానీ కొన్నిసార్లు వాపులు మరీ ఎక్కువైపోయి,చాలారోజులుండి, తగ్గవు కూడా. అప్పుడు శరీరానికి 'మంచి’ కన్నా 'చెడే’ ఎక్కువ జరుగుతుంది.

మీరెప్పుడైనా మీ వంటికి ఎక్కడైనా గాయం తగలగానే ఎందుకు కొన్ని శరీరభాగాలు వాచిపోతాయని ఆలోచించారా?ఇది ఎందుకంటే ప్రతి గాయం మన కణజాలాలను పాడుచేసి, వాపు ప్రక్రియ జరిగిన తర్వాతనే నయం అయి మామూలు స్థితికి చేరతాయి.

ఇలా చూస్తే వాపు ప్రక్రియ అనేది సహజ రోగనిరోధక మెకానిజం అని, దీని మధ్యలో కల్పించుకోకూడదని అనుకోవచ్చు. కదా? పూర్తిగా కాదు.

Combat Inflammation And Pain With These 8 Amazing Beverages

ఎక్కువకాలం ఉంటూ, నొప్పితో కూడిన వాపులు నార్మల్ కాదు, ఇవి మీ శరీరాన్ని ఈ కాలపు సాధారణ వ్యాధులైన- కాన్సర్, డిఎన్ ఎ పాడవటం, గుండెజబ్బులు, రక్తపోటు, డయాబెటిస్, ఆర్థరైటిస్ వంటివి వచ్చే రిస్కుల్లో పడేస్తుంది.

మీ జీవనవిధానాన్ని మార్చుకుని, శరీరాన్ని సహజంగా డీటాక్స్ అయ్యేలా చేయటం వలన అనారోగ్యకరమైన వాపులు నెమ్మదిగా తగ్గేట్లా చేయవచ్చు. ఇక్కడ వాపుతో పోరాడి,శరీరానికి చాలా లాభాలు చేకూరుస్తూ, మీ జీవితం మళ్ళీ సాధారణమయ్యేలా సాయపడే 8 డ్రింక్స్/ స్మూతీల గురించి ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి విషయం ఏంటంటే ఇందులో వాడిన అన్ని పదార్థాలు ఇంట్లోనే ఉంటాయి లేదా సులభంగా దొరుకుతాయి!

1.నిమ్మ,పసుపు

1.నిమ్మ,పసుపు

పసుపులో కర్క్యూమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, దీనికి వాపు వ్యతిరేక లక్షణాలు కూడా ఉండి, కీళ్ల నొప్పులు తగ్గించటంలో సాయపడుతుంది.నిమ్మకాయలో విటమిన్ సి ,సిట్రిక్ యాసిడ్ ఉంటాయి, ఇవి శరీరానికి చాలా లాభం చేస్తాయి.

ఈ రెండూ కలిస్తే వాపు వ్యతిరేక పదార్థాలుగా, శరీరంలో డీటాక్స్,హైడ్రేషన్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. ఒక పెనంలో, 1 చెంచా తురిమిన అల్లం, పసుపులను ఒక పూర్తి నిమ్మకాయ రసం పిండి(తొక్కతో సహా),3 కప్పుల నీళ్ళతో మీడియం మంటపై వెచ్చబెట్టండి.

మరిగించవద్దు. ఈ టానిక్ ను రోజూ వాపులను తగ్గించుకోవటం కోసం తాగండి, మిగిలిన దాన్ని ఫ్రిజ్ లో దాచవచ్చు. మీకు స్వీట్లంటే ప్రాణమైతే, కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు!

మీ వల్ల కాదనిపిస్తోందా?ప్రత్యామ్నాయంగా సింపుల్ గా పసుపు టీ లేదా నిమ్మరసాన్ని మీకు నచ్చిన రుచితో తీసుకోవచ్చు.

2.అల్లం,పార్స్లీ

2.అల్లం,పార్స్లీ

అల్లం,పార్ల్సీలలో జింజెరోల్,కార్న్సోల్ అనే వాపు వ్యతిరేక ఏజెంట్లు ఉంటాయి. ఇవి కండరాల నొప్పులను తగ్గించి జీర్ణక్రియలో సాయపడతాయి. అంతేకాక, అల్లం వాపును కలిగించే ప్రోస్టాగ్లాండిన్,ల్యూకోట్రయిన్ ఉత్పత్తిని కూడా నివారిస్తుంది.

ఈ రసం తయారుచేయటానికి చేతికి పట్టినన్ని పార్స్లీ రెబ్బలను, 2 అంగుళాల అల్లం, ఒక నిమ్మకాయ, ఒక చిన్న దోసకాయ, కొన్ని పాలకూర ఆకులు, ఒక గ్రీన్ యాపిల్, కొన్ని కొత్తిమీర రెబ్బలతో కలపండి. మీరు దీన్ని రెండు లేదా మూడు నెలలపాటు రోజుకి ఒకసారి తాగి చూడండి, తేడా మీకే తెలుస్తుంది!

3.బీట్ జ్యూస్ లేదా స్మూతీ

3.బీట్ జ్యూస్ లేదా స్మూతీ

ఈ ఆర్టికల్ లో వస్తున్న ఎరుపు, పసుపులను చూసి భయపడకండి ; ఈ ఎరుపు,పసుపు పదార్థాలు ఎంత ముఖ్యమో, లాభదాయకమో మీకు తెలీదు! బీట్ రూట్ లో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ బి9,పీచు మొదలైనవి ఉంటాయి.ఇవి ఆక్సిజన్ పీల్చుకోవటం ఎక్కువచేసి, రక్తపోటును, వాపులను తగ్గిస్తాయి.

ఈ డ్రింక్ కి మరింత రుచి,పోషకాలను పెంచాలంటే చిన్న/మధ్యమంగా ఉండే బీట్ రూట్ ను 1 చెంచా పసుపుతో, అరచెంచా అల్లం(మీ రుచిని బట్టి)తో, ఆరెంజ్, చేతిలో పట్టినన్ని స్ట్రాబెర్రీలు,రెండు లేదా ఎక్కువ కప్పుల కొబ్బరినీళ్లతో కలిపితే రుచికరమైన స్మూతీ తయారవుతుంది!

4. క్యారట్ జ్యూస్ లేదా స్మూతీ

4. క్యారట్ జ్యూస్ లేదా స్మూతీ

ఈ చిన్ని ఆరెంజ్ రంగు పదార్థాలలో కళ్ళకి, చర్మానికి ముఖ్యమైన చాలా విటమిన్ ఎ ఉంటుంది. శుభవార్త ఏంటంటే ఇవి వాపులతో కూడా పోరాడుతాయి! 8 నుంచి 10 క్యారట్ల రసం తీయండి, తొక్కతీసిన ఆరెంజి,ఆపిల్, అరచెక్క నిమ్మకాయ,అల్లం, నచ్చితే పసుపు, 1 చెంచా యాపిల్ సిడర్ వెనిగర్ తో కలపండి.మీకు నచ్చడాన్ని బట్టి నీళ్ళు, లేదా పాలని ఈ మిశ్రమానికి కలుపుకోవచ్చు.

5.చికెన్ ఎముకల సూప్

5.చికెన్ ఎముకల సూప్

కేవలం చికెన్ మాత్రమే ఎందుకు,మిగతావి ఎందుకు కావు?ఎందుకంటే చికెన్ ఎముకలో కోన్డ్రోటిన్ సల్ఫేట్,గ్లూకోసమైన్ ఉంటాయి. ఇది శరీరంలో ఎముకలు క్షీణించటాన్ని నెమ్మది చేసి, అలా ఆస్టియోపోరోసిస్ చికిత్సలో,నివారణలో సాయపడతాయి.

అదనంగా, చికెన్ ఎముకలో కొల్లాజెన్ ఉండి, కీళ్ల ఆరోగ్యానికి, మంచి జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుకి, మెరుగైన నిద్రకి -ఒక్కమాటలో చెప్పాలంటే పోషకాలకి జాక్ పాట్ ప్యాకేజి అన్నమాట!

2 పౌండ్ల చికెన్ ఎముకలను, ఒక ఉల్లిపాయ,రెండు కారట్లు,రెండు కొత్తిమీర రెబ్బలను, 2 నుంచి 3 చెంచాల యాపిల్ సిడర్ వెనిగర్ ను ,సరిపోయేంత నీళ్లతో కలిపి కుక్కర్లో పెట్టండి. సూప్ తయారయ్యేవరకు సిమ్ లో మంటను పెట్టి ఉంచండి. ప్రతిరోజూ హెర్బ్స్ లేదా సీ సాల్ట్ రుచికోసం వేసుకుని ఒక కప్పు తాగండి.

6.పైనాపిల్ జ్యూస్

6.పైనాపిల్ జ్యూస్

పిజ్జాతో కాంబినేషన్ గురించి చర్చల్లోకి వచ్చిన మరో ‘పసుపుపచ్చ' రంగు పదార్థం ఇది. ఎంతో రుచికరమైన పైనాపిల్స్ లో బ్రోమెలైన్ ఎంజైమ్ (ఎక్కువమటుకు దాని తొక్కలోనే ఉంటుంది) ఉంటుంది.ఇది చాలా శక్తివంతమైన వాపు వ్యతిరేక ఏజెంట్, జీర్ణక్రియలో కూడా సాయపడుతుంది.

English summary

Combat Inflammation And Pain With These 8 Amazing Beverages

There are times when inflammation gets out of hand and becomes chronic or uncontrollable. Chronic painful inflammation is not normal and puts your body at the risk of the most common fatalities of today - cancer, DNA damage, heart diseases, hypertension, diabetes, arthritis, etc. Some of the best beverages to combat this are lemon, iced hibiscus tea, beet juice, etc.
Desktop Bottom Promotion